సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్ధిని మధులిక(17) బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. పదిహేను రోజులుగా యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఈ రోజు మరోసారి పూర్తిగా పరీక్షించిన వైద్యులు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా మధులిక మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి పాల్పడిన భరత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరింది. మధులిక వైద్య చికిత్సల కోసం ఇప్పటివరకు 10 లక్షల రూపాయలు ఖర్చు కాగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల సహాయం అందింది.
Comments
Please login to add a commentAdd a comment