Kurnool MP
-
బస్తిపాటికి అవకాశం..బత్తినకు అవమానం
కర్నూలు: టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజును ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా వ్యాపారవేత్తకు ఎంపీ టిక్కెట్ ప్రకటించడంపై ఆ పార్టీ నేతల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. వ్యాపారవేత్త, ఆదోని పట్టణానికి చెందిన బత్తిని లక్ష్మీనారాయణ, హరియానా గవర్నర్ దత్తాత్రేయ ఓఎస్డీ భానుశంకర్, ఇటీవలే టీడీపీలో చేరిన డాక్టర్ సంజీవకుమార్, కర్నూలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు తెలుగుదేశం తరపున ఎంపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. పార్టీ అధిష్టానం బస్తిపాటి నాగరాజు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో శుక్రవారం సాయంత్రం టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకుని అధ్యక్షుడు బీటీ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో బత్తిన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రామలింగాయపల్లె గ్రామానికి చెందిన జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టిక్కెట్ కోసం ఆయన విశ్వప్రయత్నం చేశారు. అయితే, బత్తిన సామాజికవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బస్తిపాటి నాగరాజును ప్రకటించడంతో వెంకటరాముడు తీవ్ర మనస్థాపంతో ఆ పార్టీకి శనివారం రాజీనామా చేయనున్నట్లు సమాచారం. -
మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ
కర్నూలు (రాజ్‌విహార్): తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రిలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. (బయట తిరిగితే క్వారంటైన్కే ! ) కర్నూలులో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. అమెరికా, స్పెయిన్‌లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడి వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో బీసీజీ వ్యాక్సిన్ వాడుతుండటం వల్ల ఇక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, అమెరికా లాంటి పరిస్థితి ఇక్కడ రాదని వివరించారు. లాక్ డౌన్ ఆంక్షలను రెడ్ జోన్లలో పొడిగించి.. గ్రీన్ జోన్లలో విడతల వారీగా ఎత్తివేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజ్‌భవన్‌కు చెందిన నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. చీఫ్ సెక్యూరిటీ అధికారితో పాటు నర్సింగ్ సిబ్బందికి కరోనా సోకింది. (కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందొద్దు) -
టీబీఎస్ సంస్థది భారీ కుంభకోణం
సాక్షి,కర్నూలు(హాస్పిటల్): వైద్యపరికరాలు మరమ్మతులు చేయకుండా రూ.450 కోట్ల ప్రజల సొమ్మును టీబీఎస్ సంస్థ అప్పనంగా దోచుకుందని కర్నూలు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఎస్. సంజీవకుమార్ అన్నారు. దోచుకున్న ఆ సొమ్మును ఆ సంస్థ నుంచి రికవరీ చేయిస్తామని చెప్పారు. ‘టీబీఎస్ నిర్వహణ తుస్’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల తనిఖీ చేశారు. ముందుగా రేడియాలజీ విభాగంలోని మూలనపడ్డ ఎక్స్‌రే యూనిట్లను పరిశీలించారు. మొత్తం పది యూనిట్లు పనిచేయడం లేదని, ఈ విషయాన్ని టీబీఎస్ సంస్థకు చెప్పినా పట్టించుకోవడం లేదని రేడియాలజీ హెచ్ఓడీ డాక్టర్ గఫూర్ ఎంపీకి చెప్పారు. ఈ విభాగంలో సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉందని చీఫ్ రేడియోగ్రాఫర్ కృష్ణమూర్తి విన్నవించారు. ఒకవైపు ఎక్స్‌రే యూనిట్లు పనిచేయకపోవడం, మరోవైపు సిబ్బంది తక్కువగా ఉండటంతో అధిక భారం పడుతోందన్నారు. అనంతరం ఆయన ఏఎంసీ విభాగాన్ని పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన బడేసాహెబ్‌ను పరామర్శించారు. ఏఎంసీలో ఎన్ని వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని ఆరా తీశారు. పడకల సంఖ్య తక్కువగా ఉండటంతో రోగులకు ఇబ్బందిగా ఉందని, ఈ మేరకు పాత గైనిక్ విభాగంలో ఏఎంసీ, క్యాజువాలిటీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ వివరించారు. విద్యుత్ అంతరాయంపై ఆగ్రహం ఎంపీ సంజీవ్‌కుమార్ మేల్ పోస్టు ఆపరేటివ్ వార్డును సందర్శించారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆపరేషన్ చేయించుకున్న రోగులు ఇబ్బందులు పడుతుండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్ సరఫరా లేక పది మందికి ఆపరేషన్లు ఆగిపోయాయని తెలుసుకుని ఆపరేషన్ థియేటర్లు పరిశీలించారు. ఆసుపత్రిలో ట్రాన్స్ఫార్మర్ బ్రేక్‌డౌన్ అయ్యిందని, త్వరలో పునరుద్ధరిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. కాగా ఆపరేషన్ థియేటర్‌కు జనరేటర్ లేకపోతే ఎలాగని, ఆపరేషన్ చేసే సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఏమిటని అధికారులను ఎంపీ ప్రశ్నించారు. ఆ సమయంలో ఏఈ వెంకటేష్, టీబీఎస్ సంస్థ ప్రతినిధులు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీఎస్లో అనర్హులతో పనిచేయిస్తున్నారని, మొత్తం ఇప్పటి వరకు ఎన్ని పరికరాలు రిపేర్ చేశారు, ఎన్ని ఉన్నాయో, మీ ఎంఓయు తదితర వివరాలు తీసుకుని రావాలని ఆలస్యంగా వచ్చిన ఆ సంస్థ ప్రతినిధిని ఆదేశించారు. రైతు ఆత్మహత్యలపై ఆవేదన అనంతరం పోస్టుమార్టం వద్ద సి.బెళగల్ మండలం పోల్‌కల్ గ్రామానికి చెందిన రైతు లాజర్ (35) మృతదేహాన్ని సందర్శించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పశ్చిమ ప్రాంతానికి నీటి కేటాయింపులు న్యాయబద్ధంగా జరగలేదని, అందుకే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే 20 టీఎంసీల నీరు నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాసిరకంగా నిర్మాణ పనులు ఆసుపత్రిలోని మేల్ పోస్టు ఆపరేటివ్ వార్డులో వేసిన టైల్స్ కుంగిపోయి ఉండటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే వేసిన టైల్స్ ఎలా కుంగిపోతాయని, మీ ఇంట్లో కూడా ఇలాగే వేసుకుంటారా అని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. బండలు వేసేటప్పుడు ప్రాథమిక సూత్రాలు కూడా పాటించినట్లుగా లేదని మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే వేశామని డీఈ రాజగోపాల్‌రెడ్డి చెప్పేందుకు ప్రయత్నించగా ఆ మాటకు కట్టుబడి ఉండండి, దీనిపై నేను లోతుగా పరిశీలిస్తానని చురకలంటించారు. -
బీసీల బాంధవుడు వైఎస్ జగన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దేశ చరిత్రలోనే రాష్ట్రాల మంత్రిమండళ్లలో అట్టడుగు వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవుతారని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రిమండలిలో 8 మంది బీసీలకు అవకాశం కల్పించి, బీసీల బాంధవుడయ్యారని కొనియాడారు. ఎస్సీలకు ఐదు, ఇతర సామాజిక వర్గాలకు కలిపి మొత్తంగా అట్టడుగువర్గాలకు దాదాపు 60 శాతం పదవులను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని, ప్రాణం ఉన్నంతవరకు ఆయనతోనే ఉంటానన్నారు. కర్నూలు జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాంలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జిల్లా సమస్యలపై మంత్రులతో కలసి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. -
ఫ్యాన్ సునామీ
ఫ్యాన్ సునామీ సృష్టించింది. ఈ ఉధృతికి సైకిల్ అడ్రెస్ లేకుండా కొట్టుకుపోయింది. గ్లాస్ ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ‘కంచుకోట’లో తిరుగేలేదని బలంగా చాటిచెప్పింది. జిల్లా ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారు. జిల్లాలోని అన్ని స్థానాలను ఒక పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మే 23 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా సరికొత్త చరిత్రను లిఖించింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ అన్నింటినీ గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చరిత్రలో తనదైన రికార్డును నమోదు చేసుకుంది. 2014 ఎన్నికల్లోనూ 14 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. అలాగే రెండు ఎంపీ సీట్లనూ కైవసం చేసుకుంది. తదనంతరం ఇద్దరు ఎంపీలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినప్పటికీ తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నామంటూ జిల్లా ప్రజలు స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకు అభిమానం తరిగిపోదని మరోసారి రుజువు చేశారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 14 అసెంబ్లీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీని రాజకీయ సమాధి చేసి.. వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారు. మరోవైపు జిల్లా రాజకీయాలను తమ చేతుల్లో బంధించుకుని నడిపిన కోట్ల, కేఈ కుటుంబాలను రాజకీయ సమాధి చేశారు. ఈసారి కూడా రెండు పార్లమెంటు స్థానాలనూ వైఎస్సార్సీపీకే ప్రజలు కట్టబెట్టారు. మొదటి నుంచి 13 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ కనిపించినప్పటికీ కర్నూలులో మాత్రం విజయం దోబూచులాడింది. రౌండు రౌండుకు ఉత్కంఠ పెంచింది. చివరకు కర్నూలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని నిరూపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు డాక్టర్లలో ఎంపీగా సంజీవ్‌కుమార్, కోడుమూరు ఎమ్మెల్యేగా సుధాకర్ గెలుపొందగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాటసాని రాంభూపాల్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ సారి కాటసాని జిల్లాలోనే అత్యధికంగా 43,857 ఓట్ల మెజార్టీ సాధించారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో మొదటి ఫలితం ఆదోని అసెంబ్లీ స్థానానిది వెలువడగా..చివరి ఫలితం పాణ్యం స్థానానిది వెలువడింది. పోస్టల్ బ్యాలెట్ల నుంచి మొదలైన వైఎస్సార్సీపీ ఆధిపత్యం చాలా నియోజకవర్గాల్లో చివరి రౌండ్‌వరకు కొనసాగుతూనే వచ్చింది. కోట్ల, కేఈ కుటుంబాలకు గుణపాఠం మొదటి నుంచి ఉప్పు–నిప్పుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు తమ మధ్య విభేదాలు మరిచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. కర్నూలు పార్లమెంటు నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేయగా.. పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. ముఖ్యంగా కోట్ల, కేఈ కుటుంబాలు కర్నూలు పార్లమెంటు పరిధిలో కలియతిరిగి.. గతంలో తమ వల్ల దెబ్బతిన్న కుటుంబాలు కలిసి పనిచేయాలని కోరారు. అయితే, వీరి వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చింది. ఈ కుటుంబాల రాజకీయాల వల్లనే కర్నూలు పార్లమెంటు వెనుకబడి ఉందన్న భావన వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి మరోసారి తమను మోసం చేసేందుకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఫలితంగా ఈ రెండు కుటుంబాలు పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ భారీ ఓటమిని గిఫ్టుగా ఇచ్చారు. గెలిచిన డాక్టర్లు కోడుమూరు నియోజకవర్గం నుంచి డెంటల్ డాక్టర్ జె. సుధాకర్, కర్నూలు పార్లమెంటు నుంచి డాక్టర్ సంజీవ్‌కుమార్ బరిలో నిలిచారు. ఇద్దరూ రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ప్రజాసేవ చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్లను కేటాయించింది. ఈ ఇద్దరూ రాజకీయ ఉద్దండులతోనే పోటీ పడ్డారు. కర్నూలు పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఆయనపై రాజకీయాలకు కొత్తగా వచ్చి పోటీ చేసిన సంజీవ్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక కోడుమూరు నుంచి బరిలో ఉన్న డాక్టర్ సుధాకర్ కూడా రాజకీయాలకు కొత్తే. ఈ నియోజకవర్గంలో ఒకవైపు కోట్ల, మరోవైపు విష్ణువర్దన్ రెడ్డితో పాటు కొత్తకోట ప్రకాష్ రెడ్డికూడా టీడీపీలోనే ఉన్నారు. వీరందరూ మూకుమ్మడిగా టీడీపీ అభ్యర్థి అయిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రామాంజినేయులుకు మద్దతు పలికారు. అయితే, కోట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన కోట్ల హర్షవర్దన్ రెడ్డి, రిటైర్డు ఎస్ఈ కృష్ణారెడ్డి వంటి నేతలు వైఎస్సార్సీపీ వెంట నడిచారు. అటువంటి రాజకీయ ఉద్దండులను వీరందరూ కలిసి ఢీ కొట్టి వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ సమకూర్చారు. వరుసగా రెండోసారి... డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుగ్గన డోన్ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. వరుసగా రెండోసారి... డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుగ్గన డోన్ నుంచి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు. రెండోసారి కూడా కేఈ ప్రతాప్‌పైనే విజయం సాధించారు. ఇక ఆలూరు నుంచి కూడా గుమ్మనూరు జయరాం వరుసగా రెండోసారి గెలుపొందారు. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. కాటసాని ఆరోసారి.. అతి చిన్నవయసు నుంచే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చరిత్ర కాటసాని రాంభూపాల్రెడ్డిది. 1985, 1989, 1994, 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి పాణ్యం శాసనసభ్యునిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విధేయునిగా ఉన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపై పార్టీ అభిమానులు, పాణ్యం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణరెడ్డికి నివాళి జిల్లా చరిత్రలో పత్తికొండకు ప్రత్యేక స్థానం ఉంది. కరువు పీడిత ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ను పోషించే ముఠా నాయకుల ఆగడాలను నిరోధించేందుకు చెరుకులపాడు నారాయణరెడ్డి చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన ప్రజలతో మమేకమైన తీరును చూసి ఎన్నికల్లో తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే కుట్రతో నారాయణరెడ్డిని అంతమొందించారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఆయన సతీమణి కంగాటి శ్రీదేవికి జిల్లాలో తొలి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయిస్తూ బహిరంగసభలో ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన కంగాటి శ్రీదేవి అలుపెరగని పోరాటం సాగించి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపు నారాయణరెడ్డికి ఘనమైన నివాళియేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. త్యాగానికి విజయ‘ఫలం’! గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు మంత్రి పదవుల కోసం పాకులాడి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పచ్చపార్టీలో చేరి మంత్రులుగా వెలగబెట్టిన నేతలకు బుద్ధి చెప్పేలా వ్యవహరించిన ఏకైక నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలకు కట్టుబడి తన ఎమ్మెల్సీ పదవిని తృణపాయంగా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తద్వారా పార్టీ అభిమానుల్లో, ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆయన చేసిన త్యాగానికే విజయం వరించిందని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన వారు వీరే.. అసెంబ్లీ నియోజకవర్గం పేరు గెలిచిన అభ్యర్థి ఆలూరు గుమ్మనూరు జయరాం పాణ్యం కాటసాని రామిరెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రాలయం వై.బాలనాగి రెడ్డి ఆదోని వై.సాయి ప్రసాద్ రెడ్డి ఆళ్లగడ్డ గంగుల బీజేంద్రా రెడ్డి కోడుమూరు(ఎస్సీ) డాక్టర్ సుధాకర్ నంద్యాల శిల్పా రవించంద్ర కిశోర్ రెడ్డి ఎమ్మిగనూరు ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కర్నూలు హఫీజ్ ఖాన్ నందికొట్కూరు టి.ఆర్థర్ బనగానపల్లె కాటసాని రామిరెడ్డి పత్తికొండ కంగాటి శ్రీదేవి శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి ఎంపీలు కర్నూలు సింగరి సంజీవ్ కుమార్ నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి -
ఆమెను ఎంపీని చేస్తే ఇదేనా కృతజ్ఞత?
సాక్షి, కర్నూలు : సాధారణ మహిళగా ఉన్న బుట్టా రేణుకకు వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే కనీస కృతజ్ఞత కూడా లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య విమర్శించారు. ప్రాణం ఉన్నంతవరకూ జగన్ వెంటే నడుస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలతో బుట్టా రేణుక మనస్తాపం చెందినట్లు వెలువడ్డ వార్తలపై స్పందిస్తూ... గెలిచిన మూడో రోజే ఆమె భర్త పచ్చ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెంది ఉంటామో గుర్తించాలన్నారు. రహస్యంగా వెళ్లి సీఎం చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతలకు కొదవ లేదు ఫిరాయింపుదారులకు టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతోందో తెలుసుకోవాలని బుట్టా రేణుకకు బీవై రామయ్య సూచించారు. అక్కడ కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా వారికి మర్యాద ఇవ్వడంలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కర్నూలులోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఆయన నిన్న (ఆదివారం) విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీలో ప్రజాదరణ కలిగిన నాయకులకు కొదవలేదన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి ఏమాత్రం జరగ లేదన్నారు. విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెట్టి సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టనున్న పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
వెయిటింగ్ హాల్స్ ప్రారంభించిన ఎంపీ.
-
లోకేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన బుట్టా రేణుక
కర్నూలు : ప్రత్యేక హోదా రావడం లేదంని తీవ్ర మనస్తాపం చెందిన గుండెపోటుతో మరణించిన జి.లోకేశ్వరరావు (37) కుటుంబాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరామర్శించారు. శనివారం కర్నూలు జిల్లా గూడూరులోని లోకేశ్వరరావు నివాసానికి బుట్టా రేణుక విచ్చేశారు. ఈ సందర్భంగా లోకేశ్వరరావు భార్య కృష్ణవేణితో ఆమె మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా కృష్ణవేణికి రేణుకా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. -
'మంత్రాలయాన్ని పర్యాటక ఆలయంగా అభివృద్ధి చేస్తా'
కర్నూలు: తన సొంత జిల్లాలో ఉన్న మంత్రాలయం ఆలయాన్ని పర్యాటక ఆలయంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శనివారంతో ఆమె ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏడాది పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. కర్నూలు నియోజక వర్గంలో ఎంపీ నిధులతో రూ.2.5 కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పించినట్టు ఆమె తెలిపారు. కేంద్రం నుంచి జిల్లాకు అధిక నీరు తీసుకు రావడానికి కృషి చేస్తానని బుట్టా రేణుక ఈ సందర్భంగా తెలిపారు. -
విఐపి రిపోర్టర్ - కర్నూలు ఎంపి బుట్టారేణుక
-
వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతా : బుట్టా రేణుక
న్యూఢిల్లీ : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఆమె మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాను వైఎస్ఆర్ సీపీలోనే ఉన్నానని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు బుట్టా రేణుక పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే బాబును కలిసినట్లు చెప్పారు. రాజకీయంగా తనకు ఎలాంటి అనుభవం లేనందువల్లనే కొంత గందరగోళానికి గురైన మాట వాస్తవమని బుట్టా రేణుక అంగీకరించారు. అందువల్లే ఇటువంటి పరిణామాలు జరిగాయని ఆమె తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని బుట్టా రేణుక తెలిపారు. ఈ ఎపిసోడ్‌కు ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు ఆమె చెప్పారు. భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాదని బుట్టా రేణుక తెలిపారు. -
వైఎస్సార్ సీపీలోనే ఉన్నా: ఎంపీ రేణుక
సాక్షి, న్యూఢిల్లీ: తాను వైఎస్సార్ సీపీలోనే ఉన్నానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ఢిల్లీలోని ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను టీడీపీలో చేరడం లేదు. చంద్రబాబుకు అభినందనలు తెలిపేందుకే వచ్చాను. నా నియోజకవర్గం అభివృద్ధికి వారి సహాయం అవసరం ఉంది. అందుకే ఆయన్ను కలిశాను. నేను టీడీపీకి కేవలం అసోసియేట్ సభ్యురాలిగానే కొనసాగుతాను. ప్రజలకు ఏదో మంచి చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాను. వెనుకబడిన కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఆ మాట నిలబెట్టుకునేందుకు చాలా నిధులు అవసరం’’అని రేణుక చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచి టీడీపీ అసోసియేట్ సభ్యురాలిగా ఎలా కొనసాగుతారన్న విలేకరుల ప్రశ్నకు తాను ఆ విషయాలన్నీ ఆలోచించలేదంటూ సమాధానం దాటవేశారు. ఆమె భర్త టీడీపీలో చేరిన విషయమై ప్రశ్నించగా... తన వ్యక్తిగత అభిప్రాయం వేరని, తాను వైస్సార్సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. సాంకేతిక అంశాలపై తనకు అంతగా అవగాహన లేదన్నారు. ఒకవేళ పార్టీ అనర్హత వేటు వేస్తే మళ్లీ పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు... మళ్లీ పోటీ చేసే స్థోమత ఉంటే చేస్తాను, లేద ంటే సామాజిక సేవ చేసుకుంటానని సమాధానమిచ్చారు. టీడీపీకి అంశాల వారీగానే మద్దతు ఉంటుందన్నారు.