ఘటనాస్థలంలోని దృశ్యం
సాక్షి, వరంగల్: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందడంతో మృతుల సంఖ్య ఐదుకి చేరింది.
పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు గుగులోతు సీతమ్మ(32), జాట్టోతు బిచ్య(45), గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు అదనపు సమాచారం అందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment