
దుర్ఘటనపై 3గంటలకు రైల్వే మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైల్వే ప్రమాద దుర్ఘటనపై రైల్వేమంత్రి సదానంద గౌడ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు.
లోక్సభ సమావేశాల్లో రైలు ప్రమాద వార్తను ఎంపీ జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ఘటనపై స్పందించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ సహాయ చర్యలు చేపట్టాల్సింది అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు మధ్యాహ్నం మూడు గంటలకు సభలో తెలుపుతామని రైల్వేమంత్రి పేర్కొన్నారు.