ssc
-
టెన్త్ ఫెయిల్, బైక్ మెకానిక్.. ఇప్పుడు రూ. 350 కోట్ల స్టార్ హీరో
మీరు ఇలాంటి హీరోను అరుదుగా చూస్తారు.. బహుషా భవిష్యత్‌లో కనిపించకపోవచ్చు. థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టొద్దని హుకూం జారీ చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో పాలాభిషేకాలు చేయొద్దని వేడుకుంటాడు. సినిమా విడుదల సమయంలో ఎలాంటి హంగామా, వేడుకలు వద్దని సూచిస్తాడు. ఇంతకీ ఎవరా స్టార్ అనుకుంటున్నారా..? కోలీవుడ్ హీరో అజిత్.. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రవర్తన ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులూ ఫిదా అవుతుండటం విశేషం.సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్అజిత్ నాన్న సుబ్రమణిది తమిళకుటుంబమే అయినప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన మోహినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దేశ విభజన తర్వాత కోల్‌కతాలో స్థిరపడ్డారు. పెళ్ళయ్యాక ఆయనకి సికింద్రాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదారేళ్లపాటున్నారు. రెండో సంతానంగా అజిత్ జన్మించారు. తర్వాత వారు చెన్నై వెళ్లి అక్కడే స్థరపడ్డారు. దీంతో అజిత్‌కి ఏ ప్రాంతీయ భాషా సరిగ్గా రాలేదు. ఆపై స్కూల్లో ఎప్పుడూ అట్టడుగు ర్యాంకే. చివరకు ఆయన్ను పదో తరగతి పరీక్షలకు కూడా అనుమతించలేదు. అలా ఖాళీగా ఉన్నప్పుడే ఓసారి వాళ్ల నాన్నతో ఆఫీసుకెళ్లాడు. అక్కడి ఎండీ గదిలో ఉన్న రేసు బైకుల ఫోటోలను చూసి ఫిదా అయ్యాడు. తానూ ఆ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు తయారీ కంపెనీలో మెకానిక్ పనిలో చేరాడు. అలా పదహారేళ్లకే రిపేరింగ్ నేర్చుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టాడు. కానీ, అతని తల్లిదండ్రులకి ఆ వర్క్ నచ్చలేదు..! మావాడు మెకానిక్ అంటే అందరూ నవ్వుతున్నారంటూ అజిత్‌పై వాళ్లనాన్న కోప్పడేవాడు. బలవంతంగా మెకానిక్ పనికి ఫుల్స్టాప్ పెట్టించి ఓ గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు.అక్కడ పనిచేస్తున్నా సరే, అజిత్ రేసులపైన ఆశలు వదులుకోలేదు. తన జీతం డబ్బు మొత్తం పెట్టి బైకు రేసుల్లో పాల్గొనేవాడు. కానీ , ఆ సమయంలో అజిత్‌కు ఎక్కువగా ఎస్పీబీ చరణ్ సాయపడ్డాడు. పదో తరగతిలో మొదలైన ఆ స్నేహమే అజిత్ సినిమాల్లోకి రావడానికి మూల కారణమైంది. గార్మెంట్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ ప్రారంభించిన అజిత్‌కు నష్టాలు వచ్చాయి. అన్నయ్య అమెరికాలో స్థిరపడ్డాడు. తమ్ముడు ఐఐటీ మద్రాసులో చేరాడు. వారికి డబ్బు సర్ధడమే కుటుంబానికి కష్టంగా మారింది. తొలి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది.. ఇప్పటికీ నో ఫోన్అప్పుడే గొల్లపూడి మారుతీరావు కుమారుడు సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా నిర్మాతకు అజిత్‌ను పరిచయం చేసింది ఎస్పీ బాలసుబ్రమణ్యమే.. అలా అజిత్ కెరీర్లో ఫస్ట్ సినిమా 'ప్రేమ పుస్తకం' తెలుగు పరిశ్రమ నుంచే పడ్డాయి. అక్కడ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఏమీ లేని స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 350 కోట్ల ఆస్తితో నిలదొక్కుకున్నాడు.ఈ కాలంలో మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించని సూపర్ స్టార్ ఒకరు ఉన్నారని చెబితే అది అజిత్ మాత్రమేనని చెప్పవచ్చు. సోషల్ మీడియాకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు. తనకంటూ యాక్టివ్ ఫ్యాన్ క్లబ్‌లు లేవు. ఎలాంటి వేడుకల్లో పాల్గొనడు. ప్రమోషనల్ యాడ్స్‌లో నటించడు. సినిమా, కారు రేసింగ్లలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు.అభిమాన సంఘాలు వద్దని ఎందుకు చెప్పారు..?రాజకీయాల్లో అజిత్ రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకు అభిమాన సంఘాలిను ఉపయోగించుకుంటున్నాడు అని ప్రచారం జరిగింది. దీంతో ఆ సంఘాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. సినిమా హీరోలను అభిమానించే వారికి గొప్ప గుణపాఠం కూడా చెప్పాడు. 'డియర్ సార్,మేడమ్.. ఒక సినిమా నటుడి కోసం మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. నేనొక మెకానిక్‌ని.. అక్కడి నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కారణం కరెక్ట్ సమయాన్ని ఉపయోగించడమే. నామీద ప్రేమతో మీరు సమయాన్ని వృథా చేయకండి. అందుకే ఈ అభిమాన సంఘాలను పూర్తిగా రద్దు చేస్తున్నాను. మీ పని అంత మీ కెరీర్‌పైనా పెట్టిండి. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరాలి. మీరు పట్టుదలతో కరెక్ట్‌గా సమయాన్ని ఉపయోగిస్తే భారీ విజయాలను అందుకుంటారు. -
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల్లోకి షూస్, సాక్స్‌లకు నో ఎంట్రీ
గాంధీ నగర్ : త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షూస్, సాక్స్‌లు ధరించొద్దని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఎక్కడంటే?గుజరాత్లో ఫిబ్రవరి 27 నుంచి పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు గుజరాత్ సెకండరీ,హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పలు సూచనలు ఇచ్చింది.పరీక్షల్లో జరిగే కాపీయింగ్‌ను అరికట్టేందుకే గుజరాత్ ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు షూస్,సాక్సులు ధరించకూడదని సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు మొబైల్, ఎలక్ట్రానిక్ వాచ్ లేదా ఎలాంటి గాడ్జెట్లు ధరించకూడదని ఆదేశించింది. ఇప్పటికే 2018 నుండి బీహార్ బోర్డు ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే,ప్రతికూల వాతావరణం కారణంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. బీహార్ బాటలో ఉత్తరప్రదేశ్ బోర్డు సైతం పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రమే షూస్,సాక్స్‌లు లేకుండా రావాలని తెలిపింది. తాజాగా,గుజరాత్ సైతం పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంది. కాగా,ఈ సంవత్సరం గుజరాత్లో 10వ తరగతి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 14.30 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
10 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 10వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలు రాయనున్నారు. షెడ్యూల్ ఇలా... 10వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1(కాంపోజిట్ కోర్సు), 11వ తేదీ సెకండ్ లాంగ్వేజ్, 12న ఇంగ్లిషు, 13న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2(కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 15న గణితం, 17న భౌతిక శాస్త్రం, 18న జీవ శాస్త్రం, 19న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ), 20న సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించనుంది. -
సచిన్ టెండుల్కర్ పదో తరగతితో ఆపితే.. అర్జున్ ఎంత వరకు చదివాడో తెలుసా? (ఫొటోలు)
-
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తాజా సవరణ మేరకు 2024–25 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.500 లేట్ ఫీజుతో వచ్చేనెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.ఫీజును www.bse.ap.gov.in లో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో నామినల్ రోల్స్ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్‌టికెట్ జారీకి ముందు ఎడిట్ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్ దేవానందరెడ్డి వివరించారు. ఫీజు వివరాలు ఇలా..⇒ అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి రూ.125 ⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110⇒ వొకేషనల్ విద్యార్థులు అదనంగా మరో రూ.60⇒ నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300⇒ మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు రూ.80 -
విద్యార్థులకు శుభవార్త: ఆ సబ్జెక్టుల్లో 20 వస్తే పాస్
ముంబై: మహారాష్ట్రలో గణితం, సైన్స్ సబ్జెక్టులంటే భయపడే విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అపార కరుణ చూపింది. ఇకపై రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షల్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో 20 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. గతంలో ఈ సబ్జెక్టులలో పాస్ కావాలంటే 100కు 35 మార్కులు తప్పనిసరిగా రావాలనే నిబంధన ఉంది.ఇంత మంచి వార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా పాసయ్యేవారి విషయంలో మరో మెలికకూడా పెట్టింది. వారు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక వారి మార్క్‌షీట్‌లో ఇకపై సదరు విద్యార్థి మ్యాథ్స్, సైన్స్ చదవలేరని రాస్తారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ రాహుల్ రేఖావర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ మార్పు పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆమోదించిన కొత్త పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌లో ఒక భాగమని తెలిపారు.రాష్ట్రంలో కొత్త పాఠ్యాంశాలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ శరద్ గోసావి తెలిపారు. హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ చదవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. ఇది కూడా చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే.. -
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో 73.0శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.అయితే వార్షిక పరీక్షల్లో పెయిలైన ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఆ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్ని https://results.sakshieducation.com/ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
తొలుత ఫెయిల్.. రీవాల్యుయేషన్లో 90% మార్కులు
దుండిగల్: పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురతున్నారు. వా ల్యుయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదోతరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. రీవాల్యుయేషన్లో అదే విద్యార్థిని 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయనగర్‌కు చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్‌గాం«దీనగర్‌లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.ఇటీవల పరీక్షలను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఎంతో కష్డపడ్డానని, 9.5 గ్రేడ్ సా«ధిస్తానని నమ్మకముందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకుని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి.. ధైర్యా న్ని నింపారు.తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్ట్‌కు రీవ్యాలుయేషన్ పెట్టించారు. మొదట రాసిన పరీక్షల్లో అన్ని సబ్టెక్టుల్లో 9, 10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి, తిరిగి రీవాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కు లు వచ్చాయి.9.3 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఎగ్జామినర్లదే తప్పు..పదవ తరగతి జవాబు పత్రాలను ముగ్గురు అధికారులు దిద్దుతారు. ముందుగా విద్యార్థి జవాబు పత్రాన్ని అస్టిసెంట్ ఎగ్జామినర్ తప్పు ఒప్పులను పరిశీలించి సరైన సమాధానాలకు మార్కులు వేస్తారు. ఆ పత్రాలను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన అనంతరం స్పెషల్ అసిస్టెంట్ అధికారి మరోసారి విద్యార్థికి వచి్చన మార్కులను కూడి పునఃపరిశీలిస్తారు. కానీ ఇక్కడ లతశ్రీ పేపరును దిద్దిన ముగ్గురు అధికారులూ అజాగ్రత్తగా వ్యవహరించారు.రీ వ్యాలుయేషన్ చేసిన అనంతరం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోర్డు కార్యాలయానికి పిలిచారు. రీ కరెక్షన్లో మీ అమ్మాయి పాసైందని, ఎస్ఎస్íసీ సరి్టఫికెట్ తీసుకెళ్లండని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, గీతాంజలి పాఠశాల ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బోర్డు అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎగ్జామినర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మరో 10,542 టెన్త్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సంబంధించి మరో 10,542 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. మొత్తం 55,996 మంది రీ వెరిఫికేషన్/ రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.మార్కుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసిన 43,714 మంది జవాబు పత్రాలను ఈ నెల 23న ఆయా స్కూళ్లకు ఆన్లైన్లో పంపించారు. మరో 10,542 మంది జవాబు పత్రాలను సోమవారం ఆయా స్కూళ్లకు పంపించగా, మిగిలిన 1,710 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసి త్వరలోనే పంపిస్తామని తెలిపారు. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని సోమవారం వర్చువల్ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండేలా చూడాలని సూచించారు.ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్స్ జారీ చేస్తామని చెప్పారు. మాల్ ప్రాక్టీసెస్‌కు పాల్పడితే ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్టు 1997 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. 0866–2974540 లేదా, dir-govexmas@yahoo.com లో సంప్రదించాలన్నారు.పరీక్షల నిర్వహణ తేదీలిలా..ఫస్ట్ లాంగ్వేజ్ 24–05–24సెకండ్ లాంగ్వేజ్ 25–05–24థర్డ్ లాంగ్వేజ్ 27–05–24మాథమెటిక్స్ 28–05–24ఫిజికల్ సైన్స్ 29–05–24బయోలాజికల్ సైన్స్ 30–05–24సోషల్ స్టడీస్ 31–05–24ఓఎస్ఎస్సీ పేపర్–1 01–06–24ఓఎస్ఎస్సీ పేపర్–2 03–06–24 -
TS 10th ఫలితాలు విడుదల
-
TS SSC 2024 Results: ఒక్క క్లిక్‌తో టెన్త్ రిజల్ట్స్ చూస్కోండి
క్లిక్ చేయండి పదో తరగతి ఫలితాలు చెక్ చేస్కోండి -
నేడే టెన్త్ ఫలితాలు..
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 11 గంటలకు ఫలితాలను అధికారి కంగా విడుదల చేస్తారు. టెన్త్ పరీక్షల విభా గం డైరెక్టర్ కృష్ణారావు ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను http:// results. bse.telangana.gov.in, http://results.bsetela అనే వెబ్సైట్లలో చూడవచ్చని తెలిపారు.‘సాక్షి’లో వేగంగా ఫలితాలు ఇంటర్మీడియెట్ ఫలితాలను అందించిన విధంగానే టెన్త్ ఫలితాలను శరవేగంగా అందించేందుకు ‘సాక్షి’ దినపత్రిక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది.www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఫలితాలను చూడవచ్చు. -
పది పరీక్ష రాశారా? మా కాలేజీలో చేరండి
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి. ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా.. ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టార్గెట్ పెడుతూ.. కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13 మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45 ప్రైవేట్ కళాశాలలు 14 భారీగా ఫీజులు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. – రవీంద్రకుమార్, డీఐఈవో -
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. - గత వారం రోజుల క్రితం క్రిష్టియన్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్‌లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచే.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్‌ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్‌పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
టెన్త్, ఇంటర్లో భారీగా ‘రీ అడ్మిషన్లు’
సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దాంతో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్ తీసున్న వారిని ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తారు. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పబ్లిక్ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్ పేపర్లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్ విద్యార్థుల సర్టీఫికెట్లపై ప్రైవేట్/కంపార్ట్మెంటల్/స్టార్ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్’ అని గుర్తింపు ఇస్తారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు. ఒక్కసారే అవకాశం ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్‌తో పాటు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జెక్టులు పాసైతే ‘రెగ్యులర్’ సర్టీఫికెట్ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే. -
TS: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం రోజు ఉదయం 9.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు తెలంగాణ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ శనివారం ఓ ప్రకటనలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్.. ► మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు) ► మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్( హింది) ► మార్చి 21 న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) ► మార్చి 23న మాథ్స్ ► మార్చి 26 న సైన్స్ పేపర్ 1(ఫిజిక్స్) ► మార్చి 28న సైన్స్ పేపర్ 2(బయాలజీ) ► మార్చి 30న సోషల్ స్టడీస్ చదవండి: కొండా సురేఖ, పల్లా వాగ్వాదం... ఎందుకంటే -
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి నవంబర్ 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ నుంచి 16 వరకు రూ.50, 17వ తేదీ నుంచి 22 వరకు రూ.200, 23వ తేదీ నుంచి 30 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల హెచ్ఎంలు నిర్ణి త సమయంలో ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు. -
'కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి' ఆప్తులమంటూ నమ్మించి.. మోసం!
కర్ణాటక: బెస్కాంలో మీటర్ రీడర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు దండుకొని నకిలీ నియామక పత్రాలు జారీ చేసి పంగనామం పెట్టిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో వెలుగు చూసింది. పదో తరగతి, ఐటీఐ పాసైన 15 మంది నిరుద్యోగ యువకుల నుంచి దేవదుర్గ తాలూకా గబ్బూరుకు చెందిన సురేష్, బసప్ప, నేతాజీ, వేణు, హసన్ అనే వ్యక్తులు తాము కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆప్తులమంటూ నమ్మించి డబ్బు వసూలు చేశారు. అనంతరం బెంగళూరు ఎంఎస్ భవన్లో అభ్యర్థులకు నకిలీ ఇంటర్వ్యూలు జరిపించారు. అనంతరం ఐడియా ఇనఫిటి కంపెనీలో శిక్షణకు సిఫార్సు చేసినప్పుడు అసలు బండారం బయట పడింది. లింగసూగూరుకు చెందిన విక్రం సింగ్ రూ.13 లక్షలు, శరణప్ప రూ.12 లక్షలు, ప్రభుగౌడ రూ.9 లక్షలు, ఆనంద్ రూ.6 లక్షలు, దేవరాజ్ రూ.12 లక్షలు, బలరాం రూ.12 లక్షలు, వెంకట సింగ్ రూ.12లక్షలు, రాజు రూ.7 లక్షలు, రాహుల్ రూ.7లక్షలు, ముస్తాఫా రూ.3 లక్షలు ఇచ్చినట్లు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
AP 10th Class Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల..
సాక్షి, అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల వివరాలను వెల్లడించారు. ఇక, పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లి దండ్రులు ధైర్యం చెప్పాలి ప్రభుత్వ చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి బొత్స తెలిపారు.రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 18 రోజుల్లో ఫలితాలు ప్రకటించమని, పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వరకూ పకడ్బందీగా వ్యవహరించామన్నరు. తక్కువ ఉత్తీర్ణీత వచ్చిన ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గతేడాది పేపర్ లీక్‌కు పాల్పడిన 70 మందికి పైగా టీచర్లను అరెస్ట్ చేశామన్నారు.ఈ ఏడాది ఆరోపణలు రాకుండా టెన్త్ పరీక్షలు నిర్వహించమన్న బొత్స.. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహం చెందవద్దన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని బొత్స సూచించారు. - ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత). - నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది(60 శాతం). - ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. - జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. - మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో ఏప్రిల్ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి చేశారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.... BSEAP అధికారిక సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి. హోమ్ పేజీలో AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి కొన్ని క్షణాల్లో మీ ఫలితం తెరపై కనబడుతుంది ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్లోడ్ చేయండి -
ఏపీలో పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ వేతనం పెంపు
-
టెన్త్ పేపర్ లీక్ కేసులో నిందితులకు బెయిల్
సాక్షి, వరంగల్: కమలాపూర్‌లో టెన్త్ పేపర్ లీక్ వ్యవహరానికి సంబంధించిన కేసులో.. నిందితులకు కోర్టు ఊరట లభించింది. ముగ్గురికి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది స్థానిక కోర్టు. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ5 శివగణేష్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు. అలాగే.. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు మెజిస్ట్రేట్. ఇదిలా ఉంటే.. పోలీస్ కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై నిన్న(సోమవారం) సైతం వాదనలు జరిగాయి. కస్టడీ పిటిషన్ వేసిన దృష్ట్యా బెయిల్ ఇవ్వద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బెయిల్ లభించడంతో.. మిగతా నిందితులకూ బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరపున న్యాయవాదులు కోరారు. వాదోపవాదనల అనంతరం తీర్పును ఈరోజు(మంగళవారం) వాయిదా వేసిన మెజిస్ట్రేట్. చివరకు.. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక దశకు సిట్ విచారణ -
టెన్త్ పరీక్షా పేపర్ లీక్ కేసు కొత్త మలుపులు
-
వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-
బండి సంజయ్ పిటిషన్‌పై నేడు హై కోర్టు విచారణ
-
బండి సంజయ్‌పై నమోదైన కేసు ఇదే.. ఏం జరిగిందని అమిత్‌షా ఆరా..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నాటకీయ పరిణామాల మధ్య కరీంగనర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. అరెస్టు విషయంపై ఆరా తీశారు. సంజయ్ అరెస్టు పరిణామాలను కిషన్ రెడ్డి అమిత్‌షాకు వివరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సంజయ్ అరెస్టుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలని రాష్ట్ర బీజేపీ నేతలను అధిష్టానం ఆదేశించింది. సంజయ్‌ను అరెస్టు చేసిన అనంతరం బొమ్మలరామారం పీఎస్‌కు తరలించిన పోలీసులు కాసేపట్లో హన్మకొండ కోర్టులో హాజరుపర్చనున్నారు. సంజయ్‌పై కమాలపూర్ పీఎస్‌లో పేపర్ లీకేజీ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. క్రైం నెం.60/2023, ఐపీసీ 420 సెక్షన్ 4(ఏ), 6 టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్, 66-డీ ఐటీఏ-2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కమలాపూర్ హెడ్మాస్టర్ శివప్రసాద్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని విద్యార్థులు ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఫొటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారని, తప్పని పరిస్థితుల్లో సంజయ్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. మంగళవారం అర్ధరాత్రి 12:15 గంటలకు సంజయ్‌ను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు కరీంనగర్ టూ టౌన్‌లోనూ బండి సంజయ్‌పై సెక్షన్ 151 కింద మరో కేసు నమోదైంది. చదవండి: బండి సంజయ్ అరెస్ట్.. రంగంలోకి అమిత్ షా! -
టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
పేపర్ లీక్ అయ్యిందనడం సరికాదు: వరంగల్ సీపీ
సాక్షి, వరంగల్: తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ.. తాజాగా మొదలైన పదో తరగతి పరీక్షల్లోనూ పేపర్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా హిందీ క్వశ్చన్ పేపర్ సైతం వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో.. ఇవాళ్టి హిందీ క్వశ్చన్ పేపర్ పరీక్ష సమయంలోనే బయటకు వచ్చిన విషయాన్ని ధృవీకరించారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్. పేపర్ బయటకు వచ్చిన అంశంపై సైబర్ క్రైమ్ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. పేపర్ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. ఎగ్జామ్ ప్రారంభమైన గంట తర్వాత పేపర్ వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చింది. అంటే.. దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందన్నమాట!. కాబట్టి దీనిని లీక్ అనడం సరికాదు. పరీక్ష మధ్యలో ఉండగానే పేపర్ బయటకు వచ్చిందనే మేం భావిస్తున్నాం. ఒక మీడియా ఛానెల్ మాజీ రిపోర్టర్ ద్వారా పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని తేలింది. అయితే.. అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. బహుశా ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని భావిస్తున్నాం. ఈ అంశంపై విచారణ జరుగుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం కల్లా విచారణ పూర్తి చేస్తాం అని కమిషనర్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్, ఇవాళ్టి హిందీ పరీక్ష పత్రం ఒక్కటే అని తేలింది. అయితే.. ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలియదంటూ వరంగల్ హన్మకొండ డీఈవోలు వాసంతి, అబ్దుల్‌లు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా పరిధిలోని ఓ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లోనే పేపర్ పెట్టినట్లు తెలుస్తున్నా.. అధికారికంగా అది ధృవీకరణ కావాల్సి ఉంది. -
కోహ్లి 10th క్లాస్మార్క్స్ లిస్ట్ వైరల్.. వామ్మో ఇన్ని మార్కులా!
టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2022 సీజన్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన విరాట్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాడు. కాగా వరుసగా 16వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ తరపున విరాట్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 223 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 6624 పరుగులతో ఐపీఎల్ టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కింగ్ కోహ్లి.. తాజాగా ఎవరూ ఊహించని ఫోటోను షేర్ చేశాడు. విరాట్ తన 10వ తరగతి మార్క్షీట్కి సంబంధించిన ఫోటోను 'కూ' యాప్‌లో షేర్ చేశాడు. "మార్క్స్‌షీట్‌లో ఏయే అంశాల్లో తక్కువ మార్క్‌లు వస్తాయో అవే మన వ్యక్తిగత జీవితాన్ని నిర్ణయించడానికి ఎక్కువ ప్రాధాన్యం అవడం హాస్యాస్పదం అనిపిస్తుంది అని"కోహ్లి క్యాప్షన్‌గా ఇచ్చాడు. కాగా కింగ్ కోహ్లి తన 10వ తరగతిని 2004లో పూర్తి చేశాడు. ఇక విరాట్‌కు తన 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయో ఓ లూక్కేద్దం. కోహ్లీ ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ & టెక్నాలజీలో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు సాధించాడు. అత్యధికంగా ఇంగ్లీష్‌లో 83 మార్క్‌లు వచ్చాయి. ఇక విరాట్ మార్క్‌షీట్‌పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది కోహ్లి తెలివైన స్టూడెంట్ అని, మరి కొంత మంది మ్యాథ్స్‌లో కొంచెం వీక్‌గా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్! It's funny how the things that add the least to your marksheet, add the most to your character. 10th Marksheet of @imVkohli जय श्री राम#ViratKohli𓃵 pic.twitter.com/fm97q2JHMl — Raj (@MSD071845) March 30, 2023 -
టెన్త్ మోడల్ పేపర్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 3 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను ఎస్సెస్సీ పరీక్షల విభాగం గురువారం విడుదల చేసింది. వందశాతం సిలబస్ నుంచి వీటిని రూపొందించారు. కోవిడ్ తర్వాత ఈ తరహా పరీక్ష జరపడం ఇదే మొదటిసారి. 2020లో 3 సబ్జెక్టులు నిర్వహించిన తర్వాత కోవిడ్ ఉధృతి దృష్ట్యా పరీక్షలను వాయిదా వేశారు. 2021లో అసలు పరీక్షలే నిర్వహించలే దు. 2022లో పరీక్షలు పెట్టినా 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయి సిలబస్‌తో నిర్వహించనున్నారు. దీంతో టెన్త్ పరీక్షల విధానం పూర్తిగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కృషి చేసేందుకు ఇదే సరై న మార్గమని అభిప్రాయపడుతున్నారు. గతంలో పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించారు. ఇది కూడా కొత్త విధానం కావడంతో అవగా హన కల్పించాలని హెచ్ఎంలకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి, జనవరిలో రివిజన్ చేపట్టడంతోపాటు, బోర్డు విడుదల చేసిన మోడల్ పేపర్లతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని చెప్పింది. ఏయే చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు రావొచ్చు, మార్కులు ఎలా ఉంటాయనే వివరాలను, మోడల్ పేపర్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీటిని అనుసరిస్తే మంచి మార్కులు సాధించవచ్చని అధికారులు అంటున్నారు. -
టెన్త్‌లో ఆరు పేపర్లే.. విద్యాశాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఇక నుంచి ఆరు పేపర్లతోనే జరగనున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల నుంచే దీన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు పరీక్షల తీరుపై స్పష్టతనిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 9వ తరగతి పరీక్షలు కూడా ఇదే విధంగా ఉంటాయని తెలిపారు. ఆరు పేపర్లతో జరిగే పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రాంతీయ అధికారులు, పాఠశాలల హెచ్ఎంలు ఇప్పట్నుంచే ఈ దిశగా అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. మొదట్నుంచీ గందరగోళం టెన్త్ పరీక్షలపై ఈ ఏడాది మొదట్నుంచీ గందరగోళం నెలకొంది. కోవిడ్‌కు ముందు వరకు 11 పేపర్లతో టెన్త్ పరీక్షలు జరిగేవి. కోవిడ్ కారణంగా గతేడాది పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. ఈ ఏడాది సకాలంలో బడులు తెరవడంతో గతంలో మాదిరిగానే 11 పేపర్లతో పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తొలుత పేర్కొంది. అయితే సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–1) పరీక్షలకు సన్నద్ధమైన సమయంలో ఆరు పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. కానీ అప్పటికే 11 పేపర్లకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పన పూర్తవడం, ప్రింటింగ్‌కు ఆర్డర్లు ఇవ్వడంతో.. మార్చేదెలా అని ఉపాధ్యాయ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీనివల్ల ఎస్ఏ–1 పరీక్షను 11 పేపర్లతో నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు ఎస్ఏ–1 పరీక్షను 11 పేపర్లతో రాసిన తర్వాత.. వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతో రాయాల్సి ఉండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని హెచ్ఎంలు, టీచర్లు విద్యా శాఖ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత విద్యా సంవత్సరం 11 పేపర్లతో వార్షిక పరీక్ష నిర్వహించడంపై విద్యాశాఖ ఆలోచన చేసింది. కానీ తాజాగా ఆరు పేపర్లతోనే పరీక్షలంటూ ఆదేశాలు జారీ చేసింది. 11 పేపర్లకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించలేదని, అందుకే ఈ ఆదేశాలు ఇచ్చామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇలా పరీక్షలు మార్చడం సరికాదు వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. సంవత్సరం మధ్యలో మార్పులు చేపడితే విద్యార్థులు గందరగోళంలో పడే అవకాశం ఉంటుంది. ఎస్ఏ–1 పరీక్షలు వార్షిక పరీక్షలకు ప్రిపరేషన్‌గా చూడాల్సి ఉంటుంది. ఇదే మాదిరి పరీక్షలు ఉంటే బాగుంటుంది. – రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
సాక్షి, చిత్తూరు: పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురయ్యింది. చిత్తూరు కోర్టు బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు, మిగిలిన వారు నారాయణకు చెందిన స్కూల్ సిబ్బంది ఉన్నారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. -
AP: టెన్త్.. నో టెన్షన్
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో నూతన సంస్కరణల వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌కు టెన్త్ కీలక మలుపు. పదో తరగతి పరీక్షలంటే విద్యార్థుల్లో ఎక్కడాలేని భయం. ఈ భయాన్ని పోగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో సమూల మార్పులు తీసుకు వచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు. నెల్లూరు (టౌన్): టెన్త్ పరీక్షలంటే.. ఇక నో టెన్షన్. విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో విద్యార్థులపై చదువులు, ర్యాంక్‌లు, మార్కులు ఒత్తిడి తగ్గనుంది. తద్వారా నాణ్యమైన విద్య ప్రమాణాలు అందనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లనే ఉండడంతో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గుతుందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 420 వరకు ఉన్నాయి. వీటిల్లో 35 వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గతంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు ఉండేవి. హిందీ మినహా మిగిలిన ఒక్కో సబ్జెక్ట్‌కు రెండు పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా గతేడాది çపది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మార్కులు కేటాయించారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచి పది పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు భారం తగ్గడంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పది పబ్లిక్ పరీక్షల్లో తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిల్లో హిందీకి తప్ప మిగిలిన సబ్జెక్ట్‌లకు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరహాలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక్కో పరీక్షను మాత్రమే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మోడల్ పేపర్లను సిద్ధం చేసి ఉపాధ్యాయులకు అందజేశారు. చదువుకునేందుకు ఎక్కువ సమయం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లకు తగ్గించడంతో విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఎక్కువ రోజులు పరీక్షలు జరగకుండా నూతన పరీక్ష విధానం వల్ల పరీక్షలు కేవలం 6 రోజుల్లోనే ముగిసిపోతాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల సమయంలో ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులు టెన్షన్‌ను పక్కన బెట్టి రాసేందుకు సిద్ధమవుతారు. – పి. రమేష్, డీఈఓ ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు నిర్వహించాలని నిర్ణయించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల్లో తక్కువ పేపర్లు నిర్వహించడం వల్ల చదువుకునేందుకు సమయం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు టెన్షన్ కూడా తగ్గుతుందంటున్నారు. నూతన జిల్లాల్లోనే పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించారు. -
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
-
10th Class Exams: టెన్త్‌లో ఈ ఏడాదీ 7 పేపర్లే..
సాక్షి, అమరావతి: వచ్చే మార్చిలో జరగనున్న 2021–22 విద్యాసంవత్సరపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో నంబర్ 79ను విడుదల చేశారు. కోవిడ్ కారణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఈ ఏడాది కూడా ఏడు పేపర్లకు కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో టెన్త్ పరీక్షలకు 6 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. కరోనా ఉధృతి కారణంగా 2019–20, 2020–21లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు ఏడింటికి కుదించిన సంగతి తెలిసిందే. అయినా పరీక్షలను నిర్వహించలేకపోయారు. 2019–20 విద్యాసంవత్సరంలో విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించి మార్కులు, గ్రేడ్లు లేకుండా ధ్రువపత్రాలు ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఆపై తరగతుల్లో చేరేందుకు, కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. 2020–21లో కూడా టెన్త్ పరీక్షలను నిర్వహించలేక విద్యార్థులను ఆల్‌పాస్‌గా పేర్కొన్నప్పటికీ.. వారి పైచదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారి అంతర్గత మార్కులను అనుసరించి గ్రేడ్లు ప్రకటించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఛాయారతన్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్, ఇంటర్ విద్యార్థులకు వారి అంతకు ముందరి తరగతుల్లోని అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. 2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది టెన్త్ విద్యార్థులకు ఇలా అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. -
సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!
ఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల పరీక్షా పత్రంలో వచ్చిన ఒక వివాదాస్పద వ్యాసం తీవ్ర దుమారం రేపింది. దాంతో దీన్ని ఉపసంహరిస్తున్నామని సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. విద్యార్థులందరికీ ఈ ప్రశ్నకు సంబంధించి ఫుల్ మార్కులు ఇస్తామని పేర్కొంది. వ్యాసంలో అంశాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బోర్డు, ఇది ఒక దురదృష్ట ఘటనగా అభివర్ణించింది. విద్యాభ్యాసనలో సమానత్వానికి, శ్రేష్టతకు సీబీఎస్ఈ కట్టుబడి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. సీబీఎస్ఈ 10వ తరగతి ఇంగ్లిషు టర్మ్ 1 ప్రశ్నాపత్రంలోని ఒక వ్యాసంలో లైంగిక వివక్ష, తిరోగామి విశ్వాసాలను ప్రతిబింబించే అభిప్రాయాలున్నాయని శనివారం తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే సీబీఎస్ఈ అప్రమత్తమైంది. ఈ వ్యాసంలో ‘‘ పిల్లలపై తల్లిదండ్రుల అధికారాన్ని స్త్రీ విముక్తి నాశనం చేసింది’’, ‘‘భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే పిల్లల విధేయతను తల్లి పొందగలదు’’ అనే వాక్యాలున్నాయి. ‘‘స్త్రీ స్వాతంత్య్రం అనేక సామాజికార్థిక సమస్యలకు కారణమైంది, భర్తకు భార్య విధేయత చూపకపోవడంతో పిల్లల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగింది’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో సీబీఎస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో సీబీఎస్ఈ ‘ఇన్సల్ట్స్ ఉమెన్’ పేరిట హ్యాష్‌ట్యాగ్‌లు దర్శనమిచ్చాయి. బోర్డు స్త్రీద్వేష, తిరోగామి భావనలకు మద్దతినిస్తోందని పలువురు దుయ్యబట్టారు. దీంతో స్పందించిన బోర్డు సదరు వ్యాసం తమ ప్రశ్నాపత్రాల రూపకల్పనా నిబంధనలకు అనుగుణంగా లేదని, విద్యార్ధులకు పూర్తి మార్కులు కేటాయిస్తామని బోర్డు పరీక్షా కంట్రోలర్ సన్యామ్ భరధ్వాజ్ ప్రకటించారు. లోక్‌సభలో ప్రస్తావించిన కాంగ్రెస్ సీబీఎస్ఈ పరీక్షా పత్రంలోని వ్యాసం అసంబద్ధం, స్త్రీ ద్వేషపూర్వకమని కాంగెస్ర్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. చదువు, పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలు నాసిరకంగా మారాయని ఈ వ్యాసం నిరూపిస్తోందన్నారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించి పభ్రుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షలో స్త్రీద్వేష పూర్వక వ్యాసం ప్రత్యక్షమవడమై తీసుకున్న చర్యలకు సంబంధించి ఈనెల 17లోగా నివేదిక ఇవ్వాలని సీబీఎస్ఈకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
AP: టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 55 విడుదల చేశారు. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి వరకు గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. 2018–19 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలలో గ్రేడింగ్ విధానం అమలు చేశారు. కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల విద్యార్థులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో విద్యార్థులు ఆయా తరగతుల్లో ఏడాదిపాటు నిర్వహించిన పరీక్షల్లో అంతర్గత మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు. చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ ఫలితాలను ఇచ్చారు. హైపవర్ కమిటీ సూచన మేరకు విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులను కూడా అవార్డు చేయనున్నారు. పై చదువులకు, ఉపాధి అవకాశాలకు మెరిట్ నిర్ణయించేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2019–20 బ్యాచ్ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇస్తారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా -
TS: రేపు పదోతరగతి ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి విద్యార్థుల ఫలితాలను ఈ నెల 21న (శుక్రవారం) విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. వాటిని మరోసారి పరిశీలిస్తోంది. ఒకవేళ ఆ రోజు వీలుకాకపోతే 22వ తేదీన విడుదల చేయనుంది. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. ఎఫ్ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ఖరారు చేసి ప్రకటించనుంది. దీంతో ఈసారి 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. చదవండి: టీఎస్పీఎస్సీకి కొత్త కళ -
అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు భవిష్యత్తులో అన్నింటికీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హాయంలో ఈ నిర్ణయం గొప్ప సంస్కరణగా చెప్పవచ్చునని పేర్కొన్నారు. ఈ సంస్కరణ మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు మేలుజరగనుంది. అంతేకాకుండా అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు రావడానిక అయ్యే రవాణా ఖర్చులు, పరీక్ష ఫీజులు తగ్గుతాయి, అందుకుగాను నేషనల్ రిక్రూట్ ఎజెన్సీ (ఎన్ఆర్ఏ) ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్ఆర్ఏ సెట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ వివరించారు. ఎన్ఆర్ఏ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎన్ఆర్ఏ స్వతంత్ర బోర్ఢ్‌గా వ్యవహరించనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిర్వహించే పరీక్షలను ఈ బోర్డ్ నిర్వహించనుంది. ప్రస్తుతం ఎస్ఎస్సీ , ఆర్ఆర్బీ , ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. -
Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్యాట్రన్‌లో మార్పులు, గ్రూప్ కాంబినేషన్లు, నామినల్ రోల్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సవివర సూచనలను చేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం సర్క్యులర్ విడుదల చేశారు. పరీక్ష పేపర్లు, సమయం, మార్కులు తదితర అంశాలను అందులో వివరించారు. ఈ సర్క్యులర్ ప్రకారం.. ► ఈ పరీక్షలకు తొలిసారి హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులంతా తెలుగు భాషను ఫస్ట్ లాంగ్వేజ్ లేదా సెకండ్ లాంగ్వేజ్ కిందS తప్పనిసరిగా రాయాలి.► తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌గా ఉన్న విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ తప్పనిసరిగా రాయాలి.► ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగును ఎంచుకుంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌గా హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.►తమిళం, కన్నడ, ఒరియా తదితర మాతృభాషలను ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్‌గా తెలుగును తప్పనిసరిగా రాయాలి. పబ్లిక్ పరీక్షల్లో.. ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు.►ఏడు పేపర్లలో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు ఒక్కొక్కటి 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా ఉంటాయి.► ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ పేపర్–1.. 70 మార్కులకు, పేపర్–2.. 30 మార్కులకు ఉంటాయి.► లాంగ్వేజ్ పరీక్షలు, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్‌కు 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల (మొత్తం 3 గంటల 15 నిమిషాలు) సమయం ఇస్తారు. ►ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు రాసేందుకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలు (మొత్తం 2 గంటల 45 నిమిషాలు) ఇస్తారు.► 2017 మార్చిలో మొదటిసారి టెన్త్ పరీక్షలకు హాజరై 2019 జూన్ వరకు ఆ పరీక్షలను పూర్తిచేయనివారు కొత్త స్కీమ్‌లో ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్ కావచ్చు.► ఇంటిపేరుతో సహా అభ్యర్థి పూర్తిపేరు, తండ్రి, తల్లి పూర్తి పేర్లు నమోదు చేయాలి. అనాథలకు సంరక్షకుల పేరు నమోదు చేయాలి.► స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. ► గుర్తింపు ఉన్న స్కూలు నామినల్ రోల్స్ మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా అప్లోడ్ చేయాలి.► చెవిటి, మూగ, అంధత్వం తదితర బహుళ దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్‌లకు బదులు ఒక్కటే ఎంచుకోవచ్చు. వీరికి ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు 20 మాత్రమే. -
వాట్సాప్‌లో టెన్త్ పరీక్ష పేపర్.. ముగ్గురు అరెస్ట్
పట్నా: బిహార్ రాష్ట్రంలో పదో తరగతి సోషల్ సైన్స్ పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తోంది. బీఎస్ఈబీ నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం రోజు సోషల్ సైన్స్ పరీక్షకు 8.46 లక్షలు మంది విద్యార్థులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో పరీక్ష పేపర్ లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాఝా ఎస్బీఐ బ్రాంచ్‌కు చెందిన వికాస్ కుమార్, మరో ఇద్దరు బ్యాంక్ సిబ్బంది పరీక్ష పేపర్‌ను లీక్ చేశారు. ప్రధాన నిందితుడైన వికాశ్ కుమార్ బంధువులతో ఒకరు ఈ పరీక్ష రాయనుండగా.. పరీక్ష పేపర్‌ను లీకు చేసి వాట్సాప్ ద్వారా ప్రశ్న పత్రాన్ని పంపించాడు. బోర్డు ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రశ్న పత్రం లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్షను మార్చి నెల 8న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. పోలీసులు దర్యాపు పూర్తి చేశారని, ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా విడిచిపెట్టేది లేదని బీఎస్ఈబీ చైర్మన్ అనంద్ కిశోర్ తెలిపారు. చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని వెల్లడించారు. చదవండి: హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఖననం చదవండి: దారుణం: మైనర్ బాలికలకు విషం ఇచ్చి -
ఏపీ: మే నెలలో పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏప్రిల్ 30 వరకు తరగతులు కొనసాగుతాయని, మే నెలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. టెన్త్ పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయన్నది ఇంకా నిర్ణయం కాలేదని, దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు తదితరులతో మంగళవారం యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జనవరిలో ఫార్మేటివ్ ఎగ్జామ్స్ 9, 10 తరగతుల విద్యార్థులకు జనవరి 6, 7, 8 తేదీల్లో, 7, 8 తరగతులకు జనవరి 21, 22, 23 తేదీల్లో ఫార్మేటివ్–1 పరీక్షలు ఉంటాయన్నారు. అన్ని స్కూళ్లలో ఏప్రిల్ 30 వరకు తరగతులు నిర్వహిస్తారని, సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు హడావుడి పడాల్సిన పనిలేదని చెప్పారు. ఎస్సెస్సీ పరీక్షల్లో ఆప్షనల్ అంశాలు ఏమీ ఉండవని, సిలబస్ తగ్గించినందున అన్ని అంశాలనూ కూలంకషంగా బోధించాలన్నారు. తరగతుల్లో గైడ్లను అనుసరించి బోధన చేయకూడదని, అలా చేసే వారిపై చర్యలుంటాయని పేర్కొన్నారు. టెన్త్ తరువాత ఏం చేయాలన్న దానిపై విద్యార్థులు వారికి అభిలాష ఉన్న రంగాలను ఎంచుకునేలా ముందుగానే కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఎస్సీఈఆర్టీ నిర్వహిస్తోందని తెలిపారు. విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు, పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన చదువులు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందుకోసం వేలకోట్ల బడ్జెట్‌ను కేటాయించారని వివరించారు. అందువల్ల ప్రతి పేద విద్యార్థికి న్యాయం జరిగేలా టీచర్లు కృషి చేయాలని కోరారు. దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలు రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి విద్యార్థి పాస్ కావడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. నేషనల్ టాయ్ ఫెస్టివల్‌ను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి నెలలో మొదటి, మూడో శని వారాలను నో బ్యాగ్ డేగా తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. (చదవండి: గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి) నీట్, ఐఐటీ–జేఈఈ సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ ఏర్పాటు అమరావతి: నీట్, ఐఐటీ–జేఈఈ ఔత్సాహిక విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం ఎల్హెచ్ఎల్ కంచన ఫౌండేషన్, ఐఐటీ –జేఈఈ, నీట్ ఫోరం ఆధ్వర్యం లో హెల్ప్‌లైన్ నంబర్ 9052516661 ను ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ కె.లలిత్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌లైన్ సేవలు పొందవచ్చన్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో సమాచారం పొందవచ్చని చెప్పారు. హెల్ప్‌లైన్ ద్వారా నీట్, ఐఐటీ–జేఈఈ, కేవీపీవై, ఎన్టీఎస్ఈ, ఒలంపియాడ్ పరీక్షలు, అకడమిక్స్ సమాచారం, ఫ్యాకల్టీ సమాచారం, గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తో పాటు సలహాలు, సూచనలు పొందవచ్చని వివరించారు. అలాగే సందేహ నివృత్తికి helpline@ iitjeeforum. com, Support@ iitjeeforum. com నకు మెయిల్ పంపాలని కోరారు. -
ఓపెన్ బుక్ విధానమా? అసైన్మెంట్లతో ఇంటర్నల్సా?
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ స్కూళ్లలో ఆన్లైన్ పాఠాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు.. కొన్ని బడా ప్రైవేటు స్కూళ్లలోనూ రికార్డెడ్ వీడియో పాఠాలు.. మరికొన్ని బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల్లోనైతే అసలే మొదలుకాని చదువులు, ప్రభుత్వం ప్రసారం చేసే టీవీ పాఠాలనే వింటూ వెళ్లదీస్తున్న వైనం. కరోనా దెబ్బతో రాష్ట్రంలో విద్యా బోధన అస్తవ్యస్తమైంది. చూస్తుండగానే నవంబరు నెల వచ్చేసింది. సగం విద్యా సంవత్సరం పూర్తయిపోయింది. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు సమయం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఎలా? ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎలా? పదో తరగతి విషయంలో ఎలా ముందుకు సాగాలన్న దానిపై అధికారుల్లో ఆలోచనలు మొదలయ్యాయి. అదుపులోకి రాని కరోనా దేశంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పాఠశాలలను ప్రారంభించారు. మన రాష్ట్రంలో మాత్రం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచే విద్యాసంవత్సరాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. కరోనా కారణంగా తరగతుల నిర్వహణలో ప్రత్యక్ష బోధన, అభ్యసనను ప్రారంభించలేదు. అయితే ఆన్లైన్, డిజిటల్ పాఠాలను మాత్రం బోధిస్తున్నారు. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలోనూ ఏదో ఒక రకంగా (ఆన్లైన్, డిజిటల్) బోధనను ప్రారంభించారు. ఇక 5వ తరగతి వరకు మాత్రం కార్పొరేట్ స్కూళ్లలో ఆన్లైన్ పాఠాలు కొనసాగుతుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు (టీశాట్, దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాల ప్రసారం) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆరో తరగతి నుంచి 10 తరగతి వరకు ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఆలోచనలు చేస్తున్నారు. డిటెన్షన్ విధానం లేనందున 6 నుంచి 9వ తరగతి వరకు కూడా ప్రమోట్ చేస్తే ఇబ్బందేమీ ఉండదన్న భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసలు సమస్య పదో తరగతి పరీక్షలే. వాటి నిర్వహణ విధానం ఏంటన్న దానిపైనే సందిగ్ధత నెలకొంది. గత విద్యా సంవత్సరంలో ఇంటర్నల్స్ ఆధారంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ప్రాతిపదికన ప్రభత్వం టెస్త్ విద్యార్థులందరిని పాస్ చేసింది. పైగా గత మార్చి నెల వరకు తరగతులు కొనసాగాయి. దీంతో విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో వచ్చిన మార్కులను బట్టి విద్యాశాఖ విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లను, గ్రేడ్లను ఇచ్చింది. అయితే ఈసారి ఇంటర్నల్ మార్కులను వేసేందుకు అవకాశం లేకుండాపోయింది. ఇప్పటివరకు ఇంటర్నల్స్‌కు ప్రత్యేకంగా పరీక్ష అంటూ ఏమీ లేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో (సీసీఈ) భాగంగా తరగతిలో విద్యార్థుల అభ్యసన తీరు, ప్రతిస్పందనలు, ప్రాజెక్టులు, సృజనాత్మకత వంటి అంశాల ఆధారంగా ఇంటర్నల్స్ మార్కులను ఇచ్చారు. ఈసారి వాటికి అవకాశం లేకుండాపోయింది. వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభమైతే వాటికి కొంత అవకాశం ఉంటుంది. ఒకవేళ కరోనా కేసులు ఇలాగే ఉంటే తరగతుల ప్రారంభం కష్టమే. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఆలోచనలు మొదలయ్యాయి. వివిధ కోణాల్లో ఆలోచనలు ప్రస్తుత విద్యా బోధన పరిస్థితుల్లో పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను అప్‌గ్రేడ్ చేయాలా? అలా చేస్తే ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తాయా? అన్న కోణంలోనూ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఇక పదో తరగతి పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే సమయం వచ్చేసింది. ఇప్పటినుంచి పనులను మొదలు పెడితేనే ఏప్రిల్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే పరీక్షల విధానంపైనా ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు పదో తరగతికి పలు అసైన్మెంట్లతో ఇంటర్నల్ మార్కులు వేసి, వాటి ఆధారంగానే ఉత్తీర్ణులను చేయాలా? లేదా ఓపెన్ బుక్ పరీక్షల విధానం ప్రవేశపెట్టాలా? ఆన్న అంశాలపైనా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసి, పరీక్షల విధానాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పదో తరగతి విషయంలో ఇప్పుడే పరీక్షల విధానంపై ఓ నిర్ణయానికి వస్తేనే విద్యార్థులు అందుకు సిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకే... ప్రస్తుత పరిస్థితుల్లో పదో తరగతికి ఈసారి ఓపెన్ బుక్ పరీక్షల విధానం పెడితే బాగానే ఉంటుందన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఓపెన్ బుక్ విధానంలో ప్రశ్నపత్రాలు ఇస్తారు.. పాఠ్యపుస్తకాలు, నోట్స్ చూస్తూ సమాధానాలు రాసే వెసులుబాటు ఉంటుంది. పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులకు అసైన్మెంట్స్ ఇవ్వడం, ప్రాజెక్టులు చేయించడం, వాటిల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను ఇంటర్నల్ మార్కులుగా పరిగణనలోకి తీసుకొని వాటి ఆధారంగా మార్కులిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనా ఉంది. వ్యాసరూప విధానంలో కాకుండా బిట్‌పేపర్ తరహాలో ప్రశ్నపత్రాలు రూపొందించి ఇంటర్నల్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనా చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి, లోతుగా అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం తరువాతే విధానాన్ని ప్రకటించనున్నారు. పరీక్షలను ఏప్రిల్/ మే నెలల్లో నిర్వహించే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వం శనివారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్త షెడ్యూల్ మార్చి 31-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 ఏప్రిల్ 1-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 ఏప్రిల్ 3- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఏప్రిల్ 4- ఇంగ్లీష్ పేపర్-1 ఏప్రిల్ 6-ఇంగ్లీష్ పేపర్-2 ఏప్రిల్ 7-మ్యాథమేటిక్స్ పేపర్-1 ఏప్రిల్ 8-మ్యాథమేటిక్స్ పేపర్-2 ఏప్రిల్ 9-జనరల్ సైన్స్ పేపర్-1 ఏప్రిల్ 11-జనరల్ సైన్స్ పేపర్-2 ఏప్రిల్ 13-సోషల్ స్టడీస్ పేపర్-1 ఏప్రిల్ 15- సోషల్ స్టడీస్ పేపర్-2 ఏప్రిల్ 16- ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2 ఏప్రిల్ 17-SSC ఒకేషనల్ కోర్స్ థియరీ -
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులుండగా 2018మార్చి 1 నాటికి అందులో 31,18,956 ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 2019–20 ఏడాదికి గాను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ)లు సుమారు 1.34 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు చేశాయన్నారు. -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల షెడ్యూల్ మార్చి 23 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 మార్చి 24 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్ మార్చి 27 : ఇంగ్లీష్ పేపర్ 1 మార్చి 28 : ఇంగ్లీష్ పేపర్ 2 మార్చి 30 : గణితం పేపర్ 1 మార్చి 31 : గణితం పేపర్ 2 ఏప్రిల్ 01 : సైన్స్ పేపర్ 1 ఏప్రిల్ 03 : జనరల్ సైన్స్ పేపర్ 2 ఏప్రిల్ 04 : సోషల్ స్టడీస్ పేపర్ 1 ఏప్రిల్ 06 : సోషల్ స్టడీస్ పేపర్ 2 ఏప్రిల్ 07 : సంస్కృతం, అరబిక్, పెర్షియన్ సబ్జెక్ట్ ఏప్రిల్ 8 : ఒకేషనల్ పరీక్షలు -
గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వెయ్యికి పైగా ఉద్యోగావకాశాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటన జారీ అయింది. దాదాపు 130 కేటగిరీల్లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. దేశంలో ఉద్యోగాలు లేవంటూ మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలు/సంస్థలలో 1,136 ఖాళీలు భర్తీ చేసేందకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) / గ్రూప్ సి పోస్టులకోసం ఎస్ఎస్సీ నియామకాలు చేపట్టనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబరు 30, 2018. ఒక వ్యక్తి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఒక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని పేర్కొంది. మరిన్ని వివరాలు www.ssc.nic.in, లేదా SSC (northern region) website i.e, www.sscnr.net.in. వెబ్సైట్లో లభ్యం. అలాగే అన్ని ఎస్ఎస్సీ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా ఖాళీలు, అర్హత , దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన వివరణాత్మక ప్రకటన అందుబాటులోఉంది. -
తెలంగాణ పదో తరగతి ఫలితాలు: బాలికలదే పైచేయి
-
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 83.78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,34,726 మంది హాజరయ్యారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇక ఫలితాల్లో మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా, చివరి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. ఫలితాల్లో బాలికలదే పైచేయి బాలుర ఉత్తీర్ణత శాతం 82.46 బాలికల ఉత్తీర్ణత శాతం 85.14 21 సూళ్లలో సున్నా శాతం ఫలితాలు వీటీలో 11 ప్రయివేటు స్కూళ్లు జూన్ 4 నుంచి 19 వరకూ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపుకు మే 21 చివరి తేదీ ఫలితాల కోసం.. www.sakshieducation.com, www.bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. -
రేపు రాత్రి 7గంటలకు టెన్త్ రిజల్ట్స్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. అయితే ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. సెక్రటేరియట్ డీ బ్లాక్‌లో రేపు రాత్రి ఏడు గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 5,38,867 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 2,62,479 మంది బాలికలు, 2,76,388 మంది బాలురు ఉన్నారు. టెన్త్ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎస్ఎస్సీ స్పాట్‌ను బహిష్కరిస్తున్నాం: జాక్టో
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ (జాక్టో) ప్రకటించింది. బుధవారం ఈ మేరకు జాక్టో నాయకులు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి బహిష్కరణ నోటీసు అందించారు. కార్యక్రమంలో జాక్టో చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.మల్లారెడ్డి, ఆర్‌యూపీపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.జగదీశ్, టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేశ్, సింగరేణి టీచర్స్ అధ్యక్షుడు జి.ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్ వివరాల్లో పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 3లోగా సవరించాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేరు, కమ్యూనిటీ, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను వెబ్సైట్లో ((www.bsetelangana.org) ఉంచామని పేర్కొంది. వాటిని డౌన్లోడ్ చేసుకొని సరైన వివరాలతో ఫిబ్రవరి 3, సాయం త్రం 5లోగా డీఈవో కార్యాలయాల్లో ఇవ్వాలని హెచ్ఎంలకు సూచించింది. -
పదిలో నూరు శాతం ఫలితాలు సాధించాలి
ఎంఈఓలు, హెచ్ఎంలకు డీఈఓ సూచన ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఈ ఏడాది పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.ఎస్.గంగాభవాని సూచించారు. సోమవారం ఏలూరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఒలతో స్థానిక సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ప్రతీ రోజూ సాయంత్రం ఒక గంట అదనంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే ప్లేఫీల్డ్స్కి ప్రధానోపాధ్యాయులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరు డీవైఈఓ ఉదయ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదులను ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, వారాంతపు సమీక్షలు నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. అలాగే బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతీ పాఠశాలలో కిచెన్గార్డెన్లు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకానికి కూరగాయలు పండించాలన్నారు. అనంతరం రిటైర్డ్ డీవైఈఓ ఏడీవీ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏలూరు డివిజన్లోని మండల విద్యాశాఖాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
పది జవాబు పత్రాలకు భద్రత కరువు
-సెక్యూరిటీ లేకుండానే తరలింపు -ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు జూపాడుబంగ్లా: పదోతరగతి ప్రశ్నపత్రాలను పటిష్టబందోబస్తు మధ్య పోలీసుస్టేషన్లకు తరలించి భద్రపర్చే అధికారులు జవాబు పత్రాల తరలింపు విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. జూపాడుబంగ్లాలోని రెండు పరీక్ష కేంద్రాలలో 443 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలను రాస్తున్నారు. వారు రాసిన జవాబు పత్రాలను స్పీడ్‌పోస్టు ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలి. స్పీడ్‌పోస్టు సౌకర్యం జూపాడుబంగ్లాలో లేకపోవటంతో నందికొట్కూరుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్పీడ్ పోస్టుచేస్తున్నారు. నందికొట్కూరు వరకు తీసుకెళ్లేందుకు పోలీసుల బందోబసు్త ఉండాలి. అయితే ఎలాంటి పోలీసు ప్రొటెక్షన్ లేకుండా జవాబు పత్రాలను పరీక్షాకేంద్రాల చీఫ్‌లు యథేచ్ఛగా వారి ఇష్టారాజ్యంగా బస్సులు, ఆటోల్లో తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఎక్కడైనా జవాబు పత్రాలు తారుమారైనా, మిస్అయినా అందుకు బాధ్యత ఎవ్వరు వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ విజయభాస్కర్‌ను ప్రశ్నించగా వాస్తవంగా పదోతరగతి పరీక్షల జవాబు పత్రాలను పోలీసు ప్రొటెక్షన్తోనే తరలించాలి. అయితే తగినంత పోలీసు సిబ్బంది లేరనే కారణంతో వారు రావటం లేదు. దీంతో మేమే బస్సుల్లో జవాబుపత్రాలను నందికొట్కూరుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్పీడ్పోస్టుచేస్తున్నట్లు తెలిపారు. -
పది పరీక్షల ఏర్పాట్లపై కమిషనర్ అసంతృప్తి
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆమె ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జిల్లాలోని మూడు స్కూళ్లను తనిఖీ చేశారు. గోనెగండ్ల, కోడుమూరు, లద్దగిరి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించి.. లద్దగిరి కేంద్రంలో ఒకే బెంచీపై ముగ్గురు విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు రాయించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు ఇద్దరు విద్యార్థులకు ఒక బెంచీ చొప్పున ఏర్పాటు చేశారు. మరో కేంద్రంలో ఏకంగా కమిషనర్ ఎదుటే చీఫ్ సూపరింటెండెంట్ చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడంతో పరీక్ష కేంద్రానికి సెల్ఫోన్లు తీసుకురాకూడదని చెప్పినా మీకు అర్థం కాలేదా అని ఆగ్రహించారు. అత్యవసరం అయితే కీప్యాడ్ సెల్‌తో ఆఫీస్ రూంలో కూర్చొని మాట్లాడాలని సూచించారు. రెండవ రోజు 250 మంది గైర్హాజరు పదవ తరగతి రెండో రోజు పరీక్షలకు మొత్తం 50,275 మంది విద్యార్థులకు గాను, 50,025 మంది హాజరుకాగా, 250 మంది గైర్హాజరయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కమిషనర్‌తో పాటు, డీఈఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు మొత్తం 82 కేంద్రాలను తనిఖీ చేశారు. -
పక్కాగా పది పరీక్షలు
మార్గదర్శకాలు విడుదల చేసిన డీఈవో నిడమర్రు: పదో తరగతి పరీక్షలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 17 నుంచి పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని 246 పరీక్ష కేంద్రాల్లో. 46,682 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కాపీయింగ్‌కు బ్రేక్ పరీక్షల నిర్వహణ ఏపీ పబ్లిక్ పరీక్షల యాక్ట్1997, ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్‌కు లోబడి నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికా ఆర్ఎస్ గంగాభవానీ తెలిపారు. అలానే చూచీరాత నిరోధక చట్టం1997ను సమర్థవంతంగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. టెన్త్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా వారిని దోషులుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బంది అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని వ్యవహరించాలని, లేకపోతే చట్టప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. చీఫ్, డీవో చేయాల్సినవి పరీక్ష కేంద్రాన్ని ముందుగా సందర్శించి ఫర్నీచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, పరిశుభ్రత పరిశీలించాలి. తహసీల్దార్, ఎస్పీహెచ్లకు పరీక్షల విషయం తెలియజెప్పాలి. వారి ఫోన్ నంబర్లు తీసుకోవాలి. పరీక్షల నిర్వహణకు అన్ని ఫారాలు సిద్ధం చేసుకోవాలి. డిఫార్, ఓఎంఆర్ షీట్స్, పేపర్ సీల్, అంటెండెన్స్ షీట్స్ సరిపడా అందాయో లేదో చూసుకోవాలి. ట్రక్ పెట్టెలు, క్లాత్ బ్యాగ్స్ వంటి కంటిజెన్స్ సామగ్రి సిద్ధం చేసుకోవాలి. ఽఈనెల 16న పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందితో సమావేశం నిర్వహించాలి. సిబ్బంది నుంచి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరూ పరీక్ష రాయడం లేదని నో రిలేషన్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. బాలికలను చెక్ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలి. పరీక్ష జరుగుతున్న రోజుల్లో ఇలా.. రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫెరెన్స్‌కు హాజరుకావాలి. నిర్దేశించిన సమాయాని కన్నా ముందు సీఎస్, డీవో, ఇద్దరు సంతకాలతో పరీక్ష కట్టల సీల్ తెరవాలి. లాటరీ పద్ధతిలోనే ఇన్విజిలేటర్‌కు తరగతి గదులు కేటాయించాలి. ఇన్విజిలేటర్లకు సూచనలు ఇన్విజిలేటర్లు పరీక్షల ప్రారంభానికి ముందురోజున చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్) నిర్వహించు శిక్షణ సమావేశానికి విధిగా హాజరుకావాలి. ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. పరీక్ష పేపర్ల కోడ్స్, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి. పరీక్ష రోజు ఉదయం 8 గంటలకు కేంద్రం వద్దకు హాజరుకావాలి. 9 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలో కూర్చోబెట్టాలి. 10 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించరాదు. ప్రతి విద్యార్థిని సోదా చేసి, ఎటుంవటి ఫర్బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించాలి. విద్యార్థినులను మహిళా ఇన్విజిలేటర్లు మాత్రమే సోదా చేయాలి. పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతాయి. అందువల్ల సీఎస్ నిర్ధారించిన సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను గాని, విద్యార్థులను గదులు మార్చడం గాని చేయరాదు. విద్యార్థులకు, ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్‌టికెట్ అందిస్తారు. విద్యార్థిని హాల్ టికెట్, అటెండెన్స్ షీట్‌లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి, అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకురావాలి. అన్ని పరీక్షలు బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి. ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెసుక భాగంలో విద్యార్థులకు వివరించాలి. ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్‌పైనా కూడా హాల్‌టికెట్ నంబర్, పేరు రాయించకూడదు. ఓఎంఆర్ షీటు ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దృష్టికి తీసుకువెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి. ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి. 9.25 గంటలలోపు ఇన్విజిలేటర్ అన్ని పనులు ముగించుకుని 9.30 గంటలకు కచ్చితంగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలి. ప్రశ్నపత్రాలు తీసుకొన్న వెంటనే చాలినన్ని ఉన్నాయో/ ఆరోజుకు సంబంధించిన సబ్జెక్/ పేపర్‌కోడ్ / మీడియం సరిచూసుకోవాలి. పేపరు ఏమాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్‌పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అన్ని ద్వితీయ భాష పేపర్లకు, అన్ని భాషేతర పేపర్లకు పార్ట్బి బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంట ముందుగా ఇవ్వవలెను. మిగిలిన పేపర్లకు పార్టీఎ తోపాటే పార్ట్బి ఇవ్వాలి. ఇంగ్లిష్ మీడియం ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు పేపర్బి ఉండదు. గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్‌ను ఎర్ర సిరా పెన్‌తో క్యాన్సిల్ చేస్తారు. పరీక్ష ముగిసాక సమాధాన పత్రాలు, అడిషనల్ షీట్స్ అన్ని సరిచూసుకున్నాకే విద్యార్థులను బయటకు పంపాలి. -
పదిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి
– జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డి నంద్యాలరూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డి తెలిపారు. శుక్రవారం కానాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హైస్కూల్ కొట్టాల వద్ద ఉన్న శ్రీ పోశంపాపిరెడ్డి పూదోట సంస్కృతోన్నత పాఠశాలను డీఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక విద్యా విధానానికి అనుగుణంగా విదా్యర్థులకు బోధన చేస్తున్న పాఠశాల అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి, కరస్పాండెంట్ విజయశేఖర్రెడ్డిలను అభినందించారు. వరుసగా ఐదో సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు డీఈఓను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఏఓ రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ ఇంటర్, టెన్త్ పరీక్షల తేదీలు ఖరారు
-
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
–డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి పాములపాడు: 10వ తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ఏఎన్ఆర్ జిల్లా పరిషత్ హైస్కూలు, తుమ్మలూరు జెడ్పీ హైస్కూలును తనిఖీ చేశారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. ఓ విద్యార్థిని తెలుగు చదవకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల తరువాత మళ్లీ వస్తానని, పిల్లలు చదవకపోతే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వారం మ«ధ్యాహ్న భోజనంలో 3 గుడ్లు ఇవ్వాలన్నారు. ఇందుకు బిల్లులు సైతం పెంచినట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. మార్చి 7నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పెంచేందుకు çప్రతి మండలం నుంచి తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులను సబ్జెక్టుల వారిగా 7గురిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వీరి పర్యవేక్షణలో విద్యార్థులను తీర్చి దిద్ది అధిక చి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో 279 సక్సెస్ స్కూళ్లు, 35 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. విద్యార్థి తల్లితండ్రులు కోరితే ఆ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ సుమతి, ఎంఈఓ బాలాజీనాయక్, హెచ్ఎం పుల్లారెడ్డి ఉన్నారు. -
29 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఏలూరు సిటీ : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ నెల 29 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా ఏలూరు, తణుకులో 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2,880 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వారికి అన్ని సెంటర్లలో మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 29న బిల్‌గ్రేడ్ ఫౌండేషన్ బృందం పర్యటన జిల్లాలో ఆన్లైన్ ద్వారా అమలు చేసే పథకాలను బిల్‌గ్రేడ్ ఫౌండేషన్ వారు తణుకు, భీమడోలులో పర్యటించి పథకాల అమలుపై స్వయంగా అడిగి తెలుసుకుంటారని చెప్పారు. 29న ఏలూరు చేరుకుని రెండు బృందాలుగా తణుకు, భీమడోలు మండలాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా జరుగుతున్న పనులు, పింఛన్లు, ఎరువుల పంపిణీ, వైద్యం ఇతర అంశాలపై అడిగి తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఏలూరు కలెక్టరేట్ చేరుకుని జిల్లా అధికారుల సమావేశంలో బృందం పాల్గొంటారు -
ఎస్ఎస్సీలో 279 పోస్టులు
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఈస్టర్న్ రీజియన్ ప్రకటనను విడుదల చేసింది. పదో తరగతి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు గల అభ్యర్థులకు ఇందులో పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు: 279 ఖాళీల వివరాలు 1.జూనియర్ ఇంజనీర్ (క్వాలిటీ అస్యూరెన్స్)- 105 (అమ్యునిషన్-40, వెపన్స్ -14, ఇన్స్ట్రుమెంట్స్-7, స్మాల్ ఆర్మ్స్-24, మెటలర్జీ-20). 2. సైంటిఫిక్ అసిస్టెంట్-66 (మెకానికల్-9; కెమికల్-28; రబ్బర్, ప్లాస్టిక్, టెక్స్టైల్-5, ఎలక్ట్రికల్-8, సివిల్-13, నాన్ డిస్ట్రక్టివ్-3). 3.ఆఫీస్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్)-40. 4.ఫీల్డ్ అటెండెంట్-19 5. ల్యాబ్ అసిస్టెంట్-19; 6.రీసెర్చ్ అసిస్టెంట్-5; 7. జూనియర్ కెమిస్ట్-5; 8.సీనియర్ ఇన్స్ట్రక్టర్ (వీవింగ్)-4; 9.సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్-4; 10.జూనియర్ జియోగ్రాఫికల్ అసిస్టెంట్-2 ; 11.డిప్యూటీ రేంజర్-2; 12. అసిస్టెంట్ ఆర్కైవిస్ట్-1; 13.డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-1; 14.డూప్లికేటింగ్ మెషిన్ ఆపరేటర్-1; 15.ఆక్యుపేషనల్ థెరపిస్ట్-1; 16. స్పీచ్ థెరపిస్ట్-1; 17. లైబ్రరీ క్లర్క్-1; 18. మెట్రోలాజికల్ అసిస్టెంట్-1; 19. హెరాల్డిక్ అసిస్టెంట్-1. విద్యార్హత-అనుభవం 1. జూనియర్ ఇంజనీర్: అమ్యునిషన్ విభాగం పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్ (లేదా) ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్). వెపన్స్ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్ (లేదా) ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ప్రొడక్షన్/మెషిన్ అండ్ టూల్స్). స్మాల్ ఆర్మ్స్ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ (లేదా) డిప్లొమా(మెకానికల్ ఇంజనీరింగ్). మెటలర్జీ పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ) (లేదా) డిప్లొమా (మెటలర్జికల్ ఇంజనీరింగ్). జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి. 2. సైంటిఫిక్ అసిస్టెంట్: కెమికల్ విభాగం పోస్టులకు పీజీ (కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) (లేదా) కెమికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బీఈ/బీటెక్, రెండేళ్ల పని అనుభవం. సివిల్ పోస్టులకు పీజీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ), రెండేళ్ల పని అనుభవం. 3. ఆఫీస్ అటెండెంట్: పదో తరగతి/తత్సమానం. 4. లేబొరేటరీ అసిస్టెంట్: 10+2 (లేదా) బయాలజీతో తత్సమాన విద్యార్హత. జువాలజీ ల్యాబ్‌కు సంబంధించిన పని అనుభవం. 5. ఫీల్డ్ అటెండెంట్: పదో తరగతి (లేదా) తత్సమానం. వయసు జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18-30 ఏళ్లు; ఫీల్డ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు 18-27 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. వేతనం జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్లకు రూ.9,300-34,800+గ్రేడ్‌పే. ఫీల్డ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.5,200-20,200+గ్రేడ్‌పే. ఎంపిక విధానం విద్యార్హతల మార్కులను బట్టి ఒక్కో పోస్టుకు 25 మంది చొప్పున రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తారు. ఒక తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష 1.పదో తరగతి విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున; జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. 2.ఇంటర్మీడియెట్ విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో 200 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అనే నాలుగు సబ్జెక్టుల నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. యూజీ/పీజీ విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు కూడా రాత పరీక్ష ఇదే తరహాలో ఉంటుంది. అయితే ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్‌తోపాటు రీజనింగ్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే అప్లికేషన్లను వేర్వేరుగా సమర్పించాలి. పరీక్ష రుసుం కూడా విడివిడిగా చెల్లించాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌట్‌కు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత, వయసు, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి. చిరునామా ది రీజనల్ డెరైక్టర్ (ఈఆర్), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈస్ట్ రీజియన్, నిజాం ప్యాలెస్, ఫస్ట్ ఎంఎస్‌వో బిల్డింగ్, ఎనిమిదో అంతస్తు, 234/4, ఏజేసీ బోస్ రోడ్డు, కోల్‌కతా, 700020. పరీక్ష రుసుం ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థులు మాత్రమే రూ.100 చెల్లించాలి. ముఖ్య తేదీలు 1.ఆన్లైన్ అప్లికేషన్లను నింపేందుకు, ఎగ్జామ్ ఫీజును చెల్లించేందుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 26. 2.ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ రీజనల్ ఆఫీసుకు చేరాల్సిన తేది: 2016, సెప్టెంబర్ 26 నుంచి పది రోజుల్లోపు. వెబ్సైట్: ssconline.nic.in/sscselectionpost సింగిల్ డిజిట్ ఖాళీలున్న ఉద్యోగాల విద్యార్హత, వయసు, అనుభవం, వేతనం తదితర వివరాలకు www.sscer.org చూడొచ్చు. -
టెన్త్ సప్లమెంటరీ ఉత్తీర్ణత 82.03 శాతం
–రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం నల్లగొండ : పదో తరగతి సప్లమెంటరీ ఫలితాల్లో నల్లగొండ జిల్లా విద్యార్థులు 82.03 ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సప్లమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 8,225 మంది పరీక్షలు రాయగా 6,747 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 4,438 మందికిగాను 3,550 (79.99శాతం), బాలికలు 3,787 మందికిగాను 3,197 (84.42శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 99.8 శాతం వచ్చినా..
ముంబై: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 99.8 శాతం మార్కులు తెచ్చుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ అమ్మాయికి జూనియర్ కాలేజీలో సీటు రాని విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కళ్యాణ్ పాఠశాలలో పదోతరగతి చదివిన ఆమె పబ్లిక్ పరీక్షల్లో 99.8 శాతం మార్కులను సంపాదించింది. జూనియర్ కాలేజిల్లో చేరేందుకు నోటిఫికేషన్ వెలువడటంతో ఆన్ లైన్ ద్వారా నగరంలోని ప్రముఖ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మంగళవారం కాలేజీల్లో సీట్లకు ఎంపికయిన అభ్యర్థుల్లో ఆమె పేరు లేకపోవడంతో ఒక్కసారిగా షాకైంది. తనకు వచ్చిన మార్కులకు కచ్చితంగా సీటు వస్తుందని భావించినట్లు చెప్పింది. ఈ నెల 10, 11, 16 తేదీల్లో మాత్రమే ఆన్ లైన్ ఆప్లికేషన్ లో కాలేజీల వరుసను మార్చినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన అధికారులు ఆమె అప్లికేషన్ ను మార్చి ఉండకపోతే పాఠశాలకు చెందినవారే మార్పులు చేసి ఉంటారని అన్నారు. అప్లికేషన్ ను నింపేటపుడు పాఠశాల నుంచే సాయం తీసుకుంది కాబట్టి కచ్చితంగా మరలా వారే మార్పులు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. డిపార్ట్ మెంట్ కు సంబంధించి ఏదైనా పొరబాటు జరిగిందేమోనని విచారించామని అలాంటిదేమీ లేదని చెప్పారు. ఈ నెల20న విడుదల చేసిన జనరల్ మెరిట్ లిస్టులో ఆమె పేరు రాలేదు. దీంతో జులై 15న జరిగే మరో విడత అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
టెన్త్ విద్యార్థులకు నేడు కెరీర్ గెడైన్స్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి తరువాత ఏ కోర్సులో చేరాలన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ బుధవారం కెరీర్ గెడైన్స్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. బుధవారం ఉదయం 10:30 నుంచి ఒంటిగంట వరకు నిఫుణులతో కెరీర్ గెడైన్స్, కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని మన టీవీ చానల్ ద్వారా నిర్వహించనుంది. మన టీవీ చానల్ ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. టోల్‌ఫ్రీ నంబరు 18004254038 కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపాయి. -
19వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కోలకతా: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే పనులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 19 వేల టీచర్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నమెంట్ ఎయిడెడ్ సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ టీచర్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి 'వెస్ట్ బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్' (ఎస్ఎస్సి) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పరీక్ష తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది. పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి, ఇంటర్వ్యూ అనంతరం తుది ఎంపిక జరుగుతుందన్నారు. ఈనెల 19 నుండి వచ్చేనెల 15 వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా మరికొన్ని వారాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ తీరును తప్పు పట్టిన హైకోర్టు
-
టెన్త్ పాతసిలబస్ వారు ఇక ఓపెన్ స్కూల్‌కే!
-
ఏపీ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
'ఆన్లైన్ అప్‌లోడ్‌కు సిద్ధం కండి'
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజుకు సంబంధించి నామినల్ రోల్స్, ఐసీఆర్ కమ్ ఓఎంఆర్ ఫారాల డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు హెడ్మాస్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లోడ్ చేయాలన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని, ఈలోగా ఫీజులు చెల్లించిన విద్యార్థుల సమగ్ర వివరాలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, పదో తరగతి ఓంఎంఆర్, ఐసీఆర్ ఫారాలు డిసెంబరు 2 వరకు అందజేసేందుకు అవకాశం ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎస్టీయూ-టీఎస్ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఎస్ఎస్సీ, ఇంటర్ అర్హతలతో పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్ విద్యార్హతలతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులకు నిర్వహించే పోటీ పరీక్షల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోటీ పరీక్షల్లో ఉండే పేపర్లు, మార్కుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. బిల్ కలెక్టర్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. నియామక ప్రక్రియను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష విధానాన్ని రూపొందించింది. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం విద్యార్హతలకు అనుగుణంగా సంబంధిత పోస్టుల పరీక్ష ప్రణాళికను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సెస్సీ తత్సమాన విద్యార్హత ఉన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్ పేపర్ ఒకటే ఉంటుంది. ఈ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. ఇక ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతలున్న పోస్టులకు జనరల్ నాలెడ్జ్, సెక్రెటేరియల్ ఎబిలిటీస్ పేరుతో ఒక పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి 75 ప్రశ్నలు, సెక్రెటేరియల్ ఎబిలిటీస్‌కు 75 ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ పేపర్‌కు 150 మార్కులుంటాయి. అలాగే ఐటీఐ లేదా తత్సమాన అర్హతలున్న పోస్టులకు జనరల్ నాలెడ్జ్, సంబంధిత ఐటీఐ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 75 ప్రశ్నలుంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. -
కేంద్ర కొలువులకు... ఎస్ఎస్సీ- సీహెచ్ఎస్ఎల్!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. తాజాగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) పరీక్ష-2015కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పోస్టల్ అసిస్టెంట్లు/సార్టింగ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజన్ క్లర్క్స్ మొత్తం 6,578 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఖాళీల వివరాలు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్: 3,523 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (డీఈవో): 1006 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ): 2049 అర్హత:2015, ఆగస్టు 1 నాటికి ఇంటర్ లేదా తత్సమాన అర్హత. వయసు:2015, ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుం ది. వితంతువు, విడాకులు తీసుకున్న మహిళల కేటగిరీలో జనరల్ కేటగిరీ మహిళలకు 35 ఏళ్లు, ఓబీసీ మహిళలకు: 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వేతనాలు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్: రూ.5,200-రూ.20,200; గ్రేడ్ పే- 2400. ూ.5,200-రూ.20200; గ్రేడ్ పే- 2400/1900. లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ): రూ.5,200-రూ.20,200; గ్రేడ్ పే- 1900. ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. పరీక్ష విధానం: రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు జనరల్ ఇంటలిజెన్స్ 50 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 50 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్) 50 50 జనరల్ అవేర్నెస్ 50 50 మొత్తం 200 200 ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఒకవేళ అనుమతి లభిస్తే పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ (డేటా ఎంట్రీ ఆపరేటర్): గంటకు ఎనిమిది వేల కీ డిప్రెషన్స్; టైపింగ్ టెస్ట్ (పోస్టల్ అసిస్టెంట్లు/సార్టింగ్ అసిస్టెంట్లు, ఎల్డీసీ): అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న చాయిస్‌ను బట్టి ఇంగ్లిష్ లేదా హిందీలో నిర్వహిస్తారు. కంప్యూటర్‌పై ఇంగ్లిష్ అయితే నిమిషానికి 35 పదాలు, హిందీ అయితే 30 పదాలు టైప్ చేయాలి. ముఖ్యతేదీలు: ఆన్లైన్ లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 13, 2015. పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 10, 2015. పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 13, 2015. పరీక్ష తేదీలు: 2015, నవంబరు 1, 15, 22 (ఆదివారాల్లో). వెబ్సైట్: sscregistration.nic.in/ssc సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్: ఈ విభాగం నుంచి వెర్బల్/నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్/నంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ అనాలజీ, స్పేస్ ఓరియెంటేషన్, సెమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్/నంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, నంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, నంబర్ ఆపరేషన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్: స్పాట్ ది ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్/డిటెక్టింగ్స్, మిస్ స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ప్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిసెస్ ఆఫ్ వెర్బ్స్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ నెరేషన్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రెహెన్షన్ ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.అర్థమెటిక్: నంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్,ట్రిగనోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ నుంచి ప్రశ్నలుంటాయి.జనరల్ అవేర్నెస్: కరెంట్ అఫైర్స్‌తో పాటు సాధారణ పరిజ్ఞానానికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్ అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. దినపత్రికలు చదివి, ముఖ్యమైన అంశాలను నోట్స్‌గా రాసుకోవడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. -
నేటి నుంచే టెన్త్ పరీక్షలు
హైదరాబాద్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 12 గంటల వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు దాదాపు 6,53,692 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 156 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణసౌకర్యాలు అందిస్తున్నట్లు ఆర్టీసీ తెలియజేసింది. -
‘రాత’బాగుంటే .. గెలుపు వెన్నంటే..
మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలోనూ పది కాలాలపాటు చెరగని ముద్ర వేయాలంటే అందమైన చేతి రాతతోనే సాధ్యం. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే బుజ్జాయి నుంచి కోటి ఆశలతో కళాశాలలకు వెళ్లే యువత వరకు అందరూ అందమైన దస్తూరి కోసం ఆరాటపడుతుంటారు. నేటి కంప్యూటర్ యుగంలోనూ విద్యా రంగంలో చేతి రాత ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అక్షరాలను ముత్యాల్లా రాసేవారికి ఉజ్వల భవిత ఉంటుందంటున్నారు చేతిరాత నిపుణులు. ముఖ్యంగా ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించే క్రమంలో చేతిరాత ఓ సాధనంగా ఉపయోగపడుతుందంటున్నారు. మంచి చేతిరాతతో కనీసం 20 మార్కులు అదనంగా సాధించే అవకాశం ఉంటుందంటున్నారు.. ⇒ అందమైన దస్తూరితో ఎన్నో లాభాలు ⇒ ఎస్ఎస్సీ, ఇంటర్ స్థాయిల్లో చేతిరాతకు ప్రాధాన్యం ⇒ మార్కులు పెరిగే అవకాశం ⇒ సాధనతో సాధ్యమేనంటున్న నిపుణులు చేరాత చేజారి పోతోంది. కలాన్ని కుదురుగా పట్టుకొని ముత్యాల్లాంటి అక్షరాలను జాలువార్చాల్సిన చేతి వేళ్లు ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డుపై నాట్యమాడుతున్నాయి. చిన్నప్పటిలా అందంగా రాయలేకపోతున్నామని మధనపడుతున్నవారెందరో. కొందరు పెద్దలైతే పిల్లలు దస్తూరిగా రాస్తున్నారో లేదో పట్టించుకోవడమే మానేశారు. సాంకేతిక రంగం ఎంత విస్తరించినప్పటికీ ఇప్పటికీ అన్ని రంగాల్లో చేతి రాతే కీలకం. అందమైన చేతి రాత ఉంటే పరీక్షల్లో మార్కుల సాధనలో ముందున్నట్లే. సాధనమున సమకూరు.. ⇒ రాసేటప్పుడూ కూర్చొనే భంగిమ, కలాన్ని పట్టుకొనే విధానం, కాగితానికి, కలానికి మధ్య దూరం వంటి అంశాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ⇒ బాల్ పాయింట్ పెన్ను కన్నా సిరాకలమే రాయడానికి అనుకూలంగా ఉంటుంది. దానితో కొంతమేర చేతిరాత మెరుగవుతుంది. ⇒ సున్నా, అరసున్నా, నిలువు గీతలను కూడా బాగా సాధన చేయాలి. ⇒ ఆంగ్లం, తెలుగు భాషల్లో మెరుగైన రాత కోసం అపసవ్య దిశలో, హిందీ భాషకు సవ్యదిశలో రాయడం సాధన చేయాలి. ⇒ మెలకువలను అవపోసనపట్టి నిర్విరామంగా 21 రోజులపాటు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన చేతి రాత సొంతమ వుతుందని చేతిరాత నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోండి.. ⇒ జవాబుల్ని సూటిగా చెప్పాలి. ⇒ సమాధానాలు టీచరుకు తెలుసని గుర్తించాలి. మనంరాసే తీరు పరీక్ష పేపరు దిద్దేవారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. ⇒ వ్యాకరణ తప్పులేకుండా చూసుకోవాలి. ⇒ కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25 నుంచి 30 లైన్లు రాస్తారు. ఇది చూసే వారిని ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్కో పేజీలో 16-18 లైన్లకు మించకూడదు. ⇒ ఒక పాయింట్ దగ్గర మొదలైన రాత ఆలైను చివరికి వెళ్లే సరికి పైకో, కిందికో పోతుంది. దాంతో ఆ పేజీల్లో అన్నిలైన్లు అలానే పోతాయి. మొదటి లైను రాసే సమయంలోనే మార్జిన్ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయాలి. దాంతో మిగిలిన లైన్లు కూడా అలాగే సమాంతరంగా వస్తాయి. ⇒ గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి.. మరో సగాన్ని కిందిలైనులో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు. ⇒ చాలామంది విద్యార్థులు ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టీ మరీ రాస్తుంటారు. కలాన్ని వేళ్లతో బిగ పట్టుకుంటారు. దీంతో పేజీ రెండోవైపు ఆ అక్షరాలు కనిపిస్తూ గందరగోళపరుస్తాయి. కొద్దిసేపు రాయగానే వేళ్లు నొప్పిపెడతాయి. ⇒ చాలామంది విద్యార్థులు అంకెలను సరిగా రాయరు. ఉదాహరణకు...‘2’ అంకెను ఇంగ్లిష్ ‘జెడ్’ తరహాలో ‘5’ను ‘ఎస్’లో ⇒ ‘0’ను ‘6’తరహాలో రాస్తుంటారు. దీంతో రావాల్సిన మార్కులు తగ్గిపోతాయి. ⇒ సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాల్ని గుర్తించడంలో ఒక క్రమ పద్ధతి పాటించాలి. ⇒ పరీక్షలో కొంతసేపు రైటింగ్, అలంకరణకు సమయం తీసుకోవాలి. ⇒ పరీక్ష పత్రంలో ఏవైనా తప్పులు రాస్తే వాటిని పెన్సిల్ లేదా పెన్నుతో బాగా రుద్దుతారు. దీంతో పేపరంతా నల్లగా మారుతుంది. అక్షరాల్ని ఇలా రాయండి ⇒ పేజీకి పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్‌ను విడిచి పెట్టాలి. పేజీకి కుడివైపు కూడా అర అంగుళం ఖాళీ విడిచిపెట్టి రాయాలి. టీచర్లు పేజీలను దారంతో కట్టినా..రబ్బర్‌బ్యాండ్‌తో చుట్టినా జవాబులు స్పష్టంగా కన్పిస్తాయి. ⇒ కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెల్లకాగితంపై తర్ఫీదు పొందాలి. ⇒ పరీక్షల్ని నలుపు, బ్లూపెన్ తప్ప వేరే పెన్నుల్ని వాడరాదు. బాల్ పాయింట్ పెన్నులు అనుకూలమైనవి. రెండు పెన్నులు ఉంటే ఒకే కంపెనీవై ఉంటే మంచిది. ⇒ జవాబుల్లో ఏవైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి. ⇒ విద్యార్థులకు పాఠశాలలు అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాల్ని చేతితో రాయించాలి. ⇒ జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాల్ని ఒకవైపు సరళ రేఖల్ని గీసి భాగాలు పేర్లు రాస్తే మేలు. లేదా వాటికి నంబర్లను ఇచ్చి ఒక వైపు రాయాలి. ⇒ పరీక్ష పత్రంలో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాల్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలో ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధన చేయాలి.. సాధనమున పనులు సమకూరు అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే చక్కటి దస్తూరిని రాబట్టడం సాధ్యమే. ముందుగా అక్షరాలు గుండ్రంగా రాయడం అలవాటు చేసుకోవాలి. తర్వాత పదాలు, వాఖ్యాల కూర్పుపై దృష్టి పెట్టాలి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు చక్కటి చేతిరాత ఎక్కువ మార్కుల సాధనకు ఉపయోగ పడుతుంది. - సుభాన్ రెడ్డి, హెచ్ఎం, దిర్సంపల్లి తండా ప్రాథమిక పాఠశాల -
కేంద్ర సాయుధ బలగాల్లో 62 వేల పోస్టులు
ఇఫ్లూ అడ్మిషన్లు ఇఫ్లూ యూనివర్సిటీకి హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఈ మూడు క్యాంపస్‌లలో ఎక్కడైనా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ క్యాంపస్ బీఏ (ఆనర్స్)- ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్ బీఈడీ (ఇంగ్లిష్) ఎంఏ (ఇంగ్లిష్) ఎంఏ జేఎంసీ (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) ఎంఏ (కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్) ఎంఈడీ పీజీ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ పీహెచ్డీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియా స్టడీస్, ఇంగ్లిష్ లిటరేచర్, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్, ఎడ్యుకేషన్, అస్థెటిక్స్ అండ్ ఫిలాసఫీ, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్) ఎంఏ (హిందీ, అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్) లక్నో క్యాంపస్ బీఏ (ఆనర్స్)-ఇంగ్లిష్ ఎంఏ (ఇంగ్లిష్) పీజీడీటీఈ (ఇంగ్లిష్) షిల్లాంగ్ క్యాంపస్ బీఏ (ఆనర్స్) -ఇంగ్లిష్ బీఏ జేఎంసీ (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) ఎంఏ (ఇంగ్లిష్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) పీహెచ్డీ (లింగ్విస్టిక్స్)ప్రవేశం: దాదాపు అన్ని కోర్సుల్లో రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కొన్ని కోర్సులకు మాత్రం రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి రెండు కోర్సులకు మించి దరఖాస్తు చేసుకునే వీలు లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2015 దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: మార్చి 5, 2015. రాత పరీక్షలు నిర్వహించే తేదీ: మార్చి 28, 2015. వెబ్సైట్: www.efluniversity.ac.in -
పొడవైన నటి ఎవరు?
కొచ్చి: పొడవైన నటి ఎవరు? ఇదేమి మీకు నిర్వహించే అర్హత పరీక్ష కాదు. ఓ ప్రభుత్వ పరీక్షలో వెలుగు చూసిన ప్రశ్న. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ తరహా ప్రశ్నలు ప్రభుత్వ పరీక్షల్లో అడుగుతారా? అనే సందేహం కూడా రావచ్చు.ఇక నుంచి చరిత్రలను తిరగేసి విద్యార్థులు సినిమాలపై కూడా ఓ కన్నేసి ఉంచాలేమో. ఎందుకంటే ఆదివారం కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ లో ఒక ప్రశ్న మాత్రం విద్యార్థులను తికమకపెట్టింది. ఆ పరీక్షల్లో పొడవైన నటి ఎవరని అడుగుతూ.. దిగువన కొంతమంది నటీమణుల పేర్లు దర్శనిమిచ్చాయి. ప్రభుత్వం క్రింద వరుసలో ఇచ్చిన నటీ మణుల్లో హుమా ఖురేషి, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, ప్రీతి జింతా పేర్లు ఉన్నాయి. ఇటువంటి వింత ప్రశ్నను చూసిన విద్యార్థులు కలవరపడ్డారు. దీనిపై ఒక విద్యార్థి స్పందిస్తూ.. ఆ ప్రశ్నతో తొలుత కాస్త ఇబ్బంది పడ్డానని తెలిపాడు. కాకపోతే ఈ ప్రశ్నకు జవాబు చేయడానికి ప్రీతి జింటా పేరును ముందుగా పక్కన పెట్టినట్లు తెలిపాడు. తాను నటీమణులు బికినీలతో ఉన్న సన్నివేశాలను ఎప్పుడూ తిలకించలేదని.. అయితే కత్రీనా కైఫ్, రణబీర్ కపూర్ ల బీచ్ హాలీడే ఫోటోను గతంలో చూసిన సందర్భం మాత్రం ఆ సమయంలో గుర్తుకు వచ్చిందన్నాడు. కాకపోతే తాను ఈ ప్రశ్నకు దీపికా పదుకునే అనుకుని మాత్రమే జవాబు ఇచ్చానన్నాడు. ఇక నుంచి ప్రశ్నలకు కాదేదీ అనర్హం! అన్న సంగతి విద్యార్థులు గుర్తించాలి. -
ఒకే రోజు మూడు ‘పరీక్ష’లు
25న ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్, అటవీశాఖ, పోస్టల్ అసిస్టెంట్స్ పరీక్షలు తలపట్టుకుంటున్న నిరుద్యోగులు.. పట్టించుకోని అధికారులు హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదే అరకొరగా. పోటీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులు అహోరాత్రులు శ్రమిస్తేగానీ నెగ్గుకురాలేరు. అసలే రాష్ర్ట విభజన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో నోటిఫికేషన్లు లేక ఆవేదనలో ఉన్న అభ్యర్థులపై మరో పిడుగు పడింది! ఈనెల 25వ తేదీన ఒకే రోజు మూడు పరీక్షల జరగనుండటంతో దేనికి హాజరు కావాలో తేల్చుకోలేక నిరుద్యోగులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్, పోస్టల్ అసిస్టెంట్స్, అటవీశాఖ నోటిఫికేషన్లు అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 25న జూనియర్ ఇంజనీర్ పరీక్ష నిర్వహణకు మార్చి 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే రెండు నెలల క్రితమే పరీక్ష తేదీ ఖరారైంది. అయితే రాష్ట్ర అటవీ శాఖ దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా అదే రోజున ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవలే తేదీని ప్రకటించింది. దీంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇది చాలదన్నట్టు తాజాగా పోస్టల్ శాఖ కూడా మే 25వతేదీన పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించటం మూడు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నింపింది. పరీక్ష తేదీలను మార్చాలని అధికారులను కోరినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపాలి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ఎదురు చూస్తున్న మాకు ఈ పరీక్షలు వరంలా అనిపించాయి. కానీ ఒకే రోజు మూడు పరీక్షలు పెట్టటం అంటే నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే. అధికారులు చొరవ తీసుకొని పరీక్షల తేదీలను మార్చాలి. - కృష్ణ, అభ్యర్థి, కర్నూలు ఒకే రోజు మూడు పరీక్షలా? ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఇది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడ మే. తేదీలు ఖరారు చేసేముందు అదే రోజు ఇతర పరీక్షలు ఉన్నాయోమో చూసుకోవాలా వద్దా? అధికారులు దీన్ని పరిశీలించి పరీక్ష తేదీలను మార్చాలి. - కిషోర్, అభ్యర్థి, హైదరాబాద్ -
విద్యార్థులకు మార్గదర్శనం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర తెలుగు మంచ్ (ఎంటీఎం), ‘రత్నమాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలాజీ’ (ఎఆర్‌ఎంఐఈటీ) సంయుక్త ఆధ్వర్యంలో షాహాపూర్‌లో ఎస్ఎస్సీ, హెచ్ఎస్సీ విద్యార్థుల కోసం ‘కెరీర్ గెడైన్స్’ సదస్సు నిర్వహిస్తున్నారు. ఏఆర్ఎంఐఈటీ కాలేజీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సులో తొలిరోజు సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. మొదటిరోజు సదస్సులో వర్లిలోని ఎస్వీ క్లాసెస్ విద్యార్థులతోపాటు సైన్, దాదర్ తదితర ప్రాంతాల విద్యార్థులు పాల్గొన్నారు. వీరితోపాటు భివండీ, ముంబైకి చెందిన 15 ఎన్జీఓ సంస్థల సభ్యులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎంటీఎం అధ్యక్షుడు జగన్‌బాబు, సుభాష్ మచ్చ, ఎఆర్‌ఎంఐఈటీ ైచె ర్మన్ ఏవీ గుప్తా, బోగ సహదేవ్, వడ్లకొండ రాము, బోగ సుదర్శన్, ప్రదీప్ సుంకా, వాసం రాజేంద్ర, గాజెంగి రాజు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ కొలువులుః ఎస్ఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మాదిరిగానే.. క్రమం తప్పకుండా నియామక ప్రకటనలు విడుదల చేస్తూ ఉద్యోగార్థుల పాలిట కామధేనువుగా నిలుస్తోంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ). ఇది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు, వాటి పరిధిలోని విభాగాలు, కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. దాదాపు ఈ పోస్టులన్నీ గ్రూప్-బి, గ్రూప్-సి కేడర్‌కు చెందినవే. డిగ్రీ, ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, పదోతరగతి అర్హతతో ఎస్ఎస్సీ నిర్వహించే పరీక్షల ద్వారా ఏయే ఉద్యోగాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్ఎస్సీ నిర్వహించే పరీక్షల ద్వారా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ఇన్‌కంట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సీబీఐ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఐటీబీపీ వంటి ప్రతిష్టాత్మక విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్గా అడుగుపెట్టొచ్చు. అదేవిధంగా ఇంటర్ అర్హతతో డేటాఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్, స్టెనోగ్రాఫర్స్ పోస్టులకు పోటీపడొచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాతో కేంద్ర ప్రభుత్వ ఇంజనీర్‌గా కొలువుదీరొచ్చు. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ సంస్థలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ వంటి వాటి లో కానిస్టేబుల్ ఉద్యోగాలను, వివిధ కేంద్ర పభుత్వ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ పోస్టులను దక్కించుకోవచ్చు. ఇలా పదో తరగతి మొదలుకొని ఇంటర్, పాలిటెక్నిక్, బ్యాచిలర్ డిగ్రీ వరకూ.. ఏ కోర్సులు పూర్తిచేసినవారైనా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరై కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో పాగా వేయొచ్చు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్-బి, గ్రూప్-సి స్థాయి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఉద్యోగాలివే... రాతపరీక్ష, ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా భర్తీ చేసే పోస్టులు: ఇన్స్పెక్టర్(ఇన్‌కంట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, పోస్ట్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్) సబ్ ఇన్స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)) అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ) డివిజనల్ అకౌంటెంట్స్(కాగ్ పరిధిలోని వివిధ విభాగాల్లో) స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 అసిస్టెంట్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతోపాటు ఇతర మంత్రిత్వ శాఖలు, సంస్థలు, విభాగాలు) రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేసే పోస్టులు: ఆడిటర్(కాగ్, సీజీడీఏ, సీజీఏ పరిధిలోని కార్యాలయాలు) అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్(కాగ్, సీజీఏ పరిధిలోని కార్యాలయాలు) అప్పర్ డివిజన్ క్లర్క్(కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖలు) ట్యాక్స్ అసిస్టెంట్(సీబీడీటీ, సీబీఈసీ), కంపైలర్(రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా) సబ్ ఇన్స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్) అర్హత: కంపైలర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కంపైలర్ పోస్టులకు ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టులకు స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: అన్ని పోస్టులకు ప్రకటనలో సూచించిన విధంగా నిర్దేశించిన తేదీనాటికి వయసును కలిగి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (నిర్దేశిత తేదీనాటికి 26 ఏళ్లు మించరాదు)మినహా మిగతా అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక: రెండు దశల్లో నిర్వహించే రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్ల పోస్టులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. రాత పరీక్ష: పోస్టులను బట్టి రాత పరీక్ష ఉంటుంది. టైర్-1 అందరికీ ఒకేలా ఉంటుంది. టైర్-2లో మాత్రం మార్పులు ఉంటాయి. వివరాలు.. మొదటి దశలో నిర్వహించే టైర్-ఐ పరీక్షలో.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో మొత్తం 50 ప్రశ్నల చొప్పున 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి టైర్-2పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 కింద క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, పేపర్-2కింద ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, కంపైలర్ పోస్టులకు ఈ రెండు పేపర్లతోపాటు అదనంగా మూడో పేపర్(స్టాటిస్టిక్స్) ఉంటుంది. దీనికి కూడా 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. టైర్-1, టైర్-2 రెండు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. రెండు దశలు రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి పోస్టులను బట్టి ఇంటర్వ్యూ/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో, ప్రకటన: ఫిబ్రవరిలో.. స్టెనోగ్రాఫర్స్(గ్రేడ్ సీ అండ్ డీ) ఎగ్జామినేషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్స్(గ్రేడ్ సీ అండ్ డీ) పోస్టుల భర్తీ కోసం ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 18-27ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా. రాతపరీక్ష విధానం: ఇందులో భాగంగా ఒకే పేపర్ ఉంటుంది. మూడు పార్ట్‌లుగా ఉండే పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 ప్రశ్నలు)-50 మార్కులు, జనరల్ అవేర్నెస్(50 ప్రశ్నలు)-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (100 ప్రశ్నలు) - 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. స్కిల్ టెస్ట్: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి స్టెనోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రకటన: సెప్టెంబర్‌లో.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) పరీక్ష కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లోని వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామ్‌ను ఎస్ఎస్సీ నిర్వహిస్తోంది. అర్హత: 10+2 ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశించిన తేదీ నాటికి 18-27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాతపరీక్ష, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా.. రాతపరీక్ష: ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు. స్కిల్ టెస్ట్: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటర్‌పై గంటకు 8,000 పదాలు(కీ డిప్రెషన్స్) టైప్ చేయాలి. టైపింగ్ టెస్ట్: లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల వారికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నిమిషానికి ఇంగ్లిష్ అయితే 35 పదాలు, హిందీ అయితే 30 పదాలు చొప్పున టైప్ చేయగలగాలి. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్టులు కేవలం అర్హత కోసమే. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ప్రకటన: జూలై, ఆగస్టులలో.. జూనియర్ ఇంజనీర్స్ పరీక్ష సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఫరక్కా బ్యారేజ్ వంటి వాటిల్లో జూనియర్ ఇంజనీర్ల భర్తీకి ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత: సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రాంచ్‌ల్లో డిగ్రీ(లేదా)మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. కొన్ని పోస్టులకు నిర్దేశించిన పని అనుభవం తప్పనిసరి. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి కొన్ని పోస్టులకు 18-27 ఏళ్లు. మరికొన్ని పోస్టులకు 32 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా. రాత పరీక్ష 500 మార్కులకు, ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 వ్యాసరూప విధానంలో ఉంటాయి. పేపర్-1 పరీక్ష విధానం: ఇది ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌కు 50 మార్కులు; జనరల్ ఇంజనీరింగ్ పార్ట్-ఏలో సివిల్ లేదా స్ట్రక్చరల్, పార్ట్-బీలో ఎలక్ట్రికల్, పార్ట్- సీలో మెకానికల్ ఉంటాయి. ఏదో ఒక విభాగాన్ని ఎంచుకోవాలి. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్-2 పరీక్ష విధానం: ఇందులో జనరల్ ఇంజనీరింగ్‌లో భాగంగా.. పార్ట్-ఎలో సివిల్ అండ్ స్ట్రక్చరల్, పార్ట్-బిలో ఎలక్ట్రికల్, పార్ట్-సిలో మెకానికల్ ఉంటాయి. ఏదో ఒక విభాగాన్ని ఎంచుకొని వ్యాసరూప విధానంలో సమాధానాలు రాయాలి. మొత్తం మార్కులు 300. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇంటర్వ్యూ: రాతపరీక్ష ఉత్తీర్ణులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 100 మార్కులుంటాయి. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా, ప్రకటన: ఫిబ్రవరిలో, పరీక్ష తేదీ: మే 25, 2014 కానిస్టేబుళ్ల భర్తీ కేంద్ర రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి ప్రతి ఏటా ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమాబల్‌లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: శారీరక ప్రమాణాలు, శారీరక సామర్థ్యం, రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా. రాత పరీక్ష విధానం: శారీరక సామర్థ్య, ప్రమాణాల పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారిని రాత పరీక్షకు పిలుస్తారు. రెండు గంటల వ్యవధిలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అవి.. పార్ట్-ఎ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, పార్ట్-సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్-డి ఇంగ్లిష్/హిందీ. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్/హిందీ మినహా మిగతా మూడు పార్టులను మన రాష్ట్ర అభ్యర్థులు తెలుగులో కూడా రాయొచ్చు. వైద్య పరీక్ష: రాత పరీక్ష ఉత్తీర్ణులకు వైద్య పరీక్షను నిర్వహిస్తారు. ప్రకటన: డిసెంబర్లో.. మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) సిబ్బంది వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాలు మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తోంది. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశించిన తేదీ నాటికి 18-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. పేపర్-1లో సాధించిన మార్కుల ఆధారంగా పేపర్-2కు ఎంపిక చేస్తారు. పేపర్-2 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అయితే నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. పరీక్ష వ్యవధి: రెండు గంటలు. పేపర్-1 పరీక్ష విధానం: విభాగం పశ్నల సంఖ్య మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 25 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 25 జనరల్ ఇంగ్లిష్ 50 50 జనరల్ అవేర్నెస్ 50 50 పేపర్-2: షార్ట్ ఎస్సే/లెటర్ ఇన్ ఇంగ్లిష్ లేదా ఏదైనా భాషలో రాయాలి. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. 30 నిమిషాల వ్యవధిలో జరిగే పరీక్షకు 50 మార్కులు కేటాయించారు. ప్రకటన: నవంబర్‌లో.. సబ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ఫోర్సెస్లలో సబ్ ఇన్స్పెక్టర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య: సబ్ ఇన్స్పెక్టర్స్-2197, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్- 564. అర్హత: గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పోస్టులకు పోటీపడేవారు డ్రైవింగ్ లెసైన్స్‌ను కలిగి ఉండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 20-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా. రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్-1, పేపర్-2. రెండు పేపర్లు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి: రెండు గంటలు. పేపర్-1: సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 50 జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 50 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 50 పేపర్-2: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పై 200 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. వ్యవధి రెండు గంటలు. శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు: పేపర్-1లో ఉత్తీర్ణత సాధించినవారిని శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలకు పిలుస్తారు. ఇందులో భాగంగా నిర్దేశించిన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. దీంతోపాటు పరుగుపందెం, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌ఫుట్ వంటివి నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినవారికి మాత్రమే పేపర్-2 నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014 పేపర్ -1 పరీక్ష తేదీ: జూన్ 22, 2014 పేపర్-2 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2014 --------------------------------------- పై పోస్టులే కాకుండా.. ప్రసార భారతి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివాటిలోనూ వివిధ ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోంది. సంబంధిత సంస్థల్లో ఖాళీల ఆధారంగా వీటికి ప్రకటనలు వెలువడుతుంటాయి. ఉద్యోగ నియామక ప్రకటనల కోసం www.ssc.nic.in, ఎంప్లాయ్మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్, www.sakshieducation.com వంటి వాటిని చూడొచ్చు. -
నేనూ పరీక్ష రాస్తున్నానోచ్ అంటున్న నరేంద్ర మోడీ
గుజరాత్ లో గురువారం నుంచి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బుధవారం ఉన్నట్టుండి ఒక ఎస్ ఎం ఎస్ వచ్చింది. 'విద్యార్ధి మిత్రులారా... నేను నరేంద్ర మోడీని,' అంటూ నరేంద్ర మోడీ వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తరువాతే మోడీ మార్కు మొదలైంది. 'మీలా నేనూ పరీక్షలు రాస్తున్నాను. నేను పరీక్షలంటే భయపడటం లేదు. నాలాగే మీరూ పరీక్షలంటే భయపడకండి' అంటూ భరోసా ఇచ్చారు. 'పరీక్షలు ఎదుర్కోవడం జీవితంలో సహజం. మనం ఎంత కష్టపడి ప్రిపేరైతే అంత విజయం సాధిస్తాం. మీ టీచర్లు, మీ తల్లిదండ్రులు మీ కోసం ఎంతో చేశారు. వీటన్నిటి వల్ల మీరు విజయం సాధించడం ఖాయం' అంటూ మోడీ సెంటిమెంట్ పై దెబ్బకొట్టారు. రాబోయే లోకసభ ఎన్నికలే నరేంద్ర మోడీ రాయబోతున్న అసలైన పరీక్ష. మోడీకి కూడా దాటాల్సిన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. పార్టీ లోపల, వెలుపల సవాళ్లు ఉన్నాయి. వీటన్నిటి కన్నా ముఖ్యం ప్రజల ఆమోదాన్ని పొందాలి. అది సిసలైన పరీక్ష. ఇన్ని కఠిన పరీక్షల ముందు మీ పరీక్షలొక లెక్కా అన్నట్టు నరేంద్ర మోడీ విద్యార్థుల్లో భరోసా నింపారు. తమాషా ఏమిటంటే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఒక సారి ఫెయిలయినా మరో చాన్స్ ఉంటుంది. కానీ మోడీకి ఇదే మొదటి, చివరి పరీక్ష. ఇందులో ఫెయిలయితే మాత్రం అంతే సంగతులు. -
మార్చి 27 నుంచి పదో తరగతి పరీక్షలు
రీషెడ్యూల్‌ను ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు కాకుండా.. మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు బుధవారం వెల్లడించింది. తొలుత ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ను ప్రకటించారు. అయితే ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పుల కారణంగా ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం మార్చారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 27న ప్రథమ భాష పరీక్షతో పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పరీక్షతో ముగుస్తాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలవుతాయి. కొత్తషెడ్యూల్ పక్క పట్టికలో...