
ఇలాన్ (తైవాన్) : తైవాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తైతుంగ్ నగరానికి వెళ్తున్న పుయ్‌మా ఎక్స్‌ప్రెస్ ఇలాన్ కౌంటీలోని జిన్మా స్టేషన్ వద్దకు రాగానే పట్టాలు తప్పింది. దీంతో రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పగా, ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా, 132 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
Comments
Please login to add a commentAdd a comment