Madhulika
-
ఇండియాలోని టాప్ యూట్యూబర్లలో ఒకరామె..జస్ట్ పాక నైపుణ్యంతో ఏకంగా..!
యూట్యూబ్ అంటే కొందరికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టే వేదిక. మరికొందరికి అదొక సరదా కాలక్షేపం. అయితే కొంతమంది మాత్రం దీంతో మంచి పేరు తోపాటు కోట్లు ఆర్జించి మిలియనీర్లుగా మారారు. అచ్చం అలానే మంచి నేమ్, డబ్బు సంపాదించి స్టార్ యూట్యూబర్‌గా ఎదిగింది 65 ఏళ్ల మహిళ. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు సరదాగా మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానెల్ విలియన్లమంది ఫాలోవవర్లు, లక్షల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా ఆమె భారతదేశంలోని అత్యంత ధనిక యూట్యూబర్లలో ఒకరిగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఎవరామె..? ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..!ఆమె పేరు నిషా మధులిక. 2009లో తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె భారతీయ శైలి వంటకాలకు ఫేమస్. ఆమెకు చిన్న వయసు నుంచి వివిధ వంటకాలపై ఉన్న ఆసక్తితో రకరకాల రెసిపీలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది. అలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో దాదాపు రెండు వేలకు పైగా వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 14.5 మంది మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఆరోగ్యకరమైన వంటకాలతో ప్రతి ఇల్లు ఐక్యతతో సంతోషభరితంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని అంటోంది నిషా. ఆమెకు ఈ యూట్యూబ్ తోపాటు ఫేస్బుక్లో 5.7 మిలియన్లు, ఇన్‌స్టాలో 3.41 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిషా నేపథ్యం..నిషా ఆగస్టు 24, 1959న ఉత్తరప్రదేశ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ తదనంతరం.. కొన్నాళ్లు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత పెళ్లితో నోయిడాకు వెళ్లిపోయింది. అక్కడ తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇక ఆ బాధ్యతలు తీరి ఒంటరితనం వేధించడంతో.. చిన్ననాటి వంటకాల ఆసక్తితో ఆ లోటుని భర్తి చేసింది. ఆ ఇష్టంతోనే యూట్యూబ్ ఛానెల్లో అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసి.. విశేష జనాదరణ సంపాదించుకుంది. ఒకరకంగా ఆ అభిరుచి ఆమెకు మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాయి. రెస్ట్ తీసుకునే వయసులో కాలక్షేపం కోసం మొదలు పెట్టి.. దేశంలోనే టాప్ చెఫ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు నవంబర్ 2017లో సోషల్ మీడియా సమ్మిట్ & అవార్డ్స్‌లో టాప్ యూట్యూబ్ వంట కంటెంట్ క్రియేటర్‌గా గౌరవాన్ని పొందింది. జస్ట్ తన పాకనైపుణ్యాలతో ఏకంగా రూ. 43 కోట్ల నికర విలువతో భారీ సంపాదనను ఆర్జిస్తోంది నిషా. అంతేగాదు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న టాటా ట్రస్ట్‌ల ప్రాజెక్ట్ డ్రూవ్తో సహా అనేక ఇతర ప్రయత్నాలకు తన వంతు సహాయసహకారాలు అందించి సేవదృక్పథంలో కూడా మేటి అనిపించుకుంది. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్..
పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్ బాధ్యత లు అప్పజెప్పి మనవళ్లు మనవరాండ్రతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్‌ను ప్రారంభించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గానే గాక ..‘‘పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజన్ పర్సనాలిటీ’’ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్ గుప్తాతో వివాహం జరిగింది. ఢిల్లీకి వచ్చేసిన నిషాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకంలోనూ, మరోపక్క భర్త వ్యాపారంలో సాయం చేస్తూ బిజీగా ఉండేవారు. పిల్లలు చదువులు పూరై తమ ఉద్యోగాలతో బిజీ అయిపోయారు. దీంతో అప్పటిదాకా తీరిక లేకుండా గడిపిన నిషాకి ఒక్కసారిగా తీరిక ఏర్పడడంతో తనని తాను బిజీగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు బ్లాగ్‌కు రాస్తుండడం చూసి.. తనకు బాగా అనుభవమున్న కుకింగ్‌ను బ్లాగ్స్లో రాయాలనుకున్నారు. కొడుకు సాయంతో.. భర్త, కొడుకు సాయంతో.. నిషా 2007లో కుకింగ్ బ్లాగ్‌ను ప్రారంభించి దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్సైట్ https:/nishamadhulika.com లో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. నిషా వంటలను ఇష్టపడిన అభిమానులు ‘‘వీడియోలు పెట్టండి మేడం’’ అని అడగడంతో.. వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా 1300 కుపైగా వంటల వీడియోలను అప్లోడ్ చేశారు. సిసలైన శాకాహార వంటలు మధులిక కుటుంబం 2009 లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యత నిచ్చిన నిషా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వీడియోలు మిలియన్ల మందిని ఆకర్షించేవి. ప్రస్తుతం నిషా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోటీ పదిహేను లక్షలకు పైనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఐదుగురితో టీం .. యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో.. మంచి కిచెన్‌ను సెటప్ చేసి, ఐదుగురితో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ రెండుమూడు వంటల వీడియోలు తీసి.. తరువాత ఛానల్లో అప్లోడ్ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది. టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబర్.. మొదట్లో బ్లాగ్స్, వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా.. తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్లోడ్ చేసేవారు. తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఉన్న తన ఫాలోవర్స్ తమ భాషల్లో వీడియోలు అప్లోడ్ చేయమని అడగగా వాళ్ల భాషల్లో వంటల వీడియోలు, సబ్‌టైటిల్స్‌తో పోస్టు చేసేవారు. అంతేగాక పలు వెబ్సైట్లకు వంటల ఆర్టికల్స్ రాసిచ్చేవారు. దీంతో సబ్స్క్రైబర్స్తోపాటు, ఆదాయం పెరిగింది. ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు అందుకున్నారు. ఇండియన్ టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబ్ స్టార్స్ జాబితాలో.. రెండుసార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేగాక ప్రముఖ మ్యాగజీన్లు బ్లూమ్‌బర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీని ప్రచురిస్తూ ‘కుకింగ్ క్వీన్’గా అభివర్ణించాయి. లోక్‌సభ టీవీ ఆమె ఇంటర్వ్యూనూ టెలికాస్ట్ చేయడం విశేషం. -
కొలనుకు కొలువు
‘మై ఎర్త్ మై రెస్పాన్సిబులిటీ’ పేరుతో నగరవాసులకు ముఖ్యంగా విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నారు హైదరాబాద్ నివాసి మధులిక. గత కొంత కాలంగా నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రకృతిని అర్థం చేసుకోవడం, పర్యావరణ హితమైన చర్యల ఆవశ్యకతను యువతకు చెబుతున్నారు. ప్రముఖులూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. యువతను పర్యావరణ పరిరక్షణ దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నారు మధులిక. గుండె ‘చెరువై’ంది... రాజస్థాన్‌లోని పిలానీలో జన్మించిన మధులిక సింగపూర్ వెళ్లడానికి ముందు ఐసిఎఫ్ఐఐ, శారదా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సింగపూర్ వెళ్లి భారతదేశానికి తిరిగివచ్చినప్పుడు హైదరాబాద్‌లో స్థిరపడటానికి నిర్ణయించున్నారు 37 ఏళ్ల మధులిక. తొలుత పర్యావరణం కోసం మాత్రమే పనిచేయాలనుకున్నారు. మొదట్లో స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఉత్పాదక వనరుల గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన కలిగించేవారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న నెక్నంపూర్ చెరువు దుస్థితి చూసినప్పుడు ఆమె ఆలోచన చెరువుల అభివృద్ధివైపు మళ్లింది. ‘‘మనకు ప్రాణాధారమైనవి, నిర్లక్ష్యానికి గురవుతున్నవాటిలో నదీజలాలు, సరస్సులు, చెరువులు ప్రధానమైనవి. దీనివల్ల నీటి ఆధారంగా బతికే ఎన్నోరకాల జీవులు అంతరించిపోతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల మానవ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉంది. ఒక్క అడుగుతో మొదలు.. నగరాల్లోని చెరువులను కాపాడుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి. ఇప్పటికే చాలా చెరువులు కబ్జాదారుల కోరల్లోనే ఉన్నాయి. ఉన్న చెరువులు చెత్తా చెదారం, కాలుష్యంతో నిండి ఉండేవి. వాటి దగ్గరకు వెళ్లాలన్నా ఆ దుర్గంధానికి నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. అలాంటి చెరువులను శుభ్రం చేయాలి. అందంగా తీర్చిదిద్దాలి.. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో సమాజంలో ఒక కొత్త దృష్టికోణం తీసుకురావడానికి 2014 నవంబర్‌లో ధ్రువాంశ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ‘ధ్రువ్ అంటే తార. చీకటిలో ఉన్నవారికి మార్గం చూపిస్తుంది’ అని అర్థం. ‘మై ఎర్త్ మై రెస్పాన్సిబిలిటీ’ అనే నినాదంతో విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికి జీవవైవిధ్యం ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. చేస్తున్న పని సమాజానికి ఉపయోగపడేదైతే నలుగురూ వచ్చి చేరుతారనడానికి ధృవాంశ్ ఉదాహరణగా నిలిచింది. ఈ సంస్థలో కొంతమంది భాగస్వాములుగా చేరారు. కాలుష్యకారకాలైన చెత్తను తొలగించడం, బురదగా ఉన్నచోట మట్టి పోయడం, ఇళ్లలోని వేస్ట్‌ను కంపోస్ట్ ఎరువుగా మార్చడం, చెరువుల చుట్టూ మొక్కలు నాటడం చేస్తున్నాం. నీటిపై తేలియాడే వ్యవసాయ క్షేత్రాలు హైదరాబాద్ నగరానికి చేరువలో 450 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నెక్నెంపూర్ లేక్ ఇప్పుడు జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా పేరుగాంచింది. ఈ సరస్సు అభివృద్ధి అంత సులువుగా జరగలేదు. అందుకు తగిన శ్రమ చేయడంతో నేడు అనుకూల ఫలితాలు వచ్చాయి. ముందు చెరువు ప్రాంతం కబ్జాకు గురికాకుండా అక్రమార్కులకు అడ్డుకట్ట వేశాం. ఈ క్రమంలో బిల్డర్లు లంచం ఇవ్వడానికి వచ్చిన పరిస్థితులూ ఉన్నాయి. ఈమెకెందుకీ పని అన్నట్టు చాలామంది అనుమానంగా చూసేవారు. కొన్ని బెదిరింపులూ రాకపోలేదు. కానీ, వెనక్కి తగ్గలేదు. పచ్చదనం, పరిశుభ్రతను సాధించాం. హెచ్.ఎమ్.డిఎ తో కలిసి నీటిపై తేలియాడే వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేశాం. ఇందులో కూరగాయలు, పూల మొక్కలతో ఆకర్షణీయమైన పచ్చదనాన్ని తీసుకువచ్చాం. దేశంలోనే నీటిపై తేలియాడే ఈ వ్యవసాయ క్షేత్రం అతి పెద్దదిగా పేరొందింది. ఈ చెరువును నేను కాదు ఎంచుకున్నది, నన్నే ఈ చెరువు ఎంచుకుంది అని భావిస్తాను’ అని చెప్పారు మధులిక. నెక్నంపూర్ చెరువు పునరుద్ధరణకు పాటుపడినందుకు అనేక పర్యావరణ అవార్డులు గెలుచుకున్నారు మధులిక. పట్టణంలోని చెరువులన్నింటినీ అభివృద్ధి చేయడానికి, విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన తీసుకు రావడానికి నిరంతరం పాటుపడుతున్నారు. ఆమె లక్ష్యం సిద్ధిస్తే ఒకనాడు లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ కి పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది. – నిర్మలారెడ్డి -
మృత్యువును జయించింది!
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన మధులిక మృత్యువును జయించింది. 15 రోజుల క్రితం తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలో ఆస్పత్రిలో చేరిన ఆమె ఇప్పుడు చక్కగా మాట్లాడుతోంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆమెను నేరెడ్‌మెట్‌లోని అమ్మమ్మ ఇంటికి తరలించారు. డిశ్చార్జ్ సమయంలో బాధితురాలితో మాట్లాడించేందుకు ఆస్పత్రి వర్గాలు ఏర్పాట్లు చేసినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. 35 కేజీల బరువు.. 14 కత్తిపోట్లు... బర్కత్‌పురా సత్యనగర్‌కు చెందిన మంగరాములు, ఉదయ దంపతుల రెండో కుమార్తె మధులిక (17)పై ఇదే బస్తీకి చెందిన భరత్(19) తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఈ నెల 6న కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. 14 కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్న ఆమెను బంధువులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. 35 కేజీల బరువు మాత్రమే ఉన్న మధులికకు చికిత్స చేయడం పెద్ద సవాల్‌గా మారింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆస్పత్రి వైద్యులు ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆరోగ్య పరిస్థితి, ఇస్తున్న మందులు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత ఆమె స్పృహలోకి రావడంతో చికిత్స ప్రారంభించారు. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్తో పోరాటం... చికిత్సకు మధులిక శరీరం సహకరిస్తుండటంతో న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ భొట్ల, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ సాయిబాబా, డాక్టర్ ప్రసాద్‌ల బృందం 7 గంటల పాటు శ్రమించి ఆమె తల, ఇతరచోట్ల గాయాలకు ఈ నెల 8న చికిత్స చేశారు. భరత్ ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండటంతో సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మధులిక కోలుకుందని, గాయాలకు వేసిన కుట్లు కూడా విప్పినట్లు చెప్పారు. స్వయంగా ఆహారం తీసుకోవడం, మాట్లాడటంతో పాటు లేచి నడుస్తోందన్నారు. చికిత్సకైన ఖర్చును సీఎంఆర్ఎఫ్, ఇతర దాతలు చెల్లించినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఇంజనీరింగ్ చేస్తా: మధులిక భరత్ మా ఇంటికి సమీపంలో ఉండేవాడు. ఒకే వీధిలో ఉండటంతో చిన్నప్పటి నుంచి పరిచయం. కొద్దికాలంగా తనను ప్రేమించాలంటూ నాపై ఒత్తిడి తెచ్చాడు. కొన్నిసార్లు కొట్టాడు కూడా. చదువుమాన్పిస్తారనే భయంతో చాలా రోజులు ఇంట్లో చెప్పలేదు. అతని ప్రవర్తనకు విసిగిపోయి చివరికి అమ్మానాన్నకు చెప్పా. అతను ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఆ రోజు ఉదయం కాలేజీకి వెళ్తుండగా అడ్డుకుని కత్తితో దాడి చేశాడు. నేను అరవడంతో అమ్మానాన్న వచ్చారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. భరత్‌ను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుస్థితి మరే అమ్మాయికి రాకుండా చూడాలి. భవిష్యత్‌లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించి చదువుతా. మంచి ఉద్యోగం చేసి, నా తల్లిదండ్రులకు అండగా ఉంటా. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన మధులిక
-
ప్రాణాలతో బయటపడతాననుకోలేదు: మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్ధిని మధులిక(17) బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన భరత్.. ఈ నెల 6న కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మధులికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన మధులిక.. దాదాపు 15 రోజుల తర్వాత కోలుకుంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ప్రాణాపాయం లేదని, లోపలి గాయాలు తగ్గడానికి మరికొన్ని రోజులు ఇంటిపట్టునే ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అసలు ప్రాణాలతో బయటపడటమే కష్టమనుకున్న తమ కూతురి ప్రాణాలు కాపాడిన వైద్యులు దేవుళ్లంటూ మధులిక తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని దేవుని ప్రార్థించిన వందలాది మందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మధులిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకిదో పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాను ప్రాణాలతో బతికి బట్టకడతానని అసలు అనుకోలేదంటూ కంటతడిపెట్టుకుంది. తనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని దేవుడ్ని ప్రార్థించింది. ఇదిలా ఉంటే, భరత్‌ను ఎన్కౌంటర్ చేయాలని మధులిక కుటుంబం డిమాండ్ చేస్తోంది. తన కూతురి లాంటి పరిస్థితి ఏ తల్లీదండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. -
భరత్‌ని కఠినంగా శిక్షించాలి: మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్ధిని మధులిక(17) బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. పదిహేను రోజులుగా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఈ రోజు మరోసారి పూర్తిగా పరీక్షించిన వైద్యులు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా మధులిక మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి పాల్పడిన భరత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరింది. మధులిక వైద్య చికిత్సల కోసం ఇప్పటివరకు 10 లక్షల రూపాయలు ఖర్చు కాగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల సహాయం అందింది. చదవండి: నోరు మూసి బలవంతంగా లాక్కెళ్లి గేటు వేశాడు -
నోరు మూసి బలవంతంగా లాక్కెళ్లి గేటు వేశాడు
కాచిగూడ: ఇంటర్ విద్యార్థిని మధులికపై ఈ నెల 6న భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో దాడికి పాల్పడిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కాచిగూడ పీఎస్ పరిధిలోని బర్కత్‌పురా సత్యానగర్ లో జరిగింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక స్టేట్మెంట్ను మూడు రోజుల క్రితం పోలీసులు రికార్డు చేసినట్లు తెలిసింది. గత మూడు నెలలుగా భరత్ తన వెంటపడి వేధిస్తున్నాడని, తరచూ తన కాలేజీ వద్దకు వచ్చి వేధింపులకు గురిచేసేవాడని మధులిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈనెల 6నన ఉదయం తన బాబాయ్ ఇంటికి వెళుతుండగా దారిలో తనను అడ్డుకున్న భరత్ తన నోరు మూసి బలవంతంగా పక్కనే ఉన్న ఇరుకైన సందులోకి లాక్కెళ్లి గేటు వేశాడని, అతను తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటికి తీయడంతో తాను భయంతో కేకలు వేసినట్లు చెప్పినట్లు తెలిసింది. అయినా అతను తనపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడని మధులిక పేర్కొన్నట్లు సమాచారం. భరత్ పథకం ప్రకారమే తనపై దాడి చేశాడని , అతడికి వారి బంధువుల సహకారం కూడా ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెట్లో పేర్కొన్నట్లు తెలిసింది. -
జ్వరంతో బాధపడుతున్న మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది కిరాతక దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆస్పత్రి వైద్యులు బుధవారం మెడికల్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి శరీరంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఆమెకు.. అది తగ్గేందుకు చికిత్స అందిస్తున్నామని, ఇంకా అత్యవసర విభాగంలోనే ఉంచి ఆమెకు వైద్యం కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. మధులిక ఇంకా జ్వరంతో బాధపడుతున్నారని, ఆమెకు జ్వరం వస్తూ పోతూ ఉండడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. తన ప్రేమను నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని అయిన మధులికపై ప్రేమోన్మాది భరత్ కొబ్బరిబోండాల కత్తితో కిరాతకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శరీరంలోని బలమైన గాయాలు కావడంతో గాయాలకు ఎప్పటికప్పుడు డ్రెసింగ్ చేస్తూ.. ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని యశోదా వైద్యులు తెలిపారు. -
మధులిక శరీరంలో ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మధులిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందని వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో మాత్రం మధులిక జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ సోకడంతో అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. -
కుదుటపడుతున్న మధులిక ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ మేరకు సోమవారం వైద్యబృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి కృత్రిమ శ్వాసను తొలగించామని వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్స్ సోకకుండా అత్యవసర విభాగంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మధులిక శరీరంలోని అన్ని అవయవాలు నార్మల్‌గానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచిన తర్వాత ఆమెను మరోసారి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిన అనంతరం జనరల్ వార్డ్‌కు షిష్ట్ చేసే అవకాశం ఉంది. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) -
రెండు రోజులపాటు ఐసీయూలోనే మధులిక
-
రెండు రోజులపాటు ఐసీయూలోనే మధులిక
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన మధులికను మరో రెండు రోజుల పాటు ఐసీయూలోనే ఉంచనున్నారు. ఆమెకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కొబ్బరి బొండాల కత్తితో నరకడం వలన ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆమెకు ఐసీయూలోనే చికిత్స అందించాలని భావించిన వైద్యులు.. ఆ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మధులిక శరీరంలోని అన్ని అవయవాలు నార్మల్‌గానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచిన తర్వాత ఆమెను మరోసారి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే జనరల్ వార్డ్‌కు షిష్ట్ చేసే అవకాశం ఉంది. (మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు) -
మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థిని మధులికపై కత్తితో జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ప్రణాళిక ప్రకారమే బాలికపై నిందితుడు భరత్ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మధులిక 9వ తరగతి చదవుతున్నప్పటి నుంచే ప్రేమపేరుతో వెంటపడ్డానని పోలీసుల ముందు భరత్ ఒప్పుకున్నట్లు సమాచారం. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం) ఈ మూడేళ్లలో మధులికకు భరత్ రెండు సార్లు ప్రపోజ్ చేశాడని, అమె నిరాకరించడంతోనే కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. మధులిక విషయంలో ఆమె తల్లిదండ్రలు పలు మార్లు భరత్‌ను హెచ్చరించారనీ.. దాడి సమయంలో తనకు అడ్డు రాకుండా ఉండేందుకు ఆమె తల్లిదండ్రులను గదిలో బంధించి గడియ వేసి.. మధులికపై కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో దాడి చేశాడనీ తెలుస్తోంది. హత్యాయత్నానికి ముందు కూడా భరత్‌తో బాలిక తండ్రి రాములు గొడవ పడ్డాడు. షీ టీమ్స్‌తో కౌన్సిలింగ్, ఘర్షణలు, ఫిర్యాదుల వీటన్నింటి కారణంగానే ద్వారా భరత్ మధులికపై విపరీతమైన కక్ష పెంచుకుని ఉంటాడనీ అందుకే ఇంత దారుణం చేసి ఉంటాడనీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం భరత్ వాడిన కత్తిని, బ్లడ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) -
ప్రేమోన్మాదికి ఉరే సరైన శిక్ష
ముషీరాబాద్: బర్కత్‌పుర రత్ననగర్‌కాలనీలో మధులికపై దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌కు ఉరిశిక్షే సరైన మార్గమని ఆమె తల్లిదండ్రులు హోంమంత్రి మహమూద్ అలీని కోరారు. శుక్రవారం రాంనగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.శ్రీనివాస్‌రెడ్డి, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ దంపతులు గరిగంటి శ్రీదేవి, రమేశ్, కాచిగూడ కార్పొరేటర్ చైతన్య, ఎక్కాల కన్నా యాదవ్ లతో పాటు పలువురు మధులిక తల్లిదండ్రులను హోంమంత్రి నివాసానికి తీసుకెళ్లగా వారిని మహమూద్ అలీ పరామర్శించారు. ఈ సందర్భంగా తమ కూతురుపై దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని, తమ కూతురుకు జరిగిన ఘటన మరే యువతికి జరగకూడదని వేడుకున్నారు. దోషిని కఠినంగా శిక్షస్తామని హోంమంత్రి వారికి హామీ ఇచ్చారు. మధులిక ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నందున ఆమె తండ్రి రాములు వీఎస్టీలో కార్మికునిగా పనిచేస్తున్నందున వారి కుటుంబానికి కావాల్సిన ఇతర అవసరాలను వీఎస్టీ యూనియాన్ భరిస్తుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
మధులిక ఆరోగ్య పరిస్థితి మరుగైంది
-
మధులికపై జరిగిన దాడిని ఖండించిన మహిళా సంఘాలు
-
స్పృహలోకి వచ్చిన మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో 2రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు మధులిక(17) ఆరోగ్యం శుక్రవారానికి కొంత మెరుగుపడింది. 2 రోజుల నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందు తున్న ఆమె శుక్రవారం స్పృహలోకి వచ్చింది. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తుండటంతో పాటు బీపీ, పల్స్‌రేటు సహజస్థితికి చేరుకు న్నాయి. న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ భొట్ల, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌలి, వాస్క్యూలర్ సర్జన్ డాక్టర్ ప్రకాశ్, జనరల్ సర్జన్ డాక్టర్ సాయిబాబా, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసీద్‌లతో కూడిన వైద్య బృందం సుమారు 7 గంటలు శ్రమించి ఆమె తల, ఇతర భాగాలకైన గాయాలకు చికిత్స చేశారు. విరిగిన చేతి ఎముకలకు రాడ్డు సాయంతో సరిచేశారు. గదుమ, మెడ, మోచేతి భాగాల్లోని కత్తిగాట్లను శుభ్రం చేసి, గాయాలకు కుట్లు వేశారు. రక్త స్రావం పూర్తిగా నియంత్రించారు. ఇప్పటి వరకు పదిబాటిళ్లకు పైగా రక్తం ఎక్కించారు. ఉన్మాది ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండటం వల్ల తలపై గాయానికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ..ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం వెంటిలేటర్ నుంచి బయటికీ తీసుకురానున్న ట్లు తెలిపారు. మధులిక స్వయంగా శ్వాస తీసు కోగలిగి..ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాల్సి ఉంది. మరో 48 గంటలు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్య బృందం స్పష్టం చేసింది. -
మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగైంది
-
మధులిక కాస్త కోలుకుంది..
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన మధులిక చికిత్స విషయంలో 48 గంటల పాటు వైద్యులు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఐదుగురు డాక్టర్ల బృందం ఏడు గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేశారని యశోదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని సీఓఓ విజయ్ కుమార్ వెల్లడించారు, మధులిక కాస్త కోలుకుందని, సైగలు చేస్తోందని తెలిపారు. మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశామన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచుతామని వెల్లడించారు. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం) వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం ఉంటుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. నాలుగు సర్జరీలు జరిగినందున మధులిక కోలుకోవడనికి సమయం పడుతుందని. మరో 48 గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. తల వెనక భాగంలో విరిగిన ఎముక భాగాలను తొలగించామని న్యూరో సర్జన్ శ్రీనివాస్ తెలిపారు. గాయాలకు ఇన్ఫెక్షన్ అవకాశం ఎక్కువగా ఉందని, కండరాలు తెగిపోయిన చోట సర్జరీలు చేశామని ప్లాస్టిక్ సర్జన్ చంద్రమౌళి చెప్పారు. -
మెరుగు పడుతున్న మధులిక ఆరోగ్యం
-
ప్రేమోన్మాది దాడి అత్యంత విషమంగా మధులిక పరిస్థితి
-
అత్యంత విషమంగా మధులిక..
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో భరత్ అనే యువకుడి పాశవికదాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మధులిక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిన్నటికన్నా ఈ రోజు ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా.. ఇంకా ఆందోళనకరంగానే ఉందని, మరో 48 గంటలు గడిస్తేకానీ పరిస్థితి గురించి చెప్పలేమని యశోదా ఆస్పత్రి వైద్యులు గురువారం ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నామని, ఆమె మెదడుకు తీవ్ర గాయాలయ్యాయని, ఆమె కొంత కుదుటపడిన తర్వాత బ్రెయిన్ సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆమె శరీరంపై 14 బలమైన కత్తి పోట్లు ఉన్నాయని తెలిపారు. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) బుధవారం ఆస్పత్రికి తరలించే సమయానికే ఆమె పల్స్‌రేటు పడిపోయిందని, బీపీ లెవల్స్ కూడా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. భరత్ విచక్షణారహితంగా పొడిచిన కత్తిపోట్లకు బాధితురాలి తలపై భాగంలో పుర్రె రెండుగా చీలిందని, మెదడులోకి కీలక నరాలు తెగిపోయాయని వైద్యులు వెల్లడించారు. అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉందని, మెడపై కూడా తీవ్రమైన గాయం ఉందని చెప్పారు. దవడపై, రెండు చేతుల మణికట్లపై రెండు సెంటీమీటర్ల మేర గాయాలు ఉన్నాయని, ఎడమ చేతివేలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. రక్తస్రావం ఆగి, బీపీ, పల్స్రేట్.. సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు సర్జరీ చేస్తామని చెప్పారు. పక్కా ప్లాన్‌తోనే దాడి మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధులికపై దాడి చేయడానికి రెండు రోజులముందే భరత్ పక్కా ప్లాన్ రూపొందించుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. ఇందుకోసం బర్కత్‌పురాలో కొబ్బరిబోండం కొట్టే కత్తిని అతను దొంగిలించి.. తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోనే ఆ కత్తిని దాచి పెట్టాడని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న మధులికపై అదను చూసి భరత్ దాడి చేశాడని, దాడి అనంతరం తిరిగి తన ఇంట్లో ఎక్కడి నుండైతే కత్తి తీశాడో అక్కడే దాచి పెట్టాడని పోలీసులు గుర్తించారు. మాకు న్యాయం జరగలేదు: మధులిక తల్లిదండ్రులు మరోవైపు జనవరి 7నుంచీ తమ కూతురును భరత్ వేధిస్తున్నాడని, అతని వేధింపులపై షీ టీమ్స్ కౌన్సిలింగ్‌ను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భరత్ బాబాయి మాజీ పోలీసు ఉద్యోగి అని, అందుకే భరత్‌కు అనుకూలంగా కౌన్సిలింగ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు.