హోంమంత్రి మహమూద్ అలీని కలిసిన మధులిక తల్లిదండ్రులు, కార్పొరేటర్లు
ముషీరాబాద్: బర్కత్‌పుర రత్ననగర్‌కాలనీలో మధులికపై దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌కు ఉరిశిక్షే సరైన మార్గమని ఆమె తల్లిదండ్రులు హోంమంత్రి మహమూద్ అలీని కోరారు. శుక్రవారం రాంనగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.శ్రీనివాస్‌రెడ్డి, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ దంపతులు గరిగంటి శ్రీదేవి, రమేశ్, కాచిగూడ కార్పొరేటర్ చైతన్య, ఎక్కాల కన్నా యాదవ్ లతో పాటు పలువురు మధులిక తల్లిదండ్రులను హోంమంత్రి నివాసానికి తీసుకెళ్లగా వారిని మహమూద్ అలీ పరామర్శించారు.
ఈ సందర్భంగా తమ కూతురుపై దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని, తమ కూతురుకు జరిగిన ఘటన మరే యువతికి జరగకూడదని వేడుకున్నారు. దోషిని కఠినంగా శిక్షస్తామని హోంమంత్రి వారికి హామీ ఇచ్చారు. మధులిక ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నందున ఆమె తండ్రి రాములు వీఎస్‌టీలో కార్మికునిగా పనిచేస్తున్నందున వారి కుటుంబానికి కావాల్సిన ఇతర అవసరాలను వీఎస్‌టీ యూనియాన్ భరిస్తుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment