మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కత్నీ నుంచి సాగర్‌కు వెళుతున్న బొగ్గుతో కూడిన గూడ్సు రైలు దామోహ్ జిల్లాలోని పఠారియా సమీపంలో పట్టాలు తప్పింది. ఈ గూడ్సు రైలులోని ఏడు వ్యాగన్లు ట్రాక్‌పై బోల్తా పడ్డాయి.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాద ఘటనలో ట్రాక్‌లు, స్లీపర్‌లు, ఓహెచ్‌ఈ కేబుల్స్ దెబ్బతినడంతోపాటు సాగర్, దామోహ్, కట్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గూడ్సు రైలు కోచ్‌ల చక్రాలు విడిపోయి, ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో వ్యాగన్లలోని బొగ్గంతా నేలపాలయ్యింది. అర కిలోమీటరు పొడవునా పదుల సంఖ్యలో రైలు స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
Breaking News: Goods train loaded with coal derailed in Damoh, MP;
- Darbhanga Express narrowly escapes accident. pic.twitter.com/TFP4DVPnBm— زماں (@Delhiite_) August 14, 2024
Comments
Please login to add a commentAdd a comment