కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇక్కడ వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.