ఎస్‌ఎస్‌సీ స్పాట్‌ను బహిష్కరిస్తున్నాం: జాక్టో  | JACTO Says we are Expulsion SSC Spot Valuation | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌సీ స్పాట్‌ను బహిష్కరిస్తున్నాం: జాక్టో 

Published Thu, Mar 29 2018 3:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

JACTO Says we are Expulsion SSC Spot Valuation

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఎస్‌సీ స్పాట్‌ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ తెలంగాణ ఎంప్లాయీస్‌ (జాక్టో) ప్రకటించింది. బుధవారం ఈ మేరకు జాక్టో నాయకులు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి బహిష్కరణ నోటీసు అందించారు.

కార్యక్రమంలో జాక్టో చైర్మన్‌ కె.రవీందర్‌రెడ్డి, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ మమత, టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.మల్లారెడ్డి, ఆర్‌యూపీపీటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సి.జగదీశ్, టీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేశ్, సింగరేణి టీచర్స్‌ అధ్యక్షుడు జి.ఎం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement