ముంబై: మహారాష్ట్రలో గణితం, సైన్స్ సబ్జెక్టులంటే భయపడే విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అపార కరుణ చూపింది. ఇకపై రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో 20 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. గతంలో ఈ సబ్జెక్టులలో పాస్ కావాలంటే 100కు 35 మార్కులు తప్పనిసరిగా రావాలనే నిబంధన ఉంది.
ఇంత మంచి వార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా పాసయ్యేవారి విషయంలో మరో మెలికకూడా పెట్టింది. వారు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక వారి మార్క్‌షీట్‌లో ఇకపై సదరు విద్యార్థి మ్యాథ్స్, సైన్స్ చదవలేరని రాస్తారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ రాహుల్ రేఖావర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ మార్పు పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆమోదించిన కొత్త పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌లో ఒక భాగమని తెలిపారు.
రాష్ట్రంలో కొత్త పాఠ్యాంశాలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ శరద్ గోసావి తెలిపారు. హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ చదవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
Comments
Please login to add a commentAdd a comment