Yashoda Hospital
-
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (38) మృతి చెందారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఇక, ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్‌రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి ఏడేళ్ల వయసున్న కుమార్తె, ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. ఎస్సై శ్రీను స్వగ్రామం నారక్కపేట. కాగా, శ్రీనివాస్ ఆత్మహత్య నేపథ్యంలో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జితేందర్ రెడ్డి సతీమణి శైలజ ఒక వీడియో సందేశం పంపించారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ..‘జితేందర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం అన్యాయం. ఎస్సీ మాదిగ కులానికి చెందిన నన్ను ఆయన తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి మంచి వ్యక్తి నా భర్త. ఎస్ఐ శ్రీనివాస్‌ను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. కుల సంఘాలు ఆలోచన చేసి వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలి. జితేందర్ రెడ్డిపై ఆరోపణలను విరమించుకోవాలని విజ్ఞప్తి’ చేశారు. -
యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
-
TS:యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
సాక్షి,హైదరాబాద్ : తుంటి ఎముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ కొద్దిరోజుల పాటు నందినగర్‌లోని ఇంట్లోనే ఉండనున్నారు. సర్జరీకి సంబంధించి డాక్టర్లకు అందుబాటులో ఉండాలన్న కారణంతోనే కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లకుండా నందినగర్‌లోని ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత నందినగర్‌లోని సొంత ఇంటిలో కేసీఆర్ బస చేయనున్నారు. నందినగర్ ఇంటిని 2000 సంవత్సరంలో నిర్మించారు. 2021 జులై 13న ఇంటి మరమ్మతు పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఇంటి నుంచే కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సొంత ఇంటికి కేసిఆర్ వస్తుండడంతో పూలదండలతో అలంకరించిన కుటుంబ సభ్యులు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ బాత్రూమ్లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయనకు తుంటి ఎముకు రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత వారంరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయనను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ కారణంగా కేసీఆర్ అసెంబ్లీలో ఇంకా ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం -
రేపే డిశ్చార్జి.. పాత ఇంటికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు. ఆపై ఆయన నేరుగా బంజారాహిల్స్ నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు షిఫ్ట్ అయ్యారాయన. ఈ క్రమంలో గత గురువారం రాత్రి బాత్రూంలో జారి కిందపడడంతో తుంటి ఎముక రెండుచోట్ల విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం వివిధ పరీక్షలు జరిపి తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించింది. ఆపై విజయవంతంగా సర్జరీ చేసింది. అప్పటి నుంచి ఆయన కోలుకుంటూ వస్తుండగా.. ప్రముఖుల పరామర్శ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. మరోవైపు నందినినగర్‌లోని కేసీఆర్ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన సిబ్బంది ఇప్పటికే పూర్తి చేశారు. -
ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి
-
KCR: దయచేసి ఆస్పత్రికి రావొద్దు: కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రిలోనే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆస్ప్రతి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో కేసీఆర్.. బీఆర్ఎస్.. కేటీఆర్ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ విజ్ఞప్తి.. మరోవైపు ఆస్పత్రి బయట పరిస్థితులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. దీంతో బీఆర్ఎస్ కేడర్‌ను, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. ‘‘నేను కోలుకుంటున్నా.. త్వరలో మీ ముందుకు వస్తా. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దు. నాతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు సహకరించాలి. నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు: తెలంగాణ మంత్రులు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలంగాణ మంత్రులు అన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన్ని ఇవాళ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరామర్శించేందుకు వచ్చాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారేమో’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పగా.. ‘‘కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాం. త్వరగా సభకు వచ్చి వారికున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అందించాలని కోరాం. అందరూ నాయకులను కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాం. స్పీకర్ ఎన్నికలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేవిధంగా సహకరించాలని అడిగాం’’ అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. -
కేసీఆర్ కు డిప్యూటీ సీఎం పరామర్శ
-
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాలి తుంటి గాయంతో సర్జరీ అయిన ఆయన నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు ఆయన దగ్గరకు క్యూ కడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌ను పరామర్శించాను. డాక్టర్లు కూడా ఆపరేషన్ బాగా చేశారని చెప్పారు. ఆయన కోలుకోవడానికి ఆరువారాల టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలి. కోలుకుని మళ్లీ ప్రజా సేవకు రావాలి. జీవితంలో ఒడిదుడకులు రావటం సహజం. ప్రజలకు అంకిత భావంతో మళ్ళీ ఆయన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అని చంద్రబాబు అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేసీఆర్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు రాజకీయంతో పాటు సినీ ప్రముఖులు తరలి వస్తుండడం గమనార్హం. -
కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన నటుడు ప్రకాష్ రాజ్
-
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... అసెంబ్లీకి రావాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్.. కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులతోనూ మాట్లాడారు. తర్వాత ఆస్పత్రి బయట రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను పరామర్శించాను. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నా. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముంది. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నా..’’అని రేవంత్ అన్నారు. కేటీఆర్, హరీశ్‌లను కలసిన పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చానని.. అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడానని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేసీఆర్ త్వర గా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌కు వీహెచ్, కోదండరెడ్డి పరామర్శ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కోదండరెడ్డి పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన ఇద్దరు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొలుత కేసీఆర్‌ను కలిసేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవడంతో.. మాజీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ నేతలను లోపలికి తీసుకెళ్లారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్? సాధారణంగా తుంటి మారి్పడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన బాగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ మందుల వాడకం, సులభమైన వ్యాయామాలు తప్ప మరే ప్రత్యేకమైన వైద్య సేవలూ అవసరం లేదని అంటున్నారు. దీంతో ఆయనను మరో 2, 3 రోజుల్లోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పూర్తిగా కోలుకుని తన కార్యకలాపాలు య «థావిధిగా నిర్వర్తించేందుకు మరి కొన్ని వారా లు పడుతుందని వైద్యులు అంటున్నారు. -
యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు సీఎం రేవంత్ సహా మంత్రులు ఆదివారం యశోద ఆసుపత్రికి వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం రేవంత్.. కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వార్డులో ఉన్న కేసీఆర్ వద్దకు రేవంత్, కేటీఆర్ కలిసి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం, యశోద ఆసుపత్రి వద్ద రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్‌ను పరామర్శించాను. ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇక, మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్లో కాలిజారి కిందపడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో, కేసీఆర్‌కు యశోద ఆసుపత్రి వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశారు. కాగా, ఆపరేషన్ అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. వాకర్ సాయంతో కేసీఆర్‌ను వైద్యులు నడిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. Sir❤️ pic.twitter.com/w0X2mj1BEM — Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) December 9, 2023 -
ఆస్పత్రిలో కేసీఆర్.. యశోదకు పొన్నం
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చనట్లు తెలిపారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పొన్నం చెప్పారు. కేటీఆర్, హరీష్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిడి తెలుకున్నానని తెలిపారు. ఇక మధ్యాహ్నం 12.30 తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యశోదా ఆస్పత్రికి రాననున్నట్లు అయన వెల్లడించారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
వీడియో: కాలికి ఆపరేషన్. వాకర్ సాయంతో కేసీఆర్ నడక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ ఎడమ కాలికి యశోద ఆసుపత్రి వైద్యులు నిన్న హిప్ రిప్లేస్మెంట్ చేశారు. దీంతో, ఆయనకు దాదాపు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. మరోవైపు.. ఆపరేషన్ అనంతరం కేసీఆర్ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక, కాలికి ఆపరేషన్ తర్వాత.. నడవడానికి కేసీఆర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు కేసీఆర్ దగ్గరే ఉండి.. వాకర్ సాయంతో ఆయనను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. కేసీఆర్‌ను మై రాక్‌స్టార్ అంటూ కామెంట్స్ చేస్తూ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ అనంతరం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. My ROCKSTAR .. ❤️❤️❤️❤️ https://t.co/KzbULh7LUL — Prakash Raj (@prakashraaj) December 9, 2023 Sir❤️ pic.twitter.com/w0X2mj1BEM — Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) December 9, 2023 -
మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ సక్సెస్
-
కేసీఆర్ కు ఎడమ తుంటిలో ఫ్యాక్చర్
-
యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ
-
కేసీఆర్‌కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరం: వైద్యులు
-
ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు, కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వద్ద ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని… — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 ఇదిలా ఉండగా.. కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్లో కాలు జారి పడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉంది. ఇక, కేసీఆర్ ఆరోగ్యంపై యశోద డాక్టర్లు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిటీ స్కాన్ అనంతరం.. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరమన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. -
నేడు కేసీఆర్ కాలుకి శస్త్ర చికిత్స చేయనున్న వైద్యులు
-
కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్. కాగా, ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health. — Narendra Modi (@narendramodi) December 8, 2023 మరోవైపు, కేసీఆర్ గాయంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విట్టర్లో కవిత..‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు. మద్దతు, శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో, నాన్న త్వరలో పూర్తిగా కోలుకోనున్నారు. అందరి ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు. BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon. Grateful for all the love 🙏🏼 — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023 ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ నిన్న(గురువారం) అర్ధరాత్రి ఆయన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్లో కాలు జారి కిందపడిపోయారు. ఈ సందర్భంగా ఎడమ కాలి తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. అలాగే, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రమాదంలో తుంటి బాల్ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. వీరితో చర్చించిన తర్వాతే కేసీఆర్‌కు సర్జరీ చేసే అవకాశం ఉంది. -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్
-
యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ
Updates.. కేసీఆర్ హెల్త్ బులెటిన్ మాజీ సీఎం కేసీఆర్‌కు ఎడమ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టుల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ► యశోద ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స. ► మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న యశోద ఆస్పత్రి డాక్టర్లు ►యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ ►కొద్దిసేపటి క్రితమే కేసీఆర్‌కు ప్రారంభమైన ఆపరేషన్ ►కేసీఆర్‌కు ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ ►గత రాత్రి ఇంట్లో జారిపడ్డ కేసీఆర్ ►హుటాహుటిన రాత్రే ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు ► యశోద ఆసుపత్రి నాలుగో ఫ్లోర్‌లోని ఆపరేషన్ థియేటర్‌కు కేసీఆర్‌ను షిఫ్ట్ చేస్తున్న వైద్యులు ► కాసేపట్లో ఎడమ కాలు తుంటికి శస్త్ర చికిత్స అందించనున్న యశోద వైద్యులు ► కాసేపట్లో కేసీఆర్‌కు సర్జరీ ►యశోద ఆసుపత్రి నాలుగో అంతస్తులో ఆపరేషన్ ► మాజీ సీఎం కేసీఆర్ సేవలు భవిష్యత్తులో తెలంగాణకు అవసరం: మురళీధర్ రావు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ ► ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ► క్రియాశీలక రాజకీయాల్లోకి కేసీఆర్ ఆరోగ్యంగా వస్తారని ఆశిస్తున్నాం. యశోద ఆసుపత్రిలో హరీశ్ రావు కామెంట్స్ కేసీఆర్ గారికి యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హిప్ రీప్లేస్మెంట్ చేయాలని వైద్యులు సూచించారు. ఈరోజు సాయంత్రం సర్జరీ జరుగుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటంతో డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ అభిమానులు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దు. సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్లు హెల్త్ బెలిటెన్ను విడుదల చేస్తారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్ ►కేటీఆర్‌లో ట్విట్టర్లో..‘బాత్రూంలో పడిపోవడంతో కేసీఆర్ గారికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpi — KTR (@KTRBRS) December 8, 2023 మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా.. ►యశోదా ఆసుపత్రి దగ్గర భద్రతను పెంచిన ప్రభుత్వం ►కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రేవంత్ ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని ప్రకటించిన వైద్యులు కేసీఆర్ కి సిటి స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన వైద్యులు సిటీ స్కాన్లతో సహా, హిప్ ఫ్రాక్చర్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని సూచించిన వైద్యులు ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరం ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్‌తో సహా వైద్య బృందం అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్న వైద్యులు ►కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health. — Narendra Modi (@narendramodi) December 8, 2023 ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్. ►తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స కల్పించేందుకు హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ►గజ్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలి తుంటికి గాయాలైనట్లు తెలిసింది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ►కాగా, ప్రమాదంలో తుంటి బాల్ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం మైనర్ సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్న వైద్యులు.. రక్తం కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం -
రెండు ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలో అరుదైన ట్రాన్స్‌ప్లాంట్
సికింద్రాబాద్, రాంగోపాల్‌పేట్: విషం తాగి తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడికి యశోద ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌తో ప్రాణం పోశారు. ఒకేసారి డబుల్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఇలాంటి శస్త్ర చికిత్స నాలుగవది కావడం గమనార్హం. శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్‌లు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ గత నెలలో వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అతన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్చారు. విషం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ పరిస్థితి ఏర్పడింది. అలాగే కిడ్నీలు, కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయనకు మెకానికల్ వెంటిలేటర్స్ వైద్యం అందించిన తర్వాత 20 రోజులకు పైగానే ఎక్మోపై చికిత్స అందించారు. అయినా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడలేదు. దీంతో రెండు ఊపిరితిత్తులను మారిస్తేనే యువకుడి ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్యులు బావించారు. కానీ భారతదేశంలో ఇలాంటి కేసుల్లో ఎక్మో వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన వాళ్లు లేరు. శరీరంలో ఎటువంటి పురుగుల మందు అవశేషాలు లేవని నిర్ధారించుకున్నాక ఊపిరితిత్తుల మారి్పడి కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేశారు. జీవన్‌దాన్ చొరవతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్, థొరాసిక్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కేఆర్ బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ మిమి వర్గీస్‌లతో కూడిన బృందం ఆరు గంటల పాటు శ్రమించి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో రోహిత్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. -
టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. జానారెడ్డికి యాంజియో గ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి యశోదా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చదవండి: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే! -
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటుడు మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒడియా నటుడు పింటు నందా(45) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. మొదట భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చదవండి: రితికాపై మీడియా ఫైర్, క్షమాపణలు కోరిన హీరోయిన్! కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. పింటు నందా మృతితో ఒడియా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. చదవండి: తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. పింటు నందా ఒడియా సినీ పరిశ్రమలో హీరోగా, ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. 1996లో కోయిలి చిత్రంతో అరంగేట్రం చేశారు నందా. దోస్తీ, హట ధారి చాలు తా, రుంకు ఝుమానా , రాంగ్ నంబర్, ప్రేమ రుతు అసిగల చిత్రాల్లో నటించారు. -
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే యువత శ్రమించాలి
బన్సీలాల్‌పేట్: లక్ష్యసాధన కోసం అస్త్రాన్ని సంధించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు యువతీ, యువకులు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగా లని సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం యశోద ఫౌండేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువతీ, యువకుల సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు చూసిన మీరు ఎంతో ధైర్యంతో ముందుకు సాగాలని యువతకు ఉద్బోధించారు. విద్యావంతులైన యువతకు సాఫ్ట్‌స్కిల్స్ ప్రాణవాయువు వంటిదనీ, అలాంటి స్కిల్స్‌లో మరింత సమర్థవంతంగా రాణించినప్పుడే అవకాశాలు వస్తాయని సూచించారు. సమాజంలోని అనాథలను చేరదీయాలని, వారు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే దేశానికి తీరని నష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది అనాథలు, నిరుపేదలను చేరదీసి సాఫ్ట్‌స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావును సాక్షి ఎడిటర్ మురళి అభినందించారు. సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా యశోద ఫౌండేషన్ చిత్తశుద్ధితో సమాజమార్పు కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి యశోద ఫౌండేషన్‌లో శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న సోనీ(నిర్మల్), సురేఖ(నాగర్‌కర్నూల్), స్వాతి(యాదగిరిగుట్ట), రాకేష్, సరిత, స్వాతి, లిడియా, సుమిరాలు మాట్లాడుతూ కూలీ నాలీ చేసుకొని జీవనం సాగించే కుటుంబం నుంచి వచ్చి ఇక్కడి శిక్షణతో ఉద్యోగాలు చేస్తున్న వైనాన్ని వివరించారు. తినడానికి తిండి లేక, కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని పరిస్ధితుల్లో ఇక్కడ శిక్షణతో ఆత్మవిశ్వాసం, స్కిల్స్‌తో జీవితంలో స్ధిరపడిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టారు. అనంతరం సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి, యశోద ఆసుపత్రి డైరెక్టర్ బాలక్రిష్ణరావుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి డైరెక్టర్ రాజేందర్, డాక్టర్ హరీశ్‌కుమార్, డాక్టర్ రఘవీర్, ప్రిన్సిపల్ అరుణజ్యోతి, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సతీమణి శోభకు యశోద వైద్యులు మోకాళ్ల సర్జరీ చేశారు. కేసీఆర్ తన సతీమణి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ సతీమణి ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేసుకున్న సీఎం సతీమణిని పలువురు తెలంగాణ మంత్రులు, నేతలు పరామర్శించారు. చదవండి: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ఘాటు లేఖ -
మంత్రి సురేష్‌కు అస్వస్థత.. ఫోన్లో సీఎం పరామర్శ
సాక్షి, అమరావతి/యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన పలు సభల్లో మాట్లాడారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. గత నెల 31న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించి బుధవారం స్టెంట్ వేశారు. విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. మంత్రి సురేష్‌ను ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోలుకున్న ఆయన్ను శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. -
CM KCR Health: అంతా ఓకే.. విశ్రాంతి చాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 8 గంటల సమయంలో నీరసం, ఎడమచేయి నొప్పితో కేసీఆర్ ఇబ్బందిపడుతున్నట్టుగా సోమాజిగూడ యశోద ఆస్పత్రికి ఫోన్ వచ్చింది. దీనితో ఆస్పత్రి వైద్యులు ప్రగతిభవన్‌కు వెళ్లి పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చి సాధారణ టెస్టులతోపాటు ముందుజాగ్రత్త పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించడంతో.. సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న డాక్టర్ ప్రమోద్‌కుమార్. చిత్రంలో డాక్టర్ విష్ణురెడ్డి, డాక్టర్ ఎంవీ రావు నరంపై ఒత్తిడితో.. సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య వల్ల కేసీఆర్ ఎడమ చేతి నొప్పితో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆ యన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. ఎడ మ చేయికి వెళ్లే నరంపై ఒత్తిడి పడటంతో ఇలా నొప్పి వస్తుందన్నారు. పత్రికలు చదవడం, ఐ– ప్యాడ్ వాడే అలవాటు ఉండటంతోపాటు వయసు రీత్యా నొప్పి వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది మినహా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌కు పరీక్షలు చేసిన ఆస్పత్రి చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ విష్ణురెడ్డి, చీఫ్ కార్డియాలజీ డాక్టర్ ప్రమోద్ కుమా ర్తో కలిసి ఎంవీ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. అన్నీ నియంత్రణలోనే..: సీఎం కేసీఆర్‌కు ఏటా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఈసారి పరీక్షల సమ యం కూడా ఆసన్నమైందని ఎంవీరావు తెలిపారు. 90శాతం పరీక్షల నివేదికలు వచ్చాయని, సీఎం ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించామని చెప్పారు. యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చిందని.. రక్తంలో హిమోగ్లోబిన్, కిడ్నీ, లివర్ ఫంక్షన్, కొలెస్ట్రాల్ అన్నీ బాగున్నాయన్నారు. బీపీ, మధుమేహం నియంత్రణలోనే ఉన్నాయన్నారు. అల్ట్రాసౌండ్ పరీక్షలు సైతం చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఈ మధ్య వరుస పర్యటనలు, బిజీ షెడ్యూల్స్కు తోడు ఎండాకాలం వల్ల నీరసానికి గురైనట్టు గుర్తించామని.. వారం పాటు విశ్రాంతి అవసరమని సూచించామని చెప్పారు. కేసీఆర్‌కు యాంజియో గ్రామ్ తర్వాత.. కళ్లు తిరుగుతాయనే ఉద్దేశంతో బెడ్‌పై పడుకోబెట్టి వార్డులోకి తీసుకెళ్లా మని వివరించారు. విశ్రాంతి తర్వాత కేసీఆర్ మళ్లీ అన్ని పనులు చేస్తారని ఎంవీరావు పేర్కొన్నారు. సీఎం గుండె పదిలమే.. కేసీఆర్‌కు ఎడమ చేతి నొప్పిరావడంతో.. కరోనరీ ఆర్టరీస్‌లో (గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో) రక్తం గడ్డకట్టి ఉంటుందేమోనని యాంజి యోగ్రామ్ నిర్వహించాం. అదృష్టవశాత్తు ఎలాం టి బ్లాక్‌లు లేవని గుర్తించాం. గుండె పనితీరు తెలుసుకోవడానికి నిర్వహించిన ఈసీజీ, 2డీ ఎకో టెస్టుల ఫలితాలు బాగా వచ్చాయి. గుండెకు సంబంధించి సీఎంకు ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించాం. ఎడమచేతి నొప్పి వెనుక కారణమేంటో తెలుసుకోవడానికి మెడ, మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ టెస్టులు నిర్వహించాం. వైద్యులందరం కూర్చుని పరిశీలించి.. సర్వైకల్ స్పాండిలోసిస్ కారణమని తేల్చాం. – ప్రమోద్‌కుమార్, చీఫ్ కార్డియాలజిస్ట్, యశోద ఆస్పత్రి -
యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
-
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై బండి సంజయ్ స్పందన
-
యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్
-
CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. హుటాహుటిన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఆయన కేసీఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. రెండురోజులుగా ఆయన వీక్‌గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్తున్నారని డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. Telangana CM KCR షెడ్యూల్ ప్రకారం ఇవాళ యాదాద్రిలో పర్యటించాలని అనుకున్నారు. అయితే, అస్వస్థతోనే ఆయన పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది. దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ టెస్టులు పూర్తి అయినట్లు, గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని యశోద వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్ టెస్టులు నార్మల్‌గానే ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. మరి కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని డిశ్చార్చి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!
సాక్షి, హైదరాబాద్: కరోనా డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ 4.2 రెట్లు అధికంగా సోకే అవకాశాలున్నాయని జపాన్ క్యోటో వర్సిటీ అధ్యయనంలో వెల్లడి కావడం అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. రోగనిరోధక శక్తినీ ఒమిక్రాన్ తప్పించుకునే అవకాశాలు ఎక్కువని తేలడంతో దాని లక్షణాలు, ప్రభావాలు, తీవ్రత, వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈవేరియెంట్ నుంచి తమ బూస్టర్ డోస్‌తో రక్షణ పెరుగుతుందని ఫైజర్, బయో ఎన్‌టెక్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతా అంశాలను యశోద ఆçస్పత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఆర్టీపీసీఆర్కు చిక్కకుంటే ఒమిక్రానే! కరోనా డెల్టా కేసులకు బూస్టర్ డోస్‌లతో 90 శాతం మరణాలు నిరోధించినట్టు న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌ఈజేఎం) తాజా అధ్యయనం వెల్లడించింది. దీన్ని బట్టి ఒమిక్రాన్ పైనా బూస్టర్ డోస్‌లు ప్రభావం చూపుతాయి. దేశంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అందరికన్నా ముందు రెండు డోసుల టీకాలిచ్చాం. హెల్త్‌కేర్ వర్కర్లు, ఇతర హైరిస్క్ జనాభాకు వెంటనే థర్డ్/బూస్టర్ డోస్‌లు వేసేందుకు అనుమతినిస్తే మంచిది. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లతోనే పరీక్షల్లో ఎస్ జీన్ కనిపించకపోతే ఒమిక్రాన్‌గా భావించాలి. ఇప్పుడున్న టీకాలు ఒమిక్రాన్‌పైనా బాగానే పనిచేస్తాయి. సాధారణ ఫ్లూ మాదిరి ఇది వెళ్లిపోయే అవకాశాలున్నందున అనవసర ఆందోళన వద్దు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాదు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగినా ఆందోళన వద్దు. కొత్త వేరియెంట్ బాధితులను ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం ఉండదు. ఈ వేరియెంట్ తీవ్రమైన వ్యాధిగా మారే ప్రమాదముందా? ఇది ఏ మేరకు ఆందోళనకరమో వచ్చే 3 వారాల్లో తెలియనుంది. వచ్చే నెలా, రెండు నెలలు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో గుమిగూడొ ద్దు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ లను జాగ్రత్తగా బాధ్యతతో చేసుకోవాలి. -
బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కల్పించాలి
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ప్రజలకు గుండెపోటుపై ఉన్న అవగాహన బ్రెయిన్ స్ట్రోక్‌పై లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అందువల్ల దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె వైద్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బైప్లేస్ క్యాథ్ ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించడం చాలా కష్టమని చెప్పారు. అవగాహన లోపించడంతోనే ఆస్పత్రికి తీసుకుని రావాల్సిన గోల్డెన్ అవర్స్‌లో రాలేక శాశ్వత అంగవైకల్యంతోపాటు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి ఈ ఆధునిక బైప్లేస్ న్యూరో ఆంజియో ప్రొసీజర్ సూట్‌తో ఒకే మిషన్‌పై స్కానింగ్ పరీక్షలు, చికిత్స లాంటివి చేయడం వల్ల ఎంతో సమయం ఆదా అవుతుందని చెప్పారు. యశోద ఆస్పత్రి డైరెక్టర్ పవన్ గోరుకంటి, సీనియర్ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిరగాని, సీనియర్ సర్జన్ డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కోమల్ కుమార్ మాట్లాడుతూ వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా రాష్ట్రంలో మొదటిసారిగా యశోద ఆస్పత్రిలో అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. -
డాక్టర్ జ్ఞానేశ్ టక్కర్: 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి సర్జరీలు
రాంగోపాల్‌పేట్/సాక్షి, హైదరాబాద్: యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్ హార్ట్–లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జికల్ డైరెక్టర్ జ్ఞానేశ్ టక్కర్ 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసి అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతితక్కువ మంది వైద్యుల్లో ఒకరిగా నిలిచారు. యూఎస్‌లో ప్రముఖ వైద్యుల్లో ఒకరిగా కొనసాగుతున్న డాక్టర్ జ్ఞానేశ్ భారత్‌కు వచ్చి తొలిసారి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. మొదటిసారిగా చిన్న గాటుతో డబుల్ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స కూడా ఆయనే చేశారు. (చదవండి: ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడ్డాయి, ఆస్పత్రికి తీసుకెళ్లగా) కాగా, అరుదైన ఘనత సాధించడంతో బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన జ్ఞానేశ్‌ను ఘనంగా సత్కరించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ‘యశోద’వైద్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కోవిడ్ సమయంలో తీవ్ర అనారోగ్యం బారిన పడిన రోగుల ప్రాణాలు కాపాడిందని తెలిపారు. ముఖ్యంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విషమ పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్‌లో వచి్చన వందకు పైగా రోగులకు అత్యాధునిక వైద్యం అందించి రక్షించినట్లు వివరించారు. చదవండి: వైద్యురాలికి ఊపిరితిత్తుల మార్పిడి.. లక్నో టు హైదరాబాద్ -
భాగ్యమ్మా.. సెల్యూట్
జనగామ: తను చనిపోతూ అవయవదానంతో పలువురికి పునర్జన్మ ఇచ్చింది భాగ్యమ్మ. ఆ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని హర్షిస్తూ ఆస్పత్రి సిబ్బంది అందరూ సెల్యూట్ చేశారు. జనగామ మండలం పెంబర్తికి చెందిన చల్ల భాగ్యమ్మ (48) తండ్రి అంత్యక్రియల నిమిత్తం ఈనెల 19న తన కుమారుడితో కలిసి బైక్‌పై యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణిగుంటకు బయల్దేరింది. మార్గమధ్యలో కొలనుపాక వద్దకు రాగానే హైబీపీతో భాగ్యమ్మ కిందపడిపోయింది. తలకు గాయమై అపస్మారక స్థితికి చేరగా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు అవయవాలను ఆస్పత్రి నిర్వాహకులు తీసుకున్నారు. -
సీఎంకు కరోనా సోకితే యశోదాకు ఎందుకు వెళ్లారు : విజయశాంతి
-
కరోనా పోరులో భారత్‌లోకి మరో డ్రగ్
-
ఆందోళన వద్దు: నిలకడగానే సీఎం కేసీఆర్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌లో భాగంగా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు బుధవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. ఫామ్‌హౌజ్ నుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్‌కు సీటీస్కాన్, సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు ఆరు రకాల పరీక్షలు చేసేందుకు వైద్యులు రక్త నమూనాలు సేకరించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీరావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇన్ఫెక్షన్ రేటు ఏ మేరకు ఉందన్న విషయం తెలుసుకునేందుకు సీటీ స్కానింగ్ చేశారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే ఉన్నాయని, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని సీటీ స్కాన్ అనంతరం డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. రక్త పరీక్షలకు సంబంధించిన నివేదికలు గురువారం అందుతాయని వైద్యులు తెలిపారు. సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. పరీక్షల అనంతరం సీఎం తిరిగి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు. యశోద ఆస్పత్రికి వచ్చిన సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
యశోద ఆస్పత్రికి కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్ సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్‌కు 6 రకాల వైద్య పరీక్షలు చేశారు యశోదా వైద్యులు. సీ-రియాక్టివ్ ప్రొటిన్స్ (సీఆర్పీ), చెస్ట్ సీటి స్కాన్..డీడైమర్, ఇంటర్ ల్యుకిన్ (ఐల్-6), లివర్ ఫంక్షన్ టెస్(ఎల్.ఎఫ్.టి)కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ) పరీక్షల చేశారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. కేసీఆర్ వస్తుండటంతో సోమాజిగూడ ఆస్పత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి చుట్టు పక్కల హై అలర్ట్ ప్రకటించారు. కరోనా పాజిటివ్ అనంతరం కేసీఆర్ మొదటిసారి ఆసుపత్రికి వచ్చారు. ఇక కేసీఆర్ ఆస్పత్రికి వస్తుండటంతో కేటీఆర్ ముందుగానే అక్కడకు చేరుకున్నారు. కరోనా నిర్థారణ అయిన తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 14వ తేదీన సాగర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నోముల భగత్‌కు మద్దతుగా హాలియాలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. కాగా, నోముల భగత్‌కు, ఆయన కుటుంబానికి కూడా కరోనా సోకిన సంగతి విధితమే. చదవండి: కేసీఆర్‌ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్‌బాబు -
ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడ్డాయి, ఆస్పత్రికి తీసుకెళ్లగా
చాదర్‌ఘాట్: అనుకోని అనారోగ్యంతో కుటుంబ సభ్యుడు బ్రెయిన్‌డెడ్‌కు గురై పుట్టెడు దుఃఖంలో ఉండికూడా ఆ పేద కుటుంబం పెద్దమనసు చాటుకుంది. అతని అవయవదానానికి ఒప్పుకోవటం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కష్ణయ్య, సత్తెమ్మ దంపతుల రెండవ కుమారుడు రాములు (24) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గత గురువారం ఉదయం పనికి వెళ్లటానికి సిద్ధం అవుతుండగా అనుకోకుండా అతని కాళ్లు చేతులు చచ్చుబడ్డాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. హుటాహుటిన అతడ్ని మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆలోపే అతని గొంతు కూడా మూగబోయింది. అతడికి అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాములుకు బ్రెయిన్‌డెడ్ అయిందని, బతికే అవకాశాలు లేవని నిర్ధారించారు. దాంతో అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అవయవదానంపై ఆసుపత్రి వైద్యులు వారికి తెలియజేసి అవగాహన కలి్పంచారు. దాంతో రాములు అవయవదానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆసుపత్రికి వచ్చి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సీఎం చేయూతతో చిన్నారి జీవితంలో వెలుగులు
కళ్యాణదుర్గం రూరల్: దీపావళి పండుగ రోజున 12 నెలల చిన్నారి ప్రాణం కాపాడి ఆ కుటుంబంలో నిజమైన దీపావళి వెలుగులు నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రానికి చెందిన కె.అన్వర్‌బాషా కుమారుడు దానీష్ శనివారం ఇంట్లో ఆడుకుంటూ వేరుశనగ విత్తనం మింగాడు. అది కాస్తా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు విషయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. చిన్నారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. రూ.2 లక్షలు విడుదల చేసి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు రుణపడి ఉంటామని అన్వర్‌బాషా దంపతులు ‘సాక్షి’తో చెప్పారు. -
సీఎం కేసీఆర్ మనవడికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్ అయినట్లు తెలిసింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతడిని చికిత్స కోసం బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కనీసం నిలబడలేక పోతున్న హిమాన్షుకు వైద్యులు సీటీస్కాన్ చేశారు. తుంటి, మోకాలికి ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సచేసి కట్టుకట్టారు. కాగా, ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షు గాయపడినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. (చదవండి: ఆ మాటలను మీడియా ఆపాదించిందన్న కేటీఆర్) -
యశోద ఆస్పత్రి స్టాఫ్ నర్సు ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: యశోద ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ పోలీసుల సమాచారం మేరకు... నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డకు చెందిన రామన్న కుమార్తె సౌందర్య(26). నాలుగు సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ ఇక్కడే ఉండే హాస్టల్లో నివసిస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమె విధులు ముగించుకుని ఆస్పత్రి వెనుకవైపు ఉన్న హాస్టల్ గదికి వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చిన మిగతా నర్సులు ఆమె నుంచి ఎలాంటి స్పందనను గమనించలేదు. ఆమెను పరిశీలించగా పక్కనే మత్తు ఇచ్చే ఇంజక్షన్ పడివుండటంతో పాటు చనిపోయి ఉంది. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందికి అక్కడికి చేరుకుని మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సు ఆత్మహత్యకు కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఉపయోగించిన ఫోన్‌కు లాక్ ఉండటంతో దాన్ని తెరవడం సాధ్యం కాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మహత్య చేసికుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
డబ్బులు చెల్లిస్తేనే పేషెంట్‌ను చూడనిస్తాం
రాంగోపాల్‌పేట్: కిడ్నీ వ్యాధితో ఆస్పత్రికి వస్తే కరోనా సోకిందంటూ ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు 10 రోజుల నుంచి పేషెంట్‌ను చూపించడం లేదు. రూ. 5 లక్షల బిల్లు పెండింగ్ ఉందని, అది చెల్లిస్తేనే మీ వాడిని చూపిస్తామని ఆ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బుధవారం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చోటు చేసికుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోరుట్లకు చెందిన రాజశేఖర్ (25) కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు గత నెల 27న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. చికిత్స నిమిత్తం విడతల వారీగా రూ.3 లక్షలు చెల్లించారు. అప్పటి నుంచి రోగికి చికిత్స అందిస్తున్న చెబుతున్న ఆస్పత్రి వర్గాలు అతడిని తమకు చూపించడం లేదన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడికి కరోనా సోకిందంటూ తమను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళను దిగారు. ఆస్పత్రి యాజమాన్యం డబ్బుల కోసం లేని రోగాన్ని అంటగడుతుందని వారు వాపోయారు. నడుచుకుంటూ ఆస్పత్రి వచ్చిన అతడికి కరోనా లక్షణాలు లేకున్నా 10 రోజుల నుంచి తమకు చూపించడం లేదన్నారు. ఆస్పత్రి యాజమాన్యం అడిగిన రూ.5 లక్షలు చెల్లించనందునే తమ కుమారుడిని చూపించడం లేదని అతడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నీ చెడిపోతే తన కిడ్నీ ఇస్తానని చెప్పానని, అప్పు చేసి రూ.3లక్షలు చెల్లించామని, తాము నిరు పేదలమని అంత డబ్బు ఎలా చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. డబ్బు చెల్లిస్తేనే చూపిస్తామని కొందరు డాక్టర్లు చెప్పారని తన కుమారుడికి ఏమైనా జరిగితే ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసింది. బుధవారం అతడి కుటుంబ సభ్యులను లోపలికితీసుకెళ్లి చికిత్స పొందుతున్న రాజశేఖర్‌ను చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగుల సహాయకులను ఆస్పత్రి లోపలికి పంపించడం లేదని ఆ విషయం తెలియక బంధువులు అలా ఆరోపిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి. కరోనా రోగులు ఉండటంతోనే వార్డులోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. అతనికి డయాలసిస్ నడుస్తుందని, చికిత్సకు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని వారు వివరించారు. వారు రూ.5లక్షల బిల్లు చెల్లించాల్సి ఉన్నా మానవతా దృక్పథంతో వారి ఇష్టం మేరకు డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?
-
యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని సూచించింది. కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (తెలంగాణలో 99 శాతం రికవరీ : హెల్త్ డైరెక్టర్) అలాగే ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా లేదో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.(నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్) -
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో దారుణం
-
3వ స్టేజ్ ఇంకా రాలేదు
సాక్షి, హైదరాబాద్: మనదేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరుకుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా.హరికిషన్ తెలిపారు. భారతీయులతో పాటు ఆఫ్రికా దేశాల ప్రజలు కరోనా వైరస్‌ను తట్టుకోగలిగే శక్తి, నిరోధకత ఎక్కువగా ఉంటుందన్న భావన ఊహాజనితమైనదే తప్ప శాస్త్రీయంగా, ప్రయోగాత్మకంగా నిరూపితం కాలేదని స్పష్టం చేశారు. మన దేశంలో మధ్య వయస్కులు, యువత శాతం ఎక్కువగా ఉండటం, ఇటలీ ఇతర పశ్చిమ దేశాల్లో వయసు మీరిన వారి శాతం ఎక్కువగా ఉండటమనేది ఈ వైరస్ బారిన పడుతున్న సంఖ్యతో పాటు అక్కడ మరణాలు ఎక్కువ కావడానికి కారణమవుతోందన్నారు. లాక్డౌన్ సందర్భంగా రోడ్లపైకి ఎక్కువగా వచ్చి కలియ తిరుగుతున్న మధ్య వయస్కులు, ముఖ్యంగా యువకులకు ఈ వైరస్ సోకితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బయటపడినా, వారి ఇళ్లలోని పెద్దవాళ్లు, డయాబెటిస్, ఇతరత్రా బలహీనంగా ఉన్న వారికి వీరి నుంచి వైరస్ వ్యాపిస్తే పెను సమస్యగా మారుతుందని హెచ్చరించారు. అందువల్ల ఇళ్లలోని పెద్దవారి ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని గురించి ఆలోచించి బయట తిరగడం తగ్గించాలని సూచించారు. ఇంకా కొన్ని రోజులు అందరూ ఇళ్లకే పరిమితమై, ఇళ్లు, సమూహాల్లో వ్యక్తుల మధ్య దూరాన్ని కచ్చితంగా పాటించడం (ఆరడుగుల దూరం), షేక్హ్యాండ్లు ఇవ్వకపోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మాత్రమే ఈ వైరస్ మరింత విస్తరించకుండా బలహీనపరిచేందుకు అవకాశముందని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. ప్రస్తుత పరిస్థితిపై.. దేశవ్యాప్తంగా సరైన టైమ్‌కే లాక్డౌన్ ప్రకటించారు. మిగతా దేశాలతో పోల్చితే పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుదల ఎక్కువగా లేకపోవడం, పాజిటివ్ కేసుల్లోనూ తీవ్రంగా ప్రభావితమై, మరణాలు సంభవిస్తున్న కేసులు కూడా తక్కువగా ఉండడం మనకు కలిసొచ్చే అంశం. మూడో స్టేజ్‌లోకి వచ్చామా? అలా కనబడట్లేదు. ముందుగా విదేశాల నుంచి వచ్చిన వారికి, వారి నుంచి సన్నిహితులు, అక్కడి నుంచి కమ్యూనిటీ ఇన్ఫెక్షన్లకు దారి తీయడాన్ని థర్డ్ స్టేజ్‌గా పరిగణిస్తారు. ఇప్పటికీ మనకా పరిస్థితి రాలేదు. అమెరికా, ఇటలీ, స్పెయిన్, తదితర దేశాల కంటే భిన్నమైన స్థితిలో ఉన్నాం. రోగులను ఎలా ట్రీట్ చేశారు? ఇద్దరు కోవిడ్ రోగులకు మేం చికిత్స చేశాం. వారిప్పుడు కోలుకున్నారు. కచ్చితమైన క్వారంటైన్, ఐసోలేషన్‌ను పాటించడంతో పాటు వైరస్ ప్రభావాన్ని తగ్గిచేందుకు ట్రీట్మెంట్ ఇచ్చాం. వ్యాక్సిన్, మందులు రావడానికి... ఈ వైరస్‌కు విరుగుడు కనుక్కునేందుకు క్లినికల్ టెస్ట్‌లు నిర్వహించి వివిధ దశలు దాటి వ్యాక్సిన్ తయారయ్యేందుకు మరో ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుంది. వ్యాక్సిన్ కాకుండా కంట్రోల్ ట్రయల్స్‌కు ఆరేడు నెలల సమయం పడుతుంది. హాంకాంగ్, సింగపూర్ల అనుభవాలేంటి? కరోనా కేసులతో డీల్ చేస్తున్న సింగపూర్, హాంకాంగ్‌లోని వైద్యులతో టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాం. వాళ్లు అనుసరిస్తున్న చికిత్స పద్ధతులు, వాడుతున్న మందులు, ఇతర అనుభవాల గురించి తెలుసుకున్నాం. సింగపూర్‌లో లాక్డౌన్ కచ్చితంగా పాటించడంతో పాటు పాజిటివ్ కేసుల గుర్తింపు, వారు ఎవరెవరిని కలిశారో, వారు ఎక్కడెక్కడున్నారో ట్రాక్ చేసి నియంత్రించి విజయం సాధించారు. మనదేశంలో, రాష్ట్రంలో పరిస్థితేంటి? లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ అమలవు తున్న తీరు గ్రేట్. చాలా వరకు మంచి ఫలితాలనే సాధించాం. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు. నివారణ ఒక్కటే మార్గం అన్నది అందరూ తెలుసుకోవాలి. చైనా అనుభవాలు పనికొస్తున్నాయా? చైనాలో కరోనా సోకిన వారి కోసం విడిగా ఆసుపత్రులు పెట్టి, రోగులను వివిధ బృందాల కింద విడగొట్టి చికిత్స అందించడంతో పాటు వైరస్ నివారణకు లేదా అదుపులోకి తెచ్చేందుకు ఉపయో గించే మందులపై స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. పేషెంట్లపై నిర్వహించిన పరీక్షలతో పాటు ఈ వ్యాధి లక్షణాలు, వైరస్ వ్యాప్తికి కారణాలు ఇతరత్రా అంశాలపై నిర్వహించిన పరిశోధనలతో చైనా వైద్యులు అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురించిన వ్యాసాలు ప్రస్తుతం మనతో పాటు వివిధ దేశాల్లో చికిత్సకు, అవగాహనకు, సమాచారానికి ఉపయోగపడుతున్నాయి. వైరస్ తీవ్రత తక్కువగా ఉందా? అలాంటిదేమీ లేదు. మిగతా దేశాలతో పోల్చితే ఇక్కడ తీవ్రత బలహీనంగా ఉందనేది నిరూపితం కాలేదు. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఒకరిద్దరికి సోకితే, వైరస్ వ్యాప్తి చెందే వేరియబుల్ (ఆర్ జీరో) ముందు ఒకరి నుంచి 2, 2.5 మందికి వ్యాప్తి చెందుతుందని తొలుత భావించినా, ఇప్పుడు ఇది 4 నుంచి 4.5 మందికి వ్యాప్తి చెందేదిగా మారింది. దీన్నే ఆర్–నాట్‌గా పరిగణిస్తున్నాం. ఇది నలుగురి నుంచి ఐదుగురికి, వారి నుంచి మరికొందరికి వ్యాపించే అవకాశాలున్నాయి. పాజిటివ్లను త్వరితంగా గుర్తించొచ్చా? పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ ద్వారా ఐజీజీ, ఐజీఎం పద్ధతుల ద్వారా డయాబెటిస్‌కు ఒక స్ట్రిప్ ద్వారా బ్లడ్ ఫ్రీక్వెన్సీ టెస్ట్‌తో తక్కువ సమయంలోనే గుర్తించే అవకాశముంది. ఈ వైరస్ బారిన పడ్డారా లేదా అని తెలుసుకునేందుకు ఆర్టీ–పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్) టెక్నిక్ న్యూక్లిక్ యాసిడ్ డిటెక్షన్ టెస్ట్‌లో దూదితో ముక్కులోంచి నమూనా సేకరించడం ద్వారా 85 శాతం కచ్చితంగా నిర్ధారించొచ్చు. పీసీఆర్‌లో నెగెటివ్ వచ్చే 15 శాతంలో మళ్లీ ఎక్కువ జ్వరంతో లక్షణాలు బయటపడతాయి. ఫాల్స్ నెగెటివ్ వచ్చిన వారికి రిపీట్ పీసీఆర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వారిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో నిర్ధారించొచ్చు. కమ్యూనిటీ స్ప్రెడ్‌ను మాత్రం 6, 7 రోజుల తర్వాతే గుర్తించే వీలుంటుంది. ఇది కాకుండా పాజిటివ్ నుంచి కాంటాక్ట్ అయిన వారికి ఈ వైరస్ లక్షణాలు 8 రోజుల్లో బయటపడతాయి. ఆ తర్వాత 102 డిగ్రీలు జ్వరం తగ్గకుండా వస్తుంది. అలాంటి వారిని ఐసోలేషన్‌లో ఉంచి తగిన చికిత్స అందిస్తే సరిపోతుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే తగ్గుతుందా ఉష్ణోగ్రతలు పెరగడం తప్పకుండా సానుకూల ప్రభావం చూపనుంది. వేసవితాపం పెరగడం, 20 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలుంటే వైరస్ తీవ్రత తగ్గేందుకు అవకాశం ఉంది. చైనాలోనూ టెంపరేచర్ పెరగడం వల్ల దీని తీవ్రత తగ్గిందనే వాదనా ఉంది. -
‘యశోద’ డాక్టర్ అనుమానాస్పద మృతి!
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్ గాయత్రి నగర్లో సుభాష్ (32) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆయన యశోద ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. డాక్టర్ సుభాష్ది మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామంగా వెల్లడైంది. ఆయన 2017లో నేరేడ్మెట్ నివాసి డాక్టర్ లాస్యను ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేళ్లుగా స్థానికంగా ఉన్న గాయత్రి నగర్‌లోని పద్మావతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు తెలిసింది. ఈక్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సుభాష్ జ్వరంగా ఉందని నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు సమాచారం. కాగా, అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో సుభాష్ విగత జీవిగా పడున్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుభాష్ మృతికి సంబంధించిన వివరాల కోసం ప్రయత్నించగా అతని బంధువులు నిరాకరించడం గమనార్హం. -
యశోద ఆస్పత్రికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉన్నారు. పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. రిపోర్టులు వచ్చిన అనంతరం యశోద ఆసుపత్రి వైద్యలు వివరాలు చెప్పనున్నారు. కాగా, ఆయన వెంట సతీమణి శోభ, కూతురు కవిత, మనవడు హిమాన్ష్, మంత్రి తలసాని శ్రీనివాస్, శుభాష్ రెడ్డిలు కూడా ఆసుపత్రికి వచ్చారు. -
ఊపిరికి భారమాయె
సాక్షి, హైదరాబాద్: వాతావరణ కాలుష్యానికి తోడు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో శ్వాస సంబంధమైన కొత్త సమస్యలు వెలుగుచూస్తున్నట్లు ప్రముఖ వైద్య నిపుణులు వెల్లడించారు. ఊపిరితిత్తుల కేన్సర్లకూ ఇదే కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రమాదకరమైన స్లీప్ ఆప్నియా (నిద్రలో శ్వాస ఆగిపోవడం/ నిద్ర అవ్యవస్థ) బారినపడే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి పదిమంది గురక బాధితుల్లో ఇద్దరు స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. శనివారం బేగంపేటలోని హోటల్ మ్యారీగోల్డ్‌లో యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘పల్మొ అప్డేట్’ సదస్సు నిర్వహించారు. మలేసియాకు చెందిన డాక్టర్ టైసివ్ టెక్, వైద్య ప్రముఖులు రితేష్ అగర్వాల్, రవీంద్ర మెహతా, దీపక్‌తల్వార్, బీవీ మురళీమోహన్, సుభాకర్, అమితాసేనె, ఆర్.విజయ్‌కుమార్, నవనీత్‌సాగర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి సహా పలు ఆస్పత్రులకు చెందిన 500 మంది వైద్యులు హాజరయ్యారు. శ్వాస సమస్యలకు కారణాలివే.. ►ఐటీ, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న యువత డిస్కోలు, పబ్ కల్చర్ పేరుతో రాత్రి పొద్దుపోయే వరకు బయటే గడుపుతున్నారు. ►మద్యం తాగడం, చికెన్, మటన్ బిర్యానీలు ఎక్కువగా తినడం, ఆహారం జీర్ణం కాకముందే నిద్రకు ఉపక్రమించడం వల్ల శ్వాసనాళాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది శ్వాస సంబంధ సమస్యలతో పాటు స్లీప్ ఆప్నియాకు కారణమవుతోంది. ►చాలామంది దీన్ని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. స్లీప్ ఆప్నియాతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆకస్మిక గుండెపోటు ప్రమాదం ఆరోగ్యంగా ఉన్న వారు గాఢనిద్రలో నాలుగు నుంచి ఆరుసార్లు మేల్కొంటారు. నగరంలో చాలామంది నిద్రపోయిన అరగంటకే మళ్లీ లేచి కూర్చుంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, మెడ సైజులో తేడా ఉండటమే ఇందుకు కారణం. నిద్రలో బలవంతంగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేసినా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ మెదడు, గుండెకు చేరడం లేదు. ఇది ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏర్పడే గురక.. చికాకు, మతిమరుపు, మధుమేహం వంటి కొత్త సమస్యలకూ కారణమవుతోంది. – డాక్టర్ నాగార్జున, పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి జీవనశైలి మార్చుకోవాలి.. వాతావరణ కాలుష్యానికి తోడు మారిన జీవనశైలి వల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నాయి. దేశంలో పది శాతం మంది ఉబ్బసంతో, ఏటా 3 మిలియన్ల మంది నిమోనియాతో, మరో 2.7 మిలియన్ల మంది పల్మనరి టీబీతో బాధపడుతున్నారు. అంతేకాదు ఏటా లక్ష మంది ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారు. జీవనశైలిని మార్చుకోవడం, మితాహారం తీసుకోవడం, మద్యం, మాంసం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం, వాకింగ్, రన్నింగ్, యోగా చేయడం ద్వారా బరువును నియంత్రించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – డాక్టర్ జీఎస్ రావు, మేనేజింగ్ డైరెక్టర్, యశోద ఆస్పత్రి -
ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది కానీ అంతలోనే..
సాక్షి, మెదక్ రూరల్: డెంగీతో యువ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన హవేళిఘనాపూర్ మండలం నాగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఒంటరి నరేందర్‌రెడ్డి, మంజుల కుమార్తె భవ్య(21) నర్సాపూర్ బీవిఆర్‌ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ సీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. భవ్యకు ఐదు రోజులు క్రితం డెంగీ జ్వరం సోకడంతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు మెదక్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని రష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఎంతో ఖర్చుతో చికిత్స చేయించినప్పటికీ భవ్య మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. భవ్య ఇటీవల క్యాంపస్‌లో నిర్వహించిన సెలక్షన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగానికి నియామకమై ఉద్యోగంలో చేరకముందే మృత్యువు ఒడికి చేరడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. శనివారం సాయంత్రం భవ్య అంత్యక్రియలు స్వగ్రామమైన నాగాపూర్‌లో నిర్వహించారు. -
పోసానిని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి
-
పోసాని కృష్ణమురళీని పరామర్శించిన సజ్జల
సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోదా ఆస్పత్రికి వెళ్లి.. పోసానిని సజ్జల పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోసానికి అందుతున్న వైద్యం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సజ్జల ఆరా తీశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పోసానిని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి -
లక్షలో 40 మందికి లంగ్ కేన్సర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి లక్ష మందిలో 40 మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు పలువురు పల్మొనాలజిస్టులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో కేవలం ఊపిరితిత్తుల కేన్సర్లే 8 శాతం ఉండగా, కేన్సర్ మరణాల్లో లంగ్ కేన్సర్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ఈ కేన్సర్ నుంచి బయటపడొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు ‘లంగ్‌పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఊపిరితిత్తుల కేన్సర్లపై లైవ్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ముఖ్యఅతిథిగా హాజరై వర్క్‌షాప్‌ను ప్రారంభించగా, డాక్టర్ చాంగ్ హూ జాంగ్(చైనా), డాక్టర్ మెల్విన్ టే(సింగపూర్), డాక్టర్ టై వాన్ సెక్ (మలేసియా) సహా దేశవిదేశాలకు చెందిన సుమారు 300 మంది వైద్యనిపుణులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా యశోద ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక ‘లంగ్ పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్)ని ఈ సందర్భంగా ప్రారంభించారు. సోమాజి గూడ యశోద హాస్పిటల్స్ ఇంట్రావేన్షనల్ పల్మొనాలజిస్టులు డాక్టర్ వి.నాగార్జున మాటూరు, డాక్టర్ నవనీత్ సాగర్‌రెడ్డి, డాక్టర్ రఘోత్తమ్‌రెడ్డిలు లంగ్ కేన్సర్ గుర్తింపు, చికిత్సలో మెళకువలను లైవ్‌లో ప్రదర్శించారు. ఇప్పటివరకు బయాప్సీ ద్వారా మాత్రమే లంగ్ కేన్సర్లు గుర్తించే వారని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రాథమిక దశలోనే ఈ కేన్సర్‌ను గుర్తించే అవకాశం లభించిందన్నారు. శరీరంపై ఎటువంటి కోతలు లేకుండా, రక్తం చుక్క కూడా చిందించాల్సిన అవసరం లేకుండా కనీసం నొప్పి కూడా తెలియకుండా శ్వాస మార్గాల ద్వారా రక్తనాళాలు, శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల చిత్రాలను చూస్తూ పనితీరును తెలుసుకునే అవకాశం దీని ద్వారా లభించిందని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి స్పష్టం చేశారు. తొలిదశలో వ్యాధి నిర్ధారణ జరిగి సరైన సమయంలో సరైన రీతిలో చికిత్స అందిస్తే ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధులు, టీబీ, ఊపిరితిత్తుల కేన్సర్ల నుంచి ఉపశమనం పొంది సాధారణ జీవితం గడపటం పూర్తిగా సాధ్యపడుతుందని డాక్టర్ నాగార్జున తెలిపారు. -
‘కేన్సర్ మరణాల్లో 85 శాతం ఊపిరితిత్తులకు చెందినవే’
జూబ్లీహిల్స్: ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కేన్సర్ సంబంధిత మరణాల్లో దాదాపు 85 శాతం ఉపిరితిత్తుల కేన్సర్‌కు చెందినవే ఉంటున్నాయని యశోదా ఆసుపత్రి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ వాస్వాని అన్నారు. 2018లో దేశంలో 67 వేలకు పైగా ఊపిరతిత్తుల కేన్సర్‌ను గుర్తించగా అందులో 40 శాతం మంది బాధితులకు అప్పటికే శరీరంలోని కాలేయం, మెదడు, ఎముకలు సహా ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉందని అన్నారు. ఈనేపథ్యంలో ‘టార్గెటెడ్ థెరపీ విత్ పర్సనైల్జ్ మెడిసిన్’ అనే సరికొత్త విధానంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని ఆయన తెలిపారు. తాజ్‌కృష్ణా హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ కేసులు ఉంటున్నాయని, గాలి కాలుష్యం, డిజిల్ పొగకు గురికావడంతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఒకటి లేదా రెండు ఊపిరితిత్తుల్లో ఆసాధారణ కణాల వృద్ధి చెంది ఉపిరతిత్తుల కేన్సర్‌కు దారి తీస్తుందన్నారు. వేగంగా విభజన చెందే సాధారణ కాన్సర్ కణాల మీద పనిచేసే కెమోధెరపీతో పోలిస్తే టార్గెటెడ్ థెరపీలు కేన్సర్‌కు చెందిన నిర్ధిష్ట లక్ష్యాల మీద పనిచేస్తాయని తద్వారా బాధితుల జీవితకాలం పెంచడం, స్వస్థత రేటు పెంచే అవకాశం మరింతగా అందుబాటులోకి వచ్చిందన్నారు. -
గడ్డ తీస్తామని కిడ్నీ తీశారు
చాదర్‌ఘాట్: చికిత్స కోసం వస్తే గడ్డ తొలగిస్తామని చెప్పిన మలక్‌పేట యశోద ఆసుపత్రి వైద్యులు కిడ్నీ మాయం చేశారని ఆరోపిస్తూ రోగిం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్, తారామతి పేటకు చెందిన శివ ప్రసాద్ వారం రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో గడ్డ ఉందని దానిని తొలగించేందుకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇందుకు గాను రూ. లక్ష అడ్వాన్స్‌గా కట్టించుకుని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అతడికి ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో గడ్డతోపాటు కిడ్నీని కూడా తొలగించారని ఆరోపిస్తూ అతని బంధువులు మంగళవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కిడ్నీని ఎలా తొలగిస్తారని ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. కాగా శివప్రసాద్ కడుపులో ఉన్నది కేన్సర్ గడ్డ అయినందున వ్యాధి కిడ్నీకి కూడా సోకిందని వైద్యులు వారికి వివరించారు. చెప్పకుండా ఆపరేషన్ చేశారు:రోగి బంధువులు శివప్రసాద్ కిడ్నీని తొలగింపై తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రోగి బంధువులు ఆరోపించారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముందుగానే తెలిపాం:యశోద ఆసుపత్రి వైద్యులు శివప్రసాద్‌కు కడుపులో గడ్డకు కేన్సర్ వ్యాధి సోకిందని, వ్యాధి రెండు కిడ్నీలకు వ్యాపించనందునే కిడ్నీ తొలగించాల్సి వచ్చిందని, దీనిపై రోగి బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆపరేషన్ చేసినట్లు యశోద ఆసుపత్రి పీఆర్ఓ అశోక్ వర్మ తెలిపారు. పేషెంట్ బంధువుల ఉద్దేశపూర్వకంగానే ఆందోళన చేస్తున్నారన్నారు. -
యశోద ఆసుపత్రికి రవళి
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. రవళి గాయాలను పరిశీలించిన అనంతరం వైద్యులు చికిత్స ప్రారంభించారు. రవళికి మెరుగైన వైద్యం అందించాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యశోద ఆసుపత్రి యాజమాన్యంతో అంతకుముందు మాట్లాడారు. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆటంకం కలగకుండా వైద్యం కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు(బుధవారం) సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి రవళి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుని, యువతి కుటుంబసభ్యులతో మాట్లాడనున్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో చదువుతున్న రవళి అనే విద్యార్థినిపై అదే కళాశాలలో చదువుతున్న సాయి అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ సాయి అన్వేష్‌ను తోటి విద్యార్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన రవళిని మొదట ఎంజీఎంకు ఆ తర్వాత యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్ దాడి -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన మధులిక
-
నోరు మూసి బలవంతంగా లాక్కెళ్లి గేటు వేశాడు
కాచిగూడ: ఇంటర్ విద్యార్థిని మధులికపై ఈ నెల 6న భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో దాడికి పాల్పడిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కాచిగూడ పీఎస్ పరిధిలోని బర్కత్‌పురా సత్యానగర్ లో జరిగింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక స్టేట్మెంట్ను మూడు రోజుల క్రితం పోలీసులు రికార్డు చేసినట్లు తెలిసింది. గత మూడు నెలలుగా భరత్ తన వెంటపడి వేధిస్తున్నాడని, తరచూ తన కాలేజీ వద్దకు వచ్చి వేధింపులకు గురిచేసేవాడని మధులిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈనెల 6నన ఉదయం తన బాబాయ్ ఇంటికి వెళుతుండగా దారిలో తనను అడ్డుకున్న భరత్ తన నోరు మూసి బలవంతంగా పక్కనే ఉన్న ఇరుకైన సందులోకి లాక్కెళ్లి గేటు వేశాడని, అతను తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటికి తీయడంతో తాను భయంతో కేకలు వేసినట్లు చెప్పినట్లు తెలిసింది. అయినా అతను తనపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడని మధులిక పేర్కొన్నట్లు సమాచారం. భరత్ పథకం ప్రకారమే తనపై దాడి చేశాడని , అతడికి వారి బంధువుల సహకారం కూడా ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెట్లో పేర్కొన్నట్లు తెలిసింది. -
జ్వరంతో బాధపడుతున్న మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది కిరాతక దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆస్పత్రి వైద్యులు బుధవారం మెడికల్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి శరీరంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఆమెకు.. అది తగ్గేందుకు చికిత్స అందిస్తున్నామని, ఇంకా అత్యవసర విభాగంలోనే ఉంచి ఆమెకు వైద్యం కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. మధులిక ఇంకా జ్వరంతో బాధపడుతున్నారని, ఆమెకు జ్వరం వస్తూ పోతూ ఉండడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. తన ప్రేమను నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని అయిన మధులికపై ప్రేమోన్మాది భరత్ కొబ్బరిబోండాల కత్తితో కిరాతకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శరీరంలోని బలమైన గాయాలు కావడంతో గాయాలకు ఎప్పటికప్పుడు డ్రెసింగ్ చేస్తూ.. ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని యశోదా వైద్యులు తెలిపారు. -
స్పృహలోకి వచ్చిన మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో 2రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు మధులిక(17) ఆరోగ్యం శుక్రవారానికి కొంత మెరుగుపడింది. 2 రోజుల నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందు తున్న ఆమె శుక్రవారం స్పృహలోకి వచ్చింది. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తుండటంతో పాటు బీపీ, పల్స్‌రేటు సహజస్థితికి చేరుకు న్నాయి. న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ భొట్ల, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌలి, వాస్క్యూలర్ సర్జన్ డాక్టర్ ప్రకాశ్, జనరల్ సర్జన్ డాక్టర్ సాయిబాబా, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసీద్‌లతో కూడిన వైద్య బృందం సుమారు 7 గంటలు శ్రమించి ఆమె తల, ఇతర భాగాలకైన గాయాలకు చికిత్స చేశారు. విరిగిన చేతి ఎముకలకు రాడ్డు సాయంతో సరిచేశారు. గదుమ, మెడ, మోచేతి భాగాల్లోని కత్తిగాట్లను శుభ్రం చేసి, గాయాలకు కుట్లు వేశారు. రక్త స్రావం పూర్తిగా నియంత్రించారు. ఇప్పటి వరకు పదిబాటిళ్లకు పైగా రక్తం ఎక్కించారు. ఉన్మాది ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండటం వల్ల తలపై గాయానికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ..ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం వెంటిలేటర్ నుంచి బయటికీ తీసుకురానున్న ట్లు తెలిపారు. మధులిక స్వయంగా శ్వాస తీసు కోగలిగి..ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాల్సి ఉంది. మరో 48 గంటలు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్య బృందం స్పష్టం చేసింది. -
మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గురువారం శివరామిరెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురికావడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు ఆస్పత్రి వైద్యులు డా.గురుప్రసాద్ మీడియాకు తెలిపారు. గతవారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివరామిరెడ్డికి గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. తొలితరం ప్రజాప్రతినిధి.. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు. వైఎస్ జగన్ సంతాపం సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
కమ్యూనిస్ట్ నాయకుడు శివరామిరెడ్డికి తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు నర్రెడ్డి శివరామిరెడ్డి గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సోమాజీగుడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉండి శివరామిరెడ్డి చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం-పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా నర్రెడ్డి శివరామిరెడ్డి పనిచేశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. -
పదిలంగా.. ఆ గుండె ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి మధ్య మార్గం అది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి వేగం 25 కిలోమీటర్లకు మించదు. గురువారం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం డోనర్ గుండె(లైవ్ హార్ట్)ను ఆ మార్గంలో తీసుకెళ్లేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానల్’ఇచ్చారు. ఫలితంగా ఈ 8 కి.మీల మార్గాన్ని అంబులెన్స్ కేవలం 7 నిమిషాల్లో అధిగమించింది. మధ్యాహ్నం 12.46కు యశోద ఆస్పత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరగా.. కేర్ ఆస్పత్రికి 12.53కు చేరుకుంది. అనంతరం ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం వరకు సాగింది. ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. ‘నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేక ఆదిలక్ష్మీ అనే మహిళకు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. డోనర్ ఇస్తున్న గుండె మధ్యాహ్నం 12.45 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరుతుంది’అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 12.10 గంటల నుంచే ఈ రూట్లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలుపెట్టారు. నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన గుండె ఉన్న బాక్స్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 8 కి.మీల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. మహంకాళి ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది. అలాగే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ప్రయాణం ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల సహకారం మరువలేం మా అమ్మకి మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డోనర్ ఇచ్చిన లైవ్ హార్ట్ ఆపరేషన్ థియేటర్లోకి చేరినట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం 5.20 వరకు సర్జరీ సాగగా.. సక్సెస్ అయినట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. ఇందులో భాగస్వామ్యులైన పోలీసులు, ఆస్పత్రి వైద్యులకూ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతటి సహాయం చేసిన వారి సహకారం మరువలేనిది. –సునంద, ఆదిలక్ష్మీ కుమార్తె ఇదీ గుండె ప్రయాణం.. మధ్యాహ్నం 12.46 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో ఉన్న అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ప్యాట్నీ, బైబిల్ హౌస్, కార్బలా మైదాన్, ట్యాంక్‌బండ్, అంబేడ్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్, ఉదయ్ ఆస్పత్రి, నాంపల్లి స్టేషన్ రోడ్, తాజ్ ఐలాండ్, గాంధీభవన్ మీదుగా ప్రయాణించి సరిగ్గా మధ్యాహ్నం 12.53కు నాంపల్లి కేర్‌కు చేరింది. ఈ మార్గంలోని అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు గ్రీన్ చానల్ ఇవ్వడంతో 7 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. -
దొంగనోట్ల కేసులో నిందితుడిపై కత్తులతో దాడి
హైదరాబాద్: దొంగనోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్‌పై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా దాడి చేసింది. కత్తులతో దాడిచేయడంతో ఎల్లంగౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఎల్లంగౌడ్‌ను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. 2014 సంవత్సరం శామీర్‌పేట్‌లో ఎల్లంగౌడ్ పోలీసులపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మృతిచెందగా..ఎస్ఐ వెంకట్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసు కాల్పుల్లో ఎల్లంగౌడ్ గ్యాంగ్ సభ్యుడు కూడా మృతిచెందాడు. అప్పటి నుంచి ఎల్లంగౌడ్ పరారీలో ఉన్నాడు. ఇటీవల ఎల్లంగౌడ్‌ను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి నేపథ్యంలో మరో మారు ఎల్లంగౌడ్ తెరపైకి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోచారంను పరామర్శించిన ఎంపీ కవిత
హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని నిజామాబాద్ ఎంపీ కవిత పరామర్శించారు. శనివారం ఆమె ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కొద్దిసేపు ఆయన కుటుంబ సభ్యులతో కవిత ముచ్చటించారు. -
సీఎం సతీమణికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. డాక్టర్ పీవీ రావు ఆమెకు వైద్యసేవలు అందిస్తున్నారు. కేసీఆర్ గురువారం ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో కొత్త విప్లవం
సాక్షి, హైదరాబాద్: మానవ శరీరంలోని అన్ని అవయవాలనూ నియంత్రించే శక్తి ఒక్క మెదడుకే ఉంటుంది. మారిన జీవనశైలి వల్ల అనేక మంది చిన్న వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.75 లక్షల కేసులు నమోదవుతున్నా యి. భారత్‌లో రోజుకు సగటున 500 బ్రెయిన్ ట్యూమర్ టెస్టులు జరుగుతున్నాయి. మెదడులో ఏర్పడిన కణితుల తొలగింపు చికిత్స కష్టమైంది. సర్జరీ సమయంలో వైద్యుడు అజాగ్రత్తగా వ్యవహరించినా.. మెదడులోని ఇతర నరాలు తెగిపోయినా రోగి కాళ్లు, చేతులు చచ్చుబడి పోయే ప్రమాదం ఉంది. సర్జరీ చేసి గడ్డను తొలగించినా.. ఒక్కోసారి ఆ గడ్డ తాలూకు కణజాలంలోని కొంతభాగం అలాగే ఉండిపోతుంది. ఇది కొన్నాళ్ల తర్వాత మళ్లీ పెద్దదిగా మారి రెండో సర్జరీకి వెళ్లాల్సి వస్తుం ది. సర్జరీ పేరుతో కపాలాన్ని రెండుసార్లు కట్ చేసి తెరవడం వల్ల ఒక్కోసారి రోగి ప్రాణాలకే ప్రమాదం. సీటీ, ఎంఆర్ఐ ద్వారా గుర్తించలేని అతి సూక్ష్మమైన కణాలను సర్జరీ సమయంలోనే గుర్తించి, దాన్ని పూర్తిగా తొలగించే ఆధునిక ‘ఇంట్రా ఆపరేటివ్ 3టి ఎంఆర్ఐ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా నగరంలోని యశోద ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘3టి ఎంఆర్ఐ’ పనితీరును వైద్య బృందం వివరించింది. వందకుపైగా చికిత్సలు పూర్తి.. ఇప్పటి వరకు వందకుపైగా చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోద ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. రెండో సర్జరీ అవసరం లేకుండా తొలి సర్జరీలోనే ఎంఆర్ఐ తీసి మిగిలిపోయిన గడ్డల తాలూకు అతిసూక్ష్మమైన కణాలను పూర్తిగా తొలగించగలిగినట్లు తెలిపింది. మిగిలిన కణాల నిర్మూ లనలో రేడియేషన్ సహా ఖరీదైన మందులు అవసరం లేకపోగా.. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో పాటు రోగి త్వరగా కోలుకునేందుకు అవకాశం లభించిందని ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీఎస్ రావు, న్యూరోసర్జన్ డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ బీజే రాజేశ్ డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ శ్రీనివాస్ బొట్లతో కూడిన వైద్యబృందం తెలిపింది. 3టి ఎంఆర్ ఐ సాయంతో చేసిన చికిత్సల్లో వందశాతం సక్సెస్ రేటు సాధించామని పేర్కొంది. -
పాపం పసివాడు..!
పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కొడుకు పుట్టాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు ఆరోగ్యం కోసం మొక్కని దేవుడంటూ లేడు. చిన్న వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కన్నవాళ్లు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కూలీ చేసుకుంటేనే నాలుగేళ్లు నోట్లోకి వెళ్లే దుస్థితి వారిది. కొడుకు ఆరోగ్యం కోసం ఇప్పటికే లక్షలాది రూపాయల అప్పులు చేసి సహాయం కోసం పేద దంపతులు ఎదురు చూస్తున్నారు. జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాగం బాల్‌రాజు, రమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు భానుప్రసాద్ గ్రామంలోనే 4వ తరగతి, కూతురు నందిని 1వ రతగతి చదువుతుంది. చిన్న కూతురు ఇంటి దగ్గరనే ఉంటోంది. వీరికి గల ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులు నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బతుకుబండి సాఫీగా కొనసాగుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కొడుకు ఉన్నట్టుండి అనారోగ్యంబారిన పడ్డాడు. తల్లిదండ్రులు కొడుకు భానుప్రసాద్‌కు హైదరాబాద్‌లోని లోటస్ ప్రైవేట్ దవాఖానలో ఇటీవల వైద్య పరీక్షలు చేయించారు. బాబుకు బ్రెయిన్‌ట్యూమర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే వైద్యుల సూచనల మేరకు సికిందరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోని వైద్యం కోసం వెళ్లారు. బాబుకు వైద్యం పరీక్షలు నిర్వహించిన అనంతరం సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు చెప్పారు. వెంటనే తల్లిదండ్రులు కొంత డబ్బు చెల్లించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. మా బాబుకు ప్రాణం పోయండి.. మా బాబు భానుప్రసాద్‌కు ప్రాణభిక్ష పెట్టండి... అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమకు ఎకరం భూమి మాత్రమే ఉందని, బాబు వైద్యం కోసం ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించాం. గ్రామంలోనే తెలిసివాళ్ల దగ్గర అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాం. ఇంకా ఐదారు లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు. సహాయం అందించి బాబుకు ప్రాణభిక్ష పెట్టండి.. అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పదోన్నతితో ఆనందం తట్టుకోలేక...
హైదరాబాద్: ఆర్ఐగా పదోన్నతి పొందిన ఆనందంలో ఓ ఏఆర్ ఎస్ఐ మిఠాయిలు పంచుతూ గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన బుధవారం హైదరాబాద్ అంబర్‌పేటలోని సీపీఎల్‌లో చోటుచేసుకుంది. గోల్నాక తిరుమలనగర్‌లో నివసించే శ్యామ్‌రావు(55) సీపీఎల్‌లో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయన ఆర్ఐగా పదోన్నతి పొందారు. ఆనందంతో బుధవారం మిఠాయిలు తీసుకొని కార్యాలయానికి వచ్చారు. అధికారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచుతూ కుప్పకూలారు. వెంటనే ఆయనను యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. శ్యామ్‌రావుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. -
జానారెడ్డిని పరామర్శించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్ : ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని మంగళవారం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా జానారెడ్డి ప్రస్తుతం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన ...అక్కడే అస్వస్థతకు గురి కావడంతో ...హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి జానారెడ్డి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కోలుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘నాన్న’ను ఆదుకుంటాం..
సాక్షి కథనానికి స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే కోరుట్ల: స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్కల్దేవి ప్రకాశ్ కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకంట్ల విద్యాసాగర్ రావు ఆదివారం పరామర్శించారు. ‘మా నాన్నను ఆదుకోరూ..’అనే శీర్షికన ‘సాక్షి’మెయిన్‌లో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ప్రకాశ్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రకాశ్ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ప్రకాశ్ కుటుంబసభ్యులకు దాతలు తోచిన సాయం అందిస్తున్నారు. ఆదివారం కోరుట్ల రేషన్ డీలర్ల సంఘం వారు రూ.10 వేలు, అవధూత శ్రీధర్ రూ.5 వేలు, చింతామణి కావ్యశ్రీ రూ.2 వేల సాయం అందజేశారు. -
‘జీవన్‌దాన్’కు ఐదు వేల మంది అంగీకారం
యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ - మంత్రి లక్ష్మారెడ్డి, హీరో నాగార్జున - సహా పలువురు ప్రముఖుల హాజరు సాక్షి, హైదరాబాద్: జీవన్‌దాన్‌కు విశేష స్పందన లభించింది. చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసేందుకుగాను శనివారం ఐదువేల మంది ముందుకు వచ్చారు. ఈ మేరకు వారంతా జీవన్‌దాన్ అంగీకారపత్రంపై సంతకం చేశారు. యశోద ఆస్పత్రి, జీవన్‌దాన్ సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున, డీజీపీ అనురాగ్‌శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, యశోద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావు, జీవన్‌దాన్ ఇన్చార్జి డాక్టర్ జి స్వర్ణలత, వైజీహెచ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. జీవన్‌దాన్‌లో ఇప్పటి వరకు 18 వేల మంది దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దిందని చెప్పారు. అరుదైన కాలేయ, గుండె మార్పిడి చికిత్సలను కూడా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ఏటా 15 లక్షల మంది వివిధ ప్రమాదాల బారిన పడి మరణిస్తుండగా, వీరిలో 5 నుంచి 10 శాతానికి మించి కుటుంబాలు అవయవదానానికి అంగీకరించడం లేదన్నారు. నాగార్జున మాట్లాడుతూ తాను అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేసి, నిజ జీవితంలో సూపర్‌హీరో అయ్యానని అన్నారు. అవయవదానం చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైజీహెచ్ చైర్మన్ జి రవీందర్రావు మాట్లాడుతూ జీవన్‌దాన్‌కు అత్యాధునిక అంబులెన్స్‌ను విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దాతల నుంచి సేకరించిన అవయవాలను వేగంగా, సురక్షితంగా స్వీకర్తల చెంతకు చేర్చవచ్చన్నారు. -
ఒకే సమయంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి
ప్రైమరీ ఫల్మొనరీ హైపర్‌టెన్షన్‌తో దెబ్బతిన్న గుండె, లంగ్స్ నిజామాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు యశోదలో చికిత్స సాక్షి, హైదరాబాద్: ఆడుతూ పాడుతూ చలాకీగా కనిపించిన బాలిక అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించగా... వైద్యులు ఆమెకు ఒకే సమయంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీఎస్ రావు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీ నరేష్కుమార్ చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా చికిత్స ఇదే తొలిదని తెలిపారు. స్కూల్లో కుప్పకూలిన బాలిక... నిజామాబాద్ జిల్లా దర్పల్లికి చెందిన రైతు సీహెచ్ రాములు, లక్ష్మిల కుమార్తె నితిష (13) అదే ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. జనవరి 4న ఉదయం స్కూల్లో ప్రార్థన చేస్తుండగా... స్పృహతప్పి పడిపో యింది. వెంటనే ఆమెను నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు నితిషను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. గుండె దడ, ఛాతీలో తీవ్ర అసౌకర్యంతో బాధపడుతున్న బాలికను పరీక్షించిన సీనియర్ కార్డియాలజిస్ట్ నరేష్కుమార్... ఆమెకు ‘ప్రైమరీ ఫల్మొనరీ హైపర్‌టెన్షన్’ ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. 27 ఏళ్ల యువతి అవయవాల సేకరణ... వైద్య ఖర్చులు భరించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయగా, ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది. జనవరి 19న గుండె, ఊపిరితిత్తుల దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేయించారు. ఇదే సమయంలో మెదడులో రక్తస్రావంతో బాధపడుతూ అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 27 ఏళ్ల యువతి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుంది. ఆ యువతి అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించారు. దీంతో డాక్టర్ నరేష్కుమార్ నేతృత్వంలోని 20 మంది వైద్యుల బృందం చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. 8 గంటలపాటు చికిత్స.. అవేర్ ఆస్పత్రి నుంచి గ్రీన్ చానల్ ద్వారా యశోదకు యువతి అవయవాలు తరలించారు. వెంటనే వాటిని బాలికకు అమర్చారు. మార్చి 26 తెల్లవారుజాము 3.45కు ప్రారంభమైన శస్త్రచికిత్స.. ఉదయం 11.30 వరకు కొనసాగింది. 8 గంటలపాటు శ్రమించిన వైద్యులు బాలికకు గుండె, ఊపిరితిత్తులను విజయవంతంగా అమర్చారు. 2 వారాలు ఐసీయూలో చికిత్స పొందిన బాలిక ప్రస్తుతం కోలుకుందని, ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. పైసా కూడా తీసుకోకుండా తన బిడ్డకు ఖరీదైన వైద్యం చేసిన యశోద వైద్యులకు బాధితురాలు నితిష, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.