responsbility
-
మరింత బాధ్యతతో పనిచేయండి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన రెవెన్యూ చట్టంతో రైతుల జీవితాల్లో మార్పు రావడానికి ఉద్యోగులు కృషి చేయాలని రోడ్లు, భవ నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో కలసిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కొత్తగా రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నందున మరింత బాధ్యతతో పనిచేయాలని కోరారు. మం త్రిని కలసిన వారిలో ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి గౌతమ్‌కుమార్ తదితరులున్నారు. -
ప్రైవేట్ విద్యాసంస్థలు బాధ్యత మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి విధిగా ప్రతి నెలా జీతాలు చెల్లించే నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్‌ను ఆయన అధికారిక నివాసంలో ఆదివారం కలిశారు. తమ సమస్యలు వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకులకు విద్యా సంస్థలు జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే తెలంగాణ విద్యాచట్టం–82లో సవరణలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెలా ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆయా విద్యాసంస్థల యజమానులు కచ్చితంగా నెలవారీ జీతాలు చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినోద్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐనేని సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉమాదేవి, కార్యదర్శులు రాజు, నరేశ్, మదన్ తదితరులున్నారు. -
మోదీ బాధ్యత వహించాలి ఏఐఏడబ్ల్యూయూ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రమాదంలో 14 మంది మరణించిన ఘటనకు ప్రధాన మంత్రి మోదీ బాధ్యత వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఈ ఘటనను సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని విచారించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికైనా వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన రైళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పేదలు, వలస, అసంఘటిత కార్మికుల కుటుంబాలకు కేంద్రం రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రవాణా కోసం ఒక్కో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల చొప్పున ప్యాకేజీ ఇవ్వాలన్నారు. -
వలస కూలీలను తరలించే బాధ్యత కేంద్రానిదే: తలసాని
బన్సీలాల్‌పేట్: వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బిహార్ వంటి సుదూర రాష్ట్రాలకు బస్సుల్లో వలస కూలీలను తరలించడం కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. గురువారం సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో అధికారులతో కలసి నూతన రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మార్గదర్శకాల పేరిట వలస కూలీల తరలింపు బాధ్యతను రాష్ట్రాలపై మోపీ చేతులు దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించి ప్రత్యేక రైళ్లలో ఉచితంగా వారిని స్వస్థలాలకు చేర్చాలన్నారు. వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చే విషయం లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు బాధ్యతారాహిత్యంగా, అసం బద్ధంగా, ఆచరణకు సాధ్యం కాని గాలిమాటల్లా ఉన్నాయన్నారు. ఓ ఆర్డర్ పాస్ చేశాం.. రాష్ట్రాలు అవి అమలు చేయాలని కేంద్రం కోరడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించి లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రశ్నకు తలసాని బదులిచ్చారు. -
కరోనాపై కలెక్టర్లకు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాలను అప్రమత్తం చేసింది. జిల్లాల్లో కరోనా వైరస్ నియంత్రణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. ఎవరైనా చైనా సహా సమీప దేశాల నుంచి వచ్చిన వారుంటే గుర్తించాలని, కరోనా రాకుం డా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేరళలో 3 కరోనా కేసులు నమోదు కావడం, అక్కడి ప్రభుత్వం కలెక్టర్లకు బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో అదే పద్ధతిలో తెలంగాణలోనూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కరోనా అనుమానిత కేసులకు కూడా ఇకనుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేయిం చాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇక అక్కడి నుంచి వచ్చే కేసులకు గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. కరోనా, ఎబోలా వంటివి అనుకోకుండా వ్యాపిస్తే పరిస్థితిని నియంత్రించేలా ఇవి పనిచేస్తాయి. ఈ మేరకు ఆ టీమ్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోవద్దు.. కరోనా అనుమానిత లక్షణా లతో వచ్చే వారిని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఏ మాత్రం అడ్మిట్ చేసుకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అటువంటివారు ఎవరైనా వస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యే కశ్రద్ధతో గాంధీ లేదా ఫీవర్ ఆసుపత్రికి పంపించాలని స్పష్టం చేసింది. ముక్కు కార డం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలతో ఎవరు వచ్చినా వారి వివరాలు తెలుసుకోవా లని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 777 విమానాల ద్వారా వచ్చిన 89,500 మందిని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేశారని, అందు లో 3,935 మందిని ఎటూ వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోవాలని కేంద్రం ఆదేశించింది. 454 మంది కరోనా అనుమానితులను పరీక్షించగా, ముగ్గురికి కరోనా సోకినట్లు కేంద్రం ప్రకటించిందని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రానికి ఇప్పటివరకు 42 మంది చైనా నుంచి వచ్చారన్నారు. వుహాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో ఎవరికైనా లక్షణాలుంటే మాత్రమే పరీక్షలు చేయాలని, ఇతరులకు వద్దని నిర్ణయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చైనాకు పంపిన విమానాల ద్వారా మన దేశానికి 600 మంది రాగా, అందులో రాష్ట్రానికి చెందినవారు ఐదుగురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వారి వివరాలు మాత్రమే సేకరించామని, ఇకనుంచి అంతకుముందు వచ్చిన వారి వివరాలు కూడా తీసుకోవాలని సూచించామన్నారు. వారిలోనూ ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్యాధికారులకు సూచిం చారు. కరోనా నిర్ధారణ పరీక్ష మూడు శాంపిళ్లను సేకరించడం ద్వారా చేస్తారన్నారు. గొంతు, ముక్కు, రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారని తెలి పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేసియా దేశాలకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. -
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఎస్పీ విక్రజిత్ దుగ్గల్ ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు ఉత్తమ డ్రైవర్లకు సత్కారం ఆదిలాబాద్ కల్చరల్ : ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ఇందుకు సమష్టిగా MSషి చేయాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై ప్రసంగించారు. ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన వారు భవిష్యత్తులో వచ్చే కొత్త డ్రైవర్లకు ఆదర్శంగా నిలవాలని, వారి అనుభవాలను వారికి బోధించాలని చెప్పారు. దీంతో అది ప్రమాదాల నివారణకు దోహదపడుతుందనివివరించారు. ప్రమాదాల జరిగినప్పుడు నిజనిర్ధారణ చేసి బాధ్యులను మాత్రమే శిక్షిస్తామన్నారు. ప్రమాదాల జరిగినప్పుడు వాటిని నివారించాలంటే ప్రభుత్వ శాఖలు అన్నీ కలిసి MSషి చేస్తేనే సాధ్యపడుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా నిబంధనలు పాటించి, ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా ఉంటే వాటితో మేలు జరుగుతుందన్నారు. ఆర్టీసీకి పోలీస్ శాఖ నుంచి అండదండలు ఉంటాయని పేర్కొన్నారు. బస్‌భవన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ శాఖ జాయింట్ డైరెక్టర్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ డ్రైవర్లు వాహనాలను నడపాలని, సెల్ఫోన్లు వాడుతూ, నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటాయని వివరించారు. ఏకాగ్రతతో వాహనాలను నడిపి, ఆర్టీసీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింతగా బలపర్చాలన్నారు. ఉత్తమ డ్రైవర్లకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. అనంతరం ‘డ్రైవరన్నా.. జాగ్రత్త’ అనే నినాదంతో తయారు చేయించిన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఎంవీఐ శ్రీనివాస్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్‌కుమార్, డిప్యూటీ సీటీఎం శరత్ప్రసాద్, డిప్యూటీ సీఎంఈ మధుసూదన్, ఆదిలాబాద్ డీఎం సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ డ్రైవర్లు వీరే.. రాష్ట్రస్థాయిలో ఉత్తమ డ్రైవర్‌గా ఎంపికైన ఎండీ రఫీని సత్కరించారు. వీరితో పాటు డివిజన్ స్థాయిలో పలుమార్లు అవార్డులు అందుకున్న ఉత్తమ డ్రైవర్లను సత్కరించారు. రీజినల్ స్థాయిలో.. ప్రథమ ఉత్తమ డ్రైవర్‌గా మంచిర్యాల డిపోకు చెందిన ఎండీ ఇక్బాల్ అహ్మద్, ద్వితీయ ఉత్తమ డ్రైవర్‌గా నిర్మల్ డిపోకు చెందిన ఎన్.గంగాధర్, ™lతీయ ఉత్తమ డ్రైవర్‌గా మంచిర్యాలకు చెందిన ఎండీ.ఇంతియాజుద్దీన్ ఎంపికయ్యారు. డిపోల స్థాయిలో... ఆదిలాబాద్ డిపో పరిధిలో ప్రథమ, ద్వితీయ, ™lతీయ స్థానాలకు కె.వి.స్వామి, ఆర్.చంద్రు, ఎంఏ రషీద్, ఆసిఫాబాద్ పరిధిలో ఎండీ.గౌస్, ఎస్కె.మహెబూబ్, కలీమ్, భైంసా పరిధిలో ఎ.వాహబ్, ఎంఏ.జబ్బర్, మహబూబ్ఖాన్ు, మంచిర్యాల పరిధిలో ఎల్ఆర్.రెడ్డి, వి.మహేందర్, ఎండీ.కర్నల్, నిర్మల్ పరిధిలో ఏజీ.రాజం, ఎస్.ముజాహిద్, ఎన్.రాజన్న, ఉట్నూర్ పరిధిలో జీజీ.సింగ్, సాధిక్‌అలీ, కె.సాహెబ్రావు ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికయ్యారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎంవీఐ శ్రీనివాస్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేడీ వెంకట్రావు, ఆర్ఎం విజయ్‌కుమార్‌లు వీరిని శాలువా, ప్రశంస పత్రాలతో సత్కరించారు. -
మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత : డీఎస్పీ
కట్టంగూర్ : మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని నల్లగొండ డీఎస్పీ సుధాకర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలినగర్‌లో ఆయన మొక్కలను నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏడుకొండలు, మర్రి రాజు, ఐతగోని నర్సింహ, నమ్ముల సత్యనారాయణ, కానుగు లింగయ్య, యాదయ్య, పోగుల నర్సింహ, నాగేష్, మల్లేష్, బాలన ర్సింహ, శిరిశాల శంకర్ పాల్గొన్నారు.