ఎల్లెల్సీ రైతుల కష్టాలు పరిష్కరిస్తా | llc dealt with Difficulties of farmers | Sakshi
Sakshi News home page

ఎల్లెల్సీ రైతుల కష్టాలు పరిష్కరిస్తా

Published Tue, Apr 29 2014 2:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఎల్లెల్సీ రైతుల కష్టాలు పరిష్కరిస్తా - Sakshi

ఎల్లెల్సీ రైతుల కష్టాలు పరిష్కరిస్తా

తుంగభద్ర దిగువ కాల్వ ఆయకట్టు రైతుల కష్టాలు పరిష్కరిస్తానని కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు.

ఆదోని టౌన్, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాల్వ ఆయకట్టు రైతుల కష్టాలు పరిష్కరిస్తానని కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం బుట్టారేణుక ఆదోనికి వచ్చారు. మార్కెట్ యార్డులో సాయి, పార్టీ కార్యకర్తలు, నాయకులతో  కలిసి బుట్టా ప్రచారం చేశారు.

మార్కెట్ యార్డులోని వ్యాపార సముదాయాలు, వ్యాపారస్తులు, హమాలీలు, ఉద్యోగుల వద్దకు వెళ్ళి అయ్యా, అక్కా, తాతా, అవ్వా, అంటూ అప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పనిచేస్తుందన్నారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక నుంచి తుంగభద్ర దిగువ కాలువ, ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు రావాల్సిన వాటా నీటికోసం కృషి చేస్తానన్నారు. పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా  పదవీ బాధ్యతలు చేపట్టగానే కర్నూలు పార్లమెంట్ పరిధిలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆదోని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. జననేతను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నాని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement