ముంబై: ముంబై కళ్యాణ్ రైల్వేస్టేషన్లో గురువారం తెల్లవారుజామున అమరావతి - ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఎక్స్ప్రెస్ రైలు కళ్యాణ్ రైల్వేస్టేషన్లో ప్రవేశించే సమయంలో ఇంజిన్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీ పట్టాలు తప్పాయని తెలిపారు.
సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లు వివిధ మార్గాలలో మళ్లీస్తున్నట్లు చెప్పారు. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.