ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ | Survived childrens are getting treatment in Yashoda hospital | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ

Published Thu, Jul 24 2014 4:00 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ - Sakshi

ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ

హైదరాబాద్: మెదక్ జిల్లా మసాయి పేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. చిన్నారుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వ భరిస్తుందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. 

మెదక్ జిల్లా మసాయిపేట వద్ద గురువారం ఉదయం నాందేడ్ ప్యాసింజర్ రైలు స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందారు. ఆ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కోకుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం కింద అందజేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేల ఇవ్వనున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement