టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అనేక ఆరోపణలు
ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు
ఎన్నికల సమయంలో గొడవలకు దిగుతున్న వైనం
పోలీస్ స్టేషన్లలో పలు కేసుల నమోదు
ఎదురూరులో యథేచ్ఛగా భూకబ్జాలు!
ఆయన అక్రమాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే! దౌర్జన్యాలకు అంతేలేదు. రౌడీలను, కేడీలను ప్రోత్సహిస్తూ.. ఇప్పటికీ కొన్ని గ్రామాలను శాస్తిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఎన్నికల్లోనూ గొడవలు సృష్టించడం ఈయనకు రివాజుగా మారింది. కబ్జాలకు పాల్పడుతూ.. ప్రజలను భయభ్రాంతలకు గురిచేస్తూ.. టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. రౌడీ రాజకీయం చేస్తున్న ఈయనను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించడం ఆ పార్టీ కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో విష్ణు అనుచరుడికి టిక్కెట్ ఇవ్వడం.. నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా వినకపోవడం.. తదితర పరిణామాలను చూస్తుంటే టీడీపీ ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తుందో అర్థమవుతోంది!
కర్నూలు: టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి వివాదాలు సృష్టిస్తూ.. ముఠా కక్షలను ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. పచ్చని పల్లెలో గొడవలకు ఆజ్యం పోస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. 1985 నుంచి 1995 వరకు కర్నూలు, సి.బెళగల్, గూడూరు, కల్లూరు మండలాల్లోని ఎన్నో గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలకు ఈయనే కారణమని విమర్శలు ఉన్నాయి. పర్ల, పోల్‌కల్, కొంతలపాడు, బురాన్‌దొడ్డి, పులకుర్తి, మునగాల, సుంకేసుల తదితర గ్రామాల్లో హత్యలు చేసిన వారిని ఈయన ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఏదో విధంగా గొడవలు సృష్టించడం, ప్రజలను భయాబ్రాంతులకు గురిచేయడం ఈయనకు అలవాటుగా మారింది. ఎన్నికల్లో అశాంతిని నెలకొల్పి గొడవలు సృష్టించడంలో ఈయన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పోలీసులు రికార్డుల్లో నమోదయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో తాను సూచించిన వ్యక్తి బొగ్గుల దస్తగిరికి సీటు ఇస్తేనే పనిచేస్తాను, లేదంటే ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తానని అధిష్టానానికి అల్టిమేటం పెట్టి తన పట్టును సాధించుకున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో పట్టుబట్టి బూర్ల రామాంజినేయులకు అసెంబ్లీ టికెట్ సాధించుకున్నా విష్ణు సొంత గ్రామాలైన ఎదురూరు, దూద్యాల, కొంతలపాడు, సుంకేసుల గ్రామాల్లో ఆ పార్టీకి మెజార్టీ రాకపోవడం గమనార్హం.
కప్పగంతులు
ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డికి రాజకీయాల్లో విలువలు లేవు. పార్టీలు మారడం ఈయనకు రివాజుగా మారింది. ఈయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో విజయభాస్కర్‌రెడ్డితో విభేదించి 1998లో టీడీపీలో చేరారు. అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పాణ్యం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మళ్లీ టీడీపీలోకి చేరి కోడుమూరు నియోజకవర్గంలో పెత్తనం నడుపుతున్నారు.
విష్ణువర్ధన్‌రెడ్డిపై నమోదైన కేసులు
ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటీ, దౌర్జన్యాలు, గొడవలు వంటి కేసులు నమోదయ్యాయి. కర్నూలు తాలుకా పోలీస్‌స్టేషన్, మూడు, నాలుగవ టౌన్ పోలీస్‌స్టేషన్లో 8 కేసులు ఉన్నాయి. సెక్షన్ 355, 365, 323 రెడ్‌విత్, ఐపీసీ 34 సెక్షన్ల కింద 244/2011 కేసు నమోదైంది. 147, 447, 506 సెక్షన్ల కింద క్రైం నెంబర్ 179/2013 ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో పాటు క్రైం నెంబర్ 45/2009, 40/2016, 21/2013, 232/2019, 244/2011, 179/2013, 45/2016, 85/2019 పలు కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురిచేసి దాడులు చేసిన కేసులే విష్ణువర్ధన్‌రెడ్డిపై నమోదయ్యాయి.
దౌర్జన్యంగా భూ కబ్జాలు
ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి వందల ఎకరాల భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడు. తొలిశాపురం సమీపంలోని వందల ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని ఆక్రమించుకుని తన అనుచరులతో సాగు చేయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎదురూరు గ్రామంలో 70 ఎకరాలు చెన్నకేశవులస్వామి భూమిని ఆక్రమించుకుని ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తీసుకురాగా ఈ భూములకు కొంతవరకు భూమిశిస్తు చెల్లించినట్లు సమాచారం. కేసీ కెనాల్‌కు రంధ్రం పెట్టి ప్రతి ఏటా ఎదురూరు గ్రామం దగ్గర వందల ఎకరాల తన భూములకు అక్రమంగా నీటిని మళ్లించుకుని వరి సాగుచేసుకుంటున్నాడు. గార్గేయపురంలో 5 ఎకరాల చెరువు భూమిని నీళ్లు లేని సమయంలో సాగు చేసుకునేందుకు పేదవారికి పట్టాలిచ్చారు. ఆ భూమి హైవే రోడ్డుకు పక్కనే ఉండడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కన్నుపడింది. కోట్ల విలువ చేసే ఆ భూమిని తన అనుచరుల మీద కొనుగోలు చేశాడు. ఆరు నెలల క్రితం ఆ చెరువును పూడ్చేందుకు ప్రయత్నించగా అధికారులు విచారణ చేసి పూడిక పనులను నిలుపుదల చేయించారు.
ఎన్నికల్లో విష్ణు సృష్టించిన గొడవలు ఇవీ..
► ఎన్నికలు వచ్చాయంటే విష్ణువర్ధన్‌రెడ్డి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. ఎన్నికల్లో నేరుగా తానే స్వయంగా వెళ్లి దొరికిన ఆయుధాలతో దాడులకు తెగబడడం ఆయనకు అలవాటుగా మారిపోయింది.
► 1985లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏరాసు అయ్యపురెడ్డికి కేఈ సోదరులు మద్దతిచ్చి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఓటమికి కారణమయ్యారనే కోపంతో కేఈ సోదరుల ఇంటిపై రౌడీమూకలతో దాడి చేయించాడు. అప్పట్లో కర్నూలు పాతబస్టాండ్ మొత్తం బీభత్సకరమైన వాతావరణం ఏర్పడింది.
► 1994లో ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి పోటీచేసిన సమయంలో ప్రత్యర్థి కొత్తకోట ప్రకా‹Ùరెడ్డి బ్యాలెట్ బాక్స్‌ల్లో ఇంకు పోశాడన్న నెపంతో విష్ణువర్ధన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కొత్తకోట ప్రకా‹Ùరెడ్డి అనుచరులను దాదాపు 35 మందిని గాయపరిచినట్లు అలంపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది.
► 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి మద్దతుగా ఉంటూ ఆ ఎన్నికలో స్వయంగా దౌర్జన్యానికి దిగాడు. కల్లపరిలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌పై దాడి చేసేందుకు ప్రయతి్నంచగా గ్రామస్తులంతా తిరగబడ్డారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఒక ఇంటిలో విష్ణువర్ధన్‌రెడ్డిని బంధించారు. ప్రజలు శాంతించిన తర్వాత ఆ గ్రామ నాయకుడు యువీ రాజారెడ్డి వచ్చి విష్ణును క్షేమంగా ఊరు దాటించాడు.
► 1999 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పారీ్టకి పడిన ఓట్లు టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్ కు పడుతున్నాయని పుల్లారెడ్డి కాలేజీలో పెద్ద ఎత్తున విష్ణువర్ధన్‌రెడ్డి గొడవ చేశాడు. ఓ దశలో అప్పటి ఎమ్మెల్యే ఎం.శిఖామణిపై దాడి చేసేందుకు ప్రయతి్నంచగా విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
► మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా తొలగించాలని కర్నూలు జిల్లా నుంచి 50 నుంచి 60 లారీల్లో జనాలను హైదరాబాద్‌కి తీసుకెళ్లి పీసీసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున అలజడి సృష్టించాడు.
► 2014 ఎన్నికలనంతరం కోడుమూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను తీసుకెళ్లి తెలుగుదేశం పారీ్టలో చేరి్పంచి కోడుమురు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జీగా పవర్ పెత్తనం నడిపాడు.
► 2019 ఎన్నికలో తెలుగుదేశం పారీ్టలో ఉంటూ తన చిరకాల ప్రత్యర్థి అయిన కొత్తకోట ప్రకాష్‌రెడ్డిపై గొందిపర్లలో దాడికి తెగబడ్డాడు. తన అనుచరులను ఉసిగొల్పి కొత్తకోట ప్రకాష్‌రెడ్డిపై దాడి చేయించిన ప్రయత్నం అప్పట్లో సంచలనం రేకేత్తించింది.
Comments
Please login to add a commentAdd a comment