barkatpura
-
మంగళసూత్రం పోయిందని వస్తే...
వెంగళరావునగర్: మంగళసూత్రం దొంగిలించారని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళను పోలీసులు నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన సంఘటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బర్కత్‌పురలో నివాసం ఉంటున్న శ్రీరేఖ ఈ నెల 15న స్థానిక మధురానగర్‌లోని తన బంధువుల వద్దకు వచ్చింది. 16వ తేదీ తన సోదరునితో కలిసి రైతుబజార్‌కు వెళ్లి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసుకోగా తన మంగళసూత్రం కనిపించలేదు. హుటాహుటిన రైతుబజార్‌కు వెళ్లి విచారించినా ఫలితం లేదు. ఆమె సమీపంలోని సనత్‌నగర్ పీఎస్‌కు వెళ్లగా అది తమ పరిధి కాదని ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు. ఎస్ఆర్నగర్ పీఎస్‌కు వెళ్లగా ఆ ఏరియా బోరబండ పీఎస్ పరిధిలోకి వస్తుందని వెనక్కు పంపారు. తిరిగి బోరబండకు వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఆ పీఎస్‌లో కూడా ఫిర్యాదు తీసుకోకుండా మధురానగర్‌కు పంపారు. చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలే మంగళసూత్రం పోగొట్టుకుని బాధలో ఉన్న మహిళను నాలుగు పీఎస్‌లకు తిప్పడం ఎంతవరకు సబబని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. -
బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
కాచిగూడ (హైదరాబాద్): ధర్మరక్ష సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో శనివారం ఆ పార్టీలో చేరారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌తోపాటు ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావుతో కలిసి డీకే అరుణ మాట్లాడుతూ సీఎం పదవి కోసం మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఆస్పత్రిలో చేర్పించకుండా ఫామ్‌హౌస్‌లో ఉంచడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. సీఎం ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోకుండా మంత్రులు కేటీఆర్, హరీశ్రావులిద్దరే తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని, ఎవరికి వారే సీఎం పదవి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం దొంగ నోటిపికేషన్లు వేసి నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు ప్రకటించారని, అందులో కూడా అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రవీణ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ధర్మరక్షణ కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
17 సార్లు పొడిచిన యువకుడికి శిక్ష
సాక్షి, హైదరాబాద్: అది ఫిబ్రవరి 6, 2019.. బర్కత్‌పురకు చెందిన పదిహేడేళ్ల మేఘన(పేరు మార్చాం) ఎప్పటిలాగే ఇంటర్ కాలేజ్‌కు వెళ్లేందుకు బస్‌స్టాప్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల భరత్ అనే యువకుడు ఆమె రాక కోసం ఓమూల నక్కి ఉన్నాడు. తన ప్రేమను అంగీకరించని ఆ యువతిని చంపేయాలని కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో నిల్చున్నాడు. ఆమె కనిపించగానే రాక్షసుడిలా మారిపోయాడు. ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు చేరుకుని వరుసగా పదిహేడు సార్లు కత్తితో పొడిచాడు. రక్తం కారుతూ కొన ఊపిరితో కొట్టుకుంటున్నా అతడు వదిలేయలేదు. కసి తీరా పొడిచి అక్కడ నుంచి పరారయ్యాడు.అప్పటివరకు భయంతో బిగుసుకుపోయిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎలాగోలా ఆమె చావు నుంచి బయటపడింది, కానీ జీవితమే చీకటి అయింది. (బీర్ సీసాతో భార్యపై దాడి) బాగా చదివి విదేశాలకు వెళ్లాలన్న ఆమె కల అర్ధాంతరంగా ఆగిపోయింది. శారీరకంగా, మానసిక ఆరోగ్యం దెబ్బ తింది. ఈ దారుణం జరిగి ఏడాదికి పైనే అవుతోంది. ఈ కేసులో నిందితుడికి సోమవారం కోర్టు పదేళ్ల జైలు విధించింది. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. 'ఒకప్పుడు నా బిడ్డ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మౌనంగానే ఉంటోంది. మళ్లీ పాత గాయాలను గుర్తు చేయడం ఇష్టం లేక దోషికి శిక్ష పడిందన్న విషయాన్ని కూడా ఇప్పటివరకు ఆమెకు చెప్పనేలేదు'అని తెలిపారు. తన కూతురికి కూతురికి జరిగిన ఘోరానికి సాక్ష్యంగా నిలిచిన బర్కత్పురను వదిలి ఆ కుటుంబం వేరే ప్రాంతంలో నివసిస్తోంది. ప్రస్తుతం మేఘన బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇప్పటికీ ఆమె కాలేజ్‌కు వెళ్లాలంటే బస్‌స్టాప్ వరకు ఒకరు తోడుగా వెళ్లాల్సిందే. (తల్లీ, కూతుళ్లపై హత్యాయత్నం) -
మధులిక శరీరంలో ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మధులిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందని వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో మాత్రం మధులిక జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ సోకడంతో అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. -
కుదుటపడుతున్న మధులిక ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ మేరకు సోమవారం వైద్యబృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి కృత్రిమ శ్వాసను తొలగించామని వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్స్ సోకకుండా అత్యవసర విభాగంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మధులిక శరీరంలోని అన్ని అవయవాలు నార్మల్‌గానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచిన తర్వాత ఆమెను మరోసారి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిన అనంతరం జనరల్ వార్డ్‌కు షిష్ట్ చేసే అవకాశం ఉంది. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) -
మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థిని మధులికపై కత్తితో జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ప్రణాళిక ప్రకారమే బాలికపై నిందితుడు భరత్ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మధులిక 9వ తరగతి చదవుతున్నప్పటి నుంచే ప్రేమపేరుతో వెంటపడ్డానని పోలీసుల ముందు భరత్ ఒప్పుకున్నట్లు సమాచారం. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం) ఈ మూడేళ్లలో మధులికకు భరత్ రెండు సార్లు ప్రపోజ్ చేశాడని, అమె నిరాకరించడంతోనే కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. మధులిక విషయంలో ఆమె తల్లిదండ్రలు పలు మార్లు భరత్‌ను హెచ్చరించారనీ.. దాడి సమయంలో తనకు అడ్డు రాకుండా ఉండేందుకు ఆమె తల్లిదండ్రులను గదిలో బంధించి గడియ వేసి.. మధులికపై కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో దాడి చేశాడనీ తెలుస్తోంది. హత్యాయత్నానికి ముందు కూడా భరత్‌తో బాలిక తండ్రి రాములు గొడవ పడ్డాడు. షీ టీమ్స్‌తో కౌన్సిలింగ్, ఘర్షణలు, ఫిర్యాదుల వీటన్నింటి కారణంగానే ద్వారా భరత్ మధులికపై విపరీతమైన కక్ష పెంచుకుని ఉంటాడనీ అందుకే ఇంత దారుణం చేసి ఉంటాడనీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం భరత్ వాడిన కత్తిని, బ్లడ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) -
మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగైంది
-
మధులిక కాస్త కోలుకుంది..
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన మధులిక చికిత్స విషయంలో 48 గంటల పాటు వైద్యులు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఐదుగురు డాక్టర్ల బృందం ఏడు గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేశారని యశోదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని సీఓఓ విజయ్ కుమార్ వెల్లడించారు, మధులిక కాస్త కోలుకుందని, సైగలు చేస్తోందని తెలిపారు. మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశామన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచుతామని వెల్లడించారు. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం) వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం ఉంటుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. నాలుగు సర్జరీలు జరిగినందున మధులిక కోలుకోవడనికి సమయం పడుతుందని. మరో 48 గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. తల వెనక భాగంలో విరిగిన ఎముక భాగాలను తొలగించామని న్యూరో సర్జన్ శ్రీనివాస్ తెలిపారు. గాయాలకు ఇన్ఫెక్షన్ అవకాశం ఎక్కువగా ఉందని, కండరాలు తెగిపోయిన చోట సర్జరీలు చేశామని ప్లాస్టిక్ సర్జన్ చంద్రమౌళి చెప్పారు. -
మెరుగు పడుతున్న మధులిక ఆరోగ్యం
-
ప్రేమోన్మాది దాడి అత్యంత విషమంగా మధులిక పరిస్థితి
-
అత్యంత విషమంగా మధులిక..
సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో భరత్ అనే యువకుడి పాశవికదాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మధులిక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిన్నటికన్నా ఈ రోజు ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా.. ఇంకా ఆందోళనకరంగానే ఉందని, మరో 48 గంటలు గడిస్తేకానీ పరిస్థితి గురించి చెప్పలేమని యశోదా ఆస్పత్రి వైద్యులు గురువారం ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నామని, ఆమె మెదడుకు తీవ్ర గాయాలయ్యాయని, ఆమె కొంత కుదుటపడిన తర్వాత బ్రెయిన్ సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆమె శరీరంపై 14 బలమైన కత్తి పోట్లు ఉన్నాయని తెలిపారు. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..) బుధవారం ఆస్పత్రికి తరలించే సమయానికే ఆమె పల్స్‌రేటు పడిపోయిందని, బీపీ లెవల్స్ కూడా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. భరత్ విచక్షణారహితంగా పొడిచిన కత్తిపోట్లకు బాధితురాలి తలపై భాగంలో పుర్రె రెండుగా చీలిందని, మెదడులోకి కీలక నరాలు తెగిపోయాయని వైద్యులు వెల్లడించారు. అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉందని, మెడపై కూడా తీవ్రమైన గాయం ఉందని చెప్పారు. దవడపై, రెండు చేతుల మణికట్లపై రెండు సెంటీమీటర్ల మేర గాయాలు ఉన్నాయని, ఎడమ చేతివేలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. రక్తస్రావం ఆగి, బీపీ, పల్స్రేట్.. సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు సర్జరీ చేస్తామని చెప్పారు. పక్కా ప్లాన్‌తోనే దాడి మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధులికపై దాడి చేయడానికి రెండు రోజులముందే భరత్ పక్కా ప్లాన్ రూపొందించుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. ఇందుకోసం బర్కత్‌పురాలో కొబ్బరిబోండం కొట్టే కత్తిని అతను దొంగిలించి.. తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోనే ఆ కత్తిని దాచి పెట్టాడని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న మధులికపై అదను చూసి భరత్ దాడి చేశాడని, దాడి అనంతరం తిరిగి తన ఇంట్లో ఎక్కడి నుండైతే కత్తి తీశాడో అక్కడే దాచి పెట్టాడని పోలీసులు గుర్తించారు. మాకు న్యాయం జరగలేదు: మధులిక తల్లిదండ్రులు మరోవైపు జనవరి 7నుంచీ తమ కూతురును భరత్ వేధిస్తున్నాడని, అతని వేధింపులపై షీ టీమ్స్ కౌన్సిలింగ్‌ను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భరత్ బాబాయి మాజీ పోలీసు ఉద్యోగి అని, అందుకే భరత్‌కు అనుకూలంగా కౌన్సిలింగ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. -
పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది భరత్ చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక(17) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆమె పల్స్‌రేటు పడిపోయింది. బీపీ లెవల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. బాధితురాలి శరీరంపై 14 చోట్ల బలమైన కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తల పైభాగంలో కత్తిగాటుకు పుర్రె రెండుగా చీలిపోయింది. మెదడులోని కీలక నరాలు తెగిపోయాయి. అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉంది. మెడ పైభాగంలోనూ బలమైన గాయమైంది. దవడ సహా రెండు చేతుల మణికట్టుల వద్ద రెండు సెంటీమీటర్ల లోతు తెగిపోయింది. అరచేతులు, వేళ్లపై బలమైన గాట్లు పడ్డాయి. చేతివేలి కీళ్లు విరిగి బయటికి కన్పిస్తున్నాయి. ఎడమచేతి వేలు ఒకటి పూర్తిగా తెగిపోయింది. రక్తం ఎక్కువగా పోవడంతో ఇప్పటివరకు ఐదు బాటిళ్ల రక్తం ఎక్కించారు. కత్తిగాట్ల వల్ల తెగి వేలాడుతున్న శరీర భాగాలకు కుట్లు వేశారు. అధిక రక్తస్రావాన్ని నియంత్రించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. రక్తస్రావం ఆగిపోయి, బీపీ, పల్స్రేట్ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. -
బుసలు కొట్టిన ప్రేమోన్మాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రేమోన్మాదం బుసలు కొట్టింది. ప్రేమించడంలేదనే కోపంతో ఇంటర్ విద్యార్థినిపై డిగ్రీ చదువుతున్న యువకుడు దాడికి తెగబడ్డాడు. బుధవారం ఆమె ఇంటికి సమీపంలోనే కాపుకాసి కొబ్బరిబొండాలు నరికే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. 14 చోట్ల తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దాడి చేసిన అనంతరం పరారైన నిందితుడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని కాచిగూడ పోలీసులకు అప్పగించారు. బర్కత్‌పుర సత్యనగర్‌కు చెందిన మంగ రాములు, ఉదయ దంపతుల రెండో కుమార్తె మధులిక (17) నల్లకుంట శివం రోడ్డులోని శరత్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే బస్తీలో నివసిస్తున్న వేణుగోపాల్, కళ్యాణి దంపతుల కుమారుడు చిట్కూరి భరత్ అలియాస్ సోను(19) రాంకోఠిలోని జాగృతి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిగా మధులిక వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు గతనెల 7న షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భరత్, మధులికలతో పాటు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మధులికను మళ్లీ వేధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భరత్‌ను హెచ్చరించి, ఇంటికి పంపించివేశారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. పైగా వేధింపులు మరింత పెంచాడు. ఎంతగా వెంటపడుతున్నా ప్రేమించకపోవడంతో ఆమెపై కక్ష కట్టి, హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల క్రితం కాచిగూడలోని ఓ కొబ్బరిబొండాల దుకాణం నుంచి కత్తి చోరీ చేశాడు. దానిని తన ఇంట్లోనే ఎవరికీ కనపడకుండా దాచిపెట్టాడు. బుధవారం ఉదయం ఆ కత్తిని ఓ పేపర్లో చుట్టి కవర్లో పెట్టుకుని బయటకు వచ్చాడు. మధులిక ఇంటి సమీపంలోనే నివసించే భరత్ సమీప బంధువు ఇంటివద్ద కాపుకాశాడు. తొలుత వాగ్వాదం.. ఆపై దాడి.. ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాలకు బయలుదేరిన మధులికను చూసిన భరత్.. వెంటనే ఆమె వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆ సందు ఇరుకుగా ఉండటంతో అతడిని తప్పించుకుని ఆమె ముందుకు వెళ్లలేకపోయింది. సహాయం కోసం భరత్ కాపుకాసిన ఇంట్లోకి వెళ్లింది. అయితే, అక్కడ ఎవరూ లేకపోవడం.. ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో వరాండాలో ఆగిపోయింది. ఈ క్రమంలో ఆమె వెనకే వచ్చిన భరత్.. తన వద్దనున్న కత్తితో మధులికపై దాడి చేశాడు. మెడపై వేటు వేయబోగా.. చేతులు అడ్డం పెట్టుకోవడంతో ఆమె బొటనవేలు తెగిపోయింది. అయినా ఆగని నిందితడు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె మెడ, చేతులు, ముఖం, పొట్ట, ఛాతిలో మొత్తం 14 చోట్ల గాయాలయ్యాయి. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు అక్కడకు వచ్చినప్పటికీ, భరత్ చేతిలో కత్తి ఉండటంతో అతడిని ఆపే ధైర్యం చేయలేకపోయారు. తీవ్ర గాయాలతో మధులిక కుప్పకూలిన తర్వాత భరత్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి, రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని తొలుత కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కోసం మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూసీ నది వద్ద పట్టుకున్నాం భరత్‌ను పట్టుకోవడానికి నాలుగు బృందాలు పని చేశాయి. మూసీ నది వద్ద ఓ ఇంట్లో దాక్కుని ఉండగా మాటువేసి అదుపులోకి తీసుకున్నాం. భరత్‌కు ఇప్పటి వరకు ఎలాంటి నేరచరిత్ర లేదు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. మధులిక ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. – ఎం.రమేష్, ఈస్ట్‌జోన్ డీసీపీ -
'ఆడవాళ్లు బయట తిరిగే రోజులు కాదు'
హైదరాబాద్: ఇంటికి పెద్దదిక్కుగా మారిన ఇల్లాలి ప్రాణం తీసిన చైన్ స్నాచింగ్ పై నెటిజన్లు స్పందించారు. గొలుసు దొంగల ఆగడాలపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బర్కత్‌పుర డివిజన్ సత్యానగర్ ప్రాంతానికి చెందిన పి. సుమిత్ర ఓ దొంగ చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసింది. ఈ విషాద ఘటనపై 'సాక్షి' ఫేస్ బుక్ పేజీలో నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. ఆడవాళ్లు బయటకు రావాలంటేనే భయపడే రోజులు దాపురించాయని మురళీధరన్ పిల్లుట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సుమిత్ర మరణం తమను కలిచివేసిందంటూ పలువురు ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.