సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర అన్ని కోర్సుల్లోనూ గ్రేడ్లు, గ్రేడ్ పారుుంట్ల విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణరుుంచింది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానం అవుల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. జాతీయు, అంతర్జాతీయు స్థారుు విద్యాసంస్థల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇకపై అన్ని స్థాయిల్లో అమలు చేయూలని నిర్ణరుుంచింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అవుల్లోకి తేనుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూజీసీ నిబంధనలకులోబడి ఆయూ రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైస్‌చాన్సలర్లకు వుంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిబంధనలను కేంద్రీయ, రాష్ట్ర యూనివర్సిటీలతోపాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా అవులు చేయూలని యూజీసీ ఆదేశించింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో వర్సిటీలను బట్టి వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. ఒక కోర్సులో మార్కుల విధానం అవుల్లో ఉంటే, కొన్ని కోర్సుల్లో మార్కులతోపాటు గ్రేడింగ్ విధానం అవుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వూర్కుల విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని యుూజీసీ నిర్ణయించింది.
ఇకపై అన్ని రాష్ట్రాల్లో, అన్ని కోర్సుల్లో గ్రేడింగ్ విధానమే అవులు చేయునుంది. కోర్సులోని అన్ని సబ్జెక్టుల్లో కలిపి విద్యార్థి ప్రగతిని క్యుములేటివ్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(సీజీపీఏ) రూపంలో ప్రకటించనుంది. ఇందులో రెండు వరుస సెమిస్టర్లను ఒక విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ప్రతి కోర్సులో ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఇక ప్రతి సబ్జెక్టులో విద్యార్థి ప్రగతికి ఇచ్చే ప్రతి గ్రేడ్‌కు ఒక పారుుంట్ ఇస్తారు. మెుత్తం సబ్జెక్టులకు ఇచ్చే పారుుంట్లను కలిపి వాటి సగటుతో సీజీపీఏను నిర్ధారిస్తారు. సెమిస్టర్‌వారీగా కూడా గ్రేడ్లను, గ్రేడ్ పారుుంట్లను ఇస్తారు. వాటిని సగటును సెమిస్టర్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(ఎస్‌జీపీఏ)గా పరిగణిస్తారు. అలాగే విద్యార్థులు గణితంతో పాటు ఆర్ట్స్ సబ్జెక్టులను కూడా చదువుకునే వీలు కల్పించాలని యూజీసీ నిర్ణయించింది.
గ్రేడింగ్ విధానమిదే..
గ్రేడ్ గ్రేడ్ పారుుంట్
ఓ (ఔట్ స్టాండింగ్) 10
ఎ+ (ఎక్సలెంట్) 9
ఎ (వెరీ గుడ్) 8
బి+ (గుడ్) 7
బి (ఎబోవ్ యావరేజీ) 6
సి (యావరేజీ) 5
పి (పాస్) 4
ఎఫ్ (ఫెయిల్) 0
ఏబీ (ఆబ్సెంట్) 0