అక్కాతమ్ముళ్ల మృతి, తండ్రికి గుండెపోటు | siblings lost lives, father gets heart attack in medak tragedy | Sakshi
Sakshi News home page

అక్కాతమ్ముళ్ల మృతి, తండ్రికి గుండెపోటు

Published Thu, Jul 24 2014 2:13 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

అక్కాతమ్ముళ్ల మృతి, తండ్రికి గుండెపోటు - Sakshi

అక్కాతమ్ముళ్ల మృతి, తండ్రికి గుండెపోటు

కన్నబిడ్డలపైనే  ప్రాణాలు పెట్టుకున్న బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ప్రమాద వార్త అశనిపాతంగా మారింది. తమ ఇద్దరు చిన్నారులు రైలు ప్రమాదంలో మృతి చెందిన వార్తను విన్న ఓ తండ్రి గుండెపోటుకు గురయ్యారు. నాందేడ్ ప్యాసింజర్ రైలు.. కాకతీయ స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో కిష్టాపూర్‌కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ మృతి చెందారు. వీళ్లిద్దరూ ఒకే తల్లి బిడ్డలు.

 

ఈ సమాచారం తెలియటంతోఆ విద్యార్థుల తండ్రికి గుండెపోటు రావటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ డ ఓ చిన్నారి అమ్మా... నాకేమయిందమ్మా... అంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమాయకంగా అడుగుతున్న ఘటన తల్లితో  పాటు, చూసేవారిని కంటతడి పెట్టించింది.

 

మరి కొంతమంది తల్లిదండ్రులు సంఘటన స్థలంలోనే స్పృహతప్పి పడిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ కళ్లముందు కదలాడే కన్నబిడ్డలు ఇక లేరన్న విషయం జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యాలు సంఘటన స్థలంలో ఉన్న వారందరి హృదయాలను కలచివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement