జ్వరంతో బాధపడుతున్న మధులిక | Student Madhulika Suffering From Fever | Sakshi
Sakshi News home page

జ్వరంతో బాధపడుతున్న మధులిక

Published Wed, Feb 13 2019 7:46 PM | Last Updated on Wed, Feb 13 2019 7:51 PM

Student Madhulika Suffering From Fever - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమోన్మాది కిరాతక దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆస్పత్రి వైద్యులు బుధవారం మెడికల్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతానికి శరీరంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఆమెకు.. అది తగ్గేందుకు చికిత్స అందిస్తున్నామని, ఇంకా అత్యవసర విభాగంలోనే ఉంచి ఆమెకు వైద్యం కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. మధులిక ఇంకా జ్వరంతో బాధపడుతున్నారని, ఆమెకు జ్వరం వస్తూ పోతూ ఉండడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. తన ప్రేమను నిరాకరించిందని ఇంటర్‌ విద్యార్థిని అయిన మధులికపై ప్రేమోన్మాది భరత్‌ కొబ్బరిబోండాల కత్తితో కిరాతకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శరీరంలోని బలమైన గాయాలు కావడంతో గాయాలకు ఎప్పటికప్పుడు డ్రెసింగ్ చేస్తూ.. ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని యశోదా వైద్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement