నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 12 గంటల వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు దాదాపు 6,53,692 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 156 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణసౌకర్యాలు అందిస్తున్నట్లు ఆర్టీసీ తెలియజేసింది.