
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన రెవెన్యూ చట్టంతో రైతుల జీవితాల్లో మార్పు రావడానికి ఉద్యోగులు కృషి చేయాలని రోడ్లు, భవ నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో కలసిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కొత్తగా రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నందున మరింత బాధ్యతతో పనిచేయాలని కోరారు. మం త్రిని కలసిన వారిలో ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి గౌతమ్‌కుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment