
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ మేరకు సోమవారం వైద్యబృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి కృత్రిమ శ్వాసను తొలగించామని వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్స్ సోకకుండా అత్యవసర విభాగంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మధులిక శరీరంలోని అన్ని అవయవాలు నార్మల్‌గానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచిన తర్వాత ఆమెను మరోసారి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిన అనంతరం జనరల్ వార్డ్‌కు షిష్ట్ చేసే అవకాశం ఉంది. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..)
Comments
Please login to add a commentAdd a comment