Butta Renuka
-
అక్రమ అరెస్టులపై బుట్టా రేణుక ఫైర్
-
నేడు నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక గురువారం ఉదయం 9.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ నాయకులు కోరారు. రేపు నామినేషన్ వేయనున్న సతీష్ కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న డా.ఆదిమూలపు సతీష్ రేపు(శుక్రవారం)నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు చిల్డ్రన్ పార్క్(ఎస్వీ కాంప్లెక్స్) దగ్గరకు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అక్కడి నుంచి వెళ్లి కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
జగన్ అంటే జనం.. జనం అంటే జగన్.. వై నాట్ 175..
-
సీఎం జగన్ గురించి బుట్టా రేణుక అదిరిపోయే స్పీచ్
-
గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను పట్టించుకోలేదు: బుట్టారేణుక
-
వైఎస్సార్సీపీ గొప్పతనం గురించి బుట్టా రేణుక ప్రసంగం
-
దళితులను గత ప్రభుత్వం మోసం చేసింది: బుట్టా రేణుక
-
ప్రతిపక్షం విమర్శలు అర్థరహితం
-
'అందుకే వికేంద్రీకరణ దిశగా అడుగులు'
సాక్షి, తాడేపల్లి : 'రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం' అనే అంశంపై వైసీపీ చేనేత విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి వైఎస్పార్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాలు నుంచి చేనేత వర్గం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'రైతు అన్నం పెడితే.. నాగరికత నేర్పిన వారు చేనేతలు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేతల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. నాడు దివంగత సీఎం వైఎస్ ఆర్ విద్య, వైద్యం పై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం మగ్గం కార్మికుల కుటుంబానికి రూ. 24 వేలు అందించి సీఎం జగన్ వారికి అండగా నిలిచారు. అర్హతలు సడలించి ఆరోగ్యశ్రీ పథకం కింద 2 వేలుపైగా రోగాలకు ఉచితంగా చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ వెనుకబడిన వర్గాలకు మేలు చేకూరుస్తుంది. వీలైనంత ఎక్కువ మందికి, అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. గత ప్రభుత్వం రూ. 3 లక్షలు 60 వేల కోట్లు అప్పులు చేసి పెట్టింది. ఆర్ధిక పరిస్థితి గాడిన పెట్టె దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో మీడియా కంటే..సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజధాని పేరుతో బినామీ కంపెనీలతో కలిసి చంద్రబాబు అమరావతిని దోచుకున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి పేరుతో ఒక భ్రమ సృష్టించారు. ఆయన కుమారుడు లోకేష్ ను గత ఎన్నికల్లో రాజధాని ప్రాంత ప్రజలు దారుణంగా ఓడించారు. రాజధాని పేరుతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష తొమ్మిది వేల కోట్లు కేటాయించాలి. ఇది ఇప్పట్లో సాధ్యం కాదు.. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి. మూడు ప్రాంతాలు అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ నడుం బిగించారు. విశాఖపట్నం అంటే.. ఐఏఎస్ అధికారులు అంతా సమ్మతంగా ఉన్నారు. చేనేతలకు మరింత అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని' పేర్కొన్నారు. (రహస్యాలు లేవు.. ప్రజలకు అన్నీ తెలుసు: సజ్జల) కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. చేనేతలు అంటే చంద్రబాబు నిర్లక్ష్యం ఎక్కువని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత కార్మికులు 13 లక్షలు 50 వేల మంది ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి చేనేతకు 3శాతం అంటే 428 కోట్లు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలకు కేంద్రం కేటాయించదని గుర్తుచేశారు. అయితే ఏపీలో మాత్రం సీఎం జగన్ ఒక నేతన్న నేస్తం కింద రూ. 180 కోట్లు కేటాయించి చేనేతలు పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్నారని అభిప్రాయపడ్డారు. వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో చేనేతలకు 25 మోసపూరిత హామీలు ఇచ్చి టీడీపీ మోసం చేసిందని, అలాగే రూ. వెయ్యికోట్ల రూపాయలు చేనేతలకు ఇస్తామని చెప్పి మాట తప్పారని వెల్లడించారు. చేనేత సహకార సొసైటీలను మరింత బలోపేతం చేయాలని, మగ్గం నేసే ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24వేలు అందచేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు.(విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) బుట్టా రేణుక మాట్లాడుతూ.. వికేంద్రీకరణ వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయం ప్రస్తావించిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేనేత హస్తం కింద 360 డిగ్రీల కోణంలో మ్యానిఫెస్టో రూపకల్పన చేసి నవరత్నాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలంటే లక్షల కోట్లు కావాలని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజధాని ప్రాంత ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు. -
బాబు నమ్మించి మోసం చేశారు: బుట్టా రేణుక
మంగళగిరి: రాష్ట్రంలోని చేనేతలను నమ్మించి మోసగించిన ఘనత చంద్రబాబుదేనని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ధ్వజమెత్తారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం చేనేత మహిళలను మభ్యపెట్టి మోసం చేసి అవమానించిన చంద్రబాబుకు రాష్ట్రంలోని నేతన్నలంతా తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత, చేతివృత్తుల సంఘాల నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించేలా ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎంత చెప్పినా బాబు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారంటే ఎంత నష్టం జరిగినా నిలబెట్టుకుంటారన్నారు. బీసీలకు 41 సీట్లు ఇవ్వడంతో పాటు తనకు ఇచ్చిన కర్నూలు ఎంపీ సీటు తాను పార్టీ మారినా మరో బీసీ పద్మశాలీయులకే ఇచ్చారు కానీ బాబులా మోసం చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలను మోసం చేసిన చంద్రబాబు, లోకేష్‌లకు బీసీలంతా ఐక్యంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచి మంగళగిరిలో చరిత్ర సృష్టించాలన్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పరిశ్రమ అభివృద్ధితో పాటు స్వర్ణకారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు నేత సంఘాల నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలైన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలను పిలిచి టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు. నేడు సంఘాల నేతలను గంటల తరబడి పడిగాపులు కాయించి అవమానించి చివరకు తన కుమారుడికి టిక్కెట్ ఇచ్చి బీసీలను అగౌరవపరచిన చంద్రబాబుకు బీసీల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నేత దామర్ల కుబేరస్వామి, కాండ్రు శ్రీనివాసరావు, మాచర్ల సుధాకర్, దామర్ల ఉమామహేశ్వరరావు, ప్రగడ ఆదిసుదర్శనరావు, చింతక్రింది సాంబశివరావు, చింతకింది కనకయ్య, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు..అదే జోరు
సాక్షి, కర్నూలు : రాష్ట్ర తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కర్నూలులో ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కర్నూలు లోక్‌సభ స్థానానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థి హెచ్.సీతారామిరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కర్నూలు లోక్‌సభ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మంత్రాలయం అసెంబ్లీ సెగ్మెంట్ కలిసింది. డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ కర్నూలు నుంచి విడిపోయి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైంది. అంతకుముందు రెండుసార్లు కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి, టీడీపీ తరఫున బీటీ నాయుడు, వైఎస్సార్ సీపీ తరఫున బుట్టా రేణుక పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిపై బుట్టా 44,131 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున, డాక్టర్ ఎస్.సంజీవకుమార్ వైఎస్సార్ సీపీ తరఫున ప్రస్తుతం బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు స్థానం వైఎస్సార్ సీపీ ఖాతాలోనే ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. బీసీలే అధికం రాయలసీమలో అనంతపురం జిల్లా తరువాత బీసీలు అత్యధికంగా ఉన్నది కర్నూలు జిల్లాలోనే. ముఖ్యంగా, కర్నూలు పార్లమెంటరీ పరిధిలో అధిక శాతం బీసీ కులాలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపారు. టీడీపీ బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తోంది. సీట్ల కేటాయింపులో మాత్రం వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. డాక్టర్ శింగరి సంజీవకుమార్ (వైఎస్సార్ సీపీ) సానుకూల అంశాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం. బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉండటం. ప్రముఖ వైద్యునిగా గుర్తింపు పొందటం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం. ప్రతి అంశంపై సూటిగా, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడగలగటం. పోటీ పరీక్షలకు వెళ్లే వందలాది యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పించి, ఉద్యోగాలు పొందేలా ప్రోత్సాహం అందించటం. పేదలకు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి.. పెళ్లిళ్లకు సహాయం అందించటం. జిల్లాలో వైఎస్సార్ సీపీ క్యాడర్ బాగా కలిసిరావటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై చెక్కు చెదరని ప్రజాభిమానం, వైఎస్ జగన్‌పై ప్రజలకు నమ్మకం ఉండటం. కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి (టీడీపీ) సానుకూలాంశాలు : కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటం. మాజీ ఎంపీ కావటం. కేంద్ర మంత్రిగా పనిచేయటం. ఆర్థికంగా స్థితిమంతుడు కావటం. బలహీనతలు : ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఉండి ఇటీవల టీడీపీలో చేరడం.రాజకీయంగా గుర్తింపు పొంది కూడా ప్రజాసమస్యలు పరిష్కరించకపోవడం. కేంద్ర మంత్రిగా పనిచేసినా కరువు నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. సాగునీటి ప్రాజెక్టుల కోసం పట్టించుకోకపోవటం. సొంత నియోజకవర్గమైన కోడుమూరు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాçశ్వత పరిష్కారం చేయకపోవడం. అనుచరుల అరాచకాలు, హత్యలు చేశారనే అపనిందలు. రాజకీయంగా విరోధం గల వ్యక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం. కుటుంబ సభ్యులు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వేర్వేరు పార్టీల్లో ఉండటం. ఇది ‘రాజు’ల కోటనే.. ఆ పాంత్రంలో ముగ్గురు మినహా అంతా ‘రాజు’లే పరిపాలిస్తున్నారు. అందుకే అది ‘రాజు’ల కోటగా భావిస్తారు. అంటే, ఉండి నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులంతా పేరు చివర రాజు అని ఉన్నవారే.. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వి.శివరామరాజు, పాతపాటి సర్రాజు, కె. రామచంద్రరాజు, గోకరాజు రంగరాజు, జి. జగన్నాధరాజు, డి. నారాయణ రాజు అందరి పేర్లలో రాజు ఉండటం గమనార్హం. 1962 లో కె. కుసుమేశ్వరరావు గెలవగా ఆయన మరణాంతం ఆతని భార్య పోటీ చేసి గెలుపొందారు. 1972లో డి. పేరయ్య గెలిచారు. కోర్టు తీర్పుతో ఎన్నికైన దొర సాలూరు నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కోర్టు తీర్పు ద్వారా ఎన్నికైన రాజన్నదొర వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడే విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీలు.. వైఎస్పార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, పి.ఎస్.పి, కె.ఎల్.పి, స్వతంత్ర అభ్యర్థులను పోటీలో గెలిపించి, ప్రజలు కూడా ఎన్నికల్లో వైవిధ్యతను చాటారు. 2004లో సాలూరులో టీడీపీ అభ్యర్థి భంజ్‌దేవ్ గెలుపొందగా, ఇతను ఎస్టీ కాదని రాజన్నదొర కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేశారు. తత్ఫలితంగా రాజన్నదొరనే గెలిచిన అభ్యర్థిగా కోర్టు ప్రకటించింది. అనంతరం భంజ్‌దేవ్ గిరిజనుడిగానే నిర్ధారణ కావడంతో ఆయన తిరిగి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. మొత్తం ఓటర్లు : 14,22,542 పురుషులు : 7,12,160 మహిళలు : 7,10,209 ఇతరులు : 173 – కె.రామకృష్ణ, కర్నూలు -
చెక్కులతో చేతులు దులుపుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘పసుపు కుంకుమ’ పథకం పేరుతో మహిళలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మహిళలను మభ్యపెట్టేందుకు ఈ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు దళితులకు దక్కాల్సిన 2137.66 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. తీరా లబ్ధిదారులు వెళ్లే సరికి ఖాళీ చెక్కులను ఇచ్చి చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకున్నారు. ఈ పథకంపై సొంత పార్టీ నేతలే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మా, బుట్టా రేణుకా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
లోకేశ్ ప్రకటించిన ‘ఆ ఇద్దరి’ స్థానాలూ హుళక్కే!
అది 2018 జులై...మంత్రి లోకేశ్ (చినబాబు) కర్నూలు వస్తున్నారని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి తెగ హడావుడి చేశారు. నారావారి రాజకీయ వారసుడి కరుణా కటాక్షాల కోసం తాపత్రయ పడ్డారు. పెద్ద వేదిక వేసి, జన సమీకరణ చేసి ‘మా రాజువి నీవయ్యా’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో చినబాబు మురిసిపోయి ‘ముగాంబో ఖుష్ హువా’ అన్నట్లుగా పోజు పెట్టారు. అదే ఊపులో ఇంకాస్త ముందుకెళ్లి ఎక్కడికో వెళ్లిపోయి ‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని’ ప్రకటించేశారు. ఇంకేముంది...నారా వంశ కిశోరం ప్రకటించిన తొలి అభ్యర్థులం తామే కాబట్టి సంబరపడ్డారు. తరువాత 9 నెలలు గడిచాయి.. ఎన్నికల తరుణం వచ్చింది. చంద్రబాబు నుంచి మాటాముచ్చట లేదు. లోకేశ్ నుంచి ఉలుకుపలుకు లేదు. చినబాబు తమకు టికెట్లు ప్రకటించారని గుర్తుచేసినా పెదబాబు పెదవి విప్పలే. వైఎస్సార్సీపీ తరపున గెలిచినా... మీ ప్రలోభాలకు లొంగి వచ్చామన్నా పట్టించుకోలేదు. తాను జీవితంలో ఎప్పుడూ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని, అసలది తమ డిక్షనరీలోనే లేదన్నట్లు చంద్రబాబు మనసులో ఓ చిన్న నవ్వు నవ్వారు. తన గురించి తెలిసీ నమ్మి రావడం మీ తప్పే అన్నట్లు ఓ చూపు చూశారు. చివరగా బుట్టా, ఎస్వీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. మీ వారసుడు లోకేశ్ ‘తొలిసారి ప్రకటించిన అభ్యర్థులం మేము... మీరు కాదనడానికి లేదు కదా’ అని పరోక్షంగా చెప్పారు. కానీ, అక్కడ ఉన్నది చంద్రబాబు. కమిట్మెంట్లు, సెంటిమెంట్లు ఏమాత్రం లేని ఆయన ‘నా లెక్కలు నాకుంటాయి. మీ తిప్పలు మీరు పడండని’ చెప్పేశారు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసే కోట్ల, టీజీ కుటుంబాలతో డీల్ సెట్ చేసుకున్నారు. కర్నూలు ఎంపీ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి, ఎమ్మెల్యే టికెట్ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్‌కు ఇస్తామని సంకేతాలిచ్చారు. విషయం అర్ధమైన బుట్టా రేణుక మూడ్రోజుల క్రితం మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు, లోకేశ్‌లను ప్రాధేయపడ్డారు. ఈయన భయపడినంతా అయింది. ఎస్వీ మోహన్‌రెడ్డికి కూడా బాబు ఝలక్ ఇచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీజీ భరత్‌ను ఎంపిక చేశారు. మోసపోయానని తెలిసిన మోహన్‌రెడ్డి హతాశుడయ్యారు. ఐదేళ్ల క్రితం తనకు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేసిన ద్రోహం గుర్తుకొచ్చి ఆయన మనసు కకావికలమైంది. మరంతేమరి... ‘చంద్రబాబు మాట మీద నిలబడరని అందరికీ తెలుసు. చినబాబైనా అలా చేయరని ఆశించాం. ఆయనకూ మాట ఇవ్వడమే తప్ప నిలబెట్టుకోవడం చేత కాదని తెలిసిందని’ ఎస్వీ మోహన్‌రెడ్డి లబోదిబోమంటున్నారు. మరోవైపు బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టికెట్లు దక్కకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ‘మనవాడు నాలుక మామూలుది కాదు. ఐరన్ టంగ్. ఏదైనా చెబితే అది అయ్యేదే లేదు. అదే మరి లోకేశ్ అంటే!’ అంటూ జోకులు పేలుస్తున్నారు. – వడ్డాది శ్రీనివాస్,సాక్షి , అమరావతి -
తప్పు చేశా, శిక్ష కూడా అనుభవించా: బుట్టా రేణుక
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆమె శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ.. దూరం నుంచి చూస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయని, ఆ భ్రమలో తాను పెద్ద తప్పు చేశానన్నారు. అలాగే తాను కూడా టీడీపీలో అలాంటి అనుభవమే ఎదురైందన్నారు. చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల పార్టీ మారి పొరపాటు చేశానని, దానికి శిక్ష కూడా అనుభవించానని ఆమె అన్నారు. ఇప్పుడు వాస్తవాలను గ్రహించానని, తనకు ఎక్కడ గౌరవం ఉంది? ఎక్కడ మంచి స్థానం ఉందనే విషయం ఇప్పుడు తెలిసిందన్నారు. ఒక మహిళగా, బీసీ నాయకురాలిగా తనకు వైఎస్సార్ సీపీలో మంచి గౌరవం దొరికేదన్నారు. చదవండి...(వైఎస్సార్ సీపీలోకి బుట్టా రేణుక, మాగుంట) టీడీపీ విలువలు లేని పార్టీ టీడీపీలో తనను మానసికంగా వేధించారని, టీడీపీ అధిష్టానం చెప్పే మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల సీట్లను కూడా అగ్ర కులాలకు ఇస్తున్నారని మండిపడ్డారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీ మహిళ అయిన తనను అవమానించారన్నారు. కర్నూలు బీసీ సిట్టింగ్ సీట్లు కూడా అగ్రకులాలకే ఇచ్చారని విమర్శించారు. టీడీపీ విలువలు లేని పార్టీ అని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందని బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీలో ఉన్న పారదర్శకత, స్పష్టత టీడీపీలో లేవని, అవన్నీ మాటలకే పరిమితమన్నారు. తాను రాకీయాలకు కొత్త అయినా, రెండు పార్టీల్లో ఎంతో అనుభవం వచ్చిందన్నారు. ఏదో ఆశించి మాత్రం తాను ఇప్పుడు పార్టీలో చేరలేదని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపుకు తనవంతు కృషి చేస్తానని బుట్టా రేణుక అన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి బుట్టా రేణుక
-
వైఎస్సార్ సీపీలోకి బుట్టా రేణుక, మాగుంట
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కండువాలు కప్పి బుట్టా రేణుక, మాగుంటను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన కుమారుడు జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చదవండి....(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు) మరోవైపు బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు లేకుండా వైఎస్సార్ సీపీలో చేరినట్లు చెప్పారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని బుట్టా రేణుకా పేర్కొన్నారు. మళ్లీ తనను పార్టీలోకి తీసుకున్నందుకు వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి, 2014లో మార్కాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాంసుబ్బారెడ్డి కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. ఏలూరు రామచంద్రారెడ్డి ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం వైఎస్ జగన్‌తోనే సాధ్యం అవుతుందన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా ఇవాళ పార్టీలో చేరిన విషయం విదితమే. వైఎస్సార్సీపీలో చేరిన వాళ్లు 1.కర్నూలు ఎంపి బుట్టా రేణుక 2. మాగుంట శ్రీనివాసులు రెడ్డి 3. ఆదాల ప్రభాకర్ రెడ్డి 4. మాజీ మంత్రి గూడూరు నియోజక వర్గం బల్లి దుర్గా ప్రసాద్ 5. మాజీ ఎమ్మెల్యే వంగా గీత 6. తాడి శకుంతల విజయవాడ మాజీ మేయర్ 7. భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి 8. దారా సాంబయ్య సంత నూతల పాడు, ఆయన కుమార్తె కూడా వచ్చారు 9. డాక్టర్ రాంచంద్రారెడ్డి అలాగే కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. -
గోడ దూకితే.. గోడు మిగిలింది!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు ఆశపడి టీడీపీలోకి వెళ్లిన నేతలకు ప్రస్తుతం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు రోజుల తరబడి ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో సదరు నేతలు అసహనానికి గురవుతున్నారు. తన టికెట్ విషయంలో మొదట్లో ధైర్యంగా ఉన్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చివరకు దక్కదన్న సంకేతాలతో నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. మరోవైపు కొడుకు టికెట్ కోసం ఎంపీ టీజీ వెంకటేష్ కూడా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ సీటు వ్యవహారం నేడు తేల్చే అవకాశముంది. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యరీత్యా ఎక్కువ సమయం వేచి ఉండలేని స్థితిలోనూ తనకు ఎంపీ టికెట్ లేదా కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరేందుకు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు సర్వే ద్వారా టికెట్లు ఇస్తామని రెడీమేడ్ సమాధానం ఇవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొదట్లో ఎంపీగానే పోటీ చేస్తానని భీష్మించుకున్న ఆమె.. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఫరవాలేదన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా సమీక్షల సందర్భంగానూ పిలుపు రాకపోవడంతో ఆమె మదనపడిపోతున్నారు. పైగా ఆదోని సీటును మీనాక్షి నాయుడికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అసలు ఊసులోనే లేకుండా పోయారు. నంద్యాల సీటు విషయంలోనూ అదే మడతపేచీ కొనసాగుతోంది. మొత్తంగా పార్టీ మారిన నేతలంతా ప్రస్తుతం తమకు జరుగుతున్న ‘మర్యాద’ను తలచుకుని లోలోపల కుంగిపోతున్నారు. అయ్యో..ఎస్పీవై! నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనకు ఎంపీ సీటు ఇస్తారన్న ఆశ ఉందని పైకి అంటున్నప్పటికీ..ఖర్చు విషయాన్ని ముందుకు పెట్టి సీటు నిరాకరిస్తున్నారని లోలోపల వాపోతున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ కావాలంటే ఖర్చుల కోసం రూ.60 కోట్లు చూపించాలని టీడీపీ పెద్దలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము అంత మొత్తాన్ని చూపించలేమనే ఉద్దేశంతోనే కావాలని ఇలా అడుగుతున్నారని ఎస్పీవై వాపోతున్నారు. సీటు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకోవడంతో ఈ విధంగా చేశారని అంటున్నారు. పార్టీ మారే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ మీ కుటుంబానికే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మదనపడిపోతున్నారు. చివరకు ఇంత వయస్సులో.. ఆరోగ్యం సహకరించనప్పటికీ గంటల తరబడి వేచిచూస్తే సర్వే ద్వారా తేల్చుతామని ప్రకటించడంతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదని తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కనీసం పిలవడం కానీ, సీటు విషయం మాట్లాడటం కానీ చేయలేదని సమాచారం. అలాగే కోడుమూరు ఇన్చార్జ్గా వ్యవహరించిన విష్ణువర్దన్‌రెడ్డిని కనీసం పలకరించే ప్రయత్నం కూడా పార్టీ నేతలెవ్వరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన నేతలంతా చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని చూసి తమను తామే తిట్టుకుంటున్నారు. కర్నూలు సీటుపై పీటముడి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మొన్నటివరకు సీటు తనదేనని బల్లగుద్ది మరీ వాదించేవారు. పార్టీ సభ్యత్వం మొదలుకుని.. పార్టీ కమిటీల వరకూ అన్నీ తమకే అప్పగించారని పేర్కొనేవారు. తమను కాదని సీటు వేరేవారికి ఎలా ఇస్తారని గాంభీర్యంగానూ ప్రకటించేవారు. అయితే.. నాలుగు రోజులుగా టీజీ భరత్‌కు సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో ఎస్వీ నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. దీంతో రోజూ గంటల తరబడి వేచిచూసి.. వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మోహన్‌రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి చంద్రబాబు అకారణంగా తప్పించిన విషయాన్ని ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు రాజకీయ కపట నాటకాన్ని తలచుకుంటూ నేతలు కుంగిపోతున్నారు. -
సీఎం మీటింగ్‌కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా
సాక్షి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలుపొంది, ఆ తరువాత టీడీపీ గూటికి చేరిన బుట్టా రేణుక పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టికెట్ హామీతో టీడీపీలో చేరిన బుట్టాకు తాజాగా కేంద్ర మాజీమంత్రి కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపిణీలో తనకు తగుస్థానం కల్పించడంలేదంటూ గతకొంత కాలంగా ఆమె పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. (నా పరిస్థితేంటి?!) ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు జిల్లాలోని కోడుమూరులో జరిగిన సీఎం చంద్రబాబు సభకు బుట్టా డుమ్మా కొట్టారు. దీంతో బుట్టా రేణుకా పార్టీ మారుతారనే ఊహాగానాలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆమె కర్నూలు లోక్‌సభ స్థానుంచి తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ సూర్య ప్రకాష్ ఎంట్రీతో రేణుకను పక్కనబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఎంటా అని ఆమె సతమవుతున్నారు. మరోవైపు కర్నూలులో కేయి, కోట్ల వర్గీయుల విభేదాలు భయపడపడుతున్న విషయం తెలిసిందే. -
ఐదేళ్లుగా మా ఊరికి ఏం చేశారు ?
కర్నూలు, సి.బెళగల్: ‘మా ఊరిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఐదేళ్లుగా మీ వెంట తిరుగుతున్నా పట్టించుకోలేదు. సమస్యలు తీర్చనప్పుడు మా ఊరికి ఎందుకొచ్చారం’టూ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సి.బెళగల్ ఎస్సీ కాలనీ వాసులు నిలదీశారు. ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైను పనులను ప్రారంభించేందుకు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డితో కలిసి బుధవారం ఆమె ఎస్సీ కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు దేవదానం, నాగేష్, మిరపకాయల మారెప్ప తదితరులు కాలనీ సమస్యలపై ఎంపీని ప్రశ్నించారు. ఇంటింటికీ కుళాయి అని చెప్పి.. టీడీపీ కార్యకర్తల ఇళ్లకే ఇస్తున్నారు. కాలనీలో వీధిరోడ్లు బాగుచేయాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కాళ్లు అరిగేలా మీ వెంట తిరిగితే మీరేం చేశారని ఎంపీని నిలదీశారు. అభివృద్ధి పేరుతో మీరు వైఎస్ఆర్సీపీని వీడారని.. మరి మీరు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఎంపీని సూటిగా ప్రశ్నించారు. మీ అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిస్తే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిధిలోని నిధులను తాగునీటికి కేటాయించానని, ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యేతో చేయించుకోవాలంటూ స్థానిక ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆగ్రహించిన ఎస్సీ కాలనీవాసులు తమ సమస్యలు తీర్చకుంటే కాలనీకి రావద్దంటూ నినాదాలు చేశారు. దూరంగా ఎంపీపీ: ఎంపీ బుట్టారేణుక పర్యటనకు ఎంపీపీ నాగమనెమ్మ, స్థానిక ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు, కార్యకర్తలు, అభిమానులు దూరంగా ఉన్నారు. పట్టుమని పదిమంది కూడా ఎంపీ వెంట కనిపించలేదు. -
నా పరిస్థితేంటి?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. కర్నూలు పార్లమెంట్ సీటును కోట్లకు కేటాయించే అవకాశముంది. దీంతో తన పరిస్థితి ఏమిటంటూ బుట్టా రేణుక నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. ఇంకా సీట్ల విషయం ఖరారు కాలేదని పేర్కొన్న సీఎం.. వాటి గురించి తర్వాత మాట్లాడదామంటూ ముక్తసరిగా ఫోన్ సంభాషణ ముగించినట్టు సమాచారం. దీంతో ఆమె మరింతగా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. కాగా.. బుట్టా పార్టీ మారేటప్పుడు టీడీపీలోఎంతో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా తిరిగి ఎంపీ సీటు కేటాయిస్తామని చెప్పారని ఆమె వర్గీయులు అంటున్నారు. స్వయంగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటన సందర్భంగా ఎంపీగా బుట్టాను తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ‘జయహో బీసీ’ అని నినదిస్తూనే ఒక బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని అధికార టీడీపీ వైఖరిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎలా వెళతాం! వాస్తవానికి బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ఆమెను గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీకి ఉన్న బలంతో ఆమె ఎంపీగా గెలిచారు. తీరా గెలిచిన తర్వాత ఆమె భర్త తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె మాత్రం వైఎస్సార్సీపీలో కొనసాగారు. అయితే, టీడీపీ ఆకర్ష్ పథకంలో భాగంగా రూ.50 కోట్ల నగదుతో పాటు ఆమె పాఠశాలకు అమరావతిలో భూ కేటాయింపునకు హామీ పొందారు. తీరా టీడీపీలో చేరిన తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ సీటు కూడా లేకుండా పోతోంది. అయితే.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఆశతో వర్గీయులు ఉన్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి మంత్రి లోకేష్ అండదండలున్నాయి. దీంతో ఆయనకే టికెట్ ఇస్తారని అంటున్నారు. ఫలితంగా రెంటింకీ చెడ్డ రేవడిలా బుట్టా పరిస్థితి తయారైంది. ఇదే తరుణంలో బీసీ మహిళకు టీడీపీ అన్యాయం చేసిందన్న అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ వైఖరిపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పెద్దన్నగా పిలవబడే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కనీసం కోట్ల చేరికపై సమాచారం కూడా లేకపోవడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మౌనంగా కేఈ వర్గం జిల్లాలో మొదటి నుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇరువర్గాలకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్‌కు బలైపోయారు. గ్రామాల వారీగా వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు కోట్ల టీడీపీలో చేరనుండడంతో కేఈ వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచి రాజకీయ వైరుధ్యంతో ఉన్న కోట్లతో ఎలా సర్దుకుపోతామంటూ పార్టీ వైఖరిపై ఆగ్రహిస్తున్నారు. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా గుమ్మనంగా స్పందించారు. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదన్నారు. అంతేకాకుండా తమ సీటు అడిగితే అప్పుడు స్పందిస్తానని పరోక్షంగా సంకేతాలు పంపారు. మొత్తమ్మీద ప్రస్తుత పరిణామాలను కేఈ వర్గం సునిశితంగా గమనిస్తోంది. కోట్లకు ఏయే సీట్లు ఇవ్వనున్నారనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ పూర్తిస్థాయి స్పందన తెలియజేయాలని భావిస్తున్నారు. -
బుట్టా.. పయనమెట్టా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు రాజకీయం కాస్తా జిల్లాలో నేతల బుర్రలను హీటెక్కిస్తోంది. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొత్తు కుదిరితే కర్నూలు ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మళ్లీ ఎంపీగానే బరిలో ఉండాలని కలలు కంటున్న సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు సీటు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అప్పుడామె పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. సీటు రాకుండా చేసే యత్నాలు కర్నూలు నగర పాలక సంస్థలో జరుగుతున్న పనుల విషయంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో బుట్టా రేణుక ఢీ కొంటున్నారు. తనకు కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని బహిరంగంగానే మండిపడిన బుట్టా రేణుక.. కార్పొరేషన్‌లోఅవినీతి వ్యవహారాలపైనా దృష్టి పెట్టారు. వాటిపై విచారణ జరపాలంటూ ఏకంగా విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. కమిషనర్‌ను బదిలీ చేయించేందుకు కూడా ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుట్టా వ్యవహారశైలిపై ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా మండిపడుతున్నారు. వీరు ఏకంగా ఆమెకు సీటు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఉంటారని ఎమ్మెల్యే వర్గం ప్రచారం చేస్తోంది. అయితే..అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా లేరు. అయినప్పటికీ బుట్టాకు ఎంపీ సీటు రాదని, ఎమ్మెల్యేగానే బరిలో ఉంటారని ఎస్వీ వర్గం భారీఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారం కూడా ఇరు వర్గాల మధ్య మరింత అగ్గి రాజేస్తోంది. ఇప్పుడేమంటారో! వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తును టీడీపీలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి లాంటి వారు ఒక అడుగు ముందుకేసి.. కాంగ్రెస్ దరిద్రం తమకెందుకని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే డోన్ అసెంబ్లీ సీటును తాము వదులుకోవాల్సి వస్తుందనే భావనలో కేఈ వర్గం ఉంది. అంతేకాకుండా మొదటి నుంచి ఇరు వర్గాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. ఇప్పుడు కలిసి పనిచేద్దామంటే పైస్థాయిలో అంగీకరించినప్పటికీ కింది స్థాయి కేడర్ మాత్రం మండిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీడీపీతో పొత్తును కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా అంగీకరించడం లేదు. ఇదిలా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలవడంతో పాటు ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని ప్రకటించారు. టీడీపీతో పొత్తు కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మున్ముందు కూడా కొనసాగుతుందని వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. అంటే రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోంది. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ, కోట్ల ఏమంటారో వేచిచూడాల్సిందే! -
కమీషన్ల రగడ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ సాక్షిగా అధికార పార్టీలో కమీషన్ల కొట్లాట మొదలైంది. కార్పొరేషన్ పరిధిలో టెండర్ల వ్యవహారమంతా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రమే చూస్తున్నారని, ఎవ్వరినీ తలదూర్చనీయడం లేదని కొన్నాళ్ల క్రితం అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక వర్గం లోలోన మండిపడుతోంది. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ ఉల్లంఘన అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కార్పొరేషన్లో టెండర్ల వ్యవహారాలను ఎమ్మెల్యే ఏకపక్షంగా నడుపుతున్నారు. ప్రతి పని ఆయన చెప్పిన మనుషులకే దక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అమృత్ పథకం పనులను కూడా ఎమ్మెల్యే వర్గీయులే చేస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం మొదలు డ్రైనేజీ పనుల వరకు.. చివరకు చెత్త సేకరణ కాంట్రాక్ట్ కూడా వారే తీసుకున్నారు. ఎంపీ బుట్టా రేణుకకు కనీసం పనుల సమాచారం కూడా ఇవ్వడం లేదన్నది ఆమె వర్గీయుల వాదన. ఈ నేపథ్యంలోనే ప్రొటోకాల్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. మునిసిపల్ కమిషనర్ హరినాథరెడ్డిపలు ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఎంపీ బుట్టా జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అనేక నిబంధనలను కూడా పేర్కొంటూ మరీ కమిషనర్‌పై మండిపడుతున్నారు. వాస్తవానికి కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ పనుల్లో ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తే ఇంత రచ్చకు దారితీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవ్వరూ వేలు పెట్టొద్దు! కార్పొరేషన్ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అధికార పార్టీ నేతలే మండిపడుతున్నారు. గతంలో కార్పొరేషన్ టెండర్ల వ్యవహారాలు కేఈ కుమార్ చూసేవారు. అయితే, ఎమ్మెల్యే ఎస్వీ పార్టీ మారిన తర్వాత కేఈ కుటుంబం నుంచి పూర్తిగా తప్పించారు. ఇందుకోసం ఫిర్యాదులు చేసి మరీ కేఈ కుటుంబ పెత్తనం లేకుండా చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా వేరే వారికి కాంట్రాక్టులు దక్కే పక్షంలో ఏకంగా టెండర్లనే రద్దు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్ల వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే ఎటూ తేల్చడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే కాంట్రాక్టర్‌కు పనులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ టెండర్‌ను రద్దు చేయించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం కూడా ఎంపీ బుట్టా వద్దకు వెళ్లినట్టు సమాచారం. తమ వారికి ఒక్క పని కూడా ఇవ్వడం లేదని బుట్టా వర్గీయులు వాపోతున్నారు. అశోక్‌నగర్ పంపుహౌస్ వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ కోసం స్థల కేటాయింపుతో మునిసిపల్ కమిషనర్, ఎంపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇచ్చారని, తమకు కనీస సమాచారం లేదని వారు మండిపడుతున్నారు. పైగా కమిషనర్.. ఎమ్మెల్యే చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో కార్యక్రమాల నిర్వహణ విషయంలోనూ ఎంపీగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఎంపీ బుట్టా ఫిర్యాదు చేశారు. -
టీడీపీ , బీజేపీ కుమ్మక్కుకు నిదర్శనమిదే
-
‘బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి’
-
‘బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా హోదా కోసం టీడీపీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదో ప్రజల సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆవ్వానించడం నిబంధనలకు విరుద్దమైన చర్య అని మండిపడ్డారు. బుట్టా రేణుకను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంలోనే టీడీపీ-బీజేపీ కుమ్మకైన విషయం వెల్లడైందని పేర్కొన్నారు.