సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన మధులిక చికిత్స విషయంలో 48 గంటల పాటు వైద్యులు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఐదుగురు డాక్టర్ల బృందం ఏడు గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేశారని యశోదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని సీఓఓ విజయ్ కుమార్ వెల్లడించారు, మధులిక కాస్త కోలుకుందని, సైగలు చేస్తోందని తెలిపారు. మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశామన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచుతామని వెల్లడించారు. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం)
వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం ఉంటుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. నాలుగు సర్జరీలు జరిగినందున మధులిక కోలుకోవడనికి సమయం పడుతుందని. మరో 48 గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. తల వెనక భాగంలో విరిగిన ఎముక భాగాలను తొలగించామని న్యూరో సర్జన్ శ్రీనివాస్ తెలిపారు. గాయాలకు ఇన్ఫెక్షన్ అవకాశం ఎక్కువగా ఉందని, కండరాలు తెగిపోయిన చోట సర్జరీలు చేశామని ప్లాస్టిక్ సర్జన్ చంద్రమౌళి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment