రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక | YSR congress party MPS ys avinash reddy, Butta renuka meets sadananda gouda | Sakshi
Sakshi News home page

రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక

Published Tue, Jul 1 2014 10:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక

రైల్వేమంత్రిని కలిసిన ఎంపీలు అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక మంగళవారం కలిశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కడప, కర్నూలు జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని వారు ఈ సందర్బంగా రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా  పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై ఏడో తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎనిమిదో తేదీన రైల్వే బడ్జెట్ను రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు ...సదానంద గౌడను కలిసి జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భేటీ అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్ల, నంద్యాల, కడప, బెంగళూరు రైల్వే మార్గాలను పునరుద్దరించాలని కోరామన్నారు. హైదరాబాద్-డోన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ను కడప వరకూ పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement