
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకుంది. సమితి చైర్మన్‌గా జి.సదానందగౌడ్, కార్యదర్శిగా ఎం.రాధాకృష్ణ, కోశాధికారిగా కె.కృష్ణ, ప్రచార కార్యదర్శిగా కల్వదర్శి చైతన్య, కో–చైర్మన్లుగా కొంగల వెంకట్, సిహెచ్.శ్రీనివాస్, జి.హేమచంద్రుడు, డీవీ రావ్, వైఎస్ శర్మ, అలీంబాబా ఎన్నికైనట్టు జాక్టో ఓ ప్రకటనలో తెలిపింది. ఉపాధ్యాయ సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలని ఈ సందర్భంగా జాక్టో తీర్మానించింది.