పొడవైన నటి ఎవరు? | Which actress is tallest? Govt exam asks | Sakshi
Sakshi News home page

పొడవైన నటి ఎవరు?

Jul 21 2014 5:59 PM | Updated on Sep 2 2017 10:39 AM

పొడవైన నటి ఎవరు?

పొడవైన నటి ఎవరు?

పొడవైన నటి ఎవరు?ఇదేమి మీకు నిర్వహించే అర్హత పరీక్ష కాదు. ఓ ప్రభుత్వ పరీక్షలో వెలుగు చూసిన ప్రశ్న. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించవచ్చు.

కొచ్చి: పొడవైన నటి ఎవరు? ఇదేమి మీకు నిర్వహించే అర్హత పరీక్ష కాదు. ఓ ప్రభుత్వ పరీక్షలో వెలుగు చూసిన ప్రశ్న. ఇది నిజంగా  ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ తరహా ప్రశ్నలు ప్రభుత్వ పరీక్షల్లో అడుగుతారా? అనే సందేహం కూడా రావచ్చు.ఇక నుంచి చరిత్రలను తిరగేసి విద్యార్థులు సినిమాలపై కూడా ఓ కన్నేసి ఉంచాలేమో. ఎందుకంటే ఆదివారం కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ లో ఒక ప్రశ్న మాత్రం విద్యార్థులను  తికమకపెట్టింది.

 

ఆ పరీక్షల్లో పొడవైన నటి ఎవరని అడుగుతూ.. దిగువన కొంతమంది నటీమణుల పేర్లు దర్శనిమిచ్చాయి. ప్రభుత్వం క్రింద వరుసలో ఇచ్చిన నటీ మణుల్లో హుమా ఖురేషి, కత్రినా కైఫ్,  దీపికా పదుకునే,  ప్రీతి జింతా పేర్లు ఉన్నాయి. ఇటువంటి వింత ప్రశ్నను చూసిన విద్యార్థులు కలవరపడ్డారు.  దీనిపై ఒక విద్యార్థి స్పందిస్తూ..  ఆ ప్రశ్నతో తొలుత కాస్త ఇబ్బంది పడ్డానని తెలిపాడు. కాకపోతే ఈ ప్రశ్నకు జవాబు చేయడానికి ప్రీతి జింటా పేరును ముందుగా పక్కన పెట్టినట్లు తెలిపాడు.  తాను నటీమణులు బికినీలతో ఉన్న సన్నివేశాలను ఎప్పుడూ తిలకించలేదని.. అయితే కత్రీనా కైఫ్, రణబీర్ కపూర్ ల బీచ్ హాలీడే ఫోటోను గతంలో చూసిన సందర్భం మాత్రం ఆ సమయంలో గుర్తుకు వచ్చిందన్నాడు.  కాకపోతే తాను ఈ ప్రశ్నకు దీపికా పదుకునే అనుకుని మాత్రమే జవాబు ఇచ్చానన్నాడు.

 

ఇక నుంచి ప్రశ్నలకు కాదేదీ అనర్హం! అన్న సంగతి విద్యార్థులు గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement