
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక గురువారం ఉదయం 9.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ నాయకులు కోరారు.
రేపు నామినేషన్ వేయనున్న సతీష్
కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న డా.ఆదిమూలపు సతీష్ రేపు(శుక్రవారం)నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు చిల్డ్రన్ పార్క్(ఎస్వీ కాంప్లెక్స్) దగ్గరకు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అక్కడి నుంచి వెళ్లి కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.