jacto
-
టీచర్స్ జాక్టో చైర్మన్‌గా సదానందగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకుంది. సమితి చైర్మన్‌గా జి.సదానందగౌడ్, కార్యదర్శిగా ఎం.రాధాకృష్ణ, కోశాధికారిగా కె.కృష్ణ, ప్రచార కార్యదర్శిగా కల్వదర్శి చైతన్య, కో–చైర్మన్లుగా కొంగల వెంకట్, సిహెచ్.శ్రీనివాస్, జి.హేమచంద్రుడు, డీవీ రావ్, వైఎస్ శర్మ, అలీంబాబా ఎన్నికైనట్టు జాక్టో ఓ ప్రకటనలో తెలిపింది. ఉపాధ్యాయ సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలని ఈ సందర్భంగా జాక్టో తీర్మానించింది. -
ఎస్ఎస్సీ స్పాట్‌ను బహిష్కరిస్తున్నాం: జాక్టో
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ (జాక్టో) ప్రకటించింది. బుధవారం ఈ మేరకు జాక్టో నాయకులు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి బహిష్కరణ నోటీసు అందించారు. కార్యక్రమంలో జాక్టో చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.మల్లారెడ్డి, ఆర్‌యూపీపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.జగదీశ్, టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేశ్, సింగరేణి టీచర్స్ అధ్యక్షుడు జి.ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డీఈఓ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం
– భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు – మంత్రి గంటా రాజీనామా చేయాలని డిమాండ్ – కార్యాలయాన్ని తెరవనియ్యకుండా అడ్డగింత – సీఎం తీరుపై అగ్రహం వ్యక్తం చేసిన టీచర్లు కర్నూలు సిటీ: బదిలీల్లో అశాస్త్రీయ పద్ధతులను నిరసిస్తూ ఫ్యాప్టో–జాక్టోల ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు.. డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో డీఈఓ కార్యాలయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆవేదనను పాటల రూపంలో వినిపించారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ..విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవన్నారు. బదిలీలు, హేతుబద్ధీకరణపై చర్చలకు పిలిచి.. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపాధ్యాయ సంఘాల నాయకులను అవమానపరిచారన్నారు. వేసవిలో బదిలీలు పూర్తి చేస్తామని చెప్పి స్కూళ్లు పునఃప్రారంభమవుతున్న సమయంలో షెడ్యూల్ ఇవ్వడంలో ఆంతర్యం అర్థం కావడం లేదన్నారు. వెబ్ కౌన్సెలింగ్, పని ఆధారిత పాయింట్లు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పందిచకుంటే ఈ నెల23న చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించలేని..మంత్రి గంటా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీఈఓ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన జరిపారు. సీఎం దృష్టికి సమస్య... ఉపాధ్యాయుల బదిలీల్లో అశాస్త్రీయమైన విధానాలను మార్చాలని జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు తంగడంచెలో ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం ఇచ్చారు. అయితే సీఎం సానూకూలంగా స్పందించక పోవడంతో ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాయి. టీచర్ల ఆందోళనకు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ఫ్యాప్టో, జాక్టో జిల్లా కన్వీనర్లు సురేష్‌కుమార్, వి.కరుణానిధిమూర్తి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సన్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు, జిల్లా అద్యక్షులు ఇస్మాయిల్, కమలాకర్, మరియానందం, ఏపీటీఎఫ్(257)జిల్లా అధ్యక్షుడు మాణిక్యంరాజు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణ, యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడు నరసింహూలు, జిల్లా కార్యదర్శి రామశేషయ్య, నాగమణి, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు సుబ్బరాయుడు, ప్రసాద్, పీఆర్టీయూ నాయకులు భార్గవరామయ్య, అపాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేడు ఫ్యాప్టో–జాక్టోల సమావేశం
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈనెల21వ తేదీన చేపట్టిన డీఈఓ కా ర్యాలయ ముట్టడిపై చర్చించేందుకు ఆదివారం ఫ్యాప్టో, జాక్టోల సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘాల జిల్లా కన్వీనర్లు సురేష్, వి.కరుణానిధిమూర్తిలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ప్రభుత్వ టౌన్ మెడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. -
వ్యతిరేక జీఓలు దగ్థం చేసిన టీచర్లు
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టామని, ఇందులో భాగంగా మంత్రి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా జారీచేసిన ఉత్తర్వులను పలుచోట్ల టీచర్లు దగ్థం చేశారని ఫాప్టో, జాక్టో నేతలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే1న సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలలను మూతవేయబోమని, బదిలీలకు పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఉండవని వెబ్ కౌన్సెలింగ్ ఉండదని మంత్రి గంటా శ్రీనివాసరావు తమకు హామీ ఇచ్చారని కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆ వేదికల నేతలు బాబురెడ్డి, హృదయరాజు పేర్కొన్నారు. సంఘాలు డిమాండ్లను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా 2500 ప్రాథమిక పాఠశాలలు మూతవేస్తుండడంతో దాదాపు 40 వేల మంది విద్యార్ధులు డ్రాపవుట్లుగా మారుతున్నారని చెప్పారు. హైకోర్టు తీర్పుపై ఆందోళన వద్దు: పీఆర్టీయూ విద్యాశాఖలో పదోన్నతులు జడ్పీ టీచర్లకు వర్తింపచేసే అంశంపై ప్రభుత్వ టీచర్లు వేసిన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీరాజ్ టీచర్లు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులురెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కమలాకర్‌రావు, శ్రీనివాసరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తీర్పుపై తదుపరి న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సాధిస్తామన్నారు. లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ కాలేదన్న కారణంతో హైకోర్టునుంచి ఈ తీర్పు వచ్చిందని, దీని ఆధారంగా ఏకీకృత సర్వీసుల కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధిస్తామని చెప్పారు. లెక్చరర్లకు షరతులు లేని అభ్యర్ధన బదిలీలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్లకు షరతులు లేని అభ్యర్ధన బదిలీలకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా నాలుగేళ్లుగా నిలిచిపోయిన ప్రిన్సిపాళ్ల పదోన్నతులు చేపట్టాలన్నారు. రిజిస్టర్డ్ సంఘాల నాయకులకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలి: ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం టీచర్ల బదిలీల్లో రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయసంఘం అధ్యక్షుడు సామల సింహాచలం ఒక ప్రకటనలో కోరారు. -
కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు.