మధులిక శరీరంలో ఇన్ఫెక్షన్‌ | Madhulika Latest Health Bulletin Released | Sakshi
Sakshi News home page

మధులిక శరీరంలో ఇన్ఫెక్షన్‌

Published Tue, Feb 12 2019 7:58 PM | Last Updated on Tue, Feb 12 2019 8:00 PM

Madhulika Latest Health Bulletin Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బర్కత్‌పురలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మధులిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందని వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో మాత్రం మధులిక జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్‌ సోకడంతో అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇన్ఫెక్షన్‌ సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement