హైదరాబాద్ : రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు కోలుకునేవరకూ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. విద్యార్థుల చికిత్స కోసం కామారెడ్డిలో ఆర్థోపెడిక్ డాక్టర్ను నియమించినట్లు ఆయన చెప్పారు. మూడు రోజుల్లో 16మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు.
యశోదాలో చికిత్స పొందుతున్న 20మంది విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని రాజయ్య చెప్పారు. వారిలో తరుణ్, వైష్ణవి పరిస్థితి మరింతగా ఉన్నట్లు సమాచారం. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఇద్దరిని ఈరోజు, రేపు మరో ఇద్దర్ని జనరల్ వార్డుకు తరలించనున్నట్లు చెప్పారు.