Popular Odia Actor Pintu Nanda Passed Away At Hyderabad - Sakshi
Sakshi News home page

Actor Pintu Nanda: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత

Published Fri, Mar 3 2023 9:15 AM | Last Updated on Fri, Mar 3 2023 9:43 AM

Odia Actor Pintu Nanda Passed Away Due to Liver Failure in Hyderabad - Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటుడు మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒడియా నటుడు పింటు నందా(45) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. మొదట భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

చదవండి: రితికాపై మీడియా ఫైర్‌, క్షమాపణలు కోరిన హీరోయిన్‌!

కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. పింటు నందా మృతితో ఒడియా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

చదవండి: తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్‌ బీస్ట్‌ లుక్‌ చూశారా?

ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. పింటు నందా ఒడియా సినీ పరిశ్రమలో హీరోగా, ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. 1996లో కోయిలి చిత్రంతో అరంగేట్రం చేశారు నందా. దోస్తీ, హట ధారి చాలు తా, రుంకు ఝుమానా , రాంగ్ నంబర్, ప్రేమ రుతు అసిగల చిత్రాల్లో నటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement