
వైఎస్సార్ జిల్లాలో ఘటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో సోమవారం అధికారులు తనిఖీ చేస్తుండగా, 10వ తరగతి గణితం పేపర్ వాట్సాప్‌లో షేర్ అయినట్లు తెలిసింది. ఆరా తీయగా స్కూల్లోని వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వరరెడ్డి అనే వ్యక్తికి పంపినట్టు గుర్తించారు. వాటర్ బాయ్‌పై కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో 15 మంది సస్పెన్షన్..
ఈనెల 21న జరిగిన ఇంగ్లీష్ పరీక్షలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ,బీ కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్‌కు సహకరించిన 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కళేష్ సర్కిల్, బస్ స్టాండ్ రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఏ,బీ కేంద్రాల వద్ద భారీగా గణితం స్లిప్పులు దొరకడంతో ఇరువురు ఇన్విజిలేటర్లు సస్పెండ్ అయ్యారు.