నోరు మూసి బలవంతంగా లాక్కెళ్లి గేటు వేశాడు | Madhulika Statement on Bharat Knife Attack in Hyderabad | Sakshi
Sakshi News home page

మధులిక స్టేట్‌మెంట్‌ రికార్డు

Published Tue, Feb 19 2019 5:52 AM | Last Updated on Tue, Feb 19 2019 5:52 AM

Madhulika Statement on Bharat Knife Attack in Hyderabad - Sakshi

కాచిగూడ: ఇంటర్‌ విద్యార్థిని మధులికపై ఈ నెల 6న భరత్‌ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో దాడికి పాల్పడిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కాచిగూడ పీఎస్‌ పరిధిలోని బర్కత్‌పురా సత్యానగర్‌ లో జరిగింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక స్టేట్‌మెంట్‌ను మూడు రోజుల క్రితం పోలీసులు రికార్డు చేసినట్లు తెలిసింది. గత మూడు నెలలుగా భరత్‌ తన వెంటపడి వేధిస్తున్నాడని, తరచూ తన కాలేజీ వద్దకు వచ్చి  వేధింపులకు గురిచేసేవాడని మధులిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

ఈనెల 6నన ఉదయం తన బాబాయ్‌ ఇంటికి వెళుతుండగా దారిలో తనను అడ్డుకున్న భరత్‌ తన నోరు మూసి బలవంతంగా పక్కనే ఉన్న ఇరుకైన సందులోకి లాక్కెళ్లి గేటు వేశాడని, అతను తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటికి తీయడంతో తాను భయంతో కేకలు వేసినట్లు చెప్పినట్లు తెలిసింది. అయినా అతను తనపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడని మధులిక పేర్కొన్నట్లు సమాచారం. భరత్‌ పథకం ప్రకారమే తనపై దాడి చేశాడని , అతడికి వారి బంధువుల సహకారం కూడా  ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement