
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సుభాష్ చంద్రబోస్ రైల్వేషన్ సమీపంలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు షాలిమార్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.రైలులోని S1, S2 కోచ్‌లు, గూడ్స్ కోచ్ పట్టాలు తప్పాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment