
సాక్షి, హైదరాబాద్: కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్న వైద్యులు.. రక్తం కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment