Sadananda Gowda
-
వీడియో సీడీలంటేనే వణికిపోతున్న మంత్రులు
సాక్షి, మైసూరు: కర్ణాటకలో వీడియో సీడీలంటేనే మంత్రులు వణికిపోతున్నారు. తమకు చెందిన సీడీలు ఏవైనా ఉంటే వాటిపై పత్రికలు, టీవీ చానెళ్లలో వార్తా ప్రసారాలు రాకుండా చూడాలని పలువురు అమాత్యులు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లను వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన పదవి పోవడం తెలిసిందే. సిటీ సివిల్ కోర్టు వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది. భగ్గుమంటున్న విపక్ష నేతలు మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అలా పిటిషన్లను వేసిన ఆరుమంది మంత్రులను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని జేడీఎస్ ఎమ్మెల్యే. సా.రా. మహేష్ డిమాండు చేశారు. శనివారం మైసూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో ప్రసారం చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని ఆరుమంది మంత్రులు కోర్టును ఆశ్రయించారని, వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ వీడియోల గురించి డిమాండ్లు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు. మీరు తప్పు చేయకుంటే కోర్టును ఎందుకు ఆశ్రయించారని మహేశ్ ప్రశ్నించారు. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ వీడియోలు బయటకి వస్తే మీ బండారం మొత్తం బయట పడుతుంది, అలా జరగకుండా కోర్టుకెళ్లారు అని ఆరోపించారు. ముంబైకి వెళ్ళిన మంత్రులు అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఎద్దేవా చేశారు. పలువురు ప్రతిపక్ష నేతలు ఇదే తరహాలో ఆరోపణలు సంధించారు. చదవండి: (రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?) వారు కోర్టుకెళ్లడం సరికాదు: సదానందగౌడ యశవంతపుర: తమ సీడీలను విడుదల చేయరాదని కొందరు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లడం సరికాదని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ అన్నారు. ఆయన శనివారం బెంగళూరు కేసీ జనరల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకొని విలేకర్లతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సమాచారం పంపించారు. మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేరళ సీఎంపై బంగారం స్మగ్లింగ్ వంటి బలమైన ఆరోపణలు వచ్చినందున ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఫార్మాకు ని‘బంధనాల’ తగ్గింపుపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. ఇందులో భాగంగా ఫార్మా రంగానికి అనేకానేక నిబంధనల పాటింపు భారాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తోందని వివరించారు. ’ది ఇండియా ఫార్మా 2021, ఇండియా మెడికల్ డివైజ్ 2021’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘2030 నాటికి 130 బిలియన్ డాలర్ల టర్నోవరు లక్ష్య సాధనకు అవసరమైన సామర్థ్యాలు దేశీ ఫార్మా పరిశ్రమకు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, 2025 నాటికి వైద్య పరికరాల పరిశ్రమ 50 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందగలదు‘ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఫార్మా రంగంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 145వ స్థానం నుంచి 79వ స్థానానికి వచ్చాం. ఫార్మాలోనూ మన ర్యాంకింగ్ మెరుగుపడి 63వ స్థానానికి చేరాము. సంస్కరణల అమలుకు ఇదే నిదర్శనం‘ అని ఆయన పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో ఔషధాలు అందించాలి .. వృద్ధి సాధనతో పాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలను అందించే ఉన్నత లక్ష్యాలకు కూడా పరిశ్రమ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నట్లు గౌడ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫార్మా రంగానికి ఇప్పటికే రూ. 6,564 కోట్ల ప్రోత్సాహకాలిచ్చే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని, అలాగే మరో రూ. 15,000 కోట్ల మద్దతుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమును కూడా ఆమోదించిందని ఆయన చెప్పారు. తయారీ రంగ సంస్థలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని గౌడ పేర్కొన్నారు. బయోఫార్మా, సంక్లిష్టమైన జనరిక్ ఔషధాలు వంటి స్పెషలైజ్డ్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను దేశీయంగా రూపొందించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు. స్వావలంబన భారత్ నినాదంలో భాగంగా రూ. 3,400 కోట్లతో బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనుమతులు సులభతరం చేయాలి .. నియంత్రణ వ్యవస్థ విధానాలను మరింత సరళతరం చేయాలని .. ముఖ్యంగా ఔషధాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని జైడస్ గ్రూప్ చైర్మన్, ఫిక్కీ ఫార్మా కమిటీ మెంటార్ పంకజ్ ఆర్ పటేల్ కోరారు. కొత్తగా ట్యాక్స్ రీఫండ్ స్కీమును ప్రవేశపెట్టాలని కోరారు. వివిధ శాఖలు, విభాగాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫార్మా రంగ అవసరాలన్నింటి కోసం ఒకే శాఖ, ఒకే డిపార్ట్మెంటు విధానాన్ని అమలు చేయాలన్నారు. -
ఇకపై రైతుల ఇంటికే ఎరువులు, ఎస్ఎంఎస్లు
-
ఇకపై రైతుల ఇంటికే ఎరువులు, ఎస్ఎంఎస్లు
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల సరఫరాకు సంబంధించి రైతులకు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) వెర్షన్, ఎస్ఎంఎస్ సర్వీసును బుధవారం కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు. ఇక నుంచి రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) నుంచి ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. అదే విధంగా ఆ ఎరువులను రైతుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడం వల్ల రైతులు అధికోత్పత్తి సాధించగలుగుతారు. అంతే కాకుండా వారికి సాగు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. (చదవండి: 1న గిట్టుబాటు ధరల ప్రకటన) రైతు భరోసా కేంద్రాలు: ‘రైతులకు సాగులో మరింత తోడ్పాటు ఇచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటి నిర్వహణ బాధ్యత కోసం బీఎస్సీ (అగ్రికల్చర్) గ్రాడ్యుయేట్లను వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, ఆక్వా సహాయకులుగా నియమించడం జరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఆర్బీకేలు అనేక మార్పులకు కేంద్రాలుగా నిల్చాయి. వ్యవసాయంతో పాటు, హార్టికల్చర్, సెరీ కల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, సహకార, నీటిపారుదల తదితర రంగాలన్నింటిలోనూ సేవలకు ఒకే వేదికగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు, పశు సంవర్థక, మత్స్యసాగుకు అవసరమైన వాటిని కూడా ఆర్బీకేల ద్వారా అందజేయడం జరుగుతోంది. అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వారికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చేందుకు ఆర్బీకేలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది మే 30న ఒకేసారి 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాము. వాటిలో డిజిటల్ కియోస్క్, స్మార్ట్ టీవీ, వైట్ బోర్డు, కుర్చీలు, డిజిటల్ లైబ్రరీతో పాటు, భూసార పరీక్షకు అవసరమైన ఉపకరణాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను డిజిటల్ కియోస్క్‌ల ద్వారా బుక్ చేసుకుంటే, వారికి 24 గంటల నుంచి 48 గంటలలోగా వాటిని సరఫరా చేయడం జరుగుతుంది. పంటల సాగు, పురుగు మందుల వాడకంపై రైతులకు వీడియోల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు స్మార్ట్ టీవీలు ఉపయోగించడం జరుగుతోంది. (చదవండి: మోదీ కేబినెట్లోకి రామ్ మాధవ్, మురళీధర్‌రావు?) ప్రత్యేక కాల్ సెంటర్: ఇంకా ఆర్బీకేల వద్ద ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను నెం:155251 తో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్‌కు ఇప్పటి వరకు రైతుల నుంచి 46,500 కాల్స్ వచ్చాయి. ఆర్బీకేలు–ఈ క్రాపింగ్: కోవిడ్ సమయంలోనూ 15 రకాల పంటలకు సంబంధించి 6.9 లక్షల టన్నుల విత్తనాలను 13.64 లక్షల రైతులకు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈ–క్రాప్ బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 49.14 లక్షల రైతుల పేర్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి 1.12 కోట్ల ఎకరాలలో సాగు చేస్తున్న పంటల పూర్తి వివరాలు నమోదు చేయడం జరిగింది. ఈ ఖరీఫ్‌కు సంబంధించి కాకతాళీయంగా ఈ–క్రాపింగ్ నమోదుకు ఇవాళే ఆఖరి రోజు కావడం విశేషం. ఆర్బీకేల పాత్ర: వ్యవస్థలో మరింత పారదర్శకత, సోషల్ ఆడిట్ ద్వారా వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, వివిధ పథకాలలో లబ్ధి పొందిన, పొందుతున్న రైతుల వివరాలను ప్రదర్శించడంలో కూడా ఆర్బీకేలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్ ఇంటలిజెన్స్, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లకు సంబంధించిన సమాచారం అందించడం, రైతుల సందేహాలు తీర్చడంలో కూడా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. ఇంకా ధాన్యం సేకరణ కేంద్రాలుగా కూడా ఆర్బీకేలు పని చేయనున్నాయి. ఇన్పుట్ సరఫరా: నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, పశు గ్రాస విత్తనాలు, చేపల ఫీడ్ తదితర అవసరాలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 2.17 లక్షల ఆర్డర్లు రాగా, 69,561 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఎక్కువగా నగదు లావాదేవీలతో కొనసాగుతున్నప్పటికీ ఆర్బీకేల వద్ద ఆ స్థాయిలో 2.17 లక్షల ఆర్డర్లు రావడం, వాటిపై రైతులకు నమ్మకం చూపుతోంది. తగిన ధరలో నాణ్యమైనవి సరఫరా చేయడమే అందుకు కారణం. డిజిటల్ పేమెంట్లు కూడా ఆర్బీకేల వద్ద అనుమతిస్తున్నారు. ఇప్పటికే 38 వేల ఆర్డర్లకు డిజిటల్ పేమెంట్లు జరిగాయి. ఖరీఫ్ సీజన్లో ఎరువులకు సంబంధించి 2 లక్షల ఆర్డర్లు రాగా, సరఫరా చేయడం జరిగింది. రైతులకు సాగు పెట్టుబడి: రైతులకు పాగు పెట్టుబడిగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.13,500. ఇస్తున్నాము. తొలుత ఖరీఫ్ ప్రారంభంలో రూ.7500, ఆ తర్వాత రబీ ప్రారంభంలో మరో రూ,4 వేలు, ఆ తర్వాత సంక్రాంతికి పంటలు చేతికొచ్చే నాటికి మరో రూ.2 వేలు ఇస్తున్నాము. ఆ మొత్తం చాలా మంది రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ మాత్రమే కాకుండా, అవి ధాన్యం సేకరణ కేంద్రాల మాదిరిగా కూడా పని చేప్తాయి, ఈ–క్రాపింగ్ పక్కాగా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్న ఎస్ఎంఎస్ సర్వీస్, ఎరువుల డోర్ డెలివరీ రైతులకు మరింత మేలు చేయనుంది’అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోంది: డీపీ సదానందగౌడ ‘ఏపీలో ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషం. కేంద్రం అమలు చేసే ఏ పథకానికి అయినా ఏపీ చాలా సహకరిస్తోంది. మా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. కోవిడ్ సంక్షోభంలోనూ రైతులకు మేలు చేయడంలో వెనక్కి తగ్గలేదు. పీఎం విజన్ ప్రకారం, కోవిడ్ సమయంలోనూ చక్కగా సేవలందించాం. రాష్ట్రంలో ఇంకా ఎరువులు, పురుగు మందులు కావాలని సీఎం శ్రీ వైయస్ జగన్ పలుమార్లు కోరారు. ఆ మేరకు మేము కూడా సహకరించాము. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) బాగా సక్సెస్ అయింది. సేవలకు సంబంధించి 65 శాఖల్లో మా శాఖ రెండో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. మా పరిపాలనతో పూర్తి పారదర్శకత, పంపిణీ చేసే ఎరువులో ఎక్కడా అవకతవకలు జరగవు. ఎక్కడా లీకేజీ ఉండదు. రోజు రోజుకూ ఇంకా పక్కాగా సేవలందిస్తున్నాము. ఇవాళ రైతులకు ఎస్ఎంఎస్ సర్వీస్‌తో పాటు, ఎరువుల హోం డెలివరీ ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ విధంగా మా శాఖ మారుమూల గ్రామాల్లో సైతం సేవలందించనుంది. రైతులకు మేలు చేయడంతో పాటు, ఈ రంగంలో సంస్కరణల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందంజలో ఉంది. ఇవాళ ఈ రెండింటితో ఆ సేవలు మరింత విస్తరించనున్నాయి’ అని అన్నారు. డ్యాష్ బోర్డుల ద్వారా రైతులకు ప్రయోజనం: మన్సుఖ్ మాండవియా ‘కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ నుంచి ఇవాళ రెండు మంచి పనులు మొదలవుతున్నాయి. దాదాపు 54 కోట్ల మంది రైతులు దేశంలో ఉండగా, వారి కోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశాం. దేశంలో ఎంత ఎరువుల ఉత్పత్తి జరిగింది? ఎంత స్టాక్ ఎక్కడ ఉంది? డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఎంత సరుకు ఉందన్నది ఆ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) మరో మహత్తర చర్య. రైతులకు నేరుగా సబ్సిడీ చెల్లింపు. దీని వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ చర్యల వల్ల రైతులకు ఇచ్చే ప్రతి పైసా కచ్చితంగా వారికే అందుతుంది. దేశంలోని అన్ని గిడ్డంగులలో ఎరువులు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎక్కడా కొరత లేకుండా ఎరువులు అందుతాయి. బుక్ చేసుకున్న తర్వాత కేవలం 72 గంటల్లో ఎరువులు రైతులకు అందించడం నిజంగా అభినందనీయం’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో చివరగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఎలా పని చేస్తున్నాయన్న దానిపై ఏపీ ఉన్నతాధికారులు వీడియో ప్రదర్శించి చూపారు. -
కేంద్రమంత్రి సదానంద గౌడతో కిషన్‌రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేసే అంశంపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఎరువుల సరఫరాపై కింది అంశాలను వెల్లడించారు. • 2020 ఖరీఫ్ సీజన్ మొత్తానికి గానూ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అని ప్రతిపాదనలు అందాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు.. 8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఎరువుల విభాగం 10.17 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచింది. (4.01 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో కలుపుకుని) • ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 8.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకం జరగింది. గతేడాది ఇదే సీజన్లో 5.09 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అమ్ముడైంది. ఈ సీజన్లో యూరియాకు ఊహించని విధంగా అధిక డిమాండ్ ఏర్పటినప్పటికీ.. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. • దీంతోపాటుగా ఆగస్టు, 2020 కోసం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉండగా.ఎరువుల విభాగం 4.52 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తాన్ని (2.67 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో సహా) అందుబాటులో ఉంచింది. దిగుమతి చేసుకున్న యూరియా 2020 సెప్టెంబర్ నెల మధ్యనాటికి తెలంగాణకు సమీపంలోని ఓడరేవులను ఇవి చేరుకోవచ్చని భావిస్తున్నాము. కేంద్ర ఎరువుల విభాగం తెలంగాణ రాష్ట్ర ఎరువుల అవసరాలను నిశితంగా పరిశీలిస్తుందని, క్షేత్ర స్థాయి అవసరాలను తీర్చడానికి రాష్ట్ర రైతులకు అవసరమైన యూరియా నిల్వలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని మంత్రి సదానంద గౌడ కిషన్ రెడ్డికి ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు. -
సాగు పెరిగింది.. ఎరువుల కోటా పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఎరువుల కోటా కూడా పెంచాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేటాయించిన యూరియా కోటాను వెంటనే పంపించాలని విన్నవించారు. ‘తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సానుకూల విధానాలు, కలిసొచ్చిన వాతావరణ పరిస్థితులతో రాష్ట్రంలో ఈసారి గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. కోటీ 25 లక్షల ఎకరాల్లో సాగైంది. మరో 8.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉండగా, ఇంకో ఆరేడు లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉంది. మొత్తంగా ఈ వానాకాలంలో దాదాపు కోటీ 41 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఎరువుల వాడకం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 3.5 లక్షల టన్నుల యూరియా వాడితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 7 లక్షల టన్నుల యూరియా వినియోగమైంది’అని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సాగునీటి వనరుల రాకతో గతంతో పోలిస్తే ఆరేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోందని వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు 10.5 లక్షల టన్నుల యూరియా కేటాయించగా.. ఈ నెల కోటా కింద రెండున్నర లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 80 వేల టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, మిగిలిన మొత్తాన్ని వెంటనే పంపించాలని కోరారు. మంత్రి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉన్నారు. -
పెట్రో కెమికల్ కారిడార్‌తో భారీ పెట్టుబడులు
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో : పెట్రో కెమికల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వస్తాయని, ఇందుకు పలు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తూ ‘ఫెసిలిటేటర్’గా పని చేస్తుందన్నారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ‘సీపెట్’ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లో.. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా ప్రత్యేక హోదా చాలా సంక్లిష్టమైన అంశం. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తే.. దేశంలోని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి. హోదా అనే పదం తప్ప.. అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం సిద్ధం. పెట్రో కెమికల్ కారిడార్ ద్వారా, ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. దేశంలోని నాలుగు ప్రధాన యూరియా ప్లాంట్లు 2002లో మూతబడ్డాయి. వాటిని పునురుద్ధరించడానికి రూ.1,500 కోట్లు వ్యయం చేశాం. త్వరలో రామగుండం యూనిట్ ప్రారంభం కానుంది. మిగతావీ కూడా దశల వారీగా పునరుద్ధరించనున్నాం. 2023 నాటికి యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నాం. వినియోగం ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లు నీటితో నిండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో యూరియా అదనంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరారు. డిమాండ్‌కు అనుగుణంగా అదనపు యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాస్పరస్, పొటాష్ తయారీకి ముడి సరుకుల కోసం పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడాలి. అంతర్జాతీయంగా టెండర్లు ముందుగానే పిలుస్తున్నాం. ధర హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తప్పించుకోవడానికి అంతర్జాతీయ కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పరిశోధనలకు ప్రోత్సాహం ‘రసాయన’ పదం వినగానే పర్యావరణానికి హాని అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. దాని వల్ల ఉపయోగాలను మరిచిపోకూడదు. పర్యావరణానికి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఎరువుల ఉత్పత్తి రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సవాళ్లు పెరిగాయి. వాటిని అధిగమించే వినూత్న మార్గాలను కనిపెట్టే విధంగా పరిశోధనలు జరగడం లేదు. ఇటీవల నేను జర్మనీ వెళ్లాను. సాంకేతిక, వినూత్న ఆవిష్కరణలు చూస్తే ఆశ్చర్యం కలిగింది. దేశంలోని ప్రతి ఉత్పత్తి ప్లాంటులోనూ పరిశోధన కేంద్రం ఉండాలి. అన్ని రంగాల్లో పరిశోధనలు విస్తృతంగా చేపట్టడానికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుంది. ఆర్గానిక్ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత వచ్చే ఐదు సంవత్సరాల్లో రసాయన ఎరువుల వినియోగాన్ని కనీసం 25 శాతం తగ్గించి, ఆమేరకు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ‘సిటీ కంపోస్ట్’ విధానాన్ని తీసుకొచ్చాం. దేశంలో రోజూ 1.5 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు పోగవుతున్నాయి. అందులో 30–70 శాతం వ్యర్థాలు.. సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగపడే పదార్థాలే. దీని కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ కంపోస్ట్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించాం. తొలుత నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా రైతులకు అవసరమైన సేంద్రియ ఎరువులను అందించడంతో పాటు ఘన వ్యర్థాల సమస్యనూ పరిష్కరించడానికి అవకాశం ఉంది. ‘స్వచ్ఛ భారత్’ లక్ష్యాలు కూడా నెరవేరతాయి. -
వైఎస్ జగన్ నివాసానికి సదానందగౌడ
సాక్షి, తాడేపల్లి : కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని (సీపెట్) గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి సదానందగౌడ విచ్చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనను మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించి శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఇచ్చిన ఆతిద్యాన్ని సదానందగౌడ గౌరవంగా స్వీకరించారు. -
వైఎస్ జగన్ నివాసానికి సదానందగౌడ
-
అమరావతి: ‘సీపెట్’ ప్రారంభించిన సీఎం జగన్
-
సీపెట్‌తో మరిన్ని ఉపాధి అవకాశాలు
-
సూరంపల్లిలో ‘సీపెట్’ ప్రారంభం
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని (సీపెట్) గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించారు. గురువారం ఉదయం 11.00 గంటలకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో కలసి సీపెట్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్రం మరిన్ని సంస్థలు ఏర్పాటు చేయాలి: సీఎం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘సీపెట్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నైపుణ్య అభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టం చేసిన తొలిరాష్ట్రం మనదే. యువతను ప్రోత్సహించేందుకు చట్టాన్ని తీసుకొచ్చాం. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా యువతలో నైపుణ్యాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాం. సీపెట్ లాంటి సంస్థలు మరిన్ని రావాల్సి ఉంది. ఇలాంటి సంస్థలను మరిన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం.’ అని అన్నారు. అలా అయితే నెంబర్ వన్ స్థానం మనదే.. కేంద్రమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది. ఏపీలో ఇలాంటి సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అందించిన సహకారం అభినందనీయం. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి సంస్థలు ఎంతో ఉపయోగపడతాయి. మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉంది. యువతను సరైన విధానంలో ఉపయోగించుకుంటే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటాం. యువతలో నైపుణ్యాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే 37 సీపెట్ కేంద్రాలున్నాయి. మరో అయిదుచోట్ల సీపెట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.’ అని తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రితో కలిసి ముఖ్యమంత్రి వీక్షించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్లతో సీపెట్ భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, సీపెట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే పార్థసారధి, పలువురు వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కేంద్ర మంత్రిని కలిసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయానాల శాఖ మంత్రి సదానందగౌడను బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా యాసంగికి ఎరువులను కేటాయించాలని, ఇంపోర్టెడ్ యూరియా కాకుండా స్థానికంగా ఉత్పత్తి చేసిన యూరియానూ సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము గతంలోనే 7.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. కాగా, ఈసారి ఖరీఫ్ సీజన్ ఆలస్యం అయినా తరువాత వర్షాలు సమృద్దిగా కురవడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండి సాగు విస్తీర్ణం పెరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి పది లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యాయని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రానున్న రబీలో సాధారణ విస్తీర్ణం కన్నా 8.5లక్షల ఎకరాలు పెరిగి సుమారుగా 42 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు తాము గతంలో విజ్ఞప్తి చేసిన 7.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని, అక్టోబరు మాసానికి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని 20వ తేదిలోపు పంపించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు. మార్చి 2020 వరకు రామగుండం ఎరువుల కర్మాగారం ట్రయల్ రన్ మొదలవుతుందని, ఆ తరువాత వచ్చే ఖరీఫ్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు అక్కడి నుండే ఎరువులు సరఫరా చేస్తామనిఘీ సందర్భంగా కేంద్ర మంత్రి సదానందగౌడ హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో మంత్రితో పాటు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
'తెలంగాణకే తలమానికం ఆర్ఎఫ్సీఎల్'
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణ పనులను గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానందగౌడ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణకే తలమానికం రామగుండం ఎరువుల కర్మాగారం' అని అన్నారు. మరో నాలుగు నెలల్లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దక్షిణ భారత రైతులకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా సదానందగౌడ చెప్పుకొచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల కల్పనకు డిసెంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుందనీ ఆయన ప్రకటించారు. స్థానికులకు ఉద్యోగాల విషయమై కేంద్రంతో చర్చించి న్యాయం చేస్తామని ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. -
‘రోడ్లు బాగున్నాయ్..అందుకే ప్రమాదాలు’
బెంగళూర్ : మెరుగైన రహదారుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే రోడ్లు బాగుండటంతో యువత ఎక్సలేటర్‌ను మరింతగా వాడుతుండటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. రోడ్లు బాగుంటే యువత వాటిపై హైస్పీడ్‌తో దూసుకెళతారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి గౌడ పేర్కొన్నారు. చెత్త రోడ్ల కంటే మంచి రోడ్లపై యువత ఎక్సలేటర్ జోరును పెంచి వాహనాలను ముందుకు ఉరికిస్తారని ఈ క్రమంంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. కాగా, అధ్వాన్న రహదారుల కంటే మంచిగా ఉండే రోడ్లపైనే ప్రమాదాలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ బుధవారం వ్యాఖ్యానించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘ఏటా కర్ణాటకలో 10,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి..వీటికి రోడ్లు దయనీయంగా ఉండటమే కారణమని మీడియా చెబుతుండగా..వాస్తవం మాత్రం రోడ్లు బాగా ఉండటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా’యని అన్నారు. ట్రాఫిక్ జరిమానాలపై నిరసనలు వెల్లువెత్తడంతో గుజరాత్ ప్రభుత్వ తరహాలో ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలను తగ్గించాలని సీఎం బీఎస్ యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. -
కేంద్ర కేబినెట్లో స్వల్ప మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అనంత్‌కుమార్ (59) సోమవారం అనారోగ్యంతో మృతి చెందడంతో కేబినెట్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనంత్‌కుమార్ నిర్వర్విస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఎరువులు, రసాయనాల శాఖల బాధ్యతల్ని నరేంద్రసింగ్ తోమర్, సదానంద గౌడలకు అప్పగించారు. ప్రధాని మోదీ సూచనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మార్పులు చేసినట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఇకపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖని నరేంద్రసింగ్ తోమర్, ఎరువులు, రసాయనాల శాఖని సదానంద గౌడ నిర్వహించనున్నారు. కాగా, సదానంద గౌడ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖనీ.. నరేంద్రసింగ్ తోమర్ గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గనుల శాఖల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు తాజాగా కేటాయించిన శాఖల్ని వీరు అదనంగా నిర్వహిస్తారని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. (కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత) -
‘ముందస్తు’పై కేసీఆర్ జవాబు చెప్పాలి
ఆమనగల్లు: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర గణాంక, పథకాల అమలు శాఖ మంత్రి డీవీ సదానందగౌడ డిమాండ్ చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్ ఓటమి భయంతోనే ముందస్తుకు సిద్ధమయ్యారన్నారు. త్రిపుర మాదిరిగానే ఈ రాష్ట్రంలోనూ బీజేపీ అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమావ్యక్తం చేశారు. ఆమనగల్లులో ని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగించారని ఆరోపించారు. బీజేపీకి ఆదరణ పెరగడంతో భయపడి కేసీఆర్ ముందస్తుకు వెళ్లారన్నారు. సచివాలయానికి వెళ్లకుండా పాలన సాగించిన మొదటి సీఎం కేసీఆరే కావొ చ్చని వ్యాఖ్యానించారు. సీఎంను సహచర మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కలవలేక పోతున్నారని, ఒవైసీ సోదరులు, కేటీఆర్, కవితలకు మాత్రం తలుపులు బార్లా తెరిచి ఉంచారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. సొమ్ము కేంద్రానిది.. సోకు కేసీఆర్‌ది.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిందని సదానంద గౌడ చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతో కేసీఆర్ తానే నిధులు తెచ్చి ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నారని, సొమ్ము కేంద్రానిదైతే సోకు కేసీఆర్ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూ.5,200 కోట్లతో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించామని, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో రూ.165 కోట్లతో ఫుడ్‌పార్క్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.రాష్ట్రంలోని 7.92 లక్షల మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమాను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం రూ.4,265 కోట్లను రాష్ట్రానికి కేటాయించిందని గుర్తు చేశారు. -
‘ఆ ఎమ్మెల్యేలను పాకిస్తాన్ తీసుకెళ్లవచ్చు’
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పాకిస్తాన్‌కు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని బీజేపీ నేత సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి కావాల్సిన మెజార్టీ ఉందని, లేకుంటే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌పై తరలించడంపై స్పందిస్తూ.. అది వారి హక్కు అని, వారందరిని ఎక్కడికి తీసుకెళ్లినా.. చివరకు పాకిస్తాన్‌కు తీసుకెళ్లిన తమకొచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా... కర్ణాటకలో అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వారం గడువు ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సమాయత్తమయ్యాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది. -
ప్రకాశ్ రాజ్‌కు కేంద్ర మంత్రి సలహా!
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు కేంద్రమంత్రి సదానంద గౌడ్ ఓ సలహా ఇచ్చారు. ప్రధాని మోదీ మౌనానికి నిరసనగా తన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానన్న ప్రకాశ్ రాజ్ ఇంకా కొత్త అవార్డులు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. ప్రకాష్‌రాజ్‌కు ఇటీవల ప్రతిష్టాత్మక ‘శివరామ్ కారంత్’ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయనకు ఈ అవార్డు ఇవ్వరాదంటూ ఇటీవల హిందూత్వ సంస్థలు గగ్గోలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సదానంద గౌడ్ స్పందిస్తూ.. ’అతను చాలామంచి నటుడు. కానీ భావజాలపరంగా అతను వామపక్షాలకు మద్దతు పలుకుతున్నాడు. ప్రజలు మాత్రం వామపక్షాలకు దూరంగా ఉంటున్నాయి. తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానన్న నటుడు కొత్తగా అవార్డులు తీసుకోకూడదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కన్నా పెద్ద నటులు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గౌరీ లంకేశ్ హత్య ఘటనపై మోదీ మౌనాన్ని నిరసిస్తూ తన జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం ప్రకాశ్ రాజ్ ట్విట్టర్లో వివరణ ఇస్తూ.. జాతీయ అవార్డులన తిరిగి ఇవ్వడానికి తానేమైనా పిచ్చోడినా అని ట్వీట్ చేశారు. -
సిద్ధూ.. హద్దు మీరుతున్నావ్
► కక్ష సాధింపు రాజకీయాలు తగవు ► కేంద్రమంత్రి సదానందగౌడ శివాజీనగర(కర్ణాటక): మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఏసీబీని ప్రయోగించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి డీ.వీ.సదానందగౌడ ఆరోపించారు. అధికార అహంకారానికి, రాజకీయ స్వలాభానికి పరిమితులు ఉన్నాయని, అయితే సిద్ధరామయ్య అన్ని హద్దులను దాటి స్వార్థం కోసం ఏసీబీని వాడుకొంటూ దుర్వినియోగానికి పాల్పడటం సరైన విధానం కాదన్నారు. ఆదివారం మహాలక్ష్మీపురంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన పరిసర పరిరక్షణ గణేశ్ జాగృత కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, పలు బడ్జెట్లను ప్రవేశపెట్టారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు, ఇలాంటి వ్యక్తి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడటంపై దేశమంతా కూడా చర్చనీయాంశమైనదని తెలిపారు. అధికారం శాశ్వతం కాదు యడ్యూరప్పను అణచివేసేందుకు సిద్ధరామయ్య కుట్ర ఫలించదని, ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పటం తథ్యమని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, దీనిని సిద్దరామయ్య తెలుసుకోవాలని సదానంద అన్నారు. ధనబలంతో సిద్ధరామయ్య కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇదే ఆయనకు ఎదురుదాడి అవుతుందని సదానందగౌడ తెలిపారు. ఏసీబీని, అధికారులను దుర్వినియోగం చేసుకోవటంపై కేఏఎస్ అధికారి ఒకరు ఫిర్యాదు చేయటం సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందన్నారు. ప్రకృతికి హానిచేయని రీతిలో వినాయక చవితిని ఆచరించాలని కేంద్రమంత్రి సూచించారు. -
కేంద్ర మంత్రికీ తప్పని నోట్ల కష్టాలు
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు కేంద్ర మంత్రి సదానంద గౌడకు స్వయంగా తెలిసొచ్చాయి. ఆయన సోదరుడు డీవీ భాస్కర గౌడ కొద్దిరోజులుగా కామెర్ల వ్యాధితో మంగళూరు కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆస్పత్రి బిల్లులకు పాత నోట్లు ఇవ్వడంతో సిబ్బంది తిరస్కరించారు. పాతనోట్లు తీసుకోవడానికి గడువు ఉన్నా ఎందుకు తిరస్కరిస్తున్నారని సదానంద గౌడ ఆస్పత్రి వర్గాలపై మండిపడ్డారు. చెక్కు తీసుకోవడానికి కూడా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో పాత నోట్లు స్వీకరించడం లేదని లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ సదానంద చెప్పడంతో సిబ్బంది దిగొచ్చి చెక్కు తీసుకున్నారు. నవంబర్ 24 వరకు పాత పెద్ద నోట్లు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆస్పత్రులు పెడచెవిన పెట్టడం సమంజసం కాదని సదానంద గౌడ అన్నారు. -
కేంద్ర మంత్రికీ తప్పని నోట్ల కష్టాలు
-
అంతర్రాష్ట్ర మండలి నుంచి స్మృతీ ఔట్
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం పనిచేసే అంతర్రాష్ట్ర మండలి నుంచి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, సదానంద గౌడలను తప్పించారు. ప్రధాని మోదీ అధ్యక్షులుగా ఉన్న ఈ మండలిలో కొత్తగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను సభ్యునిగా తీసుకున్నారు. మండలిలో మార్పులుచేర్పులు జరిగాయని తాజాగా విడుదలైన ఓ ఉత్తర్వు ద్వారా తెలుస్తోంది. మండలి స్టాండింగ్ కమిటీలో ఎలాంటి మార్పులు లేవు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇకమీదట కూడా మండలిలో కొనసాగనున్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారం చూపేందుకు 1990 మేలో ప్రధాని అధ్యక్షతన అంతరాష్ట్ర మండలిని ఏర్పాటుచేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని ఈ జులైలో మండలి 11వ సమావేశం జరిగింది. ప్రస్తుత మండలిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, మనోహర్ పరీకర్ సభ్యులుగా ఉన్నారు. వీరుగాక మరో పదిమంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’
-
‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’
న్యూఢిల్లీ : కావేరి జలవివాదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పందించారు. కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టరాని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. కన్నడిగులు, వారి ఆస్తులపై తమిళులు దాడులు చేశారన్నారు. అయితే ప్రతి ఒక్కరూ శాంతి, సమన్వయం పాటించాలని సదానంద సూచించారు. తమకే నీళ్లు లేవని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. హింసతో సమస్య పరిష్కారం కాదని, ఇరు రాష్ట్రాలు సమన్వయం పాటించాలన్నారు. కావేరిలో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందుకే తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని సదానంద గౌడ అన్నారు. 40 శాతం తక్కువ వర్ష పాతంతో కేవలం రెండు, మూడు రిజర్వాయర్లలోనే తాగు నీటి లభ్యత వుందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎక్కువ వర్షాలు కురిసినపుడు ఈ పరిస్థితి లేదన్నారు. కేంద్రం ట్రిబ్యునల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని సదానంద అన్నారు. కాగా కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. -
శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తనయుడు అనంత్ అంబానీ పాల్గొన్నారు. రిలయన్స్ వార్షిక సమావేశంలో గురువారం పాల్గొన్న ముఖేష్, ఆయన కుటుంబసభ్యులు టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చే జియో ఆఫర్ల వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
'బీజేపీ మంత్రులంతా అసమర్థులు'
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్య సదానంద అసమర్థత వల్లే అప్రధాన్య శాఖ బెంగళూరు: కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులంతా అసమర్థులేనని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి సందర్భంగా బుధవారమిక్కడి విధానసౌధ ఎదుట ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రనికి చెందిన సదానందగౌడకు అప్రధాన్యమైన శాఖను కేటాయించడంపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘సదానందగౌడ అసమర్థత కారణంగానే న్యాయశాఖ వంటి ప్రధానమైన శాఖ నుంచి ఆయనకు అప్రధానమైన ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ శాఖను కేటాయించారు. సదానందగౌడ మాత్రమే కాదు బీజేపీలోని మంత్రులంతా అసమర్థులుగానే తయారయ్యారు’ అని విమర్శించారు. ఇక మైసూరు జిల్లా కలెక్టర్ శిఖాను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య వెల్లడించారు. ‘తనను కొంతమంది వ్యక్తులు బెదిరించిన విషయంపై కలెక్టర్ శిఖా ఇప్పటికే కేసు దాఖలు చేశారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. జేడీఎస్‌తో మైత్రి లేదు..... శాసనమండలి సభాధిపతి ఎంపిక విషయమై ఇప్పటి వరకు జేడీఎస్‌తో చర్చించలేదని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. శాసనమండలిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేపీసీసీ వర్కింగ్ ప్రసిడెంగ్ దినేష్ గుండూరావ్, ఎంపీ చంద్రప్ప, మంత్రులు ఆంజనేయ, హెచ్.సి.మహదేవప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయండి
న్యాయమంత్రి సదానందకు కాంగ్రెస్ బృందం వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, న్యాయాధికారుల కేటాయింపుల్లో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, లీగల్ సెల్ నేత సి.దామోదర్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం బుధవారం న్యాయమంత్రిని కలిసింది. హైకోర్టు విభజన అంశంపై మంగళవారమే గవర్నర్‌తో మాట్లాడానని, బుధవారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి సదానంద హామీ ఇచ్చారని ప్రతినిధి బృందం మీడియాకు తెలిపింది. భేటీ అనంతరం షబ్బీర్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘హైకోర్టు విభజనలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాటకీయంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా తెలంగాణ న్యాయవాదులు ఇంకా రోడ్లపై ఉండటానికి కేసీఆరే కారణం. ఇప్పటి వరకు ఉమ్మడి హైకోర్టును విభజించకపోవడం బాధాకరం. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని విభజన చేసుకునే అంశాన్ని ఎందుకు కేంద్రంపై రుద్దుతారని మంత్రి అంటున్నారు. పార్లమెంటులో బీజేపీకి బిల్లుల విషయంలో టీఆర్ఎస్ మద్దతు తెలుపుతోంది. వాటిని అడ్డుకుని కేంద్రానికి తమ నిరసన తెలపాలి. మేం టీఆర్ఎస్ నిరసనకు పార్లమెంటులో మద్దతు తెలుపుతాం..’ అని చెప్పారు. -
'కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తానంటే ఆయనిష్టం'
న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడ అన్నారు. రెండు రాష్ట్రాల నిర్ణయంతోనే హైకోర్టు విభజన జరగాలని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. కేసీఆర్ కేంద్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. హైకోర్టు విభజన అంశంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, న్యాయవాదుల బృందం ఇవాళ సదానంద గౌడతో భేటీ అయ్యారు. అనంతరం సదానంద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల నిర్ణయాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా కేసీఆర్ మారతానంటే ఆయనిష్టమని సదానందా వ్యాఖ్యానించారు. ఏమీ చేయకపోయినా... ప్రతిరోజు కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం అలా చేస్తానంటే ప్రజలే తగిన జవాబు ఇస్తారన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని చదవాలని, కేంద్రంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37వరకూ ఆమోదం ఉందని సదానంద గౌడ తెలిపారు. అలాగే తెలంగాణ హైకోర్టులో 24మంది వరకూ న్యాయమూర్తులకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 18మంది న్యాయమూర్తులు ఏపీకి చెందినవారు, మరో ముగ్గురు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారన్నారు. ఈ వివరాలతో తాము విభేదించడం లేదన్నారు. కాని దిగువ కోర్టులతో సంబంధించినంత వరకూ ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోనే నియామకం అవుతారన్నారు. జడ్జిల నియామకాలకు సంబంధించి ప్రాథమిక విధానం ఇలా ఉంటుందని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి పెడతారని సదానంద గౌడ అన్నారు. పునర్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ, తెలంగాణ వ్యవహారలను చూస్తారని, అయితే తెలంగాణ రాష్ట్ర సీఎం కేంద్రాన్ని నిందించడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. హైకోర్టు విభజనకు కేంద్రం ఎలాంటి చొరవ చూపలేదనడం సరికాదని సదానంద గౌడ అన్నారు. రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాలను ఓసారి పరిశీలించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై మూడు,నాలుగుసార్లు తెలంగాణ ఎంపీలు తనను కలిశారని, ఇద్దరు ముఖ్యమంత్రులతో పలుమార్లు మాట్లాడినట్లు సదానంద తెలిపారు. రాష్ట్ర హైకోర్టు విభజన కోసం తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. హైకోర్టు విభజనపై ఇదివరకే పిల్ దాఖలైందని, ఆ పిల్‌ను పరిష్కరించారని, తర్వాత రివ్యూ పిటిషన్ కూడా దాఖలైందన్నారు. ప్రస్తుతం ఆ పిటిషన్ ఉమ్మడి హైకోర్టు ముందుందన్నారు. ఇప్పుడు హైకోర్టు విభజనపై ఏం మాట్లాడినా అది కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా తాను కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని సదానంద గౌడ స్పష్టం చేశారు. ఇది తన దృష్టికి వచ్చినా, మిగతా అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఈ విషయాలన్నీ లేఖ రూపంలో రాసినట్లు ఆయన తెలిపారు. అలాగే గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల పరిధిలో అంశాలు ఉన్నాయని సదానంద తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విభజన అంశంలో మాట్లాడటం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. ఇంతకన్నా తాము ఏం చేసినా..రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నామని వారే అంటారని, తనవరకు తాను ఏం చేయాలో అది చేస్తున్నానని, ఈ విషయం మీడియాకు బాగా తెలుసునని సదానంద గౌడ వ్యాఖ్యానించారు. -
ఏక్షణంలోనైనా ప్రభుత్వం పడిపోవచ్చు !
= మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు = కాంగ్రెస్‌లో సిద్ధూ మాట ఎవరూ ఖాతరు చేయడం లేదు = కర్ణాటక ముక్త కాంగ్రెస్‌ను ఆ పార్టీ నేతలే చేసుకుంటున్నారు = జీఎస్టీ బిల్లుకు వచ్చే లోక్‌సభ సమావేశాల్లో ఆమోదం = కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ బళ్లారి (గుల్బర్గా) : రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుల్బర్గాలో అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సిద్దరామయ్య మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత అసమ్మతి పెరిగిపోయిందన్నారు. దీంతో ఏకంగా సీఎం కుర్చీ కదిలే పరిస్థితే కాకుండా మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను పూర్తిగా లేకుండా చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ముక్త కర్ణాటక చేయాలని ప్రయత్నం చేస్తోందని, అయితే తాము చేయాల్సిన పనిని కాంగ్రెస్ పార్టీ నేతలే చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని వారు, మంత్రి వర్గం నుంచి తొలగించిన వారు కలిసికట్టుగా యుద్ధం ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా నిద్రావస్థలో ఉందని, దీంతో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అవినీతి పరులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించిన సిద్దరామయ్య మరింత ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించి, అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులకే పట్టం కట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి మాటను ఏ మంత్రులు ఖాతరు చేయడం లేదన్నారు. అధికారులు, మంత్రుల మధ్యనే సమన్వయం లేదని గుర్తు చేశారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోద ముద్ర లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నాయని, అయితే తమిళనాడులో ఓ లోక్‌సభ మెంబరు కొంత వ్యతిరేకత వ్యక్తపరిచారని, అయితే ఆ సమస్యను కూడా అధిగమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిరాయింపుల చట్ట సవరణకు సుముఖంగా ఉన్నాం
కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు సుముఖంగా ఉన్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. లా కమిషన్ ఈ దిశగా కొన్ని సిఫారసులు చేసిందని, వీటిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదికను బట్టి ఫిరాయింపుల వ్యతిరేక చట్ట సవరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తన శాఖ రెండేళ్ల పనితీరుపై ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయని, దీనిపై కేంద్రం వైఖరి ఏంటని ప్రశ్నించినప్పుడు న్యాయ మంత్రి ఈ సమాధానమిచ్చారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై ప్రశ్నించగా.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుందని, ఏపీలో మౌలిక సదుపాయాల ఏర్పాటు జరిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ అంశంలో తాను ఇంతకుమించి సమాధానం చెప్పలేనని స్పష్టంచేశారు. -
'విభజన చట్టం ప్రకారం హైకోర్టు తెలంగాణకే'
న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సూచించారు. విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు వెళ్తుందని చెప్పారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొత్త హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ రెండు వివేదికలను ఇచ్చినట్టు ఆయన చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని లా కమిషన్ సూచించినట్టు సదానంద గౌడ తెలిపారు. -
అట్టహాసంగా ‘అభియాన్’
బీజేపీ మహా సంపర్క అభియాన్‌ను లాంఛనంగా ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు హాజరు పార్టీ పటిష్టతకు మార్గనిర్దేశకాలు బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని(బీజేపీ) మరింత పటిష్టం చేయడంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకుగాను బీజేపీ ఆధ్వర్యంలో ‘మహా సంపర్క అభియాన్’ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల మహా సంపర్క అభియాన్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారమిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు ఉపాధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, డి.వి.సదానందగౌడ, బీజేపీ కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్‌రావుతోపాటు బీజేపీ కర్ణాటక డిప్యూటీ ఇన్చార్జ్ బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి, గోవా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందిన పార్టీ శాఖల అధ్యక్షులు, పదాధికారులు సహా మొత్తం 800 మంది పాల్గొన్నారు. మహా సంపర్క అభియాన్ ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీని ఏ విధంగా చేరువ చేయాలనే అంశంపై ఈ కార్యక్రమంలో అమిత్ షా చర్చించారు. బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రారంభించిన సభ్యత్వ నమోదు ద్వారా ఇప్పటికే 11కోట్ల మందిని సభ్యులుగా చేర్చారు. ఈ విధంగా కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులందరినీ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా మార్చేందుకు గాను మహా సంపర్క అభియాన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన సభ్యులను క్రియాశీల కార్యకర్తలుగా తీర్చిదిద్దడంతో పాటు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో ప్రజల కోసం అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఇదే సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏడాది పాలనపై ఆయా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన పదాధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను అమిత్ షాకు అందజేశారు. ఇక త్వరలో జరగనున్న బీబీఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సైతం బీజేపీ కర్ణాటక శాఖ నేతలకు అమిత్‌షా దిశా నిర్దేశం చేశారు. -
'గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
-
'గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశం 'సెక్షన్ -8' పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు. సెక్షన్ - 8పై గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదని సదానందగౌడ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ కోరితే మాత్రం తాము సలహా ఇస్తామన్నారు. కాగా సెక్షన్ - 8పై కేంద్ర హోం శాఖ ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. అలాగే సదరు సెక్షన్‌పై గవర్నర్‌కు తను నుంచి కానీ... తమ శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. సెక్షన్ -8పై ఇప్పటి వరకు న్యాయశాఖ ఎవరికీ ఎలాంటి లేఖ రాయలేదని సదానందగౌడ తెలిపారు. -
ప్రస్తుత హైకోర్టు.. తెలంగాణ ఆస్తి
కొత్తగా రావాల్సింది ఏపీకేనన్న హైకోర్టు ధర్మాసనం అప్పటివరకు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టు తెలంగాణకు కోర్టు కావాలనడం విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర న్యాయ మంత్రి రాసిన లేఖ సెక్షన్ 31కి వ్యతిరేకం మంత్రి లేఖనైనా సవరించాలి లేక పునర్విభజన చట్టాన్నైనా మార్చాలి ఇప్పటివరకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అందించాలని రిజిస్ట్రీకి ఆదేశం చట్టంలో నిర్దిష్ట కాలపరిమితి లేనప్పుడు జాప్యమన్న ప్రసక్తే లేదని వ్యాఖ్య హైకోర్టు విభజనపై కౌంటర్లు వేయాలని కేంద్రం, ఇరు రాష్ట్రాలకు ఆదేశం సమాధానాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం తీర్పు ఏదైనా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టరాదని హితవు జరగరానిది జరిగితే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరిక విచారణలో అమికస్ క్యూరీలుగా మనోహర్, విద్యాసాగర్ నియామకం సాక్షి, హైదరాబాద్: ‘విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టును తెలంగాణ ఆస్తిగానే భావించాలి.. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు విభజన విషయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖను తప్పుబట్టింది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను తమ ముందుంచాలని కోర్టు రిజిస్ట్రీని సోమవారం ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం సీనియర్ న్యాయవాదులు ఇ.మనోహర్, జి.విద్యాసాగర్‌ను కోర్టు సహాయకులు(అమికస్ క్యూరీ)గా నియమించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలనడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రస్తుత హైకోర్టును చట్ట ప్రకారం తెలంగాణ ఆస్తిగా భావించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే. దీని ప్రకారం న్యాయ శాఖ మంత్రి లేఖనైనా సవరించాలి. లేకపోతే పునర్విభజన చట్టాన్నైనా సవరించాలి’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్లు పరిశీలించాకే నిర్ణయం తొలుత పిటిషనర్ ధన్‌గోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనలో ఆలస్యం జరుగుతోందని, ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఇందుకు పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితేమీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితి లేనప్పుడు, ఇక ఆలస్యమన్న మాటే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ గత వారం రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు విషయాన్ని చూడాలని అందులో కోరినట్లు పేర్కొంటూ... ఆ లేఖను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆ లేఖ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31కి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ పలు వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్లను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తుండగా, ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు విభజనపై ఏపీ సర్కారు ఇప్పటికే తన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఏం చెప్పినా కౌంటర్లోనే చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో తీర్పు ఏదైనప్పటికీ న్యాయవాదులు ఏ రకంగానూ ఆందోళనలు చేయడానికి వీల్లేదని, ఏదైనా జరగరానిది జరిగితే న్యాయవాదులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విభజనకు సంబంధించి హైకోర్టులో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను తమ మందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
'మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు'
నల్గగొండ: నల్లగొండ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. అయితే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టుకు స్థలమిచ్చి కేంద్రానికి లేఖ రాస్తే.. తాము మూడు నెలల్లోపు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని సదానంద గౌడ తెలిపారు. -
పరువు హత్యల నిరోధక బిల్లుకు 22 రాష్ట్రాల మద్దతు
న్యూఢిల్లీ: పరువు హత్యలను నిరోధించే బిల్లుకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మద్దతు తెలిపినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సిద్ధం చేసేందుకుగానూ ఒక నిర్ధిష్ట కాలపరిమితిని నిర్ణయించేందుకు మాత్రం కేంద్రం అంగీకరించలేదు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పరువు హత్యల నిరోధక బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని లోక్‌సభలో కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే లోక్‌పాల్ సవరణ బిల్లు లోక్‌పాల్ సెలక్షన్ ప్యానెల్లో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతకు చోటు కల్పించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ సవరణ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ప్రకారం ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినేట్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాష్ట్రపతి నామినేట్ చేసే న్యాయకోవిదుడు ఉంటారు. అయితే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోక్‌సభలో అతిపెద్ద పార్టీకి చెందిన నేతకు సెలక్షన్ కమిటీలో చోటు కల్పించేందుకు అనువుగా కేంద్రం సవరణ చేయనుంది. రాజ్యసభలో బిల్లును అడ్డుకున్న విపక్షాలు లోక్‌సభ ఆమోదం పొందిన పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ)బిల్లు, 2014ను రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తప్పుపట్టాయి. బీఏసీలో లేని బిల్లును ఆశ్చర్యకరంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో తీవ్రంగా ప్రతిఘటించాయి. -
సదానంద గౌడకు డిమోషన్?
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తొలి వంద రోజుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖలను మార్చి, కొంతమందిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడకు శాఖ తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరుపై మోదీ అసంతృప్తిగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సదానంద కుమారుడు కార్తీక్ వివాదం కూడా ఆయన మంత్రి పదవికి ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా నూతన రైల్వేశాఖ మంత్రిగా శివసేనకు చెందిన సురేష్ ప్రభుకు కట్టబెట్టనున్నట్లు సమాచారం. మొత్తం 10 నుంచి 11మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్ర పక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్లో చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున పంజాబ్ నుంచి తొలిసారి నెగ్గిన విజయ్ సాంప్లా, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, హర్యానా నుంచి జాట్ నేత బీరేందర్‌సింగ్, బీహార్ నుంచి గిరిరాజ్‌సింగ్ లేదా భోలా సింగ్, రాజ్‌స్థాన్ నుంచి కల్నల్ సోనారామ్ చౌదరీ, గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ర్ట నుంచి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివసేన నుంచి సురేష్ ప్రభు, అనిల్ దేశాయ్‌కి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే టీడీపీ నుంచి సుజనా చౌదరికి, బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయకు చోటు దక్కింది. కాగా నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్‌లకు కేబినెట్ హోదా దక్కనున్నట్లు సమాచారం. కొత్తగా కేబినెట్లో చేరనున్న వారికి.. మోదీ ఇచ్చే టీ విందుకు రావాలని పీఎంఓ ఫోన్లు చేసింది. -
తొలి వైఫై రైల్వే స్టేషన్‌గా బెంగళూరు సిటీ స్టేషన్
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ వైఫై సౌకర్యాన్ని రైల్వే మంత్రి సదానంద గౌడ ఇటీవలే ప్రారంభించారు. ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు కల్పిస్తున్న ఈ వైఫై సౌకర్యాన్ని మొబైల్ఫోన్లలో తొలి అరగంట పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత అరగంటకు రూ.25, గంటకు రూ.35 రుసుము వసూలు చేస్తారు. ఇందుకోసం స్టేషన్‌లోని వైఫై హెల్ప్డెస్క్నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
కూతే.. కూత
ఉద్యాన నగరి నుంచి కొత్త రైళ్ల సంచారం రాజ్యోత్సవ కానుకగా ప్రకటించిన రైల్వే మంత్రి సదానంద బెంగళూరు రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రజలకు రాజ్యోత్సవ కానుకగా కొత్త రైలు సర్వీసులను రైల్వే శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ప్రకటించారు. బెంగళూరు-చామరాజనగర, బెంగళూరు-తుమకూరు, బెంగళూరు-హుబ్లీ, బెంగళూరు-నెలమంగళ రైల్వే సర్వీసులను నవంబర్ 1న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక వీటితో పాటు అక్టోబర్ 27న చండీఘడ్ నుంచి దక్షిణ భారతదేశానికి ఓ ప్రత్యేక రైలు, డిసెంబర్ 4న యశ్వంతపుర-జోధ్‌పుర, డిసెంబర్ 11న యశ్వంతపుర-కత్రాల నడుమ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. బెంగళూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటైన వైఫై సౌకర్యంతో పాటు ‘సుఖమంగళం’ ప్రత్యేక యాత్రా రైలును సదానంద గౌడ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కొత్త రైల్వే సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ఆయా ప్రయాణ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ తగ్గనుందని తెలిపారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 20 శాతం పనులను త్వరలోనే పూర్తి చేయనున్నామని వెల్లడించారు. రైల్వే శాఖలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభిం చినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థతో పాటు అనేక కార్యక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు తెలిపారు. గతంతో నిమిషానికి రెండు వేల టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తుండగా ప్రస్తుతం నిమిషానికి 7,800 టికెట్లను బుక్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ రెండు కోట్ల ముప్పై లక్షల మంది ప్రయాణిస్తున్నారని, 13వేల బోగీల్లో జైవిక శౌచాలయ (బయోటాయ్‌లెట్)లను ఏర్పాటు చేశామని చెప్పారు. బయప్పనహళ్లి రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. బెంగళూరు నుండి బయలుదేరే అన్ని రైళ్లు బయప్పనహళ్లి రైల్వే స్టేషన్ నుండే బయలుదేరేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి గాను బీబీఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సిన సగభాగం నిధులను ఇప్పటికీ అందజేయక పోవడంపై సదానంద గౌడ అసహనాన్ని వ్యక్తం చేశారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి గాను బీబీఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఈ విషయంపై రెండు, మూడు సార్లు చర్చలు జరిపినప్పటికీ ఇప్పటికీ ఆ నిధులను చెల్లించలేదని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ....నగరంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు గాను కె.ఆర్.పురం, యశ్వంతపుర, యలహంక, కెంగేరి ప్రాంతాల నడుమ లోకల్ ట్రైన్లను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ పి.సి.మోహన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్
పాడైపోతున్న రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని సందర్శించాల్సింగా రైల్వే మంత్రి సదానంద గౌడను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆహ్వానించారు. హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వీటి పునరుద్ధరణకు వెంటనే పనులు చేపట్టాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయంలోనూ సాయం చేయాలని తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరానని మురళీ మోహన్ వెల్లడించారు. -
రైల్వే స్టేషన్లో మంత్రి తనిఖీలు
తిరుపతి : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. కృష్ణపట్నం పర్యటన ముగించుకుని ప్రత్యేక రైలులో మంత్రి ఉదయం 11.30 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. రైల్వే క్యాటరింగ్ విభాగంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ప్లాట్‌ఫాంపై ఉన్న తాగునీటి కొళాయిలను, ప్రయాణికులు సామాన్లు భద్రపరిచే (క్లాక్‌రూం) గదిని, టాయ్లెట్లను పరిశీలించారు. మంత్రికి రైల్వే గుంతకల్ డివిజన్ మేనేజర్ మనోజ్ జోషి, అసిస్టెంట్ డివిజన్ మేనేజర్ సత్యనారాయణ, లైజనింగ్ ఆఫీసర్ కుప్పాళ్ల సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ గంగులప్ప, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకుడు గిరిధర్‌కుమార్, రాస్ ప్రధాన కార్యదర్శి గుత్తా మునిరత్నం, సింగంశెట్టి సుబ్బరామయ్య, బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి తదితరులు మంత్రికి స్వాగతం పలికారు. మునుపెన్నడూ లేని విధంగా మంత్రి రాక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌ కర్యార్థం మెడికల్ క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని బీజే యువమోర్చా నాయకులు మంత్రిని కోరారు. వృద్ధు లు, వికలాంగుల కోసం వీ ల్చైర్లు అందుబాటులో ఉం చాలని బీజేవైఎం నాయకు లు విశ్వనాథ్ మంత్రికి విన తి పత్రం సమర్పించారు. దీనిపై ఆయన సానుకూలం గా స్పందించారు. -
తిరుపతిలో కేంద్ర రైల్వే మంత్రి తనిఖీ
-
తిరుపతిలో కేంద్ర రైల్వే మంత్రి తనిఖీ
తిరుపతి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు అవసరమని సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి రాక సందర్భంగా పోలీసులు అతిగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి నెట్టేవేశారు. -
రైల్వే అభివృద్ధికి నిధులు తెస్తా
రాజమండ్రి సిటీ : గోదావరి పుష్కరాలు సక్రమంగా నిర్వహించేందుకు.. రైల్వే ప్రయాణికులకు అన్నివిధాల సౌకర్యాలు క ల్పించేందుకు అవసరమైన సప్లమెంటరీ నిధులు తీసుకొస్తానని.. అందుకు రైల్వే మంత్రి సదానందగౌడ్‌తో సమావేశమై చర్చిస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమొహన్ అన్నారు. రాజమండ్రి రైల్వేస్టేషన్లో గాంధీ జయంతిని పురష్కరించుకుని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్లాట్ ఫాం శుభ్రం చేశారు. రోడ్‌కం రైల్వే వంతెన శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి నిధులు సమకూర్చుతాని చెప్పారు. పుష్కరాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖాళీ ప్రదేశాలలో షెల్టర్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత విద్యార్థులు, ఉద్యోగులతో కలసి రైల్వేస్టేషన్లో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎస్కే గుప్తా ఉద్యోగులతో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. రాజమండ్రి సిటీఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, స్టేషన్‌మేనేజర్ బీఎస్ఆర్శాస్త్రి పాల్గొన్నారు. మధురపూడి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ప్రవేశపెట్టిన క్లీన్అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రస్తుతం దేశమంతటా ప్రధాని నరేంద్రమోడీ అమలుచేస్తున్న స్వచ్ఛభారత్ ఒక్కటేనని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇక్కడకు విచ్చేసిన ఆయన ఎయిర్‌పోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్ విజయం సాధిస్తుందన్నారు. కాలికి దెబ్బతగిలినా ఢిల్లీకి వెళ్లి కార్యకలాపాలు నిర్వహించానని.. తాను అందుబాటులో లేనని కొన్ని ఛానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం దురదృష్టకరమన్నారు. -
కాజీపేట్‌లో వ్యాగన్ వర్క్‌షాప్‌కు సిద్ధం
రైల్వే మంత్రి సదానంద వెల్లడి హైదరాబాద్: తెలంగాణలోని కాజీపేట్‌లో రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే మంత్రి డి.వి.సదానంద గౌడ తెలిపారు. దీనికి సంబంధించిన భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి రైల్ నిలయంలో దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మిడ్‌లైఫ్ కోచ్ హ్యాబిలిటేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం కూడా స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఏపీలో కొత్త రైల్వేజోన్ ఏర్పాటుపై కమిటీ వేశామని, అక్టోబర్ 14న కమిటీ సమర్పించే నివేదిక ను పరిశీలించాక తదుపరి చర్యలను ప్రకటిస్తామని వెల్లడించారు. రైల్వేలో భ ద్రత, రక్షణ, సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. రైల్వే రక్షక దళంలో 17 వేల పోస్టులను భర్తీ చేయనున్నామని, వీటిలో 4 వేల పోస్టుల్లో మహిళలను నియమిస్తామని వివరించారు. భారతీయ రైల్వేలో కొత్త శకం ఆరంభమైందని, నిధుల లోటును అధిగమించేందుకే ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నామని రైల్వే మంత్రి వెల్లడించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో రూ.2,016 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. లైన్ల డబ్లింగ్, లెవల్ క్రాసింగ్ గేట్లు, ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం, ప్రయాణికులకు మౌలిక వసతులు, సిగ్నలింగ్ వ్యవస్థల కోసం ఎక్కువ నిధులను వినియోగిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే ‘స్వచ్ఛత్-అభియాన్’ కార్యక్రమంలో ఉద్యోగులంతా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రైల్వేస్టేషన్లలో సోలార్ విద్యుత్తు వినియోగంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. మహిళా ప్రయాణికులకు పటిష్ట భద్రత రైళ్లలో మహిళా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి డి.వి.సదానందగౌడ తెలిపారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వేలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైల్వే రక్షక దళం 53వ బ్యాచ్ సబ్ఇన్స్పెక్టర్ల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మౌలాలీ ఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘దీక్షంత్’(పాసింగ్ ఔట్ పరేడ్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవవందనం స్వీకరించారు. రెల్వే మజ్దూర్ యూనియన్ నిరసన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ శుక్రవారం సికింద్రాబాద్ రైల్‌నిలయం వద్ద ధర్నా నిర్వహించింది. మరో ప్రధాన కార్మిక సంఘం దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రతినిధి బృందం మంత్రిని కలసి జాతీయ పెన్షన్ వ్యవస్థ నుంచి రైల్వేలకు మినహాయింపు ఇవ్వాలని, క్వార్టర్లను మెరుగుపర్చాలని విన్నవించింది. ప్రాజెక్టులు పూర్తి చేయండి: దత్తాత్రేయ తెలంగాణలో పెండింగ్‌లోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఎంపీ బండారు దత్తాత్రేయ మంత్రి సదానందగౌడను కలసి విజ్ఞప్తి చేశారు. -
మైత్రేయను కాపురానికి రమ్మనండి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: వర్ధమాన నటి మైత్రేయను తాను వివాహం చేసుకున్నానని సంచలన ప్రకటన చేసిన కన్నడ దర్శకుడు రుషి.. మైత్రేయ తనతో కలసి ఉండడం లేదని, తనతో కాపురం చేయాల్సిందిగా ఆమెను ఆదేశించాలని కోరుతూ ఇక్కడి కుటుంబ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. రైల్వే మంత్రి సదానందగౌడ తనయుడు కార్తీక్‌గౌడపై అత్యాచారం, వంచన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మైత్రేయ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. -
రేప్ కేసు విచారణకు హాజరైన కార్తీక్
సినీనటి మైత్రేయిపై అత్యాచారం, మోసం కేసులో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యాడు. కార్తీక్ తన వాంగ్మూలాన్ని శుక్రవారమే రికార్డు చేసే అవకాశముంది., ఇప్పటికే అతడికి బెంగళూరులో వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్తీక్ గౌడకు బెంగళూరు సెషన్స్ కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. కార్తీక్ తనను 2013 జూలై నెలలో పెళ్లి చేసుకున్నాడని మైత్రేయి అనే నటి ఆరోపించిన విషయం తెలిసిందే. సరిగ్గా కార్తీక్ నిశ్చితార్థం రోజునే ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగింది. తమ పెళ్లికి ఏకైక సాక్షి కేవలం కార్తీక్ డ్రైవరేనని ఆమె చెప్పింది. ప్రతినెలా 15, 30వ తేదీలలో పోలీసుల ఎదుగట హాజరవుతానన్న నిబంధనతో, రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు స్థానికుల గ్యారంటీలతో కార్తీక్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. అతడు తన పాస్‌పోర్టును కూడా పోలీసులకు అప్పగించాడు. -
పదేళ్ల క్రితమే మైత్రేయితో వివాహం
కేంద్ర రైల్వే మంత్రి సదానంద కుమారుడు కార్తీక్ గౌడ, నటి మైత్రేయి వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. కార్తీక్ గౌడ తన భర్త అంటూ మైత్రేయి కొద్ది రోజుల క్రితం ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే మంగళవారం కన్నడ సినీ దర్శకుడు రిషి మైత్రేయిపై ఇక్కడి 8వ ఏసీఎఎం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. పదేళ్ల క్రితమే తాను మైత్రేయిని వివాహం చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు రిషి, ఆయన న్యాయవాది కుమార గౌడ విలేకరులతో మాట్లాడుతూ... 2004లో కన్నడ సూర్య ది గ్రేట్ అనే సినిమాలో మైత్రేయి అలియాస్ శ్రుతి హీరోయిన్గా తానే అవకాశం కల్పించానని రిషి చెప్పారు. అదే ఏడాది జూలై 17న ఇక్కడి శేషాద్రిపురంలోని సన్మాన్ హోటల్లో మైత్రేయి తాను వివాహం చేసుకున్నట్లు రిషి చెప్పారు. నాలుగు నెలల పాటు అదే లాడ్జిలో ఉన్నామని, కొద్ది రోజుల తరువాత తన వద్ద రూ. 2 లక్షలు నగదు తీసుకుని మైత్రేయి అదృశ్యమైందని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచి ఆమె కనిపించలేదని చెప్పారు. 2004 ఆగస్టు 27న మైత్రేయి ఉన్న ఇంటికి వెళ్తే తనను దూషించి బయటకు నెట్టి వేసిందని రిషి ఆరోపించారు. అదే రోజు ఒక నెంబర్ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని, దీంతో తాను ఇక్కడి వయ్యాలికావెల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అదే విధంగా 2007లో కూడా వ్యాపారవేత్త అంజన్‌కుమార్ అనే వ్యక్తిని మైత్రేయి బ్లాక్ మెయిల్ చేసి నగదు వసూలు చేసిందని ఆరోపించారు. అంతా అబద్ధం : నటి మైత్రేయి సూర్య ది గ్రేట్ సినిమాలో నటించే సయయంలో తన వయస్సు 16 సంవత్సరాలు అని నటి మైత్రేయి చెప్పారు. మంగళవారం ఆమె ఒక టీవీ చానల్లో మాట్లాడుతూ... షూటింగ్ జరిగే ప్రతి రోజు తాను తల్లితో కలిసి వచ్చానని, అలాంటి సమయంలో తాను తల్లికి తెలియకుండా వివాహం ఎలా చేసుకుంటానని ప్రశ్నించారు. దర్శకుడు రిషి ఒక 420 అని అని మండిపడ్డారు. తాను కార్తీక్ గౌడపై కేసు పెట్టిన తరువాత ఈ ఆరోపణలు చెయ్యడం దారుణమని విలపించారు. కేసు దర్యాప్తులో అసలు విషయాలు వెలుగు చూస్తాయని మైత్రేయి స్పష్టం చేశారు. కార్తీక్ కోసం ప్రత్యేక బృందాలు : బుధవారం లోపు విచారణకు హాజరు కాకుంటే కార్తీక్ అరెస్టు చెయ్యడానికి పోలీసు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా కార్తీక్ నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. -
కేంద్రమంత్రి సదానంద కుమారుడిపై ‘420’
పెళ్లి చేసుకుని మోసం చేశాడని కార్తీక్‌పై ఫిర్యాదు చేసిన నటి అన్యాయుంగా ఇరికించారన్న రైల్వేవుంత్రి సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద బెంగళూరులోని ఆర్టీ నగర పోలీసు స్టేషన్లో గురువారం కేసు నమోదు చేశారు. తనను వివాహం చేసుకుని మోసం చేశాడంటూ వర్ధమాన నటి మైత్రేయి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మైత్రేయి మాట్లాడుతూ... తనకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, ఇకపై కలిసి ఉండడం కుదరదంటూ కార్తీక్ తేల్చి చెప్పాడని పేర్కొంది. తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం సాగిస్తానని స్పష్టం చేసింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సదానంద గౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. తన కువూరుడిని అన్యాయుంగా ఇందులో ఇరికించారని గురువారం వుంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. అరుుతే ఈ విషయుంలో తాను జోక్యం చేసుకోనని వుంత్రి పేర్కొన్నారు. వురో పక్క ఈ విషయుం కర్ణాటక వుహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. ఆ యువతి సోదరి తవు వద్దకు వచ్చారని కమిషన్ చైర్పర్సన్ వుంజులా వూనస తెలిపారు. గత జూన్‌లో వుంగళూరులోని వుంత్రి నివాసంలో కార్తీక్ డ్రైవర్ సవుక్షంలో తావుు వివాహం చేసుకున్నావుని మైత్రేయి ఆరోపిస్తోంది. తాను రెండున్నరేళ్ల కిందట తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయూలతో సంబంధం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలను కర్ణాటక హోంవుంత్రి జార్జి ఖండించారు. దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు ఉంటాయుని, ఈ విషయుంలో ప్రభుత్వం కలుగజేసుకోదని ఆయున పేర్కొన్నారు. కార్తీక్ నిశ్చితార్థం వురో యుువతితో జరిగినరోజే మైత్రేయి ఈ ఫిర్యాదు చేయుడం గవునార్హం. -
పది కొత్త రైళ్లు
సాక్షి, చెన్నై: దక్షిణ రైల్వే టైం టేబుల్ మారింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త టేబుల్ అమల్లోకి రానున్నది. ఈ టేబుల్లో పేర్కొన్న అంశాల మేరకు రాష్ట్రంలోకి పది రైళ్లు, ఆరు ప్రీమియం రైళ్లు రాబోతున్నాయి. నాలుగు ప్యాసింజర్లు దక్షిణాది జిల్లాల్లో పట్టాలెక్కనున్నాయి. 31 రైళ్ల వేగాన్ని పెంచారు. రైల్వే బడ్జెట్లో ఆ శాఖ మంత్రి సదానంద గౌడ్ చిన్నచూపు చూశారు. దక్షిణాది జిల్లాలకు ఒక్క రైలు కూడా ఇవ్వకుండా హ్యాండిచ్చారు. కంటి తుడుపు చర్యగా ఇతర రాష్ట్రాలకు చెన్నై నుంచి ఐదు రైళ్లను నడుపుతూ ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏటా రైల్వే టైం టేబుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం సహజం. ఈ టేబుల్ ఆధారంగా కేంద్ర ప్రకటించిన కొత్త రైళ్ల వివరాలు తెలియరావడం ఖాయం. ఆ దిశగా సదానంద చేసిన ప్రకటన కన్నా, దక్షిణ రైల్వే టైంటేబుల్లో కొన్ని కొత్త రైళ్ల వివరాలు ప్రకటించడం ప్రజలకు కాస్త ఊరట నిచ్చే అవకాశం ఉంది. దక్షిణాది జిల్లాల మీదుగా సాగే కొన్ని రైళ్లు ఇందులో ఉండటం విశేషం. అలాగే, దక్షిణాది జిల్లాల్లో నడిపేందుకు కొన్ని ప్యాసింజర్ రైళ్ల వివరాల్ని పొందు పరిచారు. అయితే, ఈ కొత్త రైళ్లు ఎప్పటి నుంచి పట్టాలు ఎక్కుతాయోనన్న తేదీని మాత్రం అధికారులు ప్రకటించలేదు. అలాగే, కొన్ని రైళ్లు బయలుదేరే సమయాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. చెన్నై ఎగ్మూర్ నుంచి సెంగోట్టైకు వెళ్లే పొదుగై ఎక్స్‌ప్రెస్ ఇది వరకు రాత్రి 8.50 గంటలకు బయలు దేరగా, ప్రస్తుతం టేబుల్ మేరకు ఐదు నిమిషాలు ఆలస్యంగా పరుగులు తీయనుంది. కొత్త రైళ్లు : కొత్త టైం టేబుల్ మేరకు పది కొత్త రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నారుు. అలాగే, నాలుగు ప్యాసింజర్లు, ఆరు ప్రీమియం రైళ్లను ప్రకటించారు. 31 రైళ్ల వేగాన్ని పెంచారు. అయితే, ఈ కొత్త రైళ్లు ఎప్పటి నుంచి పట్టాలెక్కనున్నాయో అన్న తేదీల్ని మాత్రం ప్రకటించలేదు. అహ్మదాబాద్ - చెన్నై సెంట్రల్ (వారంలో ఒక రోజు), లోక్మాన్య- చెన్నై సెంట్రల్(వారంలో ఒక రోజు), బెంగళూరు - చెన్నై (ప్రతి రోజూ), విశాఖ - చెన్నై (వారంలో ఒక రోజు), మన్నార్ కుడి - చెన్నై జోద్ పూర్( వారంలో ఒక రోజు), తిరువనంత పురం-కోయంబత్తూరు-హజరత్ నిజాముద్దీన్ (వారంలో ఒక రోజు), తిరువనంత పురం-కోయంబత్తూరు-అలపుల (వారంలో ఒక రోజు), నాగుర్ కోవిల్ - మదురై-నామక్కల్-కాట్పాడి-కాచీగూడ(వారంలో ఒక రోజు) తదితర రైళ్లు ఉన్నాయి. ప్రీమియం రైళ్లు: సెంట్రల్ ఏసీ సౌకర్యంతో కూడిన ఆరు ప్రీమియం రైళ్లను ఈ కొత్త టైం టేబుల్లో పొందుపరిచారు. ఇందులో గయ- చెన్నై (వారంలో ఒక రోజు), హౌరా-చెన్నై (వారంలో ఒక రోజు), పాట్నా-చెన్నై-బెంగళూరు (వారంలో ఒక రోజు), జైపూర్-చెన్నై-మదురై (వారంలో ఒక రోజు), గయ-చెన్నై-పనబన్న హల్లి (వారంలో ఒక రోజు), తిరువనంతపురం-కోయంబత్తూరు-ఈరోడ్, తిరుప్పూర్-బెంగళూరు(వారంలో ఒక రోజు) ఉన్నాయి. ఇక ప్యాసింజర్ రైళ్లు ప్రతి రోజు నడవనున్నాయి. ఇందులో మన్నార్గుడి-మైలాడుతుైరె , పునలూరు-కన్యాకుమారి, తిరుచెందూరు-తిరునల్వేలి, కాసర గోడు-ముక్కాంబిక రోడ్డు ఉన్నాయి. ఇక, నాగర్ కోవిల్-బెంగళూరు, కన్యాకుమారి- బెంగ ళూరు, రామేశ్వరం, లోకమాన్య-మదురై, మైలాడుతురై-మైసూర్, చెన్నై-హుబ్లీ, మదురై-నిజాముద్దీన్, చెన్నై-కోవై-మైలాడుతురై, హౌరా-తిరుచ్చి, ఎగ్మూర్-జోద్ పూర్, కోయంబత్తూరు- చెన్నై తదితర 31 రైళ్ల వేగాన్ని పెంచారు. -
కేంద్రమంత్రి కొడుకుపై రేప్ కేసు
బెంగళూరు : కేంద్ర రైల్వేమంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌గౌడ రేప్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ కార్తీక్‌గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో కార్తీక్ గౌడపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక అనంతరం కార్తీక్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రేయి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో కుషాల్ అనే స్నేహితుని ద్వారా కార్తీక్ గౌడ పరిచయమయ్యాడని, అనంతరం జూన్ 5న మంగళూరులోని తన ఇంటికి కార్తీక్ గౌడ పిలుచుకెళ్లి శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. పెళ్లికి ముందు ఇలాంటివి తనకు ఇష్టం లేదని చెప్పడంతో అప్పటికప్పడు ఓ పసుపుతాడును మెడలో కట్టాడని తెలిపింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి తిరిగేవాళ్లమని, అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో జూలై 25 నుంచి మాట్లాడడం కూడా మానేశాడని వాపోయింది. చివరకు ఈ విషయాన్ని అతని తల్లి దృష్టికి ఈ నెల 11న తీసుకెళ్లానని, అప్పట్లో ఆమె సైతం తనను బెదిరించి పంపినట్లు తెలిపింది. ఇప్పుడు మరో అమ్మాయితో అతడికి నిశ్చితార్థం చేస్తున్నారని, తనను పెళ్లి చేసుకుని ఇలా మోసం చేయడం తగదని ఆమె అంటోంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ ఖండించారు. తన కుమారుడి నిశ్చితార్థం రోజున ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మైత్రేయికి అన్యాయమే జరిగి ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా కార్తీక్ గౌడపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యింది. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆమె ఆర్టీ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మైత్రేయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కార్తీక్ గౌడ కూడా మైత్రేయి ఆరోపణలను తోసిపుచ్చాడు. తన తండ్రి ఉన్నతమైన వ్యక్తి అని, వివాదాల్లోకి లాగడం మంచిది కాదని వ్యాఖ్యానించాడు. తనకు అంత తీరిక కూడా లేదని, తన పనుల్లో తాను బిజీగా ఉన్నానని చెప్పాడు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
నిమిషానికి 7 వేల టికెట్లు
ఢిల్లీలో ఈ టికెటింగ్ వ్యవస్థను ప్రారంభించిన సదానంద గౌడ న్యూఢిలీ: ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తూ రూపొందించిన అధునాతన ఈ టికెటింగ్ వ్యవస్థకు రైల్వే శాఖ బుధవారం శ్రీకారం చుట్టింది. పాత పద్ధతిలో నిమిషానికి 2,000 టికెట్లు బుక్‌చేయడానికి వీలుండగా, ఈ కొత్త వ్యవస్థద్వారా నిమిషానికి 7,200 టికెట్లు బుక్‌చేయవచ్చు. మొత్తం బుకింగ్ ప్రక్రియ వేగంగా, సులభతరంగా ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించారు. కొత్త తరహా ఈ టికెటింగ్ వ్యవస్థను రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఢిల్లీలో ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో హామీ ఇచ్చిన ప్రకారం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (సీఆర్ఐఎస్) రూ. 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ వ్యవస్థను రూపొందించిందన్నారు. కొత్త పద్ధితిలో ఒకేసారి లక్షా 20వేలమంది టికెట్లు బుక్‌చేయడానికి వీలవుతుందన్నారు. ఇదివరకైతే ఒకేసారి 40వేల మంది మాత్రమే టికెట్లు బుకింగ్ చేయడానికి వీలుండేది. గో ఇండియా స్మార్ట్ కార్డ్ ఈ టికెటింగ్ వ్యవస్థతోపాటుగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ట్రెయిన్ ఎంక్వయిరీ మొబైల్ అప్లికేషన్, గో ఇండియా స్మార్ట్ కార్డ్ వ్యవస్థలను కూడా మంత్రి ప్రారంభించారు. టికెట్ బుకింగ్ కౌంటర్లలో టికెట్ జారీ వ్యవధి తగ్గించేందుకు గో ఇండియా స్మార్ట్ కార్డ్ పద్ధతిని మంత్రి ప్రారంభించారు. ప్రయాణికులు రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ తరగతులతో సహా, సబర్బన్ సర్వీసుల టికెట్లకు కూడా స్మార్ట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపవచ్చు. లైఫ్‌టైమ్ వాలిడిటీ ఉండే స్మార్ట్ కార్డ్‌ను రూ. 70చెల్లింపుపై జారీచేస్తారు. దాన్ని 10వేల రూపాయల గరిష్టస్థాయి వరకూ రీచార్జ్ చేసుకోవచ్చు. -
స్థాయీ సంఘానికి రైల్వే బిల్లు
ప్రతిపక్ష ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం రైల్వే(సవరణ) బిల్లు, 2014పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం ఎదురుదాడికి దిగడంతో ప్రభుత్వం దిగివచ్చింది. బిల్లులో పేర్కొన్న ‘రైళ్లలోంచి ప్రమాదవశాత్తు పడిపోవడం’ అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని మార్చాలని, బిల్లును స్థాయీసంఘానికి పంపాలని ప్రతిపక్షం ముక్తకంఠంతో డిమాండ్ చేయడంతో.. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రమాద బాధతులకు పరిహారం ఇచ్చే విషయంలో బాధ్యత నుంచి తప్పించుకునేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోందని చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తు పడిపోవడానికి సంబంధించి తప్పుడు క్లెయిమ్‌ల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిందని, అందువల్లే ఈ సవరణలు చేశామని రైల్వేమంత్రి సదానంద గౌడ వివరణ ఇచ్చారు. బిల్లును సభలో ప్రవేశపెట్టి, చర్చ జరిగి, సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన తరువాత స్థాయీసంఘానికి పంపడం సాధారణంగా జరగదని, అయినా, తాము సభ ఉద్దేశాన్ని గౌరవించి అందుకు ఒప్పుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇతర బిల్లులు.. షెడ్యూల్ కులాల కేటగిరీ నుంచి కొన్ని కులాల తొలగింపు, మరికొన్నింటి చేర్పునకు సంబంధించిన బిల్లు. కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ప్రతిపాదనల మేరకు ఈ సవరణ బిల్లును తీసుకొచ్చారు.కాలపరిమితి తీరిపోయిన 36 చట్టాలను తొలగించేందుకు ఉద్దేశించిన మరో బిల్లు. -
రైల్వేట్రాక్‌ల పునరుద్ధరణకురూ. 19 వేల కోట్లు
న్యూఢిల్లీ: రైల్వే భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వేట్రాక్‌ల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 19 వేల కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి సదానందగౌడ తెలిపారు. రైల్వేశాఖ ప్రాధాన్యత అంశాల్లో భద్రత కూడా ఒకటని...అందువల్ల ట్రాక్‌ల పునరుద్ధరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని...దాన్ని ఆపబోమని గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. నిధుల లభ్యత, ట్రాక్‌ల పరిస్థితినిబట్టి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మరోవైపు రైళ్లలో క్యాటరింగ్ సేవలపై చాలా ఫిర్యాదులు అందుతున్న విషయం వాస్తవమేనని గౌడ అంగీకరించారు. రైళ్లలో ఇకపై నాణ్యమైన ఆహారాన్ని అందరికీ అందుబాటు ధరలో అందిస్తామన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణికుల స్పందన తెలుసుకునేందుకు ఐదు రైళ్ల లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వివరించా రు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో రోజూ 25లక్షల లీటర్ల మంచి నీరు అవసరమవుతోందన్నారు. మిగతా అవసరాల కు బయటి నుంచి మంచినీటిని కొనుగోలు చేస్తున్నామన్నారు. మహిళా ప్రయాణికుల భద్రతకు మహిళా బోగీల్లో సీసీటీవీల ఏర్పాటు చేస్తామన్నారు. -
దుర్ఘటనపై 3గంటలకు రైల్వే మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైల్వే ప్రమాద దుర్ఘటనపై రైల్వేమంత్రి సదానంద గౌడ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. లోక్‌సభ సమావేశాల్లో రైలు ప్రమాద వార్తను ఎంపీ జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ఘటనపై స్పందించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ సహాయ చర్యలు చేపట్టాల్సింది అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు మధ్యాహ్నం మూడు గంటలకు సభలో తెలుపుతామని రైల్వేమంత్రి పేర్కొన్నారు. -
సదానంద సుడిగాలి పర్యటన
- రైల్వే స్టేషన్లలో సౌకర్యాలపై ఆరా - భద్రతా చర్యలు సరిగా లేవని అధికారులపై ఆగ్రహం - సాధారణ బోగిలో ప్రయాణించిన రైల్వే మంత్రి సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లలో ఉన్న మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను పర్యవేక్షించడానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. అధికారులతో పాటు ప్రయాణికులను కలుసుకుని సదుపాయాల కల్పన పట్ల ఆరాతీశారు. ఆదివారం ఉదయమే బెంగళూరులోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ చేపట్టాల్సిన పనులు, అందుకు అవసరమైన ప్రణాళిక, నిధులు తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్‌ను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అక్కడి నుంచి సిటీరైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఫ్లాట్‌ఫారం, శౌచాలయాలు, ప్రయాణికుల విశ్రాంతి గదులను పరిశీలించారు. అక్కడే ఉన్న హోటల్స్‌కు వెళ్లి అక్కడి ఆహార పదార్థాలను రుచి చూశారు. కొంతమంది ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి సౌకర్యాల పట్ల ఆరా తీశారు. చాలా మంది రైల్వే స్టేషన్లో దొరుకుతున్న ఆహారం రుచిగా ఉండటం లేదని, నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదు చేశారు. అదే విధంగా టికెట్ల కోసం ప్రయాణికులు వేచి ఉండకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి ఆయన సాధారణ ప్రయాణికుడిలా రైలులో చెన్నపట్టణ, మండ్య మీదుగా మైసూరు చేరుకున్నారు. ఆయా రైల్వే స్టేషన్లో ఆగి అక్కడి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మైసూరులో రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ఈ ఏడాది హైస్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని ఇందుకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను కేంద్ర మంత్రి సదానందగౌడ ఆదేశించారు. -
ఆగని రైళ్లు మాకెందుకు?
రామగుండం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసులు పెదవివిరుస్తున్నారు. అంతా హైఫై అంటూ సామాన్యులను విస్మరించారని, రామగుండంలో హాల్టింగ్ లేని రైళ్లను కేటాయించి అన్యాయమే చేశారంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ప్రీమియం, హైస్పీడ్ పేరుతో పలు రైళ్లు వస్తున్నాయని రైల్వే మంత్రి సదానందగౌడ్ తెలిపారు. అయితే అవి సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగానే ఇంటర్నెట్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్లలోని కౌంటర్లలో టికెట్లు ఇవ్వరని అధికారులు తెలిపారు. ధనార్జనే ధ్యేయం ఇప్పటికే తత్కాల్ పేరుతో అదనపు రుసుం వసూలు చేస్తున్న రైల్వే శాఖ మరోసారి ప్రీమియం రైళ్ల పేరుతో ధనార్జనే ధ్యేయం అని చెప్పింది. ప్రయాణికుల అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ప్రీమియం రైలును ప్రవేశపెట్టారు. వీటిలో ప్రయాణించే వారు 60 రోజుల ముందుగా ఇంటర్నెట్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణపు తేదీ దగ్గరపడ్డ కొద్దీ టిక్కెట్ కొనాలనుకుంటే ధర క్రమంగా పెరుగుతుంటోంది. రైలు వచ్చే గంట ముందు కూడా టికెట్ పొందే అవకాశం ఉంది. కానీ ధర మాత్రం రెట్టింపు. ప్రీమియం రైళ్ల టికెట్లు స్టేషన్లలో ఇవ్వరు. రామగుండంలో హాల్టింగ్ లేనట్టే సికింద్రాబాద్-నాగపూర్ సెక్టార్లలో గంటలకు 200 కిలోమీటర్లతో వెళ్లే హైస్పీడు రైలును ప్రవేశపెట్టే యోచన కేంద్రం చేస్తోంది. వీటికి రెండు గంటల వ్యవధికి ఒక హాల్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇలాగైతే సికింద్రాబాద్-రామగుండం 220 కిలోమీటర్లు ఉండడంతో గంటలో రైలు చేరుకుంటుంది. దీన్ని బట్టి ఈ రైలు రామగుండంలో ఆగకుండా బల్లార్షాలో ఆగనున్నట్లు తెలిసింది. ఈ రైలు టిక్కెట్ ధర కూడా దాదాపుగా విమాన చార్జిలతో సమానంగా ఉండనున్నట్లు సమాచారం. పాలవ్యాపారులకు ప్రోత్సాహం కరువు చిరు వ్యాపారులు తమ సరుకులను సులభం గా, తక్కువ ఖర్చుతో తరలించేందుకు ప్యాసిం జర్ రైళ్లు వినియోగించుకుంటారు. జమ్మికుం ట, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి నుంచి పాల వ్యాపారులు రోజు రామగిరి ప్యాసింజర్ కిటికీలకు పాలక్యాన్లు తగిలించుకుని మంచిర్యాల కు వస్తుంటారు. కాజీపేట-బెల్లంపల్లి మధ్య పుష్పుల్ లోకల్రైలు నడిపించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. న్యూఢిల్లీకి మరో రైలు విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఓ రైలు నడపనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నపంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. దీని ద్వారా తెలంగాణ ప్రజల అవసరాలు కొంతమేరకు తీరేలా ఉన్నాయి. రైలు పేరు మార్పునకు సిఫారసు హైదరాబాద్-న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చాల్సిందిగా రైల్వేశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో నూతన రైలును విజయవాడ నుంచి న్యూఢిల్లీకి నడిపించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. -
60 మంది కాంగ్రెస్ నేతలపై కేసులు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ నివాసం ముందు ఆందోళనకు దిగిన 60 మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలని, రైల్వేలో ప్రైవేటీకరణకు దారులు తెరవొద్దని డిమాండ్ చేస్తూ డీపీసీసీ అధ్యక్షుడు అర్వీందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలో మంగళవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. త్యాగరాజ్ మార్గ్‌లోని గౌడ నివాసం ముందు చేపట్టిన ఈ ఆందోళనకు ఎటువంటి అనుమతి లేదని కమిషనర్ జతిన్ నర్వాల్ తెలిపారు. లవ్లీతోపాటు పార్టీ నేత ముఖేశ్ శర్మ తదితర 60 మంది నేతలపై కేసులు నమోదు చేశామని, చత్తర్‌సింగ్ అనే కార్యకర్తను కూడా అరెస్టు చేశామన్నారు. ప్రజాసేవకుల పట్ల అవిధేయతగా వ్యవహరించినందుకాగాను భారత శిక్షాస్మృతి, సెక్షన్ 188, విధులను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు 341, విధుల నుంచి వైదొలిగేలా ఒత్తిడి తెచ్చినందుకు 353 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆందోళన అరగంటపాటు కొనసాగిందని, ఆ వెంటనే నలుగురిని అరెస్టు చేసి, విడుదల చేశామని చెప్పారు.మంగళవారం జరిగిన ఈ ఆందోళన సమయంలో కొందరు కార్యకర్తలు గౌడ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి ఇంటి వద్ద ఉన్న నేమ్ ప్లేట్‌ను తొలగించి, కిందపడేసి కాళ్లతో తొక్కారు. ఈ దృశ్యాలను మీడియా పదే పదే ప్రసారం చేసింది. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
రైల్వే బడ్జెట్ 2014-15 పై ప్రత్యేక చర్చ
-
కలల లోకాన్నైతే సృష్టించారు కానీ..
-
రైల్వే బడ్జెట్లో తెలుగు వారికి మొండి చెయ్యే!
-
ఊరించి.. ఉసూరుమనిపించారు
- రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన సదానందగౌడ - కడప-బెంగళూరు రైలు మార్గానికి ఒక్క పైసా విదల్చని దుస్థితి - జిల్లాలో రైల్వేజోన్, డివిజన్ ఏర్పాటుపై నోరుమెదపని గౌడ - తిరుపతికి ఒక్క కొత్త సర్వీసును కూడా మంజూరు చేయలేదు - అన్యాయంపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై ప్రజాగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ జిల్లా ప్రజానీకాన్ని ఊరించి ఉసూరుమనిపించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఊపిరిలూదే బెంగుళూరు-కడప, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాల కు ఒక్క పైసా నిధులను కూడా కేటాయించలే దు. చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కనిపించలేదు. రైలు మార్గాల మా ట దేవుడెరుగు.. కనీసం కొత్త రైలు సర్వీసులను కూడా జిల్లాకు మంజూరు చేయలేదు. రైల్వే బడ్జెట్ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో ఈ ఏడాది జిల్లాకు అన్యాయం జరిగినా ఏ ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధి కూడా నోరుమెదపకపోవడంపై జనం నివ్వెరపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్‌ను మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరాక ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ఈ ఏడాది రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా జిల్లాకు రైల్వే బడ్జెట్లో పెద్దపీట వేస్తారని ప్రగల్భాలు పలికారు. శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైలు మార్గాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తారని చెప్పుకొచ్చారు. చిత్తూరు నుంచి పలమనేరు మీదుగా కుప్పం వరకూ కొత్త రైలుమార్గం నిర్మాణానికి సైతం రైల్వేశాఖ ఆమోదముద్ర వేస్తుందని బీరాలు పలికారు. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైలు సర్వీసులు మంజూరు చేస్తారని స్పష్టీకరించారు. చంద్రబాబు చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ప్రకటించలేదు. పూర్తయ్యేదెన్నడో.. కడప-మదనపల్లె-బెంగళూరు రైలుమార్గాన్ని 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ మంజూరు చేసింది. రూ.రెండు వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రైల్వే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ రూ.40 కోట్లు కేటాయించింది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.40 కోట్లను కేటాయించడంతో రూ.80 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2010-11 బడ్జెట్లో రూ.56 కోట్లు, 2011-12 బడ్జెట్లో రూ.60 కోట్లను రైల్వేశాఖ కేటాయించింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు. 259 కి.మీల పొడవున ఈ రైలుమార్గం నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం 21 కి.మీ. పొడవున చేపట్టిన రైలు మార్గం పనులు కూడా నిలిచిపోయాయి. 2013-14 బడ్జెట్లో గానీ.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోగానీ ఈ రైలు మార్గానికి ఒక్క పైసా నిధులను కేటాయించలేదు. ఇప్పుడు మంత్రి సదానందగౌడ కూడా ఈ రైలుమార్గానికి ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఒప్పందం ప్రకారం ఈ రైలుమార్గం 2015 నాటికి పూర్తికావాలి. నిధుల కేటాయింపు ఇలానే ఉంటే.. ఈ రైలుమార్గం పూర్తికావాలంటే కనీసం రెండున్నర దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని 2009-10 బడ్జెట్లో నిర్ణయించాయి. రూ.1314 కోట్ల వ్యయంతో 309 కి.మీ. ల పొడవున ఈ రైలుమార్గం నిర్మించడానికి ప్రణాళిక రూపొం దించారు. ఈ రైలు మార్గానికి 2013-14 బడ్జెట్లో కేవలం రూ.కోటి మాత్రమే కేటాయించారు. ఆ నిధులు సర్వేకు కూడా సరి పోవు. ఈ ఏడాది బడ్జెట్లో ఆ రైలు మార్గానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ రైలుమార్గం మరుగునపడినట్లే లెక్క!! చంద్రబాబు వల్లెవేసిన చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కన్పించకపోవడం గమనార్హం. కొత్త రైళ్లు ఏవీ..? రైలుమార్గానికి నిధుల విషయంలోనే కాదు.. కనీసం కొత్త రైల్వే సర్వీసులను మంజూరు చేయడంలోనూ మంత్రి సదానందగౌడ జిల్లాకు తీరని అన్యాయం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైళ్లను మంజూరు చేస్తారనే భావనను సదానందగౌడ తుంచేశారు. తిరుపతి-వారణాసి, తిరుపతి-షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగితాలకే పరిమితమయ్యాయి.రేణిగుంటలోని కోచ్ రిపేర్ వర్క్ షాప్ సామర్థ్యాన్ని విస్తరించడంపై కూడా రైల్వే బడ్జెట్లో స్పష్టత లేదు. జిల్లాకే కాదు.. రాష్ట్రానికి అదే రీతిలో అన్యాయం జరిగింది. ఇంత అన్యాయం జరిగినా సీఎం చంద్రబాబుగానీ.. టీడీపీ ప్రజాప్రతినిధులుగానీ నోరుమెదపకపోవడం గమనార్హం. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూశానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు చేతులెత్తేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌డీఐల చాటున ప్రైవేటీకరణ రైల్వే మంత్రి సదానందగౌడ రైల్వేల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్న ట్లు చెప్పడం వెనుక రైల్వే ప్రైవేటీకరణ దాగి ఉంది. అయితే రైల్వే ఆపరేషనల్ విభాగంలో ఎఫ్‌డీఐలను మినహాయిస్తున్నట్లు చెప్పి నా రైల్వే ప్రైవేటీకరణకు ఇది శ్రీకారం చుట్టినట్టే. ఈ అంశాన్ని ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తాం. - కుప్పాల గిరిధర్‌కుమార్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ సీఎం సొంత జిల్లా అంటే లెక్కలేదా..? రైల్వే బడ్జెట్లో చేసిన కేటాయింపులు చూస్తే సీఎం జిల్లా అంటే కేంద్రానికి లెక్క లేనట్లుంది. కనీసం తిరుపతి, చిత్తూరును పరిగణనలోకి కూడా తీసుకోకుండా బడ్జెట్ ప్రకటన చేయడాన్ని సీఎం కూడా సీరియస్‌గా భావించి మార్పులు చేయించాలి. సీఆర్ఎస్ అభివృద్ధి ఊసే ఎత్తకపోవడం బాధాకరం. - కారుమంచి రాజు, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సంఘం పెండింగ్ ప్రాజెక్ట్‌లకు కమిటీ నాన్చుడుకే.. విభజన జరిగాక ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు చెప్పడం నాన్చుడు ధోరణికే అని సామాన్యునికి కూడా అర్థమయింది. నిధులు, కొత్త రైళ్ల కేటాయింపులో తిరుపతికి ప్రతిసారీ అన్యాయమే జరుగుతోంది. దీన్ని రాష్ట్ర ఎంపీలు తీవ్రంగా పరిగణించాలి. - సుదర్శన్ రాజు, రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీ దేశ సమగ్రత అంటే ఇదేనా? ఎన్నికలకు ముందు దేశ సమగ్రత అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రైల్వే మంత్రి ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు రిక్తహస్తం చూప్పారు. ఇదేనా సమగ్రత అంటే? రాయలసీమకు రైల్వే జోనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారనుకుంటే మొండిచేయి చూపారు. పీపీపీ విధానంతో ఉద్యోగులను సాగనంపడానికే ప్రాధాన్యం ఇచ్చారు. - గుండ్లూరు వెంకటరమణ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొత్త సీసాలో పాత సారా.. బీజేపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్లే ఉంది. గతంలో రైల్వే ఉద్యోగుల కోసం కనీసం కొద్దోగొప్పో కొన్ని పథకాలైనా ప్రకటించారు. ఈ సారి అది కూడా లేకపోగా, గుంతకల్ డివిజన్‌కే బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది. - కే.కళాధర్, గుంతకల్ డివిజన్ ఆర్ఎంయూ కార్యదర్శి మహిళా రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి రైల్వేలో మహిళా ప్రయాణికుల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ దిశగా భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేస్తామన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లను తక్షణం నియమించాలి. - ఎన్.విజయలక్ష్మి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు కాంగ్రెస్ హయాంలో నేను రైల్వే ప్యాసింజర్స్ అమినిటీస్ కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఉన్నప్పుడే తిరుపతికి డబుల్ డెక్కర్ రైలును మంజూరు చేయించా. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, సొంత జిల్లాకు రైల్వేలో ప్రాధాన్యం ఇప్పించుకోకపోవడంపై ప్రజలకు ఇప్పుడేం చెబుతారు? ఇది రాష్ట్ర ప్రజలకు అవమానం. - మబ్బు దేవనారాయణ రెడ్డి, మాజీ రైల్వే పీఏసీ సభ్యుడు అరచేతిలో వైకుంఠం చూపింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి, ఇప్పుడు ప్రతి అంశంలో మోసం చేస్తోంది. ధరల బాదుడుకు బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్నికల అనంతరం బీజేపీ అసలు రంగు బయట పడుతోంది. - బట్టు రామారావు,ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా అధికార ప్రతినిధి చేతగానితనం చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనానికి ఇదే నిదర్శనం. రైల్వే బడ్జెట్ రూపకల్పన సమయంలో చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అప్పట్లో ప్రతి పాదనలు పంపకుండా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మూడురోజుల ముందు హడావుడిగా ప్రతిపాదనలు పంపింది. నెల రోజుల ముందే వైఎస్సార్సీపీ ఎంపీలు రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రతిపాదనలు ఇచ్చాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం మేల్కొని ఉంటే రాష్ట్రానికి.. మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి సమన్వయ కమిటీని నియమించడం కేవలం కాలయాపన చేయడం కోసమే. ఇంత అన్యాయం జరిగినా టీడీపీ ప్రజాప్రతినిధులు నోరుమెదకపోవడంలో ఆంతర్యమేమిటో..? - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట ఇదెక్కడి చోద్యం..? రైల్వే బడ్జెట్లో రాష్ట్రంతోపాటూ జిల్లాకు న్యాయం చేయాలని నెల కిత్రం వైఎస్సార్సీపీ ఎంపీలు అందరూ కలిసి మంత్రి సదానందగౌడ, ఆ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించాం. న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉంటే.. రాష్ట్రానికి, మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఇప్పుడైనా చంద్రబాబు స్పందిస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు బీరాలు పలకడానికి తప్ప దేనికీ పనికిరాడన్నది మరోసారి స్పష్టమైంది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గానికి నిధులు, రేణిగుంట సీఆర్ఎస్ విస్తరణ, తిరుపతి నుంచి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంజూరు చేసే వరకూ మడమ తిప్పకుండా పోరాటం చేస్తాం. - వరప్రసాద్, ఎంపీ, తిరుపతి -
రైల్వే బడ్జెట్‌పై.. నేతల అభిప్రాయాలు
ఇది పీపీపీ బడ్జెట్: వినోద్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం లో అంతా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) అన్న పదమే ఉందని, ఇది రైల్వే బడ్జెట్ అన డం కన్నా పీపీపీ బడ్జెట్ అంటే బాగుంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. ఈ విధానం గతంలోనూ విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. పార్లమెంట్ సమావేశం అనంతరం విజ య్చౌక్లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలు, రైల్వే సమస్యలు పరిష్కారంపై ఎలాంటి ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేయడాన్ని వినోద్ తప్పుపట్టారు. రైల్వే బడ్జెట్ నిరాశపర్చింది: ఎంపీ కవిత రైల్వే బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందని టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇచ్చే కొత్త ప్రాజెక్టులు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేటాయిస్తే సమంజసంగా ఉంటుందని, అయితే చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను సైతం కమిటీ నివేదిక వరకు ఆగాలనడం బాధాకరమన్నారు. రెండింటికీ మొండిచెయ్యే: గుత్తా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ స్వాతంత్య్ర చరిత్రలోనే చెత్తదిగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో మెండిచెయ్యి దక్కిందన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏం ఒత్తిడి తెచ్చారు. మసిపూసి మారేడుకాయ చేయలేదు: కిషన్‌రెడ్డి ‘‘రైల్వే బడ్జెట్ వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉంది. ఏ రాష్ట్రాన్నీ చిన్నచూపు చూడకుండా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా మసిపూసి మారేడుగాయ చేయకుండా ప్రజలకు భద్రతతో కూడిన బడ్జెట్‌ను సిద్ధం చేయటం అభినందనీయం. 14 వేల మంది రైల్వే పోలీసుల నియామకం, 4 వేల మంది మహిళా పోలీసుల ఏర్పాటు లాంటివి దీనికి నిదర్శనం. ప్రజలంతా ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తారని ఆశి స్తున్నా. అమలు చేయలేని హామీలివ్వటం కం టే... చేయదగ్గ పనులనే ప్రస్తావించటం మంచి చర్య. తెలంగాణకు రెండు సెమీ బుల్లెట్ రైళ్లను కేటాయించటం సంతోషకరం’ సాధారణ బడ్జెట్ చూశాక స్పందిస్తాం: యనమల కేంద్ర సాధారణ బడ్జెట్‌ను కూడా చూశాక తమ స్పందన తెలియచేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైల్వే బడ్జెట్‌పై వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బడ్జెట్‌ను రైల్వే మంత్రి చదువుతున్నప్పుడు విన్నామే తప్ప అందులో ఏమేమున్నాయో పూర్తిగా చూడలేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణకు సంబంధించి 29 ప్రాజెక్టులున్నాయని, వాటిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. జనాకర్షణకు స్వస్తి: జేపీ జనాకర్షణ సంస్కృతికి స్వస్తి చెప్పి రవాణాలో మెరుగైన మౌలిక వసతులకు పునాది వేసేందుకు రైల్వే బడ్జెట్ ద్వారా కేంద్రం చేసిన ప్రయత్నాలు అభినందనీయమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం దశాబ్దాకాలం పాటు అనుసరించిన తాత్కాలిక ధోరణులను విడిచిపెట్టి, ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ రైల్వే మంత్రి వ్యవహరించడం స్వాగతించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆశించినట్లు లేదు: బీజేపీ ఏపీ శాఖ రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించే తీరున రైల్వే బడ్జెట్ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పి. విష్ణుకుమార్‌రాజు ‘సాక్షి’తో అన్నారు. బడ్జెట్ గురించి తాము ఊహిం చింది ఒకటి, జరిగింది మరొకటి అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఆశించామని.. అలాం టి ప్రకటన లేకుండా పోయిందన్నారు. బడ్జెట్లో కొత్త జోను ప్రకటించకపోయినా ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తీవ్ర నిరాశ మిగిల్చింది: వామపక్షాలు కేంద్ర రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశ మిగి ల్చిందని సీపీఐ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణ వైపే పరుగులు తీస్తున్నట్టు కని పించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని భావిం చినా నిరాశే మిగిలిందని చెప్పారు. విజయవాడ-న్యూఢిల్లీ మధ్య రైలు మినహా రాష్ట్రానికి బడ్జెట్లో దక్కిందేమీ లేదన్నారు. -
రైలూ లేదు.. జోనూ లేదు
- రైల్వే బడ్జెట్లో వాల్తేరు రైల్వేకు మొండిచేయి - జోన్ ఊసేలేదు.. కొత్త ప్రాజెక్టులు అసలే లేవు విశాఖపట్నం: రైల్వే జోన్ అదిగో ఇదిగో అంటూ ఇన్నాళ్లు ఊరించి ఇప్పుడు ఆ ప్రస్తావనే తేలేదు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉత్తరాంధ్రకు, వాల్తేరు రైల్వేకి అన్యాయమే జరిగింది. జోన్ వస్తుందో లేదో కూడా స్పష్టం చేయలేదు. ఒడిశా రాజకీయ లాబీయింగ్ ముందు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరలేదు. దశాబ్దాల రైల్వే జోన్ డిమాండ్ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, విశాఖ ఎంపీ హరిబాబుల సంయుక్త ప్రకటనలు సైతం కార్యరూపం దాల్చలేదు. విశాఖ వాసుల రైల్వే జోన్ కల మళ్లీ కల్లలైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రైల్వే జోన్ గ్యారంటీగా వస్తుందని స్పష్టం కావడంతో దాన్ని విశాఖ కేంద్రంగానే ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టం చే సింది. తూర్పు కోస్తాలో అన్యాయమవుతున్న విశాఖను జోన్ చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలంటూ రైల్వే మంత్రికి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసి ఇద్దరి సభ్యులకు కమిటీలో స్థానం కట్టబెట్టినా జోన్ విషయం బడ్జెట్ పుస్తకంలోకి ఎక్కకపోవడాన్ని నగరవాసులు ఆక్షేపిస్తున్నారు. వెంకయ్యనాయుడు రైల్వే జోన్ కావాలని రైల్వే మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్‌కు చెప్పిన తర్వాత ఆయన మాట కొట్టేయలేరని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. అందుకే ఈ బడ్జెట్‌పై ఉత్తరాంధ్రవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ బడ్జెట్ అందర్నీ నిరాశపరిచింది. ప్రాజెక్టులేవీ.. కొత్త ప్రాజెక్టుల కోసం ఉత్తరాంధ్ర వాసులు కలలుగన్నారు. డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రికల్ లోకోషెడ్లను విస్తరిస్తారనుకున్నారు. అగనంపూడి వద్ద వ్యాగన్ వర్క్‌షాప్ మంజూరవుతోందని భావించారు. స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా మరిన్ని రైల్వే పరిశ్రమలు విశాఖకు వస్తాయనుకున్నారు. కానీ ఒక్క ప్రాజెక్టూ రాకపోయేసరికి అంతా ఉసూరుమన్నారు. -
రైల్వే బడ్జెట్లో.. ఏపీపై కరుణ ఏది?
► రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి ► కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు ► పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రాజెక్టులకూ దిక్కులేదు ► ప్రత్యేక జోన్, మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు ► రాష్ట్రంలో ప్రారంభమయ్యే రైళ్లు మూడే..వీటిలో రెండు పాతవే.. ► రాష్ట్రం మీదగా 6 కొత్త రైళ్లు ► కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ఇతరత్రా పనులకు ఇచ్చింది సుమారు రూ.473.28 కోట్లే.. సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్లో మళ్లీ మొండిచేయే మిగిలింది. రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. మంగళవారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో నామమాత్రంగానే నిధులు విదిలించారు. చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టూ రాష్ట్రానికి రాలేదు. కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ బడ్జెట్లో చోటు దక్కలేదు. కొత్త రాష్ట్రం ఆవిర్భావం జరి గిన ఆరు నెలల్లోగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. దక్షిణ మధ్య జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా జోన్‌లోని వాల్తేరు డివిజన్‌తో కలిపి కొత్త జోన్ ఏర్పాటు ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విశాఖ లేదా విజయవాడ కేంద్రంగా ఈ జోన్ ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటనలు గుప్పించినా, బడ్జెట్లో నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన బిల్లు లో పేర్కొన్న విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో రైల్ ఏర్పాటుపై అపాయింటెడ్ డే (జూన్ 2) నుంచి ఆరు నెలల్లో సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి వుంది. బడ్జెట్లో ఈ ప్రస్తావనే లేదు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా నేతల ప్రకటనలకే పరిమితమైంది.తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తామని గతంలో అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డిమాండ్ నెరవేరగలదని అందరూ భావించారు. డివిజన్ ఏర్పాటు అంశం బడ్జెట్లో ప్రస్తావించాల్సిన అవసరం లేదనీ, కమిటీ నివేదిక వచ్చాక ఏర్పాటవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎ క్లాస్ రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్ల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విశాఖలో వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటునూ కేంద్రం విస్మరించింది. గుంతకల్లులో రూ.100 కోట్లతో విద్యుత్ లోకో షెడ్ నిర్మింప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర పడలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీతో సరి.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్న హామీ కూడా మంత్రి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ ఏర్పాటు ప్రకటనతో సరిపెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రూ. 20,680 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటికి నిధుల కేటాయింపుపై నివేదిక ఇవ్వడానికి రైల్వే, ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కమిటీ నివేదికను అనుసరించి ఇరు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఈ ప్రాజెక్టులను చేపడతామని హామీ ఇచ్చారు. పాత రైళ్లే కొత్తవిగా.. రాష్ట్రం నుంచి 3 రైళ్లు కొత్తగా ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో చూపించారు. వాస్తవానికి వీటిలో విజయవాడ - న్యూఢిల్లీ మధ్య రోజూ నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కొత్త రైలు. విశాఖపట్నం - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ వేస్తున్నట్లు బడ్జెట్లో చెప్పారు. అయితే, ఈ రైలు ఇప్పటికే విశాఖ - చెన్నైల మధ్య ప్రత్యేక రైలుగా నడుస్తోంది. దానినే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. పారదీప్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ఇటువంటిదే. ఇప్పటికే పారదీప్ - శ్రీకాకుళంల మధ్య నడుస్తున్న రైలును విశాఖపట్నం వరకు పొడిగించి, కొత్త రైలు మంజూరు చేసినట్లు చూపించారు. మరో 6 రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించేవి ఉన్నాయి. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైలు, షాలిమార్ - చెన్నై ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్, జైపూర్ - మధురై, కమాఖ్య - బెంగళూరు ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లు, అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ), టాటానగర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లు రాష్ట్రం మీదుగా వెళ్తాయి. ఇవి మినహా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు బడ్జెట్లో ఒక్కటీ కనిపించలేదు. విజయవాడ నుంచి ముంబై, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక రైళ్లు, తిరుపతి- షిరిడి రైలు ఊసే లేదు. -
రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్
రైళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. ఇందులోభాగంగా తినడానికి సిద్ధంగా ఉన్న(రెడీ టు ఈట్) ఆహార పదార్థాలను రైళ్లలో అందించనున్నట్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ పార్లమెంట్లో వెల్లడించారు. నాణ్యత, భిన్నత్వం కోసం రైళ్లలో ‘రెడీ టు ఈట్’ ఆహార ఉత్పత్తులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక రైళ్లలో కేటరింగ్ సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మరో సంస్థతో తనిఖీలు(థర్డ్ పార్టీ ఆడిట్) నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ వ్యవస్థను రూపొందించనున్నట్లు ప్రతిపాదించారు. ఇందులోభాగంగా ఐవీఆర్ఎస్ విధానంలో ఆహార నాణ్యతపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే పద్ధతిని త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. శుభ్రత, రుచి విషయంలో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసినపక్షంలో సదరు విక్రయదారుపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టును రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎక్కడికక్కడ స్థానిక రుచులను అందించనున్నట్లు, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్లు స్వీకరించే సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా న్యూఢిల్లీ-అమృత్సర్, న్యూఢిల్లీ-జమ్మూతావి సెక్షన్లలో ఈ సేవలను త్వరలోనేఅమలు చేయనున్నట్లు ప్రకటించారు. -
రైల్వే బడ్జెట్ లో జిల్లాకు మళ్లీ మొండిచేయే..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా ప్రాజెక్టులు దక్కకపోగా మళ్లీ టికెట్ చార్జీల పెంపు ఉండవచ్చంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ చేసిన ప్రకటన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాకు సంబంధించిన కొత్త రైల్వే లైనులు, రైళ్ల స్టాపింగ్‌లు, కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రాకు పూర్తి అన్యాయం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం జరిగిందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఎప్పటి నుంచో ఈ ప్రాంతానికి రావాల్సిన నడికుడి - కాళహస్తి రైల్వేలైన్ ప్రస్తావన చేయకపోవడం బాధాకరమన్నారు. కడప - ఎర్రగుంట్ల రైల్వేలైన్‌తో పాటు ఏ ప్రాజెక్టుకు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆమోదం తెలపకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే మంత్రిలా బడ్జెట్ రూపొందించారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విజయవాడ - ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ మినహా ఏ రైళ్లు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ప్రస్తావించిన అంశాలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విశాఖపట్నం మెట్రోరైలు, విజయవాడ - తెనాలి - గుంటూరుకు మెట్రోరైలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే రాజధాని నుంచి హైదరాబాద్‌కు రాపిడ్ ఎక్స్‌ప్రెస్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాలను కనీసం బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇంత ఘోరమైన రైల్వే బడ్జెట్‌ను చూడలేదని చెప్పారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని, రైల్వే మంత్రి సదానంద గౌడ పూర్తి నిరాశ మిగిల్చారన్నారు. తాము రైల్వే మంత్రిని నెలరోజుల క్రితమే కలిసి ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతిపాదనలను వివరించినట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. మళ్లీ అన్యాయమే: కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి రైల్వే బడ్జెట్లో మళ్లీ జిల్లాకు అన్యాయమే జరిగింది. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే ప్రాజెక్టుకుగానీ, దొనకొండ- ఒంగోలు రైల్వే లైన్‌కు సంబంధించి ఆశించిన ప్రయోజనమేమీ లేదు. జిల్లా నుంచి సరుకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నా వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. రైళ్లల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఎక్కుతున్నా అదనపు రైళ్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం బుల్లెట్ రైళ్ల పేరుతో ధనవంతులకు సౌకర్యం కల్పించడం తప్ప పేదల గురించి పట్టించుకోవడం మానేశారు. రైల్వే బడ్జెట్ భేషుగ్గా ఉంది: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ భేషుగ్గా ఉంది. పారదర్శకతకు, అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యం. రైల్వేల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, యశ్వంతపూర్ - గుంటూరు డైలీ ప్యాసింజర్ రైలు, విశాఖ-చెన్నై వీక్లీ, సికింద్రాబాద్- చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కొత్త రైళ్ల ఏర్పాటు శుభసూచకం. మహిళా ప్రయాణికులకు అధిక భద్రత, డబ్లింగ్-ట్రిప్లింగ్, కొత్త రైళ్లకు అధిక ప్రాధాన్యత. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం పోస్టాఫీసుల ద్వారా కూడా రైలు టికెట్ల విక్రయాలు చేపట్టడం వంటి వాటివల్ల బడ్జెట్ సంతృప్తిగా ఉంది. జనరంజక బడ్జెట్: బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు రైల్వే బడ్జెట్ జనరంజకంగా ఉంది. ఒక వైపు ఆదాయం వంద రూపాయలు వస్తుంటే అందులో 90 రూపాయలు వ్యయం అవుతోంది. అందువల్ల కేవలం పదిరూపాయల్లోనే అభివృద్ధి చేపట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం సాహసోపేతంగా కొత్త ట్రాక్‌ల నిర్మాణానికి పూనుకోవడం ద్వారా సరుకు రవాణాను వేగవంతం చే సి తద్వారా రైల్వే సేవలను మరింత అభివృద్ధి చేయబోతోంది. -
రైలు రాలే!
నిజామాబాద్ అర్బన్: రైల్వే బడ్జెట్లో జిల్లాకు నిరాశ త ప్పలేదు. నిధులు, రైళ్లు ఏ మాత్రం కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జిల్లాకు రైల్వే బడ్జెట్లో మంచి ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఈ ప్రాంతంపై రైల్వే మంత్రి ఏ మాత్రం కనికరించలేదు. ఉన్నవాటికే నిధులు కేటాయించ లేదు. కొత్త పథకాల ఊసే లేకుండా పోయింది. నానాటికి రై ల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా, అందుకు అనుగుణంగా రైల్వే సేవలు, సౌకర్యలు విస్తరిస్తాయని భావించినవారికి అసంతృప్తే మిగిలింది. హామీల ప్రస్తావనేదీ! ఇంతకు ముందు ప్రకటించిన హామీల అమలు విషయాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావించే లేదు. జిల్లాలో ఆర్మూర్, ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయడానికి గతంలో కేంద్రం అనుమతి ఇచ్చింది. నిజామాబాద్-పెద్దపల్లి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. బోధన్-బీదర్ రైలు మార్గం గురించి ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డిలను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా మారుస్తామని ప్రకటించి ఎనిమిదేళ్లు గడిచింది. వీటిలో ఏ ఒక్కదానిపైనా రైల్వే మంత్రి స్పందించలే దు. ఒక్క కొత్త రైలు కూడా జిల్లాకు కేటాయించలేదు. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న ఈ జిల్లా వ్యా పారపరంగా వేరువేరు ప్రాంతాలకు మంచి ప్రయాణమార్గంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే సౌకర్యాలను పెంచవల్సిన అవసరం ఉంది. అయినా, గతంలోలాగే ఈసారి కూడా కొత్త పాసింజర్ రైళ్ల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్ ప్రస్తుత బడ్జెట్ కంటే మేలు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ 2014 వరకు పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించినా, ఈ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో నిధులు భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా ప్రజలు ఎదురుచూశారు. కాని వీటికి కేటాయింపు జరగలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వేప్రాజెక్టులను కేంద్రం పట్టించుకోకపోవడం నిరుత్సాహపరిచింది. ఆధునికీకరణ పనులు, నిధుల కేటా యింపు , రైళ్ల పొడగింపు, కొత్త రైళ్ల ఏర్పాటులో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చే అవసరం ఎం తైన ఉంది. కాని వీటిని రైల్వే బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. ఢిల్లీలో మకాం వేసినా నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కె.కవిత, బీబీ పాటిల్ రైల్వే బడ్జెట్లో జిల్లాకు సౌకర్యాలు, నిధులు కేటాయించాలని ఢిల్లీలో రైల్వే అధికారులను, మం త్రులను కలిసి విన్నవించారు. దాదాపు 15 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి శ్రమించారు. అయినా, రై ల్వేబడ్జెట్‌లో మాత్రం ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. వీరి విన్నపాలను కేంద్రం పట్టించుకోలేదు. కనీసం నిధులు, రైళ్లను కూడా కేటాయించలేదు. ఉత్త ర తెలంగాణ జిల్లాలన్నింటికీ నిరాశే మిగిలింది. -
‘సదా’ నిరాశే
కొత్తగూడెం : జిల్లా ప్రజల ఆశలపై రైల్వే బడ్జెట్ నీళ్లు చల్లింది. ఈ దఫా ఎలాగైనా జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని, కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం తో పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశించిన జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2012లో మంజూరైన కొవ్వూరు లైన్‌తోపాటు, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కీలకమైన సత్తుపల్లి లైన్‌కు క్లియరెన్స్ వస్తుందని ఆశ పడినప్పటికీ.. నిరాశే మిగిలింది. జిల్లాలో సింగరేణి గనులతో పేరెన్నిక కలిగిన కొత్తగూడెం కేంద్రంగా రైల్వే విస్తరణ చేయాల్సి ఉంది. అయితే సుమారు ఆరు దశాబ్దాలుగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)-కొవ్వూరు లైన్‌కు ఈ బడ్జెట్లో అసలు నిధులే కేటాయించకపోవడం గమనార్హం. 2012లో ఈ లైన్‌కు మంజూరు లభించినా.. నాటి నుంచి ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. ఈ లైన్ ఏర్పాటయితే సుమారు 100 గిరిజన గ్రామాలకు రైలు సౌకర్యం కలుగుతుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే 140 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశాలున్నాయి. ఇన్ని అవకాశాలున్న ఈ లైన్‌కు నిధులు మంజూరు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత లైన్లకు మాత్రమే పర్యవేక్షణ కమిటీ వేసిన సదానంద బడ్జెట్ అందరినీ నైరాశ్యంలోకి నెట్టివేసింది. సింగరేణికి తప్పని తిప్పలు.. పర్యావరణశాఖ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో సింగరేణి సంస్థ చేపట్టే నూతన ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గును రైలు మార్గం ద్వారానే తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీలలో ఉత్పత్తి చేసే బొగ్గు రవాణాకు కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ ముందుకొచ్చింది. ఈ లైన్‌కు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ లైన్ ఫైనల్ సర్వే కూడా పూర్తయింది. అయితే ప్రస్తుత బడ్జెట్లో కొత్తగూడెం - సత్తుపల్లి లైన్‌కు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సత్తుపల్లిలోని కొత్త ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గును ఎలా సరఫరా చేయాలనే విషయంపై సింగరేణి సందిగ ్ధంలో పడింది. ఉద్యోగులకూ ఊరట లేదు.. జిల్లాలో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉండగా మొత్తం 1500 మంది వరకు రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు 7వ పే రివిజన్ కమిటీ కోసం ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమైనా తమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 7వ పే రివిజన్‌కు అనుమతి ఇస్తుందని భావించిన ఉద్యోగులకు ఈ బడ్జెట్లోనూ నిరాశే ఎదురైంది. -
జిల్లాలో ఆగని ‘గౌడ’ రైలు
కర్నూలు (రాజ్‌విహార్) : ఈ సారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినా.. రైల్వే మంత్రిత్వ శాఖను దక్కించుకోలేకపోయింది. రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి రాయితీలు సాధించలేకపోయింది. కర్నూలు జిల్లా ప్రజలకు ఎప్పటిలాగే నిరాశే మిగిలింది. ఎన్నో ఆశల నడుమ ఊరించిన ఎన్డీఏ తొలి రైల్వే బడ్జెట్ ఊహలకు అందనిరీతిలో ఉసూరుమనిపించింది. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం ప్రకటించిన ఈ బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. కొత్త ప్రాజెక్టుల ఊసు అసలు లేకపోగా.. పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావనే ఎత్తలేదు. గత రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వర్క్‌షాపు నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. దశాబ్దాల కాలంగా డిమాండ్‌లో ఉన్న కర్నూలు- మంత్రాలయం రైలు మార్గానికి పట్టిన గ్రహణం వీడలేదు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న 29 ప్రధాన ప్రాజెక్టుల స్థితి గతులను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయడం తప్ప బడ్జెట్‌తో ఏమీ ఒరగలేదని చెప్పవచ్చు. ప్రతిపాదనలకు రెడ్ సిగ్నల్.. కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్ రీహామిటిటేషన్ వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు 2013 బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు మూడు సార్లు నగర శివారులోని పంచలింగాల వద్ద స్థల పరిశీలన చేసినా సేకరణ జరగలేదు. దీనికి రూ. 250 కోట్లు కావాలని అధికారులు అంటున్నా ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. దూపాడు వద్ద ట్రైన్ మెయింటెనెన్స్ (నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని నాటి మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2 కోట్లు కావాల్సి ఉన్నా ఎలాంటి కేటాయింపుల్లేవు. మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త లైను కోసం గతంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు సర్వే పనులకు గ్రీన్ లభించింది. రెండు సార్లు సర్వే చేసి నిధులు దుర్వినియోగపర్చారు తప్ప ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈసారి కూడా ఆ లైను ఊసేలేదు. ఎర్రగుంట్ల-నంద్యాల లైను పెండింగ్ పనుల ప్రస్తావన లేదు. గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా పురోగతి మాటేలేదు. సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణకు నిధుల్లేవు. హొస్పేట - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడపాలనే డిమాండ్‌కు మోక్షం లభించలేదు. కాచిగూడ - బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, డోన్, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. అయితే గుంటూరు వరకు రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. విజయవాడ వరకు కనీసం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉన్నా ప్రస్తావన లేదు. చెన్నై - హైదరాబాద్ మధ్య హై స్పీడు ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతామని ప్రకటించినా.. ఏ మార్గాన నడుపుతారో స్పష్టం చేయలేదు. బెంగళూరు నుంచి కాచిగూడకు ప్యాసింజరు రైలు ప్రకటించినా కర్నూలు మీదుగా వస్తుందో లేదో తెలియదు. -
‘సదా’ నిరాశ
సాక్షి, మంచిర్యాల : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఎప్పటిలాగే జిల్లావాసులకు నిరాశ మిగిల్చింది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్న ప్రజల కలలకు గండిపడింది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును హై స్పీడు రైలుగా మారుస్తామన్న నిర్ణయం తప్ప మరేదీ జిల్లాకు దక్కలేదు. పెండిం గ్ ప్రాజెక్టులు, నూతన రైల్వేలైన్ల ప్రతి పాదనలపై ఇరు రాష్ట్రాల కోసం వేసిన కమిటీయే ఫైనల్ అని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. దీంతో జిల్లాలోని ప్రతిపాదిత ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, స్టేషన్ల నవీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదిలాబాద్-నిర్మల్, ఆదిలాబాద్-మంచిర్యాల్ వయా ఉట్నూర్ రైల్వే లైన్ల సర్వేపై ఉమ్మడి కమిటీ తరువాతే స్పష్టత రానుంది. దీంతోపాటు ఎంపీలు గొడం నగేశ్, బాల్క సుమన్‌ల ప్రతిపాదనలు బుట్టదాఖలే అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్- ఆదిలాబాద్ ఇంటర్సిటీ కేటాయింపు, ఖాజీపేట్-బల్లార్ష రూటులోని పలు రైళ్ల బోగీలకు ఏసీ బోగీలు అమర్చేందుకు స్పష్టత రాలేదు. సికింద్రబాద్ నుంచి హజ్రత్ నిజామొద్దీన్(న్యూఢిల్లీ)ల మధ్య ప్రీమియం రైలు ఏర్పాటు అంశం జిల్లావాసులకు ఊరట కలిగించేదే అయినప్పటికి, జిల్లాలోని ఏయే స్టేషన్లలో ఈ రైలుకు నిలుపుదల(హాల్ట్) ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.ప్రధాన రైల్వే స్టేషన్లలో సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నప్పటికి జిల్లాలో ఆ సౌలభ్యం పొందగల స్టేషన్లు ఏవి లేవు. ఖాజీపేట-కాగజ్‌నగర్‌ల మధ్య మరిన్ని రైళ్లు, మరిన్ని బోగీలు ఉంటాయనే ఆశతో రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూసిన జిల్లా వాసులకు మోడీ మార్కు బడ్జెట్ రుచించలేదు. ఎంపీలు విన్నవించినా.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కాబట్టి నిధులు కేటాయిస్తారని భావించినప్పటికి సదానంద గౌడ నిరాశే మిగిల్చారు. ఆదిలాబాద్-గడ్చందూర్ రైలు సర్వే విషయంలోనూ మొండిచేయి చూపారు. మంచిర్యాల, బాసర రైల్వే స్టేషన్లలో ఔట్ పేషెంట్ డిస్పెన్సరీ ఏర్పాటుపై నిరాశే మిగిల్చారు. జిల్లాలో విశాలంగా విస్తరించి ఉన్న తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించేందుకు ఆదిలాబాద్-మంచిర్యాల వయా ఉట్నూరు రైలు లైను ఏర్పాటుతో, జిల్లాలోని ప్రజలకు రవాణా మార్గం సుగమమం అయ్యేది. దీనిపై బడ్జెట్లో ప్రస్తావించక పోవడంపై జిల్లా వాసులు నిరాశ చెందుతున్నారు. భాగ్యనగర్, సింగరేణి, రామగిరి, తెలంగాణ రైళ్లలో ఏసీ కోచ్‌లతోపాటు, అదనపు బోగీల ప్రస్తావనే బడ్జెట్లో లేదు. ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రికి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వినతి పత్రం సమర్పించినప్పటికి ఫలితం లేదు. నవజీవన్, దర్బాంగ, జీటీ ఎక్స్‌ప్రెస్‌లను బెల్లంపల్లిలో హాల్ట్ చేయాలనే డిమాండును పట్టించుకోలేదు. ఆదిలాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైను సర్వే కోసం ప్రతి బడ్జెట్‌లోను ఆశగా ఎదురు చూస్తున్న పశ్చిమ జిల్లా ప్రజలకు ఈసారి యథావిధిగా నిరాశే మిగల్చడం గమనార్హం. సింగిల్ లైన్ వల్ల అవస్థలు ఎదురవుతున్న హైదరాబాద్-ఆదిలాబాద్ డబ్లింగ్ పనులకు నిధుల కేటాయింపు లేనే లేదు. ఈ విషయమై ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ కేంద్ర మంత్రికి విన్నవించినా ఫలితం శూన్యం. ఈ సారైనా నిధులు విడుదల చేస్తే, ఈ లైను పనుల్లో పురోగతి ఉంటుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. -
ఇక హైస్పీడ్‌లో రైల్వేల అభివృద్ధి..!
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ అభివృద్ధిని ప్రేరేపించేదిగా ఉందని వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వ్యాఖ్యానించాయి. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై దృష్టిపెట్టడంతో మౌలిక సౌకర్యాలు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపాయి. ‘భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కావలసిన నిధుల్లో భారీ మొత్తాన్ని పీపీపీ మార్గం ద్వారా సమీకరిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను మేం స్వాగతిస్తున్నాం. ఈ ప్రతిపాదనతో నిధుల కొరతను అధిగమించవచ్చు. రైల్వేల ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు...’ అని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సరకు రవాణా టెర్మినళ్లను, లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతామని రైల్వే మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. హైస్పీడ్ రైళ్లతో సహా భారీ పెట్టుబడులు అవసరమైన ప్రాజెక్టులకు నిధులను ప్రధానంగా పీపీపీలోనే సమకూరుస్తామని చెప్పారు. ఎఫ్‌డీఐ అనుమతిపై హర్షం... మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల్లో ఎఫ్‌డీఐని అనుమతించే యోచన హర్షణీయమని అల్స్టోమ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా ఎండీ భరత్ సల్హోత్రా అన్నారు. అరకొర నిధులతో సతమతమవుతున్న భారతీయ రైల్వేలకు ఈ నిర్ణయంతో పుష్కల ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశీయ రైల్వే రంగంలో ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలను త్వరగా ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌డీఐలు దోహదపడతాయని అన్నారు. బడ్జెట్లో చేసిన ప్రకటనలు రైల్వే మౌలిక సౌకర్యాల మెరుగుకు, ఉపాధి అవకాశాల కల్పనకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపురియా పేర్కొన్నారు. ‘ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచారు. అధికార దాహంతో కూడిన పథకాలేవీ లేవు. మార్కెట్లు ఇంతకంటే ఏం ఎక్కువ ఆశించాయి?...’ అని మహింద్రా అండ్ మహింద్రా సీఎండీ ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. పెట్టుబడుల ప్రవాహం... పీపీపీ పద్ధతిని పాటించడం వల్ల ప్రైవేటు, విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ చెప్పారు. మోడీ సారథ్యంలోని ప్రభుత్వానికి అత్యంత విశ్వసనీయత ఉందని అన్నారు. కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియతో రైల్వే రంగం నిజమైన జీవన రేఖగా ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడ్డారు. పీపీపీ పద్ధతిలో రేవులను అనుసంధానిస్తామనీ, ప్రైవేట్ పార్టీల ద్వారా పార్శిల్ వ్యాన్లు, ర్యాకులను సమీకరిస్తామనీ కూడా రైల్వే మంత్రి వెల్లడించారు. రైల్వేల సామర్థ్యం మెరుగుపడితే రవాణా వ్యయం తగ్గుతుందనీ, తద్వారా ఎగుమతిదారులకు మేలు జరుగుతుందనీ ఈఈపీసీ ఇండియా చైర్మన్ అనుపమ్ షా తెలిపారు. ఉట్టిపడిన వాస్తవికత... కీలకమైన రైల్వే రంగంలో మౌలిక సౌకర్యాలను, సామర్థ్యాన్నీ పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను రైల్వే బడ్జెట్లో విస్పష్టంగా ప్రకటించారని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ ఎస్.శ్రీరామ్ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంపై సీఐఐ హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు. వాస్తవిక దృక్పథంతో కూడిన బడ్జెట్‌ను మంత్రి సమర్పించారని సీఐఐ అధ్యక్ష పదవికి ఎన్నికైన సుమీత్ మజుందార్ చెప్పారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించేవిగా ప్రాజెక్టులను రూపొందిస్తే పీపీపీ, ఎఫ్‌డీఐ మార్గాల్లో నిధులు సమకూరుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆరు కొత్త రైళ్లను మంజూరు చేయడంపై సీఐఐ చైర్మన్ (ఆంధ్ర, తెలంగాణ) సురేశ్ చిట్టూరి సంతోషం వ్యక్తంచేశారు. ఉక్కు వినియోగం పెరుగుతుంది.. రైల్వే ట్రాకుల డబ్లింగ్, ట్రిప్లింగ్, స్టేషన్ల ఆధునీకరణ, మీటర్ గేజ్ పట్టాలను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం వంటి చర్యలతో ఉక్కు వినియోగం పెరగనుందని సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ, ఐటీ, వివిధ ప్రాజెక్టుల అమలుపై బడ్జెట్లో దృష్టి సారించారనీ, దేశీయ రైల్వేల పనితీరు మెరుగుకు దోహదపడుతుందనీ భారతీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎం.రఫీక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. గేజ్ మార్పిడి, కొత్త పట్టాల ఏర్పాటుతో రైల్వేల సామర్థ్యం పెరుగుతుందని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ వినీత్ అగర్వాల్ చెప్పారు. -
ద లాల్ సిగ్నల్
నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటితమయ్యాక తొలిసారి స్టాక్ మార్కెట్లు కంగుతిన్నాయ్. లోక్‌సభలో సదానంద గౌడ ప్రకటించిన రైల్వే బడ్జెట్ నిరాశను మిగల్చడంతో ఇన్వెస్టర్లలో ఉన్నట్టుండి భయాలు వ్యాపించాయ్. మొట్టమొదటిసారిగా ఒక బీజేపీ మంత్రి ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఇన్వెస్టర్లు ప్రసంగం మొదట్లోనే నిరుత్సాహానికి లోనయ్యారు. దేశీయ రైల్వే వ్యవస్థ ఎదుర్కొంటున్న నిధులలేమిని నొక్కిచెప్పిన మంత్రి ప్రసంగం చివర్లో ఇందుకు పలు మార్గాలను ప్రకటించినప్పటికీ మార్కెట్లకు రుచించలేదు. ప్రధానంగా ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లనూ ప్రతిపాదించకపోగా, ఇప్పటికే పలు సమస్యలతో కుదేలైన ప్రాజెక్ట్‌లను ఎలా పూర్తిచేసేదీ స్పష్టం చేయకపోవడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మరోవైపు మార్కెట్‌ను ఉత్సాహపర్చే పెద్ద ప్రకటనలూ లేకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి వార్షిక సాధారణ బడ్జెట్ సైతం ఇదే రీతిలో ఉండొచ్చునన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో అన్నివైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ ఒక దశలో 610 పాయింట్లు దిగజారింది. నిజానికి తొలుత 90 పాయింట్ల వరకూ లాభపడి కొత్త గరిష్టం 26,190ను తాకింది. అయితే రైల్వే బడ్జెట్ వెలువడ్డాక పతనబాట పట్టి 25,495 వద్ద కనిష్టాన్ని చేరింది. చివరికి 518 పాయింట్లు కోల్పోయి 25,582 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం ఇదే బాటలో 7,809 వద్ద కొత్త రికార్డును అందుకున్నప్పటికీ ఇంట్రాడేలో ఆ స్థాయి నుంచి 7,596కు పడిపోయింది. ట్రేడింగ్ ముగిసేసరికి నికరంగా 164 పాయింట్లు పోగొట్టుకుని 7,623 వద్ద నిలిచింది. ఇంతక్రితం మార్కెట్లు 2013 సెప్టెంబర్ 3న మాత్రమే ఈ స్థాయిలో పతనమయ్యాయి. అప్పట్లో సెన్సెక్స్ 651, నిఫ్టీ 299 పాయింట్లు చొప్పున దిగజారాయి. బ్లూచిప్స్ బోర్లా సెన్సెక్స్, నిఫ్టీలో భాగమైన సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మాత్రమే అదికూడా నామమాత్రంగా లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక దిగ్గజాలు భెల్, ఎన్టీపీసీ, టాటా పవర్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, సెసాస్టెరిలైట్, ఆర్ఐఎల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా 8-2% మధ్య పతనమయ్యాయి. రియల్టీ నేలచూపులు రియల్టీ షేర్లు కోల్టేపాటిల్, యూనిటెక్, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్ మిల్, శోభా, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీబీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 13-4.5% మధ్య కుప్పకూలాయి. విద్యుత్ షాక్ విద్యుత్ రంగ షేర్లు అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేపీ పవర్, సీఈఎస్సీ, ఏబీబీ, సీమెన్స్, రిలయన్స్ పవర్, ఎన్‌హెచ్‌పీసీ 8 శాతం స్థాయిలో నీరసించాయి. బీఎస్ఈ-500 విలవిల ట్రేడైన షేర్లలో ఏకంగా 2,234 తిరోగమిస్తే, కేవలం 770 లాభపడ్డాయి. బీఎస్ఈ-500లో జిందాల్ స్టెయిన్లెస్, హెచ్ఎంటీ, ఉత్తమ్ గాల్వా, జేపీ అసోసియేట్స్, ఇండియా సిమెంట్స్, గుజరాత్ గ్యాస్, ఐఎఫ్సీఐ, ధనలక్ష్మీ బ్యాంక్, మహీంద్రా సీఐఈ, ఎంఎంటీసీ, ఎంటీఎన్ఎల్, టీబీజెడ్, సిండికేట్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, ఎస్కార్ట్స్, జైన్ ఇరిగేషన్ 13-8% మధ్య దిగజారాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 423 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. -
నిధుల ఊసే లేదు
కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ యూపీఏ తరహాలో తమిళనాడు మీద సవతి తల్లి ప్రేమ చూపించారు. దక్షిణాది జిల్లాలకు పూర్తిగా హ్యాండిచ్చిన సదానంద, చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు మాత్రం ఐదు రైళ్లను కంటి తుడుపు చర్యగా ప్రకటించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల ఊసే లేని దృష్ట్యా, తమిళనాట రైల్వే బడ్జెట్‌కు వ్యతిరేకంగా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని పెండింగ్, అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సుమారు పది వేల కోట్ల మేరకు నిధులు అవసరం. కొన్నేళ్ల క్రితం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండడంతో ఏటా అంచనా వ్యయం పెరుగుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీఏ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించింది. ప్రస్తుతం అధికారం మారడంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంతో సామరస్య పూర్వంగా మెలిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసక్తి చూపినా కేంద్రం వైఖరి మాత్రం మారలేదు. హ్యాండిచ్చిన సదానంద: తమిళనాడులో అనేక రైల్వే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధానంగా చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, దక్షిణాది జిల్లాలోని పలు ప్రధాన నగరాల్ని కలుపుతూ కొత్త రైళ్ల సేవలకు ప్రతిపాదనలున్నారుు. అయితే, తమిళనాడుకు సదానంద హ్యాండిచ్చారు. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలు కూడా ప్రకటించ లేదు. ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ చేసిన విజ్ఞప్తుల్ని సైతం సదానంద ఖాతరు చేయలేదు. అమల్లో ఉన్న పనులకు కనీసం నిధుల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో ఆ పనులు పూర్తవడానికి మరెన్ని నెలలు పట్టనుందోనని ప్రశ్నార్థకంగా మారుతోంది. నిరాశే : విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్, మార్గాల్లో జరుగుతున్న పనులకు నిధుల ఊసెత్తక పోవడం గమనార్హం. అలాగే, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటన వెలువడుతుందని ఎదురు చూసిన వాళ్లకు చివరకు మిగిలింది నిరాశే. అయితే, మౌళిక వసతుల కల్పం, రైల్వే ప్రయాణికుల భద్రత, మహిళా భద్రత ప్రకటనలు మాత్రం స్వాగతిస్తున్నారు. కంటి తుడుపు చర్య : తమిళనాడు ప్రజలకు హ్యాండిచ్చిన సదానంద గౌడ కంటి తుడుపు చర్యగా కొన్ని రైళ్లను ప్రకటించారు. ఇవన్నీ చెన్నై నుంచి బయలు దేరే రైళ్లే. దక్షిణాదిలోని మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరుచ్చి నగరాలకు మిగిలింది నిరాశే. అరుుతే చెన్నై - హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు సేవలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సావల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఐదు రైళ్లు : పార్లమెంట్లో ప్రకటించిన రైల్వే బడ్జెట్ మేరకు ఐదు రైళ్ల వివరాలు. మదురై - జైపూర్ (వారంతాపు ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్‌ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు రైలు సేవ),- చెన్నై - విశాఖ (వారంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత). సర్వత్రా విమర్శ : ఈ బడ్జెట్‌ను తమిళనాడులోని రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తమిళ ప్రజల్ని పూర్తిగా విస్మరించారని పీఎంకే ఎంపీ అన్భుమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైళ్లను తన సొంత రాష్ట్రానికి మంత్రి తరలించుకున్నారని సీపీఎం ఎంపీ రంగరాజన్ మండిపడ్డారు. తమిళ ప్రజలకు మొండి చేయి మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాటనే మళ్లీ మళ్లీ పాడినట్టు, చివరకు తమిళ ప్రజల నెత్తిన టోపీ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ సుదర్శన నాచ్చియప్పన్ పేర్కొన్నారు. తమిళుల ఆశల్ని, విజ్ఞప్తులపై మోడీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండి పడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ సైతం రైల్వే బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. ఆహ్వానం : సీఎం జయలలిత మాత్రం రైల్వే బడ్జెట్‌ను ఆహ్వానించారు. భవిష్యత్తును కాంక్షిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టుందన్నారు. స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్ల సేవలు, మహిళలకు భద్రత, రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రకటనలు సంతృప్తినిచ్చాయన్నారు. ముంబె తర్వాత బుల్లెట్ రైలు సేవల ప్రాధాన్యతలో తమిళనాడుకు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకటించినవి మదురై - జైపూర్ (వారాంతపు ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్‌ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు), చెన్నై - విశాఖ (వారాంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ). వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సవాల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఆశించినవి చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలైనా వస్తుందని ఆశించారు. విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్ మార్గాల పనులకు నిధులివ్వలేదు. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటిస్తారని ఆశించినా జరగలేదు. -
ఈ సారీ ఆగలేదు!
తాండూరు: ఈ సారి కూడా తాండూరు వాసులకు నిరాశే మిగిలింది. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తాండూరుకు కొత్త హాల్టింగ్ గానీ, పొడగింపునకు గానీ అవకాశం దక్కలేదు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై మోడీ సర్కారు దృష్టి సారిస్తుందని ఆశపడిన ప్రయాణికులకు భంగపాటు తప్పలేదు. తాండూరు మీదుగా నడిచే రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని స్థానిక వ్యాపారులు, ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ప్రతి బడ్జెట్ సమయంలోనూ ఎదురుచూశారు. కర్ణాటకలోని చిత్తాపూర్ చిన్న రైల్వేస్టేషన్. ఇక్కడ గరీభ్థ్ ్రఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఉంది. ఈ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు రైల్వేకు రూ.50వేల వరకు టిక్కెట్ విక్రయంపై ఆదాయం వస్తుంది. రోజుకు సుమారు 1500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ సేడంలో ఆగుతుంది. ఇక్కడ రోజుకు 2500 ప్రయాణికులు రాకపోకలు సాగి స్తారు. సుమారు రూ.లక్ష ఆదాయం వస్తుంది. కానీ ఈ రెండు రైల్వేస్టేషన్ల కన్నా తాండూరు పెద్దది. రోజుకు సుమారు ఐదు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు రోజుకు రూ.రెండు లక్షల ఆదాయం వస్తుంది. మోడీ సర్కారు ఈ బడ్జెట్లో గరీభ్థ్,్ర రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు తాండూరులో హాల్టింగ్ ఇస్తుందని ప్రయాణికుల ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. ఇక ఉదయం పది గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్‌కు ‘హుస్సేన్‌సాగర్’ రైలు ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లడానికి సాయంత్రం నాలుగు గంటల వరకు రైలు లేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల మధ్య హైదరాబాద్ వెళ్లడానికి వికారాబాద్ వరకు నడుస్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని ఇక్కడి ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రైలు పొడిగింపునకు, పద్మావతి ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్‌కు రైల్వే బడ్జెట్లో అవకాశం దక్కపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను నిరాశపరిచింది. వేల కోట్లు ఖర్చుపెట్టి బుల్లెట్ రైలును నడపడం వల్ల కొందరికే ప్రయోజనం కలుగుతుంది తప్పా.. మధ్య తరగతికి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీదర్ -ముంబయ్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించినా.. అది రూట్లో నడుస్తుందన్న దానిపై స్పష్టత లేదు. -
‘తెలుగు’ రైలు కూతేది!
సాక్షి ముంబై: ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ముంబైలోని తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం ముంబై-కాజీపేట(వరంగల్) వయా బల్లార్షా వారానికి ఒకసారి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. దీంతో ముఖ్యంగా తెలంగాణకు చెందిన అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీంతోపాటు అహ్మద్‌బాద్-చెన్నై వయా వసాయి రోడ్డు మీదుగా వారానికి రెండు సార్లు కొత్త రైలును ప్రకటించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం మీదుగా వెళ్లనుంది. రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు ఈ రెండు రైళ్లు మినహా బడ్జెట్లో పెద్దగా ఒరిగిందేమీలేదని చెప్పవచ్చు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న తొలిసారి బడ్జెట్‌పై ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసించే తెలుగు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు రైల్వేబడ్జెట్‌పై నెలకొన్న ఉత్కంఠతకు మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి తెరదింపారు. నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, గుంతకల్ వైపు కొత్త రైలు లేదా కనీసం పొడగింపు తదితరాలేమైనా ఉంటాయని అందరూ భావించారు. అయితే కేవలం తెలంగాణ ప్రాంతానికి ఒక రైలు మాత్రమే ప్రకటించి తెలుగువారిని తీవ్ర నిరాశకు గురిచేశారు. పాత డిమాండ్‌కు మోక్షం...! బల్లార్షా లేదా కాజీపేట మీదుగా రైలును నడపాలని అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కాని ఈ మార్గం అనుకూలంగా లేకపోవడం, సెంట్రల్, సౌత్ సెంట్రల్ రైల్వేల పరిధులు తదితరాల దృష్ట్యా ఈ డిమాండ్ ఇన్నేళ్లుగా తెరపైకి రాలేదు. కాని సెంట్రల్ రైల్వేపరిధి బల్లార్షా తర్వాత చిన్న రైల్వేస్టేషన్ మానిక్‌ఘర్ వరకు ఉండగా సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధి కాగజ్‌నగర్ వరకు ఉంది. అయితే సెంట్రల్, సౌత్ సెంట్రల్రైల్వే పరిధిల కారణంగా ఈ బోగీని బల్లార్షా రైల్వేస్టేషన్ వరకే పరిమితం చేశారు. అదే విధంగా ముంబై-నాగపూర్ రైలును గోండియా వరకు పొడగించారు. ప్రస్తుతం బల్లార్షా వరకు సుమారు మూడు బోగీలను సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌తో వర్దా రైల్వేస్టేషన్లో జోడిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ బల్లార్షా నుంచి ముంబై వెళ్లే ఈ బోగీల్లో సుమారు ఆరు టికెట్లు సిర్పూర్కాగజ్నగర్కు కోటా ఉంది. అయితే ఈ బోగీలను కనీసం మంచిర్యాల వరకు పొడగించాలని లేదా మంచిర్యాల నుంచి వయా కాజీపేట మీదుగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కనీసం ఒక బోగీ జోడించాలన్న డిమాండ్లు స్థానికులు చేసేవారు. కాని మార్గాలు వేర్వేరుగా ఉండడంతో పెద్దగా ఎవరూ వీరి డిమాండ్లపై శ్రద్ధ చూపలేదు. కాని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మార్గంపై కొత్త రైలును ప్రకటించడంతో సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొత్తమార్గాలు... రాష్ట్రంలో కొత్త మార్గాల సర్వేలు చేయనున్నట్టు కూడా ఈ రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ముఖ్యంగా వీటిలో ఔరంగాబాద్-చాలిస్గావ్, షోలాపూర్ తుల్జాపూర్లున్నాయి. అదేవిధంగా డబ్లింగ్, మూడవ, నాల్గవ ట్రాక్‌ల పనులకు కూడా ప్రాధాన్యమిచ్చారు. వీటిలో కసారా-ఇగత్పురి, కర్జత్-లోనవాలాల మధ్య నాల్గవ ట్రాక్, భూసవల్-బడ్నేరా-వర్దా, భూసవల్-ఇటరసీల మధ్య మూడవ ట్రాక్‌ల నిర్మాణాలున్నాయి. రాష్ర్టం మీదుగా వెళ్లే కొత్త రైళ్లు ఇవే.. జనసాధారణ్ రైళ్లు .. ముంబై-జయంగర్ ముంబై-గోరఖ్‌పూర్ ప్రీమియం రైళ్లు: ముంబెసైంట్రల్ - న్యూఢిల్లీ ఏసీ రైళ్లు: లోకమాన్యతిలక్ టెర్మినస్ (కుర్లా)-లక్నో (వీక్లీ) నాగ పూర్-పుణే (వారానికి ఒకసారి) పుణే-నిజాముద్దీన్ (వారానికి ఒకసారి) నాగపూర్-అమృతసర్ (వారానికి ఒకసారి) ఎక్స్‌ప్రెస్ రైళ్లు: ముంబై-కాజీపేట వయా మంచిర్యాల (వీక్లీ) ముంబై-పలితనా (వారానికి ఒకసారి) ముంబై-బీదర్ (వీక్లీ) కుర్లా-ముంబై)-అజమ్గడ్ (వీక్లీ) బాంద్రా-జైపూర్ వయా నగ్డా, కోట (వీక్లీ) అహ్మదాబాద్-చెన్నై వయా వసాయిరోడ్డు (వారానికి రెండు సార్లు) -
బుల్లెట్ రైలు వచ్చేస్తుందోచ్!
-
సంస్కరణల కూత