సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్‌ఎస్‌సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో 73.0శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.
అయితే వార్షిక పరీక్షల్లో పెయిలైన ఫెయిలైన విద్యార్ధులకు ఎస్‌ఎస్‌ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఆ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్ని https://results.sakshieducation.com/ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment