
విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ
మెదక్ : కన్నబిడ్డలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో ముగినిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న వారిని జగన్ ఓదార్చారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్యాసింజర్ రైలు గురువారం ఉదయం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును ఢీకొన్న విషయం తెలిసిందే.