వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు | Venkatadri Express Derailed At Kurnool Railway Station | Sakshi
Sakshi News home page

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..!

Published Sun, Mar 3 2019 8:07 AM | Last Updated on Sun, Mar 3 2019 11:56 AM

Venkatadri Express Derailed At Kurnool Railway Station - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు : చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్‌లో రైలింజన్‌ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది.  డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్‌ రైలు కూడా పట్టాలు తప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement