![AP Govt Says Give Marks Along With Grades In SSc Exams - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/28/ap-gove.jpg.webp?itok=WauMXcPU)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 55 విడుదల చేశారు. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి వరకు గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. 2018–19 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలలో గ్రేడింగ్ విధానం అమలు చేశారు. కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల విద్యార్థులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో విద్యార్థులు ఆయా తరగతుల్లో ఏడాదిపాటు నిర్వహించిన పరీక్షల్లో అంతర్గత మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు.
చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ ఫలితాలను ఇచ్చారు. హైపవర్ కమిటీ సూచన మేరకు విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులను కూడా అవార్డు చేయనున్నారు. పై చదువులకు, ఉపాధి అవకాశాలకు మెరిట్ నిర్ణయించేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2019–20 బ్యాచ్ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment