kakatiya school
-
తరుణ్, వైష్ణవి పరిస్థితి మరింత విషమం
హైదరాబాద్ : రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు కోలుకునేవరకూ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. విద్యార్థుల చికిత్స కోసం కామారెడ్డిలో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను నియమించినట్లు ఆయన చెప్పారు. మూడు రోజుల్లో 16మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. యశోదాలో చికిత్స పొందుతున్న 20మంది విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని రాజయ్య చెప్పారు. వారిలో తరుణ్, వైష్ణవి పరిస్థితి మరింతగా ఉన్నట్లు సమాచారం. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఇద్దరిని ఈరోజు, రేపు మరో ఇద్దర్ని జనరల్ వార్డుకు తరలించనున్నట్లు చెప్పారు. -
పాతంకుల్ పెళ్లి రోజని కొత్తంకుల్ వచ్చాడు
మాసాయిపేట బస్సు ప్రమాదంలో గాయపడి, యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్న చిన్నారి రుచిత.. ఇద్దరి ప్రాణాలను కాపాడి తాను మాత్రం గాయపడింది. ఈ పాప బాగా చురుగ్గా ఉందని, మంచి ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల మిగిలినవారి కంటే త్వరగా కోలుకుంటోందని ఆస్పత్రి సిబ్బంది కూడా చెప్పారు. తనకు ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే వస్తుందని ఆమె యశోద ఆస్పత్రిలో 'సాక్షి టీవీ'తో చెప్పింది. తాను మూడో సీట్లో కూర్చున్నానని, రైలు వస్తుండగా చూశానని తెలిపింది. బస్సు అప్పటికే రైల్వే ట్రాకు మీద ఆగిపోయిందని, అంతలో డ్రైవర్‌కు ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడని చెప్పింది. ఇంతలో రైలు వస్తోందని తాము చెప్పినా అతను మాత్రం పట్టించుకోలేదని, రైలు వస్తున్న విషయం చూసి తాను తన పక్క సీట్లో కూర్చున్న సద్భావన్, మహిపాల్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికీలోంచి బయటకు తోసేశానని తెలిపింది. తన తమ్ముడు వరుణ్‌ను కూడా తోసేందుకు ప్రయత్నించినా, అతడు కిటికీలో పట్టలేదని వివరించింది. ప్రమాదం జరిగిన రోజున తమకు ఎప్పుడూ వచ్చే డ్రైవరంకుల్ పెళ్లి రోజని, అందుకనే ఆయన కాకుండా కొత్త అంకుల్‌ను పంపారని రుచిత చెప్పింది. అతడు తాము చెబుతున్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే రైలు వచ్చి బస్సును ఢీకొట్టిందని తెలిపింది. -
స్పృహలోకి వచ్చిన దర్శన్
హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 20 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఐదుగురు విద్యార్థులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 40 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. 2,3 రోజుల్లో కొందరిని డిశ్చార్జ్ చేస్తామని యశోద వైద్యులు చెప్పారు. విద్యార్థి దర్శన్ గౌడ్ స్పృహలోకి వచ్చాడని తెలిపారు. ఈరోజు దర్శన్ పుట్టినరోజు కావడంతో అతడితో కేక్ కట్ చేయించారు. -
గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో...
హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనపై నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు డ్రైవర్ స్పందించాడు. నిన్న ఉదయం 9:15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని 'సాక్షి'తో చెప్పాడు. 300 మీటర్ల నుంచే తాము విజిల్ ఇచ్చామని తెలిపాడు. అయితే బస్సు ఆకస్మాత్తుగా ట్రాక్‌పైకి బస్సు వచ్చిందని, గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో బస్సును గుర్తించలేకపోయామని వెల్లడించాడు. బ్రేక్ వేసేందుకు ప్రయత్నించామని కాని రైలు వేగం వల్ల ప్రమాదం జరిగిందని ట్రైన్ డ్రైవర్ వివరించాడు. రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది.. గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం. -
ముగ్గురి పరిస్థితి అత్యంత విషమం
హైదరాబాద్: 'మాసాయిపేట' ఘటనలో గాయపడిన 20 మంది విద్యార్థులకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు సాయిరామ్, సుచితాగౌడ్, సందీప్, శరత్, సాత్విక, వరుణ్‌గౌడ్, నభీరా ఫాతిమా, శ్రావణి, హారీశ్, మహిపాల్‌రెడ్డి, అభినందు, సద్భావన్దాస్, శిరీషా, వైష్ణవి, దర్శన్ అలియాస్ ధనుష్‌గౌడ్, కరుణాకర్, శివకుమార్, ప్రశాంత్, నితుషా, తరుణ్. మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి! -
ప్రమాద స్థలం వద్ద ఉద్రిక్తత
* బాధితులకు న్యాయం చేయాలని అంబులెన్సులను అడ్డుకున్నఆందోళనకారులు * పోలీసుల లాఠీచార్జి... పలువురికి గాయాలు రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి: రైలు ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతవాసులను కలచివేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు వేలాది మంది సంఘటన స్థలానికి తరలివచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకోసం అంబులెన్సుల్లో తరలిస్తుండగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తరలించరాదని భారీ ఎత్తున జనం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారులను నిలువరించే ప్రయత్నం చేస్తుండగా వారు రాళ్లతో దాడిచేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లను అడ్డుకున్న వందలాదిమంది యువకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మరో పక్క ఏబీవీపీ విద్యార్థులు కూడా ధర్నాకు దిగారు. దీంతో భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లాఠీచార్జి సందర్భంగా కొందరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. నిరసనకారుల రాళ్లదాడిలో తూప్రాన్ సీఐ సంజయ్‌కుమార్, గన్‌మన్ నరేంద్రతోపాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అంబులెన్స్‌ల అద్దాలు పగిలాయి. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట, వెల్దుర్తి ఎస్ఐలు నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. -
‘గేటు’ పెట్టిస్తాం ఓటేయండి.. ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం కోటి మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత ప్రజలను పట్టించుకోరనే విషయం... మాసాయిపేట ప్రమాదం నేపథ్యంలో మరోసారి రుజువైంది. గురువారం ప్రమాదం జరిగిన మాసాయిపేట లెవల్ క్రాసింగ్‌తోపాటు దానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి, డిల్లాయ్, కూచారం తండాల వ ద్ద కూడా కాపలా లేని క్రాసింగ్‌లు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. గేట్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు రైల్వే అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవటంతో విసిగిపోయిన ఆ ప్రాంతాల ప్రజలు... గత సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో కంగారుపడ్డ నేతలు... రైల్వే అధికారులను ఒప్పించి మరీ వెంటనే గేట్లు ఏర్పాటు చేయిస్తామని, ఓట్లేయాలని బతిమాలారు. దీంతో ప్రజలు ఓట్లేశారు. కానీ నేతలు మాత్రం తామిచ్చిన హామీని మరచిపోయారు. -
కేంద్రం కంటితుడుపు.. రూ. 2 లక్షల పరిహారం
రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంపై కేంద్రం నామమాత్రంగా స్పందించింది. ఈ ఘటన పై రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్‌సభలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటన చేశారు. తెలంగాణలో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సభకు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే మానవీయకోణంలో ఆలోచించి ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పరిహారం చాలా తక్కువగా ఉందని టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇది సరికాదని, పరిహారం పెంచాలని నిలదీశారు. దీంతో రైల్వే మంత్రి స్పందించారు. ఇది సాధారణంగా ప్రకటించే పరిహారమని, మరింత నష్టపరిహారం, ఇతర సహాయాలను తర్వాత రైల్వే శాఖ చేపడుతుందని వివరణ ఇచ్చారు. కాగా, బాధితులకు రూ. ఐదు లక్షల నష్టపరిహారం అందించాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఇటు లోక్‌సభలో ఎంపీలు జితేందర్ రెడ్డి, అహ్లూవాలియా కూడా ఇదే డిమాండ్ చేశారు. -
పచ్చడి మెతుకులు.. చితికిన బతుకులు
మాసాయిపేట నుండి సాక్షి ప్రతినిధి: చెల్లాచెదురైన స్కూలు బ్యాగులు...చిందర వందరగా పడి ఉన్న పుస్తకాలు...పాత పలకలు... తెగిపోయిన బూట్లు... పగిలిన టిఫిన్ బాక్స్‌లు...ఏ టిఫిన్ బాక్స్‌లో చూసినా పచ్చడి మెతుకులే. మాసాయిపేట ప్రమాదస్థలివద్ద కనిపించిన దృశ్యాలివి. గురువారం ఘటనాస్థలికి వెళ్లిన సాక్షి ప్రతినిధి అక్కడ పడి ఉన్న టిఫిన్ బాక్సుల్లో కొన్నింటిని తెరిచి చూడగా దాదాపుగా అన్నింట్లోనూ పచ్చడి మెతుకులు, కారంతో కలిపిన ముద్దలే కన్పించాయి. ఆ చిన్నారి విద్యార్థుల సామాజిక స్థితి, పేదరికానికి అద్దం పట్టే ఈ దృశ్యాలు అక్కడి వారిని కలచి వేశాయి. పేదరికంతో అల్లాడుతున్నా... ఇంగ్లిష్ చదువులు చదివితే మంచి ఉద్యోగాలొస్తాయని, తద్వారా తలరాతలు మారతాయనే ఆశతోనే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నో స్కూలుకు పంపుతున్నారు. అందుకు స్తోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని కొందరు. అప్పోసొప్పో చేసి మరికొందరు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివిస్తున్నారు. అయితే తమ పిల్లల జీవితాలను విధి బలి తీసుకోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అంతులేని వేదన..
* తల్లిదండ్రులకు గర్భశోకం * ఇంటి దీపాలను కోల్పోయి.. ఆశలు బుగ్గిపాలు * దుఃఖసాగరంలో కుటుంబాలు వారంతా కాయకష్టం చేసే బడుగు జీవులు. స్వేదం చిందించైనా తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డారు. కష్టాలు దిగమింగుతూ వేలాదిగా ఫీజులు చెల్లిస్తూ.. కన్న బిడ్డల భవిష్యత్తుపై కలలు కంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక్కసారిగా విధి కన్నెర్ర జేయడంతో ఆ కుటుంబాలన్నీ పెను విషాదంలో మునిగిపోయాయి. రేపటి పౌరులు అర్ధాంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు తీరని దుఃఖంలో కూరుకుపోయారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో చిన్నారులను కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మూడు కుటుంబాల్లో ఇద్దరేసి చొప్పున పిల్లలు చనిపోయారు. ఇక ఆసుపత్రుల్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల హృదయ వేదన గుండెలను ద్రవింపజేస్తున్నది. మాసాయిపేట పరిసర గ్రామాల్లోని ఏ ఇంటి ముందు చూసినా విషాద ఛాయలే. భగవంతుడా.. మాకెందుకీ శాపమంటూ బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. టాటా చెప్పి పోయిండు: వంశీతాత మల్లయ్య ‘పొద్దున్నే బువ్వపెట్టి, యూనిఫాం వేసి ముస్తాబు చేసి 8.30 గంటలకు మనవడిని ఎత్తుకుని కోడలితో కలసి రోడ్డుపైకి వచ్చి స్కూలు బస్సు ఎక్కించాను. బస్సు లోపల నుంచి టాటా చెబుతూ గాలిలో ముద్దు(ప్లయింగ్ కిస్) ఇచ్చిండు. గంటలోపలే పిడుగులాంటి వార్త విన్నాం’ అని ఈ దుర్ఘటనలో మృతిచెందిన వంశీ (07) తాత మల్లయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. వెల్దుర్తి మండలం వెంకటాయపల్లికి చెందిన మల్లయ్య కుమారుడు మల్లేష్, కోడలు హేమలత వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు. వంశీ కాకతీయ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. మనవడిని తానే మృత్యుశకటం ఎక్కించానని మల్లయ్య బావురుమన్నాడు. ఒక్క నిమిషం ఆగి ఉంటే.. ఒక్క నిమిషం ఆగి ఉంటే నీరుటి వంశీ ప్రాణాలు దక్కేవి. ఇస్లాంపూర్ ఎంపీటీసీ నీరుటి అమృతాసుదర్శన్కు ఇద్దరు పిల్లలు. కొడుకు వంశీ ఏడో తరగతి, కూతురు వెన్నెల నాలుగో తరగతి చదువుతున్నారు. వంశీ పెదనాన్న మల్లేశానికి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో ఆయన్ను చూడటానికి వంశీ మంగళవారం ఇస్లాంపూర్ వచ్చాడు. గురువారం బడికి వెళ్లేందుకని బయలుదేరగా.. తండ్రి సుదర్శన్ పని మీద అదే గ్రామం వచ్చాడు. పని చూసుకొని వచ్చాక తన బండి మీదనే స్కూలుకు తీసుకుని వెళ్తానని చెప్పి సుదర్శన్ గ్రామంలోకి వెళ్లిపోయాడు. సరే అని చెప్పిన వంశీ.. స్కూలు బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాడు. మరు నిమిషమే సుదర్శన్ అక్కడికి వచ్చాడు. బస్సులో వెళ్లిపోయాడని స్థానికులు చెప్పడంతో ఆయన దాని వెనకాలే బయలుదేరి వెళ్లాడు. కొద్దిసేపటికే ఘోరం చోటు చేసుకుంది. మూడు కుటుంబాల్లో ఇద్దరు మృతి తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో రామాయపల్లి యాదగిరి-సంతోష దంపతులకు ముగ్గురు బిడ్డలు దివ్య, చరణ్, త్రిష ఉన్నారు. యాదగిరి ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫీజుల భారం మోస్తూ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నాడు. గురువారం నాడు రైలు ఢీకొన్న బస్సులోనే ఇతని ముగ్గురు పిల్లలూ ఉన్నారు. వారిలో దివ్య, చరణ్ దుర్మరణం చెందారు. త్రిష చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. గుండ్రెడ్డిపల్లికి చెందిన రాములు-వసంత దంపతుల పిల్లలు సుమన్, విద్య. పేదరికంలో ఉన్నా వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు చిన్నారులిద్దరూ విగత జీవులయ్యారు. తండ్రి గుండె తల్లడిల్లింది కిష్టాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ వలి యుద్దీన్, వజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు గౌసియా యూకేజీ, కుమారుడు రశీద్ ఎల్కేజీ చదువుతున్నారు. రైలు ప్రమాదంలో చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో విగత జీవులుగా పడి ఉన్న కన్నబిడ్డలను చూసి తండ్రి వలియుద్దీన్ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. నా చెల్లికి తీవ్ర గాయాలు: తేజస్విని మా చెల్లి సాత్విక మొదటి తరగతి, నేను తొమ్మిదవ తరగతి ఒకే స్కూల్లో చదువుతున్నాము. ప్రతి రోజు నేను ఆటోలో వెళతాను. చెల్లి మాత్రం బస్సులో వస్తుంది. మేము ముందుగా వెళ్లిపోయాం. తర్వాత ఈ ఘటన జరిగింది. మేమంతా అల్లారుముద్దుగా చూసుకునే మా చెల్లికి దెబ్బలు తగిలాయి. ఒక్కగానొక్క కుమార్తె: సరోజ నా భర్త లేడు. ఒక్కగానొక్క కుమార్తె వైష్ణవే జీవితంగా బతుకుతున్నా. ఆరవ తరగతి చదువుతోంది. ఎంతో సంతోషంగా పాఠశాలకు వెళ్లిన బిడ్డను ఇలా చూస్తే కడుపుతరుక్కుపోతుంది. నా బిడ్డ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. నవ్వు ఇంకా కళ్లలోనే: సుజాత నా కొడుకు హరీష్‌ను నేనే బస్సు దగ్గరకు తీసుకుని వెళ్లి వదలి పెట్టాను. బాయ్ మమ్మీ అంటూ నవ్వుతూ టాటా చెప్పాడు. ఆ నవ్వు కళ్ల ముందు కదులుతూనే ఉంది. అలా వెళ్లిన కొద్ది సేపటికే గాయాలతో ఆస్పత్రికి రావడం చూస్తే కాళ్లూచేతులు ఆడటం లేదు. డాక్టర్లు కాలు విరిగిందని చెప్పారు. బిడ్డకు ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. ఆ 5 రూపాయల కోసం ఆగి ఉంటే.. జక్కుల యాదగిరి, సంతోష దంపతుల కుమారుడు చరణ్ స్కూలుకు వెళ్లే ముందు ఐదు రూపాయలు కావాలని మారాం చేశాడు. అవి తెచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో బస్సు రావడంతో చరణ్ వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత బస్సుతో పాటు తల్లి కొద్దిదూరం పరిగెత్తినా.. డ్రైవర్ గమనించలేదు. ఒకవేళ ఆ 5 రూపాయల కోసం బస్సును ఆపి ఉంటే అందరి ప్రాణాలు నిలిచేవని స్థానికులు చెబుతున్నారు. - సాక్షి నెట్వర్క్ -
కాకతీయ స్కూల్ బస్‌ను ఢీకొన్న రైలు, 16మంది మృతి
-
రైల్వే అధికారులపై కేసులు!
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో రైల్వే అధికారులపై కూడా కేసులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ లెవెల్ క్రాసింగు వద్ద రైల్వే గేటు లేకపోవడమేనని, ట్రాఫిక్ ఎక్కువగా లేదన్న కారణంతోనే ఇంతకుముందు ప్రజలు కోరినా కూడా రైల్వే శాఖ అక్కడ గేటు ఏర్పాటుచేయలేదని ఆయన అన్నారు. ఈ విషయమై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గేటు కావాలంటూ ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు కూడా రైల్వేశాఖ అధికారులదే తప్పని, ఇక్కడ గేటు పెట్టించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. -
ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లా మసాయి పేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. చిన్నారుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వ భరిస్తుందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా మసాయిపేట వద్ద గురువారం ఉదయం నాందేడ్ ప్యాసింజర్ రైలు స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందారు. ఆ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కోకుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం కింద అందజేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేల ఇవ్వనున్నట్లు తెలిపింది. -
ప్రజల ప్రాణాలంటే అంత చులకనా?
-
'ఈ ఘటన చాలా బాధాకరం'
-
రాష్ట్ర ప్రభుత్వాలైనా రైల్వేగేట్లు పెట్టించాలి: వైఎస్ జగన్
మెదక్ జిల్లాలో స్కూలుబస్సును రైలు ఢీకొన్న ప్రాంతంలో రైల్వే గేటు కావాలని అక్కడి ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఇప్పటికైనా రైల్వేశాఖ, వాళ్లు చేయకపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా ముందుకొచ్చి కాపలా లేని రైల్వేక్రాసింగులు ఉన్నచోటల్లా కాపలాతో కూడిన గేట్లు పెట్టించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో దాదాపు 20 మంది చిన్నారులు మరణించిన సంఘటన స్థలం వద్దకు ఆయన గురువారం ఉదయమే వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ''ఇది చాలా బాధాకరం. 20 మంది పిల్లలు మరణించారు. అక్కడకు వెళ్లి చూసినప్పుడు వాళ్ల పుస్తకాలు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి. ఒక పుస్తకం చూస్తే, ఆ పిల్లాడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంతమంది పిల్లలు చనిపోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. అక్కడ గేటు కావాలని స్థానికులు మూడుసార్లు ధర్నాలు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి గేటులేని క్రాసింగులు చూస్తే, ఆ ఒక్క సెక్షన్లోనే మూడున్నాయి. రాష్ట్రంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా చూడాలి. గేటులేని ప్రతిచోటా గేట్లు పెట్టించే కార్యక్రమాలు రైల్వేశాఖ చేస్తుందో లేదో తెలీదు గానీ.. వాళ్లు చేయాలి. లేనిపక్షంలో మనం మన పిల్లలని మనసులో పెట్టుకుని.. అవసరమైతే రెండువేల కోట్లో.. లేదంటే ఎంతోకొంత బడ్జెట్ కేటాయించి ప్రతిచోటా మ్యాన్డ్ గేట్లు పెట్టించాలని, నాలుగు అడుగులు ముందుకేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఎవరినో విమర్శిస్తే ఏమీ లాభం లేదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనమేం చేయాలో ఆలోచించాలి. అక్కడ ఆరేడేళ్ల వయసున్న పిల్లలున్నారు. వాళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండాప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ భయపడే స్థాయిలో నష్టపరిహారం ఇప్పించాలి. ఇందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చినట్లు విన్నాను. దాంతో సరిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా నష్టపరిహారం కోసం ప్రయత్నించాలి. ఇక్కడ కూడా పెద్దలైతే 5 లక్షలు సరిపోవచ్చేమో గానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు మరణించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నాను. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ప్రభుత్వం కూడా మానవత్వం ప్రదర్శిస్తే మంచిది. పార్టీ తరఫున కూడా చేయాల్సిందంతా చేస్తాం'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. -
కాకతీయ స్కూల్ బస్‌ను ఢీకొన్న రైలు
-
ప్రమాద ఘటనా స్థలంలో వైఎస్ జగన్
-
అక్కాతమ్ముళ్ల మృతి, తండ్రికి గుండెపోటు
కన్నబిడ్డలపైనే ప్రాణాలు పెట్టుకున్న బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ప్రమాద వార్త అశనిపాతంగా మారింది. తమ ఇద్దరు చిన్నారులు రైలు ప్రమాదంలో మృతి చెందిన వార్తను విన్న ఓ తండ్రి గుండెపోటుకు గురయ్యారు. నాందేడ్ ప్యాసింజర్ రైలు.. కాకతీయ స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో కిష్టాపూర్‌కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ మృతి చెందారు. వీళ్లిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. ఈ సమాచారం తెలియటంతోఆ విద్యార్థుల తండ్రికి గుండెపోటు రావటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ డ ఓ చిన్నారి అమ్మా... నాకేమయిందమ్మా... అంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమాయకంగా అడుగుతున్న ఘటన తల్లితో పాటు, చూసేవారిని కంటతడి పెట్టించింది. మరి కొంతమంది తల్లిదండ్రులు సంఘటన స్థలంలోనే స్పృహతప్పి పడిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ కళ్లముందు కదలాడే కన్నబిడ్డలు ఇక లేరన్న విషయం జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యాలు సంఘటన స్థలంలో ఉన్న వారందరి హృదయాలను కలచివేశాయి. -
రైలు ఆలస్యం కాకుంటే, చిన్నారులు...
మెదక్: నాందేడ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ప్యాసింజర్ ఆలస్యం చిన్నారుల పాలిట మృత్యువుగా మారింది. నాలుగు గంటల ఆలస్యంతో మూసాయిపేట స్టేషన్ కు చేరుకుంది. 4గంటల 43నిమిషాల ఆలస్యంగా మూసాయిపేట స్టేషన్ కు చేరుకున్న ప్యాసింజర్ 13 నిమిషాల పాటు ఆగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఆలస్యమే చిన్నారుల జీవితాన్ని చిదిమేసింది. సకాలంలో రైలు వచ్చి ఉంటే స్కూల్ విద్యార్థులు ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది -
స్కూల్ కి వెళ్ళొస్తా, మమ్మీ బై అవే చివరి మాటలు
హైదరాబాద్ : నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం, బాధ్యతా రాహిత్యం ఇవే మెదక్ జిల్లాలో పెను విషాదానికి కారణం. లెవల్ క్రాసింగ్‌ల దగ్గర గేట్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అజాగ్రత్త 20 మంది విద్యార్ధులను బలిగొన్నాయి. అధికారమే తప్ప బాధ్యత తెలియని అధికారగణం నిర్లక్ష్యానికి అభం, శుభం తెలియని చిన్నారులు మూల్యం చెల్లించుకున్నారు. నాన్న స్కూల్ కి వెళ్శొస్తాను, మమ్మీ బై అన్న పలుకులే చివరి మాటలుగా మారాయి. తమ బిడ్డల ముద్దు ముద్దు మాటలతో మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ...అవే వారి ఆఖరి మాటల కావటంతో బాధితులను ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు. అదే తన చిన్నారి ఆఖరి మాటలు అంటూ ఓ తల్లి గుండెలు పగిలేలా రోదించటం చూసేవారిని కంటతడి పెట్టించింది. కాగా శుక్రవారం మెదక్ జిల్లాలో పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. -
తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ
-
మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి!
గుండెలు పిండేసే విషాదం. హృదయాలను ద్రవింపచేసే ఘోర ప్రమాదం. పాపపుణ్యమెరుగని పసివాళ్ల ప్రాణాలను మృత్యుశకటం చిదిమేసిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదువుల కోసం బ్యాగులు భుజాన వేసుకుని బస్సు ఎక్కిన చిన్నారులు కానరానిలోకాలకు వెళ్లిపోయారు. వెళ్లొస్తామంటూ ఉత్సాహంగా వెళ్లిన తమ బంగారు కొండలను రైలు రాక్షసుడు కానరాని లోకాలకు ఎత్తుకుపోయాడని తెలియగానే తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల శోకాగ్నికి చల్లార్చడం ఎవరి తరం? తెలుగువారిపై విధి పగబట్టినట్టుగా కన్పిస్తోంది. రెండు నెలల వ్యవధిలో నాలుగు విషాద ఘటనలు దాదాపు వంద మంది తెలుగువారిని పొట్టనపెట్టుకున్నాయి. నీరు, నిప్పుతో పాటు విధి కూడా తెలుగువారిపై కక్ష గట్టినట్టు కనబడుతోంది. మనవారికి జరుగుతున్న వరుస ప్రమాదాలు చూస్తుంటే ఈ భావనే కలుగుతోంది. తెలుగు ప్రజలంటే విధికి ఎందుకంత కోపం? మెదక్ జిల్లాలో గురువారం(జూలై 24) జరిగిన ఘోర ప్రమాదం 20 మంది పసివాళ్ల ప్రాణాలు తీసింది. నాందేడ్ ప్యాసిజర్ రైలు రూపంలో వచ్చి మృతువు కాటేసింది. స్కూల్‌కు వెళ్లాల్సిన చిన్నారులను శవాలుగా మార్చింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను జూన్ 8న బియాస్ నది మింగేసింది. జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో చలరేగిన దావాగ్ని 22 మందిని బుగ్గిచేసింది. నగరం ఘటన జరిగిన మరునాడే చెన్నైలో భవనం కూలిన దుర్ఘటనలో 61 మంది శిథిలాల కింద సమాధయ్యారు. మృతుల్లో సగం మందిపైగా తెలుగువారుండడం మరో విషాదం. ఈ నాలుగు విషాద ఘటనలు- పాలకుల నిష్క్రియ, అధికారుల నిర్లక్ష్యాన్ని సజీవ సాక్ష్యాలు. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పాలకులు, అధికారులు మొద్దునిద్ర వదలడం లేదు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారు. దయచేసి మేల్కోండి. అమాయకుల ప్రాణాలు కాపాడండి. -
విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ
మెదక్ : కన్నబిడ్డలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో ముగినిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న వారిని జగన్ ఓదార్చారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్యాసింజర్ రైలు గురువారం ఉదయం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును ఢీకొన్న విషయం తెలిసిందే. -
రైల్వే పోలీసులపై రాళ్లదాడి
-
బిడ్డా.. జర భద్రం!!
'బిడ్డా.. జర భద్రం'.. ఇవే ఆ తల్లి తన బిడ్డతో మాట్లాడిన చివరి మాటలు. పొద్దున్నే లేచి, శుభ్రంగా తయారై బ్యాగు తగిలించుకుని, క్యారేజి పట్టుకుని బస్సు మెట్లు ఎక్కేముందు ఆ మూడు గ్రామాల్లోని దాదాపు 20 మందికి పైగా తల్లులు తమ కన్న బిడ్డలను భద్రంగా వెళ్లి రమ్మంటూ టాటా చెప్పారు. అలా చెప్పి గంట సేపు కూడా గడిచిందో.. లేదో, అంతలోనే వాళ్లు ఎక్కిన బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసింది. ఆ తల్లుల గుండెలు ఝల్లుమన్నాయి. ఉరుకులు పరుగుల మీద సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడకు వెళ్లేసరికే చిరునవ్వులు చిందించాల్సిన తమ చిన్నారులు రక్తమోడుతూ విగతజీవులుగా కనిపించారు. అంతే.. వాళ్ల గర్భశోకానికి అంతులేదు. చాలామంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. బస్సులో ఆడుతూ పాడుతూ వెళ్తున్న చిన్నారులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు తమ బస్సును ఢీకొనడంతో ఏం జరిగిందో తెలిసేలోపే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గుండేటిపల్లెకు చెందిన 11 మంది పిల్లలు ఈ ప్రమాదంలో మరణించారు. కొన్ని కుటుంబాల్లో వాళ్ల పిల్లలంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుండేటిపల్లెకు చెందిన వరుణ్ -శ్రుతి, కృష్ణాపూర్‌కు చెందిన రజియా-వహీద్ ఇలా మరణించినవారే. వీరిలో రజియా-వహీద్‌ల తల్లి తన బిడ్డలు లేరన్న విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించగా, వాళ్ల తండ్రికి కూడా గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరారు. -
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
-
5 లక్షల ఎక్స్‌గ్రేషియా,వారంలో గేటు ఏర్పాటు
హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వారం రోజుల్లోగా రైల్వేగేటు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఈ దుర్ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే అమాయక చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ యుద్ధ ప్రాతిపదికపై గేటు ఏర్పాటు చేసి, సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అయ్యే వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మరోవైపు యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. -
రైల్వే పోలీసులపై రాళ్లదాడి
మెదక్ జిల్లాలో ప్రమాదం సంభవించిన స్థలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి విద్యార్థుల మృతదేహాలను తరలిస్తున్న రైల్వే పోలీసుల వద్ద స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టడానికి లాఠీ ఛార్జి చేయడంతో వెంటనే వాళ్లు రాళ్ల దాడి ప్రారంభించారు. ఈ రాళ్లు తగిలి రైల్వే అధికారులతో పాటు అక్కడున్న డీఎస్పీకి, కొంతమంది పోలీసులకు, ప్రమాద ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రమాదాలను అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోలేదన్న ఆగ్రహంతోనే స్థానికులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి సున్నితమైన సమయంలో లాఠీ ఛార్జి జరగడంతో మరింత ఆవేశానికి గురై రాళ్లతో దాడి చేశారని అంటున్నారు. -
దుర్ఘటనపై ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శరత్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. ప్రమాదం జరిగిన కాకతీయ స్కూల్ బస్సులో మొత్తం 38మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 13మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు నివేదికలో వెల్లడించారు. మరో 15మంది తీవ్రంగా గాయపడగా, ప్రమాదం నుంచి ముగ్గురు విద్యార్థులు మాత్రమే క్షేమంగా బయటపడినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మృతుల సఖ్యతో పాటు పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో అందచేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. -
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
హైదరాబాద్ : ఎప్పుడూ వచ్చే బస్సు డ్రైవర్ విధుల్లోకి రాకపోవటంతో అతని స్థానంలో విద్యార్థులను తీసుకు వచ్చేందుకు స్కూల్ యాజమాన్యం స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను పంపించినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. రైలు రాదనే ధీమాతో డ్రైవర్ భిక్షపతి బస్సును ముందుకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్
-
కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్‌కు గుండెపోటు
హైదరాబాద్ : ఘోర రైలు ప్రమాదానికి సంఘటన వార్తతో కాకతీయ టెక్నో స్కూలు ప్రిన్సిపాల్ గుండెపోటుకు గురయ్యారు. కాకతీయ స్కూల్ బస్సు గురువారం ఉదయం 9 గంటల సమయంలో మాసాయిపేట రైల్వేగేట్ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 38మంది ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా 7వ తరగతిలోపువారే. తల్లిదండ్రుల రోదనలతో ఘటనా స్థలం హోరెత్తింది. ఉదయం ఇంటి నుంచి టాటా చెబుతూ వెళ్లిన తన చిన్నారి విగతజీవిగా చూసిన ఓ తల్లి ఘటనా స్థలంలోనే స్పృహ తప్పిపడిపోయింది. -
మృతి చెందిన విద్యార్థులు వీరే
హైదరాబాద్ : మెదక్ రైలు ఘోర ప్రమాద దుర్ఘటనలో మృతి చెందినవారిలో పలువురు విద్యార్థులను గుర్తించారు. మృతుల వివరాలు: విద్య (గుండేటిపల్లి), వంశీ (ఇస్లాంపూర్),.. చరణ్, దివ్య (గుండేటిపల్లి) అన్నాచెల్లెళ్లు రజియా, వహీద్ (కిష్టాపూర్) అక్కాచెల్లెళ్లు భువన (ఇస్లాంపూర్), వరుణ్, శృతి అన్నాచెల్లెళ్లు విష్ణు, చింతల సుమన్, మహేష్, డ్రైవర్ భిక్షపతిగౌడ్ ఇక క్లీనర్ ఈ ప్రమాదం నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పద్మారావు అక్కడ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
దుర్ఘటనపై 3గంటలకు రైల్వే మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైల్వే ప్రమాద దుర్ఘటనపై రైల్వేమంత్రి సదానంద గౌడ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. లోక్‌సభ సమావేశాల్లో రైలు ప్రమాద వార్తను ఎంపీ జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ఘటనపై స్పందించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ సహాయ చర్యలు చేపట్టాల్సింది అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు మధ్యాహ్నం మూడు గంటలకు సభలో తెలుపుతామని రైల్వేమంత్రి పేర్కొన్నారు. -
ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్
మెదక్: మెదక్ జిల్లాలోని మసాయిపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాంతో 44వ జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. పలుమార్లు అధికారులకు విజ్క్షప్తి చేసినా పట్టించకోకపోవడంపై అధికారులను నిలదీశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రమాద ఘటనపై కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు
-
కాకతీయ స్కూల్ గుర్తింపు రద్దు
హైదరాబాద్ : రైలు ప్రమాదానికి గురై 20మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న కాకతీయ ప్రయివేట్ స్కూల్ గుర్తింపు రద్దు అయ్యింది. స్కూల్ గుర్తింపును రద్దు చేసినట్లు మెదక్ డీఈవో రాజేశ్వరరావు గురువారమిక్కడ తెలిపారు. తుప్రాన్‌లో కాకతీయ ప్రయివేట్ స్కూల్ బస్సు గురువారం ఉదయం విద్యార్థులను తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
మృతి చెందిన విద్యార్థులు వీరే
-
రైలు ఆలస్యం.. అందుకే ప్రమాదం!
మృత్యువు ముంచుకొచ్చింది. రైలు రూపంలో తరుముకుని వచ్చింది. అదే దాదాపు 20 మంది చిన్నారుల ప్రాణాలు బలిగొంది. వాస్తవానికి నాందేడ్ ప్యాసింజర్ ప్రమాదం జరిగిన సమయానికి రావాల్సింది కాదు. నాలుగు గంటలు ఆలస్యంగా ఆ రైలు నడుస్తోంది. దాదాపు ప్రతిరోజూ అదే మార్గంలో ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లకు రైళ్ల రాకపోకల సమాచారం తెలుస్తూనే ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో రైళ్లేవీ రావన్న ధైర్యంతోనే బస్సు డ్రైవర్ కూడా మొండిగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ ప్యాసింజర్.. బస్సు వస్తున్న విషయాన్ని తెలుసుకునే అవకాశం లేకపోవడం, క్రాసింగ్ వద్దకు రైలు వచ్చేసరికి ఎదురుగా ఉన్నట్టుండి బస్సు కనిపించడంతో రైలు డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రైలుకు షడన్ బ్రేకు వేస్తే.. వెనక ఉన్న 14 బోగీలు పట్టాలు తప్పి, మరింత ఘోరమైన ప్రమాదం సంభవిస్తుంది. అందుకే నెమ్మదిగా బ్రేకులు వేస్తూ.. దాదాపు అర కిలోమీటరు దూరం తర్వాతే రైలును ఆపగలిగాడు. దాంతో అంతదూరం పాటు బస్సును రైలు లాక్కుంటూ వెళ్లిపోయింది. బస్సు మీద, రైలు పట్టాల మీద పిల్లల రక్తపు మరకలు పడ్డాయి. -
బాలాజీ ఆస్పత్రిలో 12మంది విద్యార్థులకు చికిత్స
హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు కొంపల్లి బాలాజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 12bమంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని నలుగురిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా తరలించినట్లు సమాచారం. మరోవైపు రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ .... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమీక్ష నిర్వహించారు. -
కాకతీయ స్కూల్ బస్‌ను ఢీకొన్న రైలు, 16మంది మృతి
మెదక్ : మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును ఓ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నారు. 20 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
బాధితులంతా 12 ఏళ్ల లోపువారే
మెదక్ జిల్లాలో రైలు ప్రమాదం సంభవించిన మాసాయిపేట చాలా నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో దాదాపు గంటన్నర సేపు ఎవరికీ పిల్లల ఆర్తనాదాలు వినిపించలేదు. పిల్లల్లో చాలామందికి చేతులు విరిగి. కాళ్లు మెలి తిరిగిపోయి పరిస్థితి అంతా హృదయవిదారకంగా ఉంది. బాధితులంతా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారేనని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ఇదే ప్రాంతం మీదుగా బస్సు వెళ్తుందని, కానీ లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు మాత్రం ఏర్పాటు చేయట్లేదని ఆయన అన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చిన డ్రైవర్.. తొందరగా వెళ్లాలనే హడావుడిలో రైలు వచ్చేలోగానే ట్రాక్ దాటి వెళ్లిపోవాలనుకున్నాడని, ఈలోపు బస్సు అక్కడ ఇరుక్కుపోయి ఇంజన్ ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మళ్లీ అతడు ఇంజన్ స్టార్ట్ చేసేలోపే రైలు వచ్చి బస్సును ఢీకొందని అన్నారు. అసలు బస్సుతో పాటు వచ్చినది కాకతీయ స్కూలు డ్రైవరేనా లేదా ఎవరైనా ప్రైవేటు డ్రైవర్ వచ్చారా అన్న విషయం కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌కు 9 మంది విద్యార్థుల తరలింపు
నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది విద్యార్థులను మూడు అంబులెన్సులలో హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఎక్కడకు తీసుకెళ్తున్నదీ చెప్పకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు పిల్లలను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పాలని, చెబితే తాము కూడా వెళ్తామని వారు అంటున్నా, అధికారులు మాత్రం అప్పటికప్పుడు వాళ్లను తరలించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని తరలించేటప్పుడు అంబులెన్సులో ఆక్సిజన్ సహా అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. కానీ, ఇక్కడ అలాంటి అంబులెన్సులు వారికి దొరక్కపోవడంతో సర్వసాధారణ వాహనాల్లోనే పిల్లలను మాసాయిపేట నుంచి హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినా, అధికారులెవ్వరూ వాళ్లకు సమాధానం ఇవ్వలేదు. చివరకు పిల్లలను హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. -
విద్యార్థులంతా ఆ మూడు గ్రామాల వారే
హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఘటనా ప్రాంతం దద్దరిల్లిపోయింది. స్కూల్‌కు పంపిన తమ చిన్నారులు విగత జీవులుగా మారటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థులు ఇస్లాంపూర్, వెంకటాపల్లి, గూనేపల్లి గ్రామాలకు చెందినవారు. తుప్రాన్లోని కాకతీయ ప్రయివేట్ స్కూలు బస్సు ....గురువారం ఉదయం ఇస్లాంపూర్ నుంచి విద్యార్థులను తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాందేడ్ ప్యాసింజర్ ...నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటన సమీప గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జేసీబీ సాయంతో విద్యార్థులను బయటకు తీశామని, కొన ఊపిరితో ఉన్నవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతను కూడా మృతి చెందాడు. మొత్తం బస్సులో 38మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు
మెదక్: మసాయిపేట రైల్వే గేట్ వద్ద గతంలో కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు వెల్లడించారు. గత ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కాపాలాదారుడు లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైరన్ లేకుండా రైలు రావడం, బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘోర ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇస్లాంపూర్ నుంచి తుఫ్రాన్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు నుంచి కిలో మీటర్ వరకు బస్సు ఈడ్చుకు వెళ్లినట్టు తెలుస్తోంది. -
కాకతీయ స్కూల్ బస్‌ను ఢీకొన్న రైలు
-
గుర్తుపట్టలేని విధంగా విద్యార్థుల మృతదేహాలు
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రైలు బస్సును ఢీకొని సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో బస్సులోని 26మంది విద్యార్థులు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాంతో బస్సు నుజ్జు నుజ్జు కాగా, మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు తెలుస్తుంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. మరోవైపు మంత్రి హరీష్ రావు సంఘటనా స్థలానికి బయల్దేరారు. బస్సులో విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.