తన సొంత జిల్లాలో ఉన్న మంత్రాలయం ఆలయాన్ని పర్యాటక ఆలయంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
కర్నూలు: తన సొంత జిల్లాలో ఉన్న మంత్రాలయం ఆలయాన్ని పర్యాటక ఆలయంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శనివారంతో ఆమె ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏడాది పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. కర్నూలు నియోజక వర్గంలో ఎంపీ నిధులతో రూ.2.5 కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పించినట్టు ఆమె తెలిపారు. కేంద్రం నుంచి జిల్లాకు అధిక నీరు తీసుకు రావడానికి కృషి చేస్తానని బుట్టా రేణుక ఈ సందర్భంగా తెలిపారు.