
Bikaner Guwahati ExpressTrain Accident:పశ్చిమబెంగాల్‌లో బికనీర్–గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు బోల్తాపడ్డాయి. ఈ దుర్ఘటనలో 45 మందికి పైగా గాయపడ్డారు.
జల్‌పాయ్‌గురి జిల్లాలోని దోమోహని సమీపంలో గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. భారీగా మంచు కురుస్తున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగాల్‌లో రైలు దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తంచేశారు.
చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి