
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రమాదంలో 14 మంది మరణించిన ఘటనకు ప్రధాన మంత్రి మోదీ బాధ్యత వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఈ ఘటనను సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని విచారించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికైనా వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన రైళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పేదలు, వలస, అసంఘటిత కార్మికుల కుటుంబాలకు కేంద్రం రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రవాణా కోసం ఒక్కో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల చొప్పున ప్యాకేజీ ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment