grades
-
ఉత్తమ ఫలితాలు తెచ్చుకున్న విద్యార్థులు , ఉఫాధ్యాలులకి సత్కారం
-
అంపైర్లకు ప్రమోషన్.. బీసీసీఐతో అట్లుంటది మరి
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) అంపైర్ల విషయంలో కొత్త పంథాను అనుసరించింది. ఇన్నాళ్లు ఆటగాళ్లకు మాత్రమే ఉన్న ఏ-ప్లస్ గ్రేడ్‌ను అంపైర్లకు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మెంబర్ అయిన నితిన్ మీనన్ సహా మరో నలుగురు అంతర్జాతీయ అంపైర్లకు ఏ ప్లస్ కేటగిరిలో చోటు కల్పించింది. అనిల్ చౌదరీ, మదన్‌గోపాల్ జయరామన్, వీరేంద్ర కుమార్ శర్మ, కెఎన్ అనంతపద్మనాభన్ ఈ జాబితాలో ఉన్నారు. గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ అంతర్జాతీయ అంపైర్లు కె. హరిహరన్, సుదీర్ అనానీ, అమీష్ సాహెబా, బీసీసీఐ అంపైర్స్ సబ్ కమిటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఇచ్చిన రిపోర్టు మేరకు బీసీసీఐ ఏ-ప్లస్ కేటగిరిని కొత్తగా సృష్టించింది. ఇంతవరకు అంపైర్ల గ్రేడ్ కాంట్రాక్ట్ విషయంలో ఏ, బి, సి, డి కేటగిరీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా చేర్చిన ఏ-ప్లస్, ఏ కేటగిరిలో ఉన్న అంపైర్లకు ఒక్కో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కు రూ.40 వేలు.. బి, సి కేటగిరిల్లో ఉన్న అంపైర్లకు రూ.30వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఏ-ప్లస్‌లో ఐదుగురు ఉండగా.. ఏ-కేటగిరిలో 20 మంది అంపైర్లు, బి-కేటగిరిలో 60 మంది అంపైర్లు, సి-కేటగిరిలో 46 మంది అంపైర్లు ఉన్నారు.కమిటీ బీసీసీఐకి ఇచ్చిన నివేదికలో ఏ ప్లస్ కేటగిరీ ప్రతిపాదనను ‘గ్రేడేషన్ ఆఫ్ అంపైర్లు’గా పేర్కొంది. అయితే బోర్డు స్వయంగా ఆ కేటగిరీని సృష్టించిందని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇవి ఏ-ప్లస్ కొత్త కేటగిరీతో కూడిన సమూహాలు. ఏ-ప్లస్‌తో పాటు ఏ- గ్రేడ్ భారతీయ అంపైర్ల క్రీమ్‌ను కలిగి ఉంటాయి. ఇక అంపైర్లకు విధులనేవి కేటగిరీ వారిగా నిర్ణయిస్తారని.. రంజీ ట్రోఫీ సహా మిగిలిన దేశవాలీ క్రికెట్ టోర్నీలకు ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. చదవండి: BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్ ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి -
బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ‘సి’ గ్రేడ్
బాసర (ముధోల్): నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీ (ఆర్జీయూకేటీ)కి న్యాక్ ‘సి’ గ్రేడ్ గుర్తింపునిచ్చింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కమిటీ బృందం గతేడాది బాసరను సందర్శించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాసంస్థల్లో స్థితిగతులు, మౌలిక వసతులు, బోధన, బోధనేతర అంశాలు, పరిశోధనలు ఇలా ప్రతీ అంశాన్ని పరిశీలించి తదనుగుణంగా న్యాక్ గ్రేడ్లను నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి ‘సి’ గ్రేడ్ ప్రదానం చేస్తూ కమిటీ సర్టిఫికెట్‌ను తన వెబ్సైట్లో పొందుపర్చింది. అధికారుల తీరే కారణమా..? తెలంగాణకే తలమానికమైన బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడతారు. ఎన్నో ఆశలతో వర్సిటీలో అడుగుపెట్టిన వారిని ఈసారి న్యాక్ గ్రేడ్ నిరాశపర్చింది. స్థానిక అధికారుల తీరుతో పాటు న్యాక్ బృందం వర్సిటీలో పర్యటించినప్పుడు వీసీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతోనే సరైన గుర్తింపు దక్కలేదనే విమర్శలున్నాయి. అలాగే కమిటీకి వర్సిటీ అధికారులు వివరించిన తీరు కూడా సరిగా లేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు వర్సిటీ ప్రారంభం నుంచి రెగ్యులర్ వీసీ లేకపోవడం, పరిశోధనలకు పెద్దపీట వేయకపోవడం వంటి విషయాలు బృందాన్ని నిరాశపర్చినట్లు సమాచారం. న్యాక్గ్రేడ్ ఆధారంగానే యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్) నిధుల మంజూరు ఉంటుంది. ఈ గ్రేడ్ ఆధారంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొనడంతో పాటు వర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుంది. వర్సిటీ నుంచి విద్యార్థికి లభించిన సర్టిఫికెట్‌నూ హైప్రొఫైల్‌గా భావిస్తారు. ఈక్రమంలో వర్సిటీకి తక్కువ గ్రేడ్ గుర్తింపు రావడంపై వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. (సూర్యాపేటలో ర్యాగింగ్ రక్కసి; గదిలో బంధించి.. పిడిగుద్దులు గుద్ది) -
AP: టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 55 విడుదల చేశారు. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి వరకు గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. 2018–19 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలలో గ్రేడింగ్ విధానం అమలు చేశారు. కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల విద్యార్థులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో విద్యార్థులు ఆయా తరగతుల్లో ఏడాదిపాటు నిర్వహించిన పరీక్షల్లో అంతర్గత మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు. చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ ఫలితాలను ఇచ్చారు. హైపవర్ కమిటీ సూచన మేరకు విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులను కూడా అవార్డు చేయనున్నారు. పై చదువులకు, ఉపాధి అవకాశాలకు మెరిట్ నిర్ణయించేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2019–20 బ్యాచ్ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇస్తారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా -
హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
అమరావతి: టెన్త్ ఫలితాల కోసం హైపవర్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో.. ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్ ఫలితాలు ప్రకటన విడుదల చేశారు. 2019-20 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించి, 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చి వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన.. 3 ఫార్మెటివ్ అసిస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 2021 ఏడాది విద్యార్థులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30 శాతానికి.. 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్టులకు ఇవ్వాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. -
సొమ్ములిస్తే మార్కులేస్తాం..
భీమవరం: కరోనా వైరస్ కొన్ని విద్యాసంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చేయిస్తామంటూ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థ తమ విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలుకు సంబంధించి ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్–19 కారణంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వీరిలో సుమారు 390 ప్రైవేటు హైసూ్కల్స్‌లో 17 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్ధులున్నారు. సమ్మెటివ్ ఎస్సెస్మెంట్ పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యాశాఖ ఇంతకు ముందు విద్యార్థులకు నిర్వహించిన ఫార్మటివ్ ఎస్సెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మెటివ్ ఎస్సెస్మెంట్(ఎస్ఏ) పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పదో తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలుచేసి ఎక్కువ మార్కులు వేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు నాలుగు ఫార్మటీవ్ ఎస్సెస్మెంట్, ఒక సమ్మెటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే తయారుచేస్తారు. అలాగే పరీక్షల అనంతరం వాటిని అక్కడి ఉపాధ్యాయులే వేల్యూయేషన్ చేసి మార్కులు వేస్తారు. వాటిని విద్యాశాఖ ఆన్లైన్ సీఎస్ఈ సైట్‌ను అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిగా క్లాసులు జరగకపోవడంతో ఎఫ్ఏ పరీక్షలు మూడు నిర్వహించగా ఎస్ఏ పరీక్ష ఒకటి నిర్వహించారు. ఎస్ఏ పరీక్షలు నిర్వహించినా ఇంతవరకు వాటిని సీఎస్ఏ సైట్లో అప్లోడ్ చేయలేదని తెలిసింది. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఫోన్లు చేసి గతంలో మీరు ఎఫ్ఏ పరీక్ష సరిగా రాయలేదని ప్రస్తుతం ఎస్ఏ పరీక్షలో అత్యధిక మార్కులు రాకుంటే మంచి గ్రేడ్ వచ్చే అవకాశం లేనందున సొమ్ములిస్తే మంచి మార్కులు వేస్తామంటూ బేరాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్ధి నుంచి రూ.5 వేలు నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. గతంలో రాసిన ఎస్ఏ పరీక్ష పత్రం స్థానంలో సొమ్ములు ఇచ్చిన విద్యార్థులతో మళ్లీ జవాబులు రాయించి పాతపేపర్ల స్థానంలో వీటిని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొమ్ముల వసూలుపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతందనే భయంతో తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు భీమవరం ప్రాంతంలోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ డీఐతో విచారణ చేయించాం. ఎక్కడైనా ఇటువంటి అవకతవకలకు పాల్పడితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్ష మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్ నిర్ణయించే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి -
టెన్త్ విద్యార్థులకు నేరుగా మెమోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నేరుగా మెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇటీవల ఆ పరీక్షలను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థులందరినీ పాస్ చేసింది కూడా. అయితే ఇక విద్యార్థులకు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు, వారికి సంబంధించిన వివరాల క్రోడీకరణ పనిని చేపట్టింది. ఇపుడు ఎంతమంది పాస్ అయ్యారు?, ఎంతమంది ఫెయిల్ అయ్యారనేది లేదు. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులంతా పాస్ కాబట్టి వారికి మెమోలు జారీచేసే ప్రక్రియపైనే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫలితాల ప్రకటన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. లక్షన్నర మందికి 10/10 జీపీఏ! రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరగాల్సిన పరీక్షలకు 5,34,903 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇపుడు వారంతా పాస్ కాబట్టి వారికి ఇంటర్నల్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ప్రతి సబ్జెక్టులో 20 ఇంటర్నల్ మార్కులకు ఎన్ని వచ్చాయో వాటిని ఐదింతలుచేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇవ్వడమే ప్రధానం. అందుకోసం పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. అవసరమైతే జీపీఏ వారీగా వివరాలను పది రోజుల్లోగా వెబ్సైట్లో పొందుపరిచేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. దాంతోపాటే విద్యార్థులకు నేరుగా మెమోలు పంపించేలా చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో దాదాపు లక్షన్నర మందికి 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన వారిలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులే దాదాపు 3.75 లక్షల మంది వరకు ఉన్నారు. వారిలో లక్షన్నర మంది విద్యార్థులకు యాజమాన్యాలు ఇంటర్నల్ మా ర్కులను 20కి 20 వేసినట్లు సమాచారం. వారందరికీ 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లేదు.. ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ లేదు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఫెయిలయ్యే విద్యార్థులు లేనట్లే. అందుకే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణ ఉండదని విద్యాశాఖ చెబుతోంది. -
విద్యార్థులను ఇతరులతో పోల్చవద్దు
న్యూఢిల్లీ: మార్కులు, గ్రేడ్ల విషయంలో విద్యార్థులను తోటివారితో పోల్చవద్దని తల్లిదండ్రులు, టీచర్లకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సూచించింది. విద్యార్థుల్లో ఉన్న బలహీనతలను మరొకరితో పోల్చడం వల్ల వారిలో ఆత్మన్యూనతా భావం వస్తుందని ఫలితంగా ఆత్మగౌరవం దెబ్బతింటుందని పేర్కొంది. దీనికి సంబంధించి ఎన్సీఈఆర్టీ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక విద్యార్థి సాధించిన ఫలితాలను వేరొకరితో పోల్చడం సరికాదని తెలిపింది. దీని కంటే అదే విద్యార్థి గతంలో సాధించిన ఫలితాలతో పోల్చి సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా మెరుగైన విజయాలు సాధించగలరని పేర్కొంది. అలాగే ఓ విద్యార్థి మెరుగైన ఫలితాలు సాదించినప్పుడు వారిని అభినందించడం కూడా ముఖ్యమని సూచించింది. ఇలాంటి చర్యలతో వారిలో నేర్చుకోవాలనుకునే తపనతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపింది. నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అనేది కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని స్పష్టం చేసింది. దీనిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రిన్సిపల్స్ సహా అందరూ తమ బాధ్యతగా స్వీకరించాలని సూచించింది. -
ప్రజా సమస్యలకు ‘ఎఫ్’ గ్రేడ్
న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రేడ్లు కేటాయించారు. ఎన్డీఏ పాలనను ట్విట్టలో ఆయన ఎగతాళి చేస్తూ అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యవసాయం, విదేశాంగ విధానం, ఉద్యోగ కల్పనలో ‘ఎఫ్ ’ గ్రేడ్, నినాదాల రూపకల్పన, సొంత ప్రచారంలో రాహుల్ ‘ఏ+’ గ్రేడ్ ఇచ్చారు. ‘ఇది ఎన్డీఏ సర్కారు నాలుగేళ్ల రిపోర్టు కార్డు. వ్యవసాయం ‘ఎఫ్’, విదేశాంగ విధానం ‘ఎఫ్’, పెట్రో ధరలు ‘ఎఫ్’, ఉద్యోగ కల్పన ‘ఎఫ్’, నినాదాల రూపకల్పన ‘ఏ+’, సొంత ప్రచారం ‘ఎ+’, యోగా ‘బీ–’ అని గ్రేడ్లు ఇచ్చారు. అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట, వ్యక్తిత్వ సమస్యలతో బాధపడే వ్యక్తి, ఏకాగ్రత లేని మనస్తత్వం అని మోదీ అంటూ రిమార్క్స్ ఇచ్చారు. మోదీ–షా ద్వయం ప్రమాదకరం మోదీ– అమిత్ షా ద్వయం దేశానికి ప్రమాదకరమని ప్రజలు గ్రహించారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ‘భారత్ మోసపోయింది’ పేరిట బుక్‌లెట్‌ను విడుదల చేస్తూ.. ఈ నాలుగేళ్లు నమ్మకద్రోహం, మోసం, ప్రతీకారం, అసత్యాలతో కూడిన పాలన కొనసాగిందని అందులో పేర్కొంది. ఇంగ్లిష్, హిందీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ప్రధాని మోదీకి 40 ప్రశ్నల్ని సంధించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల పేరిట లఘు చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, సూర్జేవాలాలు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్డీఏ హాయంలో దేశంలో భయం, విద్వేషపూరిత వాతావరణం సృష్టించారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ పేర్కొన్నారు. సాధించిందేమీ లేదు: వామపక్షాలు న్యూఢిల్లీ: అపజయాలు, అబద్ధాలు, ఒట్టి ప్రచారాలు తప్ప నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించినవి మరేమీ లేవని వామపక్షాలు విమర్శించాయి. దేశ సామాజిక వ్యవస్థలు, ప్రజల జీవనాధారాలపై గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నాలుగేళ్లలో దాడులు జరిగాయనీ, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు రక్షణ ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వెళ్తోందనీ, ప్రజలు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తుండగా వారి రాజ్యాంగ బద్ధమైన, ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థలను మోదీ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. -
ఇదేం రోగం..?
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పైస్థాయి అధికారుల పెత్తనం పెరిగిపోయింది. సరైన సిబ్బంది లేక రోగులను బంధువులే మోసుకెళ్లాల్సిన పరిస్థితులు ఇక్కడుంటే, పదుల సంఖ్యలో ఉద్యోగులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్న ఆస్పత్రి అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఒకరు, ఇంటి అవసరాల కోసం ఇంకొకరు.. ఇలా నాలుగో తరగతి ఉద్యోగులను తమ ఇష్టానుసారం వాడుకుంటున్న తీరు తాజాగా వెలుగులోకి వచ్చింది. లబ్బీపేట (విజయవాడతూరు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఓ అధికారి అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అండతో తన ఇంటి వద్ద పనులు చేసేందుకు నలుగురు ఉద్యోగులను కేటాయించాలని హుకుం జారీ చేశారు. ఇంకేముంది.. అడిగిందే ఆలస్యం సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఇద్దరిని, వార్డులో విధులు నిర్వహించాల్సిన నాల్గో తరగతి ఉద్యోగులు ఇద్దరినీ కేటాయించారు. ఒకరు నిత్యం ఆ అధికారి కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు కేటాయించగా, మరొకరు ఇంటి వ్యవహారాలు చూసేందుకు నియమితులయ్యారు. నిత్యం ఇద్దరు ఉద్యోగులు ఆమె ఇంట్లో పనులు చేస్తుంటారు. ఇటీవల కుక్క వ్యవహారాలు చూసే ఉద్యోగి బంధువు మృతిచెందడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించారు. ఇలా.. శోభ, యేసయ్య అనే ఉద్యోగులతో పాటు మరో ఇద్దరు ఆ అధికారి సేవలోనే ఉంటున్నట్లు తెలిసింది. మరో అధికారి ఇంట్లో ఇద్దరు, సూపర్వైజర్ వద్ద మరో ఇద్దరు ఉద్యోగులు ఇంటి పనులు చక్కబెడుతూ ఆస్పత్రి విధులకు డుమ్మా కొడుతున్నారు. రోగులకు తప్పని కష్టాలు ఉద్యోగులు అధికారుల ఇళ్లలో పనులు చక్కబెడుతుండగా, రోగులకు సేవలు అందించేవారు లేక బంధువులే వీల్చైర్లు, స్ట్రెచ్చర్‌పై ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు తీసుకెళ్లాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. ఒక్కో సమయంలో రోగులను బంధువులే చేతులపై ఎత్తుకెళ్లడం జరుగుతోంది. అత్యవసర విభాగంలో సిబ్బందిని సైతం తమ సొంత పనులకు కేటాయించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారూ దృష్టిపెట్టండి ఆస్పత్రిలో ఉద్యోగులు లేరంటూ ప్రతిసారీ ఆరోగ్యశ్రీలో ఉద్యోగులను నియమించాలని కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. రోగుల కోసం అలా నియమించిన వారిని సొంత అవసరాలకు వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ దీనిపై దృష్టిసారిస్తే.. అనేక అవకతవకలు బయట పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చోద్యంచూస్తున్న అధికారులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఓ అధికారి.. సిబ్బందిపై పెత్తనం చేస్తూ సొంత అవసరాలకు వాడుకుంటున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఇటీవల తన ఇంట్లో ఫంక్షన్ జరగ్గా, ఆస్పత్రి క్యాంటీన్ నుంచి డిమాండ్ చేసి భోజనాలు తీసుకెళ్లారు. ఆదివారం సెలవులో ఉన్న సిబ్బందిని పిలిపించి మరీ భోజనాలు తీసుకురావాలని హుకుం జారీచేసినట్లు చెబుతున్నారు. ఇలా ఆస్పత్రి ఉన్నతాధికారి అండగా, కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బందిని సొంత అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా దృష్టికి రాలేదు ఆస్పత్రిలో నాల్గో తరగతి ఉద్యోగులు.. అధికారుల ఇళ్లలో పనులు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇక నుంచి జరగకుండా చూస్తాను. – డాక్టర్ జి.చక్రధర్, సూపరింటెండెంట్ -
విద్యా కార్యక్రమాల్లో రాష్ట్రాలకు గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్: విద్యా కార్యక్రమాలు రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నాయో తెలుసు కోడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్య కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు లాంటి 10 రకాల ప్రధాన విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు ఆధారంగా రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 30 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించిన స్కూళ్ల శాతం ఆధారంగా ఈ గ్రేడింగ్ ప్రకటించనుంది. ఒక్కో అంశానికి 10 శాతం వెయిటేజీ ఆధారంగా మొత్తం 100 శాతంగా పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ప్రక టించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) వెల్లడిం చింది. ఆ పది ప్రధానాంశాల అమలుకు సంబంధించిన వివరాలు, నివేదికలను ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్లో అక్టోబర్ 1లోగా అన్ని రాష్ట్రాలు అప్లోడ్ చేయాలని.. ఆ వెంటనే గ్రేడ్లు ప్రకటిస్తామంది. విద్యా కార్య క్రమాల అమలు ఆధారంగానే భవిష్యత్‌లో రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర నిర్ణయం నేపథ్యంలో వివరాలు అప్లోడ్ చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 10 ప్రధానాంశాలివే.. ♦ ఉపాధ్యాయుల ఫొటోలను పాఠశాల నోటీసు బోర్డులో పెట్టిన స్కూళ్లు ఎన్ని.. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్ల ఫొటోలను నోటీసు బోర్డులో ఉంచాలని గతంలో కేంద్రం జారీ చేసిన ఆదేశాలు అమలు చేసిన స్కూళ్ల సంఖ్య. ♦ తరగతుల వారీగా అభ్యాసన సూచికలు నోటీసు బోర్డులో ఉంచిన పాఠశాలలెన్ని, ఎన్ని పాఠశాలలు 100% అమలు చేశాయి. ♦ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అందిస్తున్న సహాయం, వారి ఉపకరణాలకు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, అందులో ఏ మేరకు ఖర్చు చేశారు. ♦ సర్వశిక్షా అభియాన్ కింద 2017–18లో తొలిసారి ఒకటి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలకు కేంద్రం ని«ధులిచ్చింది. అందులో ఎంత మొత్తం నిధులొచ్చాయి. విద్యార్థులకు ఎన్ని పాఠ్య పుస్తకాలిచ్చారు. ♦ విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాంలు ఇచ్చేందుకు నిధిలిస్తున్నారు. వీటి ద్వారా ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. ♦ వృత్యంతర శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య, ఉపాధ్యాయ శిక్షణకు కేంద్రం నుంచి పొందిన నిధులెన్ని, ఏ మేరకు ఖర్చు చేశారు. ♦ పాఠశాలల్లో చేరని విద్యార్థుల సంఖ్య ఎంత, వారిలో ఎంత మందిని చేర్పించారు. ♦ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా స్కూల్ గ్రాంట్ పొందిన స్కూళ్లు ఎన్ని, తీసుకున్న గ్రాంట్‌ను ఎన్ని పాఠశాలలు వినియోగించాయి. ♦ ఎంత మంది విద్యార్థులకు ఆధార్ ఉంది, ఎన్రోల్మెంట్లో 100 శాతం ఆధార్ అనుసంధానం చేసిన స్కూళ్లు ఎన్ని. ♦ ఎన్ని స్కూళ్లను ఇంజనీరింగ్, ఎన్ఐటీలు, ఐఐటీ విద్యా సంస్థలతో అనుసంధానం చేసి విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నారు. -
డిగ్రీలో మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్
ఈఎంఆర్సీ డైరెక్టర్, ప్రొఫెసర్ విష్ణువర్ధన్‌రెడ్డి జడ్చర్ల టౌన్ : మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్ ఇచ్చేలా యూజీసీ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చేపట్టిందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈఎంఆర్సీ డైరెక్టర్, ప్రొఫెసర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బూర్గుల రామకృష్ణారావు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీకళాశాలలో నిర్వహించిన సీబీసీఎస్ (చాయిల్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రొజెక్టర్ ప్రదర్శన ద్వారా జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. డిగ్రీ విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకున్నాయని, సంప్రదాయ విధానం కాకుండా విద్యార్థికి వెసులుబాటు కల్పించే విధంగా తనకు నచ్చి విషయాన్ని ఐచ్చికంగా ఎన్నుకోవచ్చన్నారు. సైన్స్ విద్యార్థి ఆర్ట్స్‌లో ఒక సబ్జెక్ట్‌ను ఐచ్చికంగా తీసుకొవచ్చన్నారు. పరిసరాల విజ్ఞానం, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాషల్లో ఒకదానిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వర్క్‌షాప్‌ను పాలమూరు యూనివర్సిటి రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి పర్యవేక్షించగా పీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ భక్తవత్సల్‌రెడ్డి, ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి, కళాశాల అధ్యాపకులు కృష్ణకుమార్, తమ్మిరెడ్డి, సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. -
స్కూళ్ళలో యోగాకు గ్రేడ్స్ ఇవ్వండి!
యోగాపై విద్యా సంస్థలు, వర్శిటీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ యూజీసీ సర్క్యులర్ జారీ చేయడం, యోగా చేసే ముందు ఓంకారం, శ్లోకాలతో ప్రార్థన చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓపక్క పార్టీలు, మత పెద్దలు ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగానే... ఆరవతరగతినుంచి సీబీఎస్ఈ స్కూళ్ళలోని రోజువారీ సీసీఈ కార్యక్రమాల్లో యోగాను భాగం చేయడంతోపాటు గ్రేడ్స్ ను సైతం అందించాలని ఎఫ్లియేటెడ్ పాఠశాలల ప్రిన్సిపల్స్ కు సర్క్యులర్ అందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీబీఎస్ఈ పాఠశాలలకు వచ్చిన యోగా సర్క్యులర్ పై కార్యదర్శి జోసెఫ్ ఇమ్మాన్యూల్ స్పందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనేందుకు విద్యార్థులు సంవత్సరమంతా రోజువారీ కార్యక్రమంగా యోగాను చేయాలా అంటూ ప్రశ్నించారు. ఆయుష్ ప్రోటోకాల్ ను ప్రస్తావించిన ఆయన... పిల్లలు వారానికోసారి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ముస్లిం మత పెద్దలు, పార్టీల అభ్యంతరాలతో యోగా కార్యక్రమంలో 'ఓం' ను, వైదిక మంత్రాలను పఠించడం తప్పనిసరి కాదని, ఎవరి ఇష్టం వారిదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్సష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... ఇప్పటికే సీసీఈ కార్యకలాపాల్లో యోగా భాగంగా ఉందని, మొత్తం పాఠశాల విద్యార్థులు ప్రతిరోజూ యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోయినా, వారానికోసారి ఉదయం అసెంబ్లీలో భాగంగా యోగా నిర్వహించవచ్చని సీనియర్ సీబీఎస్ఈ అధికారి తెలిపారు. మరోవైపు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనల ప్రకారం విద్యార్థులను సర్టిఫికేషన్ కోర్సు చేయించాలంటే.. సీబీఎస్ఈ స్కూళ్ళలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ను కూడ అప్పాయింట్ చేయాలని సీబీఎస్ఈ కోరింది. -
గ్రేడ్ల వారీగా ఇంటర్ ఫలితాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాల్లో ఏ-గ్రేడ్‌లో అత్యధికంగా 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 4,11,941 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,03,934 మంది ఉత్తీర్ణులయ్యారు.73.78%గా ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 76.43, బాలురు 71.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంలో కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఏ-గ్రేడ్ 75% మార్కుల కంటే ఎక్కువ, బీ-గ్రేడ్ 60 నుంచి 75%, సీ-గ్రేడ్ 50 నుంచి 60%, డీ-గ్రేడ్ 35 నుంచి 50%గా నిర్ణయించారు. గ్రేడ్ల వారీగా ఫలితాల వివరాలు: ఏ-గ్రేడ్ : 1,74,649( 57.16 %) బీ-గ్రేడ్ : 84407 (27.77%) సీ-గ్రేడ్ : 33,864 (11.14%) డీ-గ్రేడ్ : 11,014 (3.62%). -
చెవిలో పూలు
అడ్డదారిలో గ్రేడ్లు * ప్రభుత్వ శాఖల్లో అధికారుల లీలలు * సమస్యలు పక్కన పెట్టి రికార్డుల సృష్టి * ప్రజా దరఖాస్తుల దారి మళ్లింపు * ఒక్కసారిగా ‘ఏ’ గ్రేడ్‌కు ఎగబాకిన వైనం గుంటూరు ఈస్ట్ : జిల్లా యంత్రాంగం వివిధ శాఖల అధికారుల పనితీరుపై నిర్ణయించిన గ్రేడింగ్ విధానం నిరు పేదలకు కష్టాలను మిగుల్చుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు తమ పనితీరు మెరుగ్గా ఉందని పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తక్కువ చేసి ఉన్నతాధికారులకు చూపిస్తున్నారు. సాంకేతిక సమస్యలు చూపి ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వివరాలతో కూడిన నివేదికను సోమవారం విజయవాడలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు అందించారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అమల్లోకి గ్రేడింగ్ విధానం.. మూడు నెలల క్రితం ఉద్యోగులు, అధికారుల పనితీరును పరిశీలించి గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని జిల్లా యంత్రాంగం అమలులోకి తీసుకువచ్చింది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో జిల్లా వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు ‘సి’గ్రేడ్‌ను నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఆన్లైన్లో ఆయా ప్రభుత్వశాఖల పనితీరును పరిశీలిస్తోంది. ప్రతినెలా ఆయా జిల్లాలకు గ్రేడింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో జనవరి నెలలో సమస్యల పరిష్కారంపై పరిశీలన చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు ‘సి’ గ్రేడ్ ఇచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం అందుకు కారణమైన 10 మంది ఎంఆర్ఓలకు మెమోలు ఇచ్చి, అక్షింతలు వేసింది. ఈ గ్రేడ్ల గండం నుంచి బయటపడేందుకు అడ్డదారిని ఆశ్రయించారు. జనవరి నెలలో మీసేవ ద్వారా వచ్చిన గడువు దాటిన దరఖాస్తులు 84 వేలు ఉంటే, ఒక్క నెలలోనే 15వేలు పరిష్కరించి 69 వేలకు చేరినట్లు చూపారు. జన్మభూమి, మీకోసం ద్వారా వచ్చి గడువు దాటిన దరఖాస్తులు ఒక నెలలోనే సుమారు 40 వేల వరకు పరిష్కరించినట్లు చూపారు. నాలుగు నెలలకు కూడా పరిష్కారం కానివి జనవరి నెలలోనే పరిష్కారం అయినట్టు అధికారులు చూపారు. అసలేం జరిగిందంటే.. గడువు దాటినవి, గడువులోపు ఉన్న దరఖాస్తులు జిల్లాలో సుమారు లక్షన్నరకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ గండం నుంచి బయటపడేందుకు జిల్లా వ్యాప్తంగా మీసేవ సెంటర్లలో వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సర్వర్ పనిచేయడం లేదంటూ తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగకుండా చేశారు. తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలు లేవంటూ వాటిని ఆన్లైన్ నుంచి తిరస్కరించారు. అలాగే సాంకేతిక ఇబ్బందులు చూపించి భవిష్యత్తులో పరిష్కరిస్తామంటూ రాజీమార్గంలో ఒప్పించి ఆన్లైన్ నుంచి తొలగించారు. మొత్తం మీద జనవరి నెలలో జిల్లాలో 90 శాతం తహశీల్దారు కార్యాలయాలు సి గ్రేడ్‌లో ఉండగా, ఫిబ్రవరి నాటికి 90 శాతం ఏ గ్రేడ్‌కు చేరినట్లు చూపించారు. సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించే అంశం పక్కన బెట్టి రికార్డు పరంగా సంఖ్యను తగ్గించుకోవడానికే అధికారులు శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ విషయమై కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, అటువంటి అక్రమ మార్గాలు అనుసరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మంత్రులకు బాబు ర్యాంకింగ్
-
అన్ని కోర్సుల్లోనూ గ్రేడ్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర అన్ని కోర్సుల్లోనూ గ్రేడ్లు, గ్రేడ్ పారుుంట్ల విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణరుుంచింది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానం అవుల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. జాతీయు, అంతర్జాతీయు స్థారుు విద్యాసంస్థల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇకపై అన్ని స్థాయిల్లో అమలు చేయూలని నిర్ణరుుంచింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అవుల్లోకి తేనుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూజీసీ నిబంధనలకులోబడి ఆయూ రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైస్‌చాన్సలర్లకు వుంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను కేంద్రీయ, రాష్ట్ర యూనివర్సిటీలతోపాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా అవులు చేయూలని యూజీసీ ఆదేశించింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో వర్సిటీలను బట్టి వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. ఒక కోర్సులో మార్కుల విధానం అవుల్లో ఉంటే, కొన్ని కోర్సుల్లో మార్కులతోపాటు గ్రేడింగ్ విధానం అవుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వూర్కుల విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని యుూజీసీ నిర్ణయించింది. ఇకపై అన్ని రాష్ట్రాల్లో, అన్ని కోర్సుల్లో గ్రేడింగ్ విధానమే అవులు చేయునుంది. కోర్సులోని అన్ని సబ్జెక్టుల్లో కలిపి విద్యార్థి ప్రగతిని క్యుములేటివ్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(సీజీపీఏ) రూపంలో ప్రకటించనుంది. ఇందులో రెండు వరుస సెమిస్టర్లను ఒక విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ప్రతి కోర్సులో ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఇక ప్రతి సబ్జెక్టులో విద్యార్థి ప్రగతికి ఇచ్చే ప్రతి గ్రేడ్‌కు ఒక పారుుంట్ ఇస్తారు. మెుత్తం సబ్జెక్టులకు ఇచ్చే పారుుంట్లను కలిపి వాటి సగటుతో సీజీపీఏను నిర్ధారిస్తారు. సెమిస్టర్వారీగా కూడా గ్రేడ్లను, గ్రేడ్ పారుుంట్లను ఇస్తారు. వాటిని సగటును సెమిస్టర్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(ఎస్‌జీపీఏ)గా పరిగణిస్తారు. అలాగే విద్యార్థులు గణితంతో పాటు ఆర్ట్స్ సబ్జెక్టులను కూడా చదువుకునే వీలు కల్పించాలని యూజీసీ నిర్ణయించింది. గ్రేడింగ్ విధానమిదే.. గ్రేడ్ గ్రేడ్ పారుుంట్ ఓ (ఔట్ స్టాండింగ్) 10 ఎ+ (ఎక్సలెంట్) 9 ఎ (వెరీ గుడ్) 8 బి+ (గుడ్) 7 బి (ఎబోవ్ యావరేజీ) 6 సి (యావరేజీ) 5 పి (పాస్) 4 ఎఫ్ (ఫెయిల్) 0 ఏబీ (ఆబ్సెంట్) 0