కర్నూలు : ప్రత్యేక హోదా రావడం లేదంని తీవ్ర మనస్తాపం చెందిన గుండెపోటుతో మరణించిన జి.లోకేశ్వరరావు (37) కుటుంబాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరామర్శించారు. శనివారం కర్నూలు జిల్లా గూడూరులోని లోకేశ్వరరావు నివాసానికి బుట్టా రేణుక విచ్చేశారు. ఈ సందర్భంగా లోకేశ్వరరావు భార్య కృష్ణవేణితో ఆమె మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా కృష్ణవేణికి రేణుకా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.